Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, September 23, 2017

సాయిబాబా వాక్కుకు అనంతమయిన శక్తి

Posted by tyagaraju on 5:32 AM
         Image result for images of shirdi sainath and lord venkateswara
       
         Image result for images of rose hd

23.09.2017 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అత్యధ్భుతమైన సాయి లీలను గురించి, ఆయన వాక్కుకు, ఊదీకి ఎంతటి శక్తి ఉందో తెలియచేసె లీల.  ఇది షిర్డీసాయిసేవా ట్రస్ట్.ఆర్గ్ నుండి సంగ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
                          నిజాంపేట్, హైదరాబాద్

సాయిబాబా వాక్కుకు అనంతమయిన శక్తి

సాయి సరోవర్ గుజరాతీ పుస్తకంనుండి ఆగ్లంలోకి అనువదించిన వారు సాయి కి దీవాని, ఆదివారమ్, జూన్ 8, 2008.

సాయిబాబా యొక్క స్వబావాన్ని పూర్తిగా అర్ధం చేసుకున్నవారెవరూ ఆయన మీద తమకు ఉన్న భక్తిని అంత సులబంగా వదులుకోలేరు.  వారి హృదయంలోను, నాలుక మీద ఆయన నామం తరచూ జపించబడుతూనే ఉంటుంది.  ఆవిధంగా చేయడం వల్ల వారికి ఎటువంటి కష్టాన్నయినా ఎదుర్కోగలిగే శక్తి లభిస్తుంది.   పైన యివ్వబడిన శీర్షికకు సంబంధించి సాయిబాబా వారి వాక్కులోను ఆయన ఉదీలోను ఎంతటి శక్తి దాగి ఉందో తెలియ చేసే సంఘటనలను గురించి ఇపుడు తెలుసుకుందాము. 
    


    Image result for images of dhuni in dwarakamayi
 ద్వారకామాయి మసీదులో నిరంతరం మండుతూ ఉండే  బాబా వెలిగించిన ధుని నుంచి లభిస్తున్నదే  పవిత్రమయిన ఊదీ.    

భక్తులందరూ ఆయనను దర్శించుకుని ఆయన పవిత్ర పాదాలకు ప్రణమిల్లేవారు.  బాబా, వారందరికీ తన ప్రసాదంగా ఊదీని పంచుతూ ఉండేవారు.  
           Image result for images of baba giving udi in dwarakamayi

ఆయన షిరిడీ గ్రామంలో నివసించిన మొదటి రోజులలో గొప్ప వైద్యునిగా పేరు పొందారు.  ఆయన మహాసమాధి చెంది ఇన్ని సంవత్సరాలు గడిచినా గాని.  ఆయన పవిత్రమయిన ఊదీ నిరంతరం ఎన్నో నయంకాని రోగాలను నయం చేస్తూనే ఉంది.  ఇపుడు నేను అసలు విషయానికి వస్తాను.  ఇపుడు నేను బాబావారి ఊదీ యొక్క ప్రాముఖ్యతను, బాబాకు తన భక్తుల యెడల ఎంతటి ప్రేమ ఉందో తెలియచేసే అధ్భుత లీలని మీముందుంచుతున్నాను. 
 Image result for images of ramachandra borkar
  (రామచంద్ర బోర్కర్)

శ్రీ బోర్కర్ గారు రైల్వే శాఖలో పని చేస్తూ ఉండేవారు.  ఆయనకి పండరీపూర్ నుంచి నాసిక్, మన్మాడ్ ల మధ్య ఉన్న ఆశావలీ గ్రామానికి బదిలీ అయింది.  బోర్కర్ గారి కుటుంబమంతా రైల్వే స్టేషన్ ప్రక్కనే రైల్వేవారి క్వార్టర్స్ లో ఉండేవారు.

ఒకరోజు సాయంత్రం బోర్కర్ గారు ఆఫీసునుంచి యింటికి తిరిగి వచ్చిన వెంటనే ఆయనకు తీవ్రమయిన జ్వరం వచ్చింది.  ఆయన కళ్ళు ఎఱ్ఱగా అయిపోయాయి.  విపరీతమయిన చలి కూడా తోడవడంతో  3 – 4 దుప్పటీలను కప్పుకుని పడుకున్నారు.  ఆశావలి చాలా చిన్న గ్రామం.  వెంటనే వైద్యం చేయించడానికి కూడా ఆ గ్రామంలో వైద్యులెవరూ అందుబాటులో లేరు.  
          Image result for images of sai devotee borkar
  (శ్రీమతి చంద్రాబాయి బోర్కర్)
ఆయన భార్య చంద్రాబాయి బోర్కర్  గృహవైద్యం (చిట్కా వైద్యం) చేసింది.  ఆవిడ యిచ్చిన మందుల ప్రభావంతో బోర్కర్ గారికి రాత్రి గాఢనిద్ర పట్టింది.  కాని జ్వరం మాత్రం తగ్గలేదు.  భర్తకి గాఢమయిన నిద్రపట్టడంతో చంద్రాబాయి హాయిగా ఊపిరి పీల్చుకుంది.  ఆమెకు కూడా బాగా నిద్ర ముంచుకుని వస్తుండటంవల్ల భర్త పాదాల వద్ద తల ఆనించి పడుకుంది.  ఆ సమయంలో ఆమెకు స్వప్నంలో బాబా దర్శనమిచ్ఛి, “ సోదరీ, కంగారు పడకు.  నీ భర్త శరీరానికి ఊదీని రాయి.  ఆయనకు నయమవుతుంది.  కాని రేపు ఉదయం 11 గంటలవరకు నీ భర్తని బయటకు వెళ్ళనివ్వకు.” అని చెప్పారు.

