06.02.2019 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ముత్యాల సరాలు – 4 వ.భాగమ్
35. భగవాన్
రమణమహర్షి వాక్కు
కర్త
(భగవంతుడు) వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవులను ఆడించును.
జరుగునది, ఎవరెంత అడ్డుపెట్టినను ఆగదు.
జరుగనిది
ఎవరెంత అడ్డుపెట్టినను జరుగును.
ఇది
సత్యము.
కనుక
మౌనముగా ఉండుటయే ఉత్తమము.
36. జున్నూరు
నాన్నగారు
: రామనామం వలన బుద్ధి శుధ్ధి అవుతుంది.
37. కష్టం
ఎదుటివారికి అనగా ఆత్మ శుధ్ధి కలవారికి మాత్రమే చెప్పుకోవడం వలన వారు ఆకష్టాన్ని తీరుస్తారు అని కాదు.
కష్టంలో
ఉన్నవారికి కొంత ఉపశమనం కలుగుతుంది.
38. పురుషుడయినా, స్త్రీ అయినా తల్లి గర్భంలో ఉన్నప్పుడు, రక్తము, మాంసము, చీము మొదలయిన ఛండాలంలో 9 నెలలు నిత్యం నరకం అనుభవిస్తూ ఉంటారు.
గతజన్మ
అనుభవాలు ఆజీవిని అంటిపెట్టుకొని ఉంటాయి.
9 నెలల
కారాగారం ఆజీవికి ముగిసిన వెంటనే భూప్రపంచంలోకి వస్తాడు.
తల్లి
అనే సాధనం ద్వారా పుట్టిన 3 నెలలవరకు ఆ శిశువుకి మాయపొర కమ్ముతుంది. ఇదంతా
భగవంతుని సృష్టి.
ఇక
అప్పటినుంచి బాల్యం, యవ్వనం, కౌమారం, వృధ్ధాప్యం, అంతిమంగా మరణం.
జీవిత
చక్రం ఆజీవి పుణ్యపాపముల ఆధారంగా తిరుగుతూ ఉంటుంది. అన్ని
జన్మలలోనూ సర్వోత్తమము అయినది మానవజన్మ.
గత
జన్మలలో ఎంతో పుణ్యము చేసి ఉంటేనే కానీ ఈ మానవ జన్మ రాదు.
మానవునికి
ఆయుష్షు సరాసరి 80 సంవత్సరములు ఉంటుంది.
అదికూడా
20 సంవత్సరముల క్రితం అయితే,
60 -70 సం.మాత్రమే పూర్ణ ఆరోగ్యం.
ఇది
కూడా చాలా కొద్ది మందికి మాత్రమే.
భగవంతుడు
ప్రసాదించిన ఆయుష్షులో 10సం.బాల్యం, 20సం. చదువు, సంస్కారము, 30 – 40 సం. సంసార బాధ్యతలు. ఇక మానవునికి భగవంతుని స్మరించే సమయం దొరకటంలేదని చాలా మంది అంటూ ఉంటారు.
కానీ, అది తప్పు.
ఏవయస్సువారయినా
భగవత్ నామం నిత్యం స్మరించడం అలవాటు చేసుకోవాలి. మన
గుండె లయంతో సమానంగా నామం కూడా
గుండెల్లో
ప్రతిధ్వనించాలి. ఈర్ష్య, ద్వేషాలు, కోపతాపాలు, దుర్గుణాలు అన్నీ నిత్యనామంతో అణగత్రొక్కబడతాయి. అసంకల్పితంగా
పరోపకారం దైవసేవ, కారుణ్యం, కపటం లేకపోవడం, ఇవన్నీ భగవంతుడు మనకు తెలియకుండానే
మనకి ప్రసాదిస్తాడు.
ఈ మాయా ప్రపంచంనుండి బయటపడటానికి భగవన్నామ స్మరణ ఒక్కటే మార్గం.
