04.02.2019 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ముత్యాల సరాలు - 3 వ.భాగమ్
29. సత్సంగం అంటే మన నడవడిని సరి చేసుకొనేందుకు రిపేరు చేసే వర్కు షాపులాంటిదె. అదే సత్సంగం జరిగే ప్రదేశం. గ్రంధ పారాయణం నుండి మనం నేర్చుకోవలసినది ఏమిటి? మనలోని దోషాలు ఏమిటి? వాటిని సరిచేసుకోవడం ఎలా? మనలోని దోషాలు గుర్తించుకోవడం మన మొదటి కర్తవ్యం. తర్వాతి మెట్టు నిర్మూలన. అది మన తీవ్ర ప్రయత్నంతోనే సాధ్యం. ఎవరికి వారే, వారి వారి లోపాలను నిర్మూలించుకొనే పధ్ధతులు ఆచరించాలి. సత్సంగాన్ని మనం మనలోని దోషాలను విముక్తి చేసే వర్కుషాపులా, వినియోగించుకోవాలి.
క్రమం తప్పకుండా సత్సంగానికి హాజరు కావడమే సాయికి మనం సమర్పించే శ్రధ్ధ లేక నిష్ఠ. అలా సమర్పించాలంటే త్యాగము అవసరము. త్యాగం అంటే కొంత సమయం మీ పనులను ప్రక్కన పెట్టి ఆ సమయాన్ని సత్సంగానికి కేటాయించడం. తరచూ సత్సంగాలు చేస్తూ ఉంటే నలుగురితో బాబా విషయాలు పంచుకోవడము వలన ఎవరి దగ్గరయినా సంకోచము లేకుండా మాట్లాడటము అలవాటు అవుతుంది. సత్సంగంలో శ్రవణం చేసినదానిని మననం చేసుకోవాలి. మననం చేసిన విషయాలు ధ్యానమునందు స్థిర బుధ్ధితో, అనుభూతి పొందినప్పుడే దాని ఫలితము పొందవచ్చును. సత్సంగంలో ధ్యానము కొరకు ఎక్కువ సమయము వినియోగించండి. .... దామరపాటి శోభాలత, తిరుపతి
క్రమం తప్పకుండా సత్సంగానికి హాజరు కావడమే సాయికి మనం సమర్పించే శ్రధ్ధ లేక నిష్ఠ. అలా సమర్పించాలంటే త్యాగము అవసరము. త్యాగం అంటే కొంత సమయం మీ పనులను ప్రక్కన పెట్టి ఆ సమయాన్ని సత్సంగానికి కేటాయించడం. తరచూ సత్సంగాలు చేస్తూ ఉంటే నలుగురితో బాబా విషయాలు పంచుకోవడము వలన ఎవరి దగ్గరయినా సంకోచము లేకుండా మాట్లాడటము అలవాటు అవుతుంది. సత్సంగంలో శ్రవణం చేసినదానిని మననం చేసుకోవాలి. మననం చేసిన విషయాలు ధ్యానమునందు స్థిర బుధ్ధితో, అనుభూతి పొందినప్పుడే దాని ఫలితము పొందవచ్చును. సత్సంగంలో ధ్యానము కొరకు ఎక్కువ సమయము వినియోగించండి. .... దామరపాటి శోభాలత, తిరుపతి
30. నారదమహర్షి సత్సంగంలో ధర్మరాజుతో ఈ విధంగా అన్నారు.
"ప్రతి గృహస్తుడు విధిగా సత్సంగాన్ని కలిగి ఉండాలి. భగవంతుడు భక్తులలోనే ఉన్నాడు, ఉంటాడు.
31. త్యాగరాజస్వామి రాముని గూర్చి కీర్తిస్తూ ఇలా అన్నారు.
"సంపదవలన వచ్చే సుఖముకన్నా సత్సంగము వలన వచ్చే సుఖమే నాకు చాలా ప్రీతికరం. అదే నాకు ఎనలేని ప్రీతిన , తృప్తిని కలిగిస్తాయి".
32. వివేకానందస్వామి ఇలా అన్నారు.
" సత్సంగం కంటే పవిత్రమైనది ప్రపంచంలో మరొకటి లేదు. ఎందుకంటె మనలోని దుర్వ్యసనాలను అణగకొట్టి, మంచి సంస్కారాలను పైకి తీసుకొని వచ్చేది సత్సంగం మాత్రమే"
33. ముచికుందుడు ఇలా విన్నవించాడు.
"జీవుడు ఆత్మవిశ్వాసము పొంది జననమరణ చక్రమునుండి విముక్తుడగు సమయం వచ్చినప్ప్పుడు మాత్రమే అతనికి సత్సంగం లభించును. రామకృప లేనిదే, సత్సంగం సులభంగా లభించదు. సత్సంగప్రాప్తి ఒక ఫలం అయితే, సాధనలు అన్నీ పుష్పాలు".