చంద్రాబాయి వెంటనే లేచి భర్త శరీరానికంతా ఊదీని రాసింది.  వెంటనే ఆయనకు చెమటలు పట్టి జ్వరం తగ్గిపోయింది.  ఉదయానికి జ్వరం తగ్గిపోయి హుషారుగా ఆరోగ్యంగా ఉన్నారు.  ఈ రోజంతా బయటకి ఎక్కడికీ వెళ్ళకుండా యింటిలోనే విశ్రాంతి తీసుకోమని చంద్రాబాయి భర్తతో చెప్పింది.  కాని బోర్కర్ గారు భార్య చెప్పిన మాటలని లెక్కచేయకుండా ఉదయాన్నే ఫలహారం చేసి రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయారు.

బోర్కర్ గారు రైల్వే పట్టాల వెంబడే నడుస్తూ వెడుతూ ఉండటం డ్రాయింగు రూములో కూర్చున్న చంద్రాబాయికి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.  ఆవిడ దృష్టంతా తన భర్త మీదనే ఉంది.  తన భర్తని కాపాడమని సాయిబాబాను మనసులోనే ప్రార్ధించుకుంది.  బోర్కర్ గారు రైలుపట్టాల వెంబడే నడుస్తూ ఉండగా మధ్యలో ఆయనకి రైల్వే ఉద్యోగి ఒకతను కలిసాడు.  ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ పట్టాల వెంబడే నడుస్తూ ఉన్నారు.  ఇంతలో స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు వస్తూ ఉంది.  బోర్కర్ గారు దానిని గమనించలేదు.  ఆ రైలు వస్తున్న వేగానికి బోర్కర్ ప్రక్కన ఉన్న రైలు పట్టాల మీద విసురుగా పడ్డారు.  ఆయన కాలుకి ఫ్రాక్చర్ అయింది.  ఈ దృశ్యమంతా స్పష్టంగా చంద్రాబాయి బోర్కర్ కి కన్పించింది.  ఆవిడ వెంటనే ‘సాయిబాబా’ అంటూ తెలివి తప్పి పడిపోయింది.

బోర్కర్ గారిని స్పృహలేని స్థితిలో స్ట్రెచర్ మీద యింటికి తీసుకుని వచ్చారు.  గ్రామంలో వైద్యుడెవరూ లేరు.  చంద్రాబాయి యింటిలో ఉన్న మందులు, కొన్ని ఆయుర్వేద మూలికలలో ఊదీని కలిపి ముద్దగా చేసింది.  ఆవిధంగా తను స్వయంగా చేసిన లేహ్యాన్ని భర్త కాలుకు పట్టించి కట్టు కట్టింది.  ఆ తరువాత బోర్కర్ గారికి స్పృహ వచ్చింది.  స్పృహలోకి రాగానే, మన యింటిలో ఎవరయినా ఫకీరు ఉన్నారా అని అడిగారు.  మీరు ఆయనను చూడగలుగుతూ ఉంటే కనక ఆయనే నేను భక్తితో కొలిచే సాయిబాబా.  కాని ఆయన నాకు కనిపించటం లేదు అని చెప్పింది.
                Image result for images of baba giving udi in dwarakamayi
మన్మాడ్ నుంచి ఒక వైద్యుడు వచ్చాడు. ఆ వైద్యుడు ముందురోజు రాత్రి చంద్రాబాయి కట్టిన కట్టును తీసేసి, బోర్కర్ గారి కాలుకు ప్లాస్టర్ వేసి కట్టు కట్టారు.  వైద్యుడు కట్టిన కట్టువల్ల బోర్కర్ గారికి కాలు నెప్పి బాగా ఎక్కువయింది.  రాత్రయేసరికి ఆనెప్పి రెండింతలయింది.  విపరీతంగా కాలు సలపు పెట్టసాగింది. 

రాత్రి సాయిబాబా ప్రత్యక్షమయ్యారు.  చంద్రాబాయి వెంటనే లేచి సాయిబాబా పాదాలకు నమస్కారం చేసుకుంది.  అపుడు సాయిబాబా “కాలుని తీసివేయిద్దామనుకున్నావా ?  వైద్యుడు వేసిన కట్టుని తీసేయి.  గోధుమపిండి, కొబ్బరి, ఊదీ మూడింటిని కలిపి మిశ్రమం చేయి.  ఆ మిశ్రమాన్ని నీ భర్త కాలుకు పూతగా పుయ్యి.” అన్నారు.  చంద్రాబాయి బాబా చెప్పిన విధంగానే చేసింది.

సాయిబాబావారి మాటలలోని అమోఘమయిన శక్తికి, ఊదీ ప్రభావానికి బోర్కర్ గారు కొద్దిరోజులలోనే ఆరోగ్యవంతులయ్యారు.  ఆయన అంత త్వరగా కోలుకోవడం వైద్యులనే ఆశ్చర్యపరిచింది.


(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(రేపటి సంచికలో బాయిజా బాయి అనుభవాలు -
  బాయిజాబాయి బాబాను అడిగిన ప్రశ్నలకి బాబా సమాధానం చెప్పారా?)

Kindly Bookmark and Share it:

1 comments:

Unknown on September 26, 2017 at 4:54 AM said...

Very nice article! Well narrated . To visit more beautiful tourist destinations around shirdi or any other place in India. Book taxi service or cab service now at ganraj Travels at very affordable cost. You can select your customized package. Hurry up!
for more details visit our site- https://www.ganrajtravels.com/pune-to-shirdi-taxi-service.php

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List