భగవద్గీత
39. మనం
చేసేపని నిజాయితీగా ఉంటే, మనం నిర్వహించే కర్మలు నిర్మలంగా ఉంటే మనం ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు అని శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడితో
అనెను.
40. తనను
తాను నమ్మినవాడికి, దైవాన్ని నమ్మినవాడికి భయం ఉండదని ప్రహ్లాదుడు భాగవతంలో అన్నాడు.
41. స్వామి
వివేకానంద
“మీరు ఏదయినా మంచిపనికి పూనుకొన్నప్పుడు దేనికీ భయపడవద్దు.
అలా
భయపడిన మరుక్షణం మీరు ఎందుకూ పనికిరారు.
భయమే
మన కష్టాలకు మూలకారణం.
ముఖ్యంగా ఆధ్యాత్మికంగా పురోగమించాలనుకొనేవారికి ఈ భయమే ప్రధమ శతృవు.
కనుక
భయానికి ఎంతమాత్రం చోటు ఇవ్వకూడదు”.
42. మౌనం
ఒక వజ్రాయుధం.
మౌనం
వల్ల, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అనవసర
సంభాషణలు ఉండవు. క్లుప్తంగా ప్రశ్న, సమాధానం అలవాటు అవుతుంది.
అనవసర
ఆలోచనలు మనస్సులోకి రానీయకుండా మౌనంగా అంతర్ముఖంగా నెమ్మదిగా నామం చేస్తూ ఉండాలి.
మనకి
ఇష్టమయిన భగవంతుని రూపం హృదయంలో ప్రతిష్టించి ధ్యానం చేస్తూ ఉండాలి.
ఆధ్యాత్మికపరంగాను, మానసిక పరంగాను ధృఢచిత్తులమయి ఉంటాము.
పైన చెప్పినవన్నీ సాధనలోకి రావాలంటే షడ్రుచులకు దూరంగా ఉండాలి.
మాటలను
చాలా పొదుపుగా అవసరాన్ని బట్టి వాడాలి.
దీనివలన
మనశక్తి వృధాకాదు. శారీరక, మానసిక రుగ్మతలు అదుపులో ఉంటాయి.
43. ధ్యానంలో
మన మనస్సులో ఒక దేవుడిని ఆలోచనలో పెట్టుకోవాలి. ఆసమయంలో
అనేక ఆలోచనలు మన మొదటి ఆలోచనని ఢీ కొట్టుకొంటాయి.
మనస్సును ఒకే చోట నిశ్చలంగా ఉంచలేము. అదే
సమయంలో పక్కవాళ్ల గురించి, ఇంకా వివిధ
రకాలయిన
కోరికలు మన మనస్సును తాకుతాయి.
నిశ్చలత్వముతో
మనము నమ్మిన గురువును ఆశ్రయించాలి.
మనస్సు
ధ్యానానికి
ఒక ఆలోచన మాత్రమే.
దేవుడు
నిజం – మనం అబధ్ధం
పరమాత్మ ఒక సత్యం.
రూపం
లేని పరమాత్ముని మన మనస్సు ఒక రూపం ఊహించుకొంటుంది. దేవుడి
రూపం ఒక చెక్కలోనో, ఒక లోహంలోనో, ఒక రాతిలోనో ఉండదు.
మన సంకల్పమే భగవంతుని రూపం.
మనలో
కలిగిన కోర్కెని తీర్చుకోవడం కోసమే మనం భగవంతుని ఆరాధిస్తాము. ఆ
కోరిక తీరగానే మరి ఒక కోరిక కోరడం మానవ దౌర్బల్యం. కోర్కెలేకుండా
నిశ్చలంగా భగవంతుని ఆరాధించడమే ధ్యానం.
నాకోరిక నెరవేర్చుకోవడానికి పరమాత్మ సహకరించాలి. నాప్రయత్నం
నేను చేస్తాను.
ఆకోరిక
నెరవేర్చిన పరమాత్మదే ఆ ఫలితం.
పరమాత్మని
చేరుకోవాలని నేను ఆరాధిస్తున్నాను.
44. ఆత్మదర్శనం
పొందాలనుకున్న వ్యక్తికి భోగముల మీద ఆసక్తి ఉండకూడదు.
భోగముల
మీద ఆసక్తి
ఉన్నవారికి ధ్యానం మీద మనస్సు లగ్నం కాదు.
-- చాగంటి కోటేశ్వరరావు గారు
45. భక్తిలేని
ధనవంతుడు గుళ్ళు గోపురాలు కట్టించి, దానధర్మాలు చేసి, భగవంతుని కృపకు పాత్రుడు కాలేడు. నిస్వార్ధంగా
మనస్సులో భగవంతుని ధ్యానించినవాడె నిజమైన భక్తుడు.
46. నిజానికి
మనిషి అనుభవించే సుఖం సుఖం కాదు.
సుఖం
అనేది దేవుని వద్ద మాత్రం దొరికే అత్యంత దుర్లభమైన వస్తువు. ఏకాగ్రతతో
ఆ పరమాత్మను ప్రార్ధించినపుడే సంపూర్ణ రక్షణ, సుఖం చేకూరుతాయి. మనలో
చిత్త చాంచల్యం పోతే తప్ప ఏకాగ్రత కుదరదు.
దీనికి
నిరంతర అభ్యాసం
లేదా సాధన ఒకటే మార్గం.
ఈసాధన
కాలాల్లో మనకు అపజయ పరంపరలు కలుగుతూ ఉండవచ్చును. ఒక
సమయంలో ఆశారేఖ పొడచూపి మహోత్సాహం కలగవచ్చును. వేరొక
సమయంలో చిత్త చాంచల్యం ఏర్పడి విషాద భరితులం కావచ్చు.
సాధనలో ఎటువంటి వైకల్యాలు, అపజయాలు, దుఃఖాలు సంభవించినా, అందుకు కారణం. మన సంకల్ప లోపమే కాని, భగవంతుడు కాదు.
భగవత్
తత్వం తెలుసుకోవడం అంత తేలికకాదు.
“తోడే
కొద్దీ బావిలో నీరు ఊరుచున్నట్లు, ఎంత తెలుసుకున్నా తెలుసుకోవలసినది అనంతంగా మిగులుతూనే ఉంటుంది.
సాధకులు
అల్ప అనుభవాలకే సాధన పూర్తి అయిందని భ్రమపడి గర్విస్తుంటారు. గర్వాలన్నింటిలోను, నేను భక్తుడను, జ్ఞానిని అనే గర్వం, నాకు సర్వం తెలుసుననే గర్వం ఇవే సాధకులకు ప్రబల శతృవులు.
47. తపస్సు
గర్వం చేత, యజ్ఞం అసత్యం చేత,
ఆయువు విప్రనింద చేత, ప్రకటనచే దానం, ధర్మం చెడుతాయి అని పెద్దల మాటలు. ఈ విషయాలని
భక్తులు సదా గుర్తుంచుకోవలి.
మొదట దేవుడు ఉన్నడని, విశ్వమంతా అతని వల్లనే పాలింపబడుచున్నది అనే విశ్వాసం సాధకులకు –
భక్తులకు ముఖ్యం.
భక్తి హృదయానికి సంబందమైనది.
జ్ఞానం బుధ్ధికి సంబంధమైనది. కాబట్టి
ఈ రెండింటిని మేళవించి సాధకుడు ముందుగా సత్కర్మలు చెయాలి.
-- సాక్షి నిత్యసందేశం.
48. భగవద్గీత
అంటే ఒక గీత అని అనుకొందాము. రెండు
బిందువులను కలిపేది ఒక గీత. ఒక బిందువు జననం, ఒక బిందువు మరణం.
ఈ రెంటికీ మధ్యలో ఉన్నది గీత. అదే జీవన ప్రయాణం.
కష్టాలతోను, సుఖాలతోను, ఆనందాలతోను, దుఃఖాలతోను నిండి ఉంటుంది.
(గంగ
అంటే జ్ఞానం) – గీత
49. ఆధ్యాత్మికత
అంటే బాహ్య పరిస్థితులకన్నా ముందు, అంతరంగాన్ని కావలసిన విధంగా తీర్చుకొని దిద్దుకోవడమే.
ఆధ్యాత్మికత అంటే నేను ఎవరు?
అని ప్రతివ్యక్తి ప్రశ్నించుకోవాలి. పరమాత్మ
గురించి మననం చేసేది నేనే అని అభ్యాసం
చెయ్యాలి.
ప్రకృతిధర్మాలని
అన్వేషించేది నేనే కాబట్టి సాధనకు ఆధ్యాత్మికత తోడుకావాలి.
50. నిరంతరం
సత్కర్మలు చేస్తూ ఉండాలి.
మనస్సుని
సోమరితనంగా ఉండనీయకూడదు.
మానవుడు మాధవుడు కావాలి.
మనస్సులోకి ప్రయాణం చెయ్యడమే ఆధ్యాత్మిక సాధన.
51. కష్టాలకు
కృంగిపోవడం, సుఖాలకు పొంగిపోవడం మానవనైజం.
నిజానికి
మనం అనుభవిస్తున్న కష్టాలు కాని, సుఖాలు కానీ గత జన్మలలో మనం చేసుకున్న పాప పుణ్యకార్య ఫలాలు.
ఈ జన్మలో చేసిన మంచి పనుల
వలన వచ్చే కర్మఫలాలు తదుపరి జన్మల్లో అనుభవిస్తాము, అని అనుకొంటాము. కాని
ప్రతీవారు గుర్తుంచుకోవలసిన
విషయం ఒకటి ఉంది.
ఏదీ
మనచేతులలో లేదు.
భగవంతుని
రాత ప్రకారం అన్నీ జరుగుతూ ఉంటాయి.
ఈ సత్యం గ్రహించినవారు తామరాకు మీద నీటి బిందువులా అన్ని అనుభవాలకి అతీతులు అవుతారని నా నమ్మకం.
52. ఈ
జీవన నాటకంలో మన పాత్ర అవసరం తీరిపోతే మనలని భగవంతుడు ఇంకొక నాటకంలో వినియోగించుకొంటాడు.
జీవితాన్ని ఒక నాటకరంగంలా భావించాలి.
మనం
నిమిత్తమాత్రులం. అదృశ్య
శక్తి ఒకటి మనలని ముందుకు నిడిపిస్తుంది.
53. నా
స్వానుభవంతో వ్రాసిన విషయాలు కొన్నింటిని ఉదహరించాను. 99.99% ఇతరులు వ్రాసిన అమూల్యమయిన విషయాలను క్లుప్తంగా క్రోడీకరించి ఈ
“ముత్యాలసరాలను” కూర్చడానికి సహకరించిన సాయిబాబావారికి నన్ను నేను అర్పించుకొంటున్నాను. నాస్తికుడిని
ఆస్తికుడిగా మార్చడానికి బాబాగారు నాజీవితంలో ఎన్నో సుడిగుండాలు సృష్టించి, ఒడ్డున పడవేసారు.
ఇదంతా
నా గతజన్మల పుణ్యఫలమేనని భావిస్తున్నాను.
స్వస్తి… సర్వేజనా సుఖినోభవంతు.
(సమాప్తమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
( సాయిబాబా సత్సంగంలోని ఒక భక్తురాలు ఈ ముత్యాల సరాలని నాలుగు సంవత్సరాల క్రితం నాకు ఇవ్వడం జరిగింది. వాటినే నేను యధాతధంగా ప్రచురించాను.... త్యాగరాజు)
0 comments:
Post a Comment