34. సత్సంగం జరుపుకోవలసిన వేళలు, సత్సంగం
మొదటిది. ఉదయం 4.30 (బ్రహ్మ ముహూర్తం)
రెండవది. సాయంకాలం 6 గంటలు (సంధ్యాసమయం)
ఈ రెండు సమయాలలో హిమాలయములలోని లక్షల మంది మహర్షులు "రితంబర ప్రజ్ఞ" అనగా లోతయిన ధ్యానంలో వుండి శ్వాస వదులుతారు. అనగా వారు తమ తపోశక్తిని ధారపోస్తారు. ఆ శక్తి విశ్వంలో కలుస్తుంది. దీనినే విశ్వశక్తి అంటారు. ఆ సమయంలో మనం సామూహికంగా కూర్చుని సత్సంగం చేసుకునే సమయంలో సత్సంగం జరుగుతున్న హాలులోనికి లేదా ప్రాంతంలోనికి ఒక సుడిగుండంలా ఆ శక్తి ప్రవేశించి, అక్కడ కూర్చుని ఉన్న సాధకుల మధ్య ఒక ఆకర్షణ క్షేత్రంగా ఏర్పడుతుంది. దీనినే "భగవత్ శక్తి తరంగాలు" అంటారు. ఈ తరంగాలలో అత్యంత తపోశక్తి నిబిడీకృతమై ఉంటుంది. ఈ శక్తి అక్కడ ఉన్న ప్రతి సాధకుని శరీరంలోకి శ్వాస ద్వారా ప్రవేశిస్తుంది. ఆ సమయంలో చెడు ఆలోచనలు, భయం, సందేహాలు, అనుమానాలు, పిరికితనంలాంటివి మనసులో ఏమాత్రం ఉండకూడదు. నాకు సత్సంగం అత్యంత ప్రయోజనం కలిగిస్తుంది అనే భావనతో పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. పైగా ఆశక్తి మనలో ప్రవేశించినప్పుడు మానసిక, శారీరక రోగాలు నయమవుతాయి. ఆ విధంగా ప్రతిరోజు ఒక నిర్ధిష్ట సమయంలో అలా చేయగా చేయగా రోజురోజుకి ఆశక్తి మనలో ఎక్కువ అవుతుంది. తద్వారా మనసు పవిత్రమై ఏదో ఒకరోజు కుండలినీ శక్తి ఉధృతంగా మనలో జాగృతం అవుతుంది. ఇదే సత్సంగంలోని నిగూఢ రహస్యం.
34. సత్సంగము
పండితుల సహవాసము, ధార్మిక గ్రంధ పఠనము కూడా సత్సంగమే. విజ్ఞానులతో కూడి ఉండుట కూడా సత్సంగమే. సత్సంగము యొక్క విలువ వెలకట్టలేనిది. అత్యంత శక్తివంతమైనది. ఒక్క క్షణమైనా చాలు సంస్కారములనుండి విముక్తి పొందడానికి. అయస్కాంత శక్తితో ఆకర్షించి, ఆధ్యాత్మిక ప్రకంపనలను కలిగించి, మహాత్ముల సేవా అనురక్తిచే మన మనస్సులో మాలిన్యాన్ని తొలగించి పవిత్రతను నింపి ఆధ్యాత్మికతో ఎంతో ఎత్తుకు తీసుకొని వెడుతుంది.
సత్సంగం మనోమాలిన్యాలని తొలగించి, వైరాగ్యాన్ని ప్రసాదించి, ఐహిక బంధాలనుంచి స్వేఛ్చను కలిగిస్తుంది. అంతిమంగా భగవంతుని పాదపద్మాల చెంతకు చేర్చుతుంది.
సత్సంగంలో అందరూ కలసి భజన చేయాలి. ఒక్కరే సాయిపాటలు పాడితే మిగిలిన భక్తుల ఏకాగ్రత చెదురుతుంది. అంతవరకు విన్న మంచి ధార్మిక విషయాలను మరచిపోతారు. పాట పాడేవారి కంఠస్వరం శ్రావ్యంగా ఉన్నప్పుడు పోటీతత్వం పెరుగుతుంది. కాబట్టి కంఠస్వరం బాగా ఉన్నా లేకపోయినా అందరూ కలసి పాడాలి. ఎప్పుడూ నిర్ణితమైన కొన్నిపాటలు మాత్రమే పాడుతూ ఉంటే అందులోని భావంపై మనస్సు నిలుస్తుంది. బాబాకి భావనే ఇష్టం.
(ముత్యాల సరాలలో సత్సంగం అంశం సమాప్తమ్)
ముత్యాల సరాలు ఇంకా ఉన్నాయి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment