Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, September 22, 2017

1918 కు ముందు శ్రీ బాబా లీల – భీష్మ ఉత్తరమ్ - 2

Posted by tyagaraju on 4:57 AM
    Image result for images of shirdi saibaba and adisakti
       Image result for images of green rose

22.09.2017 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
దసరా శుభాకాంక్షలు
ఈ రోజు 1918 వ.సంవత్సరానికి ముందు బాబా లీలల గురించి శ్రీ కృష్ణశాస్త్రి భీష్మ గారు తన ఉత్తరంలో వ్రాసిన విషయాలను రెండవ భాగమ్   ప్రచురిస్తున్నాను.  దీనిని షిర్డి సాయి సేవా ట్రస్ట్ . ఆర్గ్ , చెన్నై వారి నుండి గ్రహింపబడింది.

1918 కు ముందు శ్రీ బాబా లీల – భీష్మ ఉత్తరమ్ - 2
శ్రీ సద్గురు సాయినాధ సగుణోపాసన శ్లోకాలను రచించిన శ్రీ వేదశాస్త్రి కృష్ణ శాస్త్రి భీష్మ గారు 11.07.1921 న వ్రాసిన ఉత్తరంలోని కొన్ని సారాంశాలు.

ఆ మరుసటిరోజు కోపర్ గావ్ నుంచి ఒక లాయర్ వచ్చాడు.  ఆయన చెప్పిన విషయం.
“బాబా భక్తుడు ఒకతని మీద క్రిమినల్ కేసు పెట్టబడింది.  నేను అక్కడికి వెళ్ళేటప్పటికి కోర్టు అతనికి శిక్ష వేసింది.  నేను అతని కేసును తీసుకుని పై కోర్టులో అప్పీల్ కి వెళ్ళాను  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కోర్టు నన్ను ముద్దయి ప్రవర్తన గురించి వివరాలు అడిగింది.  అతను చాలా మంచివాడని, అమాయకుడని నేను సాక్ష్యం చెప్పాను. 



 కోర్టు అతనిని నిర్దోషిగా విడుదల చేసింది.  ఈ అధ్భుతం ఎలా జరిగిందో బాబాని అడిగి తెలుసుకుందామని ఆయన దర్శనానికి షిరిడీ వచ్చాను.  ఆ భక్తుడు మహాపురుషుడయిన సాయిబాబా అనుగ్రహం వల్లనే నిర్దోషిగా విడుదల అయానని చెప్పాడు”. అని అంతా వివరంగా చెప్పాడు.
          Image result for images of shirdi sai baba sitting on sack

బాబా ఎల్లప్పుడూ చినిగిపోయిన గోనెపట్టా మీదనే కూర్చునేవారు.  బాబాకు దానిమీద ఎంతో మక్కువ.  ఒకసారి బాబా లేని సమయం చూసి ఒక భక్తుడు ఆ గోనెపట్టాను బయటకు విసిరేసి సిల్కు వస్త్రంతో చేయబడ్డ మెత్తటి దిండును ఆస్థానంలో ఏర్పాటు చేసాడు.  బాబా తిరిగి వచ్చిన తరువాత కొత్త దిండును చూసి ఆగ్రహం చెందారు.  ఆ కొత్త దిండును చూడగానే తిట్లు తిట్టనారంభించారు.  ఆ దిండును తీసి ధునిలోకి విసిరేసారు.  తన పాత గోనెపట్టా తిరిగి తెచ్చిన తరవాతనే శాంతం వహించారు.
Image result for images of k j bhishma sai devotees
     (కె.జె. భీష్మ)

ఒకరోజు భక్తులందరూ పాత గోనెపట్టా స్థానంలో కొత్త గోనెపట్టాను ఏర్పాటు చేయమని నన్ను అడిగారు.  ఆరతికి అందరూ నిలుచుని ఉండేవరకు ఆగాను.  అందరూ లేచి నిలబడిన తరువాత కొత్త గోనెపట్టాను తెప్పించమంటారా అని బాబాను సైగ చేస్తూ అడిగాను.  బాబా తన అంగీకారాన్ని సంజ్ఞల ద్వారా తెలియచేసారు.  నేను వెంటనే దాదాసాహెబ్ కు చెప్పి కొత్త గోనెపట్టాను తెప్పించి చిరిగిపోయిన గోనెపట్టా స్థానంలో ఏర్పాటు చేసాను.  ఆరతి అయిన తరువాత బాబా ప్రశాంతంగా కూర్చున్నారు.  భక్తులందరూ ఆయనను సేవించుకున్నారు.  అపుడు బాబా నాకు చిలుమును ఇచ్చి అయిదు లడ్డూలు యిమ్మన్నారు.  నేను యిస్తానని చెప్పాను.  ఇక్కడ ఈ ప్రదేశం నాకు కొత్త. ఎవరి సహాయం లేకుండా లడ్డూలను ఎలా చేయాలా అని నేను చాలా గాభరా పడ్డాను.  నేనెవరినయినా సహాయం అడిగితే అది బాబాకు తెలిసిపోతుంది.  లడ్డూలు యిమ్మని అడగకుండా ప్రత్యేకంగా అయిదు మాత్రమే ఎందుకని అడిగారు?  నేను రోజంతా దీని గురించే దీర్ఘంగా ఆలోచిస్తూ ఆ ఆలోచనతోనే నిద్రపోయాను.  కాని ఆవెంటనే నాకు మెలకువ వచ్చింది. ఒక శ్లోకం రచించాలనే ప్రేరణ కలిగింది.  వెంటనే కలం తీసుకుని శ్లోకం రాసాను.  ఉదయం మరొక శ్లోకం రాస్తూ ఉండగా, దీక్షిత్ బాబా దర్శనానికి వెడుతూ మధ్యలో నా దగ్గరకు వచ్చి ఆగాడు.  నేను రాసిన పద్యం చూసాడు.  ఆతరువాత నేను స్నానం చేసి బాబా దర్శనానికి వెళ్ళాను.  నేను ఆయన వద్దకు వెళ్ళగానే బాబా లడ్డూలను గురించి అడిగారు.  నేనేమీ మాట్లాడలేదు.  కాని, దీక్షిత్ “ అయిదు లడ్డూలు తయారవుతున్నాయి” అన్నాడు.  బాబా శాంతించారు.  తరువాత రోజుకు అయిదు శ్లోకాలను పూర్తి చేసి బాబాకు సమర్పించాను.  (నేనింకా అయిదుకన్నా ఎక్కువే రాద్దామని ప్రయత్నించాను.  కాని ఎంత ప్రయత్నించినా అయిదు శ్లోకాలకన్నా ఎక్కువ రాయలేకపోవడంతో అక్కడికి విరమించుకున్నాను) బాబా ఆశ్లోకాలను చూసి నన్ను పైకి చదవమన్నారు.  నేను చదువుతుండగా బాబా తన చేతిని నాతలమీద పెట్టి ఆశీర్వదించారు.  ఆక్షణంలో నేననుభవించిన ఆనందానుభూతిని వర్ణించడం నాకు సాధ్యం కాదు.  ఆతరువాత నేను రాసిన ప్రతి పద్యాన్ని ఆయనకు చదివి వినిపించాను.  ఆఖరికి నేను వ్రాసిన ఈ పద్యాలన్నిటితో ‘సాయినాధ సగుణోపాసన’ పుస్తకంగా తయారయింది.  నేను పుస్తకాన్ని సాయి చరణాలవద్ద వుంచి ఆయనకు సమర్పించాను.  ఆపుస్తకం అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును గోసంరక్షణ కోసం విరాళంగా ఇచ్చాను.  ఈ పుస్తక ప్రతులు యింకా అక్కడ ఉండే ఉంటాయి.
             Image result for images of k j bhishma sai devotees

కఠోపనిషత్తులో “ధీరో న షోఛాతి’ అని చెప్పబడింది. "ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన ధైర్యవంతులు ఎప్పుడూ దుఃఖించరు.  ఒకవేళ వారికి విచారం కలిగినపుడు కూడా వారు తమ దుఃఖాన్నించి ఉపశమనం కలిగించి ఉల్లాసంగా ఉండటానికై ఎవరి సలహాను ఆశించరు.  తమకు తామే తమలో కలిగిన దుఃఖాన్ని నివారించుకుంటారు.”

గుజరాతీ బ్రాహ్మణుడయిన మేఘా సాయి మహరాజ్ కు ప్రియమైన భక్తుడు.  బాబా సేవకు ఎప్పుడూ సిధ్ధంగా ఉంటాడు.  తన యజమాని ప్రోత్సాహం వల్లా బాబాను సేవించుకుంటున్నాడు.  కాని ఒకరోజున అతని మనసులో “నేనీ ముస్లిమ్ కి స్నానం ఎందుకు చేయించాలి?” అనే ప్రశ్న తలెత్తింది.  ఆ విధమయిన ఆలోచన రాగానే అతను ఒక రోజున షిర్దీనుంచి తన స్వగ్రామాని వెళ్ళిపోయాడు.  అక్కడ అతను జబ్బు పడ్డాడు.  నయమయిన తరవాత శివాలయానికి వెళ్ళాడు.  కాని అక్కడ శివలింగానికి బదులు అతనికి సాయిమహరాజ్ దర్శనమిచ్చారు.  
               Image result for images of shirdisaibaba and lord shiva
వెంటనే షిరిడీకి తిరిగి వచ్చాడు.  తనలో మెదిలిన చెడు ఆలోచనలను నిర్మూలించుకోవడానికై కొన్ని నియమిత సంఖ్యలో గాయత్రి మంత్రాన్ని జపించమన్నారు.  మంత్ర జపం పూర్తయిన తరువాత బాబా ఆశీర్వదించారు.  మేఘా మరణించినపుడు బాబా స్వయంగా వచ్చి అతని శరీరాన్నంతటిని చేతులతో నిమురుతూ అయిదు నిమిషాలపాటు బిగ్గరగా ఏడ్చారు.  ఆతరువాత “ఎంత సేపు రోదిస్తావు?” అని తనకు తానే ఓదార్చుకుని శాంతించారు. (కఠ పనిషత్ లో ‘ధీరో న షోఛాతీ’ అని చెప్పబడిన ప్రకారం). మేఘా అంతిమ యాత్రకి సన్నాహాలు చేయమని ఆదేశించారు.

సాయి లీల మాసపత్రిక
(అయిపోయింది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

2 comments:

పిఆర్ తమిరి on April 2, 2020 at 10:27 PM said...

Sai leelalu mahadbhutaalu....

పిఆర్ తమిరి on April 2, 2020 at 10:58 PM said...

సాయిబాబా వారు ఆర్తులను తప్పక ఆదుకుంటారు. ఇందులో ఎంతమాత్రమూ సందేహం లేదు. బాబా వారిని నమ్మి వేడుకుంటే మనకు మంచి మార్గం చూపుతారు.. అనేకమంది అనుభవాలు ఇందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.. 2007లో నేను విజయవాడ నుంచి శిరిడి కి దగ్గరలోని రైల్వే స్టేషన్ లో తెల్లవారు ఝామున దిగి నపుడు బస్సులో ఎలా వెళ్ళాలో ఒక ప్రయాణికునిలా దారి చూపింది బాబా వారే ... ఆశ్చర్య పోయాను ఆ సమయం లో .... ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు...

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List