Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, August 31, 2020

బాబా నాజీవితంలోకి ఏవిధంగా ప్రవేశించారు - 3

Posted by tyagaraju on 5:29 AM

  Tamilnadu Saibaba Temples | Saibaba Temple | Tamilnadu Famous Temples |  District Wise Tamilnadu Temples | Saibaba Temples In Tamilnadu | Shiradi Sai  Baba In Tamilnadu | Tamilnadu Shiradi Sai Baba |
       What Rose Color Matches Your Personality? | Purple roses, Beautiful flowers  photos, Purple flowers
31.08.2020  సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
బాబా నాజీవితంలోకి ఏవిధంగా ప్రవేశించారు - 3

 తమిళంలో మంజుభాషిణిగారు  చెప్పిన విషయాలన్నిటిని తెలుగులోకి అనువాదం చేసి పంపించినవారు శ్రీమతి కృష్ణవేణి, చెన్నై.
శ్రీమతి మంజుభాషిణి గారి కుటుంబమంతా   శ్రీ రాఘవేంద్రస్వామి వారి భక్తులు.  ఆయననే పూజిస్తూ ఉంటారు. 

ఆమె ప్రతిసారి తన భర్త  పుట్టినరోజునాడు పుట్టింటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదాలను ఎప్పుడూ తీసుకుంటూ ఉంటారు. ఒకసారి అటువంటి సందర్భంలో వారు వెళ్ళినపుడు వారి నాన్నగారు వేరే చోటకి వెళ్ళిఉండటం వల్ల  భార్యా భర్తలిద్దరూ మైలాపూర్ లోని బాబా మందిరానికి వెళ్ళారు. 



ఆమె మందిరంలోనికి ప్రవేశిస్తూనే మనసులోబాబా రోజు మా నాన్నగారు వేరే చోటకి వెళ్ళడంవల్ల ఆయన ఆశీర్వాదాలను తీసుకోలేకపోయాను.  మాకు మీరే తల్లి, తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించండి" అని అనుకుంటూ లోపలికి వెళ్లారు.  ఆమె ఆలా వెళ్ళగానె అక్కడ ఉన్న పూజారులు, “రండి రండి, రోజు మీపుట్టిన రోజు కదా" అని దగ్గరకు పిలిచి, బాబాగారి శాలువా ఆమెకు ఇచ్చారు.  
             Mylapore Shirdi Sai Baba Temple - History, Timings, Accommodation, Puja
అక్కడ బాబా మందిరంలో బాబాకు వేసిన శాలువాను సామాన్య భక్తులకు ఎప్పుడూ ఇవ్వరు.  చాలా అరుదుగా మాత్రమే ఇస్తారు.  మందిరానికి వచ్చిన అతి ముఖ్యమయిన వ్యక్తులకు ( V I P లకు ) మాత్రమే ఇస్తూ ఉంటారట.  కాని ఆమె ఆ రోజు తన పుట్టిన రోజని చెప్పకుండానే పూజారులు ఆమెకు బాబావారి శాలువాను, మందిరంలో బాబాకు సమర్పించిన ప్రసాదాన్ని ఇచ్చారు. ఆరోజు ఆమె తండ్రిగారి ఆశీర్వాదాలను పొందలేకపోయినా తండ్రికంటె ఎక్కువగా బాబా ఆమెను ఆశీర్వదించారు.  అది బాబా ఆమెకు ప్రసాదించిన అధ్బుతమయిన అనుభవం.

అలాగే ఒకసారి ఆమె తన పెళ్ళిరోజున బాబా గారి ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశ్యంతో మైలాపూర్ లోని బాబా మందిరానికి వెళ్ళారు.  అప్పుడు మందిరంలోపల బాబాగారి ఆశీర్వాదం తీసుకున్న తరువాత బయటకు రాగానే అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డు మళ్ళీ వారిని వెనక్కి పిలిచి బాబాగారికి సమర్పించిన గులాబ్ జాములను రెండు ఇచ్చారు.  అక్కడ అంతమంది భక్తులు ఉన్నాగాని, వీరినే పిలిచి మళ్ళీ బాబా ప్రసాదం ఇచ్చాడంటే అదంతా వారి పెండ్లిరోజున బాబా ఆశీర్వాదం.  గార్డుకు వీరెవ్వరో తెలియదు.  భార్యా భర్తలిద్దరికీ అది చాలా ఆనందం కలిగించింది. 

బాబా ఆమెను అనుగ్రహించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.  వారు శ్రీ రాఘవేంద్రస్వామివారికి భక్తులని ఇంతకు ముందే వివరించడం జరిగింది.  వారందరూ ఏకాదశినాడు ఉపవాసాలు ఉంటూ అన్నీ శ్రధ్ధగా మడి ఆచారాలను పాటిస్తూ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటారు.  వారింటిలో  శ్రీ రాఘవేంద్రస్వామి ఫోటో ఒకటి, ఒక వెంకటేశ్వరస్వామి ఫొటో  రెండే ఉన్నాయి. బాబా అంటే ఒక ముస్లిమ్ అనే అభిప్రాయం వారింట్లోవారికి ఉండేది. అలాంటిది ఇప్పుడు వారింటినిండా బాబా విగ్రహాలు, బొమ్మలు, పటాలు. 

ఒకసారి వారు మైలాపూర్ లోని బాబా మందిరానికి వెళ్ళి బయటకు వస్తూ దుకాణంలో ఒక చిన్న బాబా విగ్రహాన్ని చూసారు.  ఆ విగ్రహాన్ని కొని పట్టుకువెడదామనుకున్నారు. ఆమె తన భర్తతో ఆ విగ్రహాన్ని కొందామని చెప్పింది.  కాని ఆమె భర్తబాబా ముస్లిమ్స్ ని కూడా సమర్ధిస్తారు కదా ఇంటిలో మనపెద్దవాళ్ళు ఒప్పుకోరేమో, ఈ సారి కొనిస్తానని అన్నారు.  ఆవిధంగా వారు ఆ విగ్రహాన్ని కొనకుండానే ఇంటికి వెళ్లిపోయారు.  ఈ సంఘటన మైలాపూర్ లో ఉన్న బాబా మందిరం వద్ద జరిగింది.  వారి ఇల్లు బాబా మందిరానికి చాలా దూరంలో ఉంది.  కాని ఇక్కడ బాబా తన అధ్భుతమయిన లీలను చూపించారు.  మంజుభాషిణి గారి అమ్మగారు. ఆ మరుసటి రోజు కూరగాయల దుకాణానికి వెళ్ళారు.  కూరలు కొంటున్నపుడు దుకాణుదారుడు మంజుభాషిణి గారు ఏ విగ్రహాన్నయితే కొనదలచుకుని కొనకుండా వెళ్ళిపోయారో, సరిగా అదే రంగులో  అదే ఆకారంలో ఉన్న అటువంటి విగ్రహాన్నే  ఆమెకు ఇచ్చాడు. “మీ అమ్మాయి ఈ బొమ్మని నిన్న అడిగారు.  మీ అమ్మాయికి ఇవ్వండి అని చెప్పి  ఆవిడకు ఇవ్వడం జరిగింది.  బాబా మందిరం దగ్గర ఉన్న దుకాణం వేరు, ఇక్కడ కూరగాయల దుకాణం వేరు.  రెండిటికి మధ్య కిలోమీటర్ల దూరం.  మంజుభాషిణి గారికి ఆ బాబా  విగ్రహాన్ని కొనుక్కోవాలనే కోరిక ఉన్న విషయం ఈ దుకాణుదారునికి ఏమాత్రం తెలియదు.  అటువంటిది బాబా తన అధ్భుతమయిన లీలతో వారింటికి వెళ్ళడం జరిగింది. (వారింటికి వచ్చిన బాబా విగ్రహం యొక్క చిత్రాన్ని ఇక్కడ ఇస్తున్నాను చూడండి.  మంజుభాషిణి గారు వాట్స్ ఆప్ లో వారింటిలో కొలువై ఉన్న విగ్రహాల ఫోటోలను పంపించారు.  వాటిని కూడా చూడండి.)  
             (మంజుభాషిణి గారి ఇంటికి వచ్చిన బాబా విగ్రహం ఇదే)
బాబా ఫొటోను ఒక్కటి తీసుకోవడానికి సంకోచించినవారింటిలో ఇప్పుడు ఎటు చూసినా బాబా విగ్రహాలే.  అవన్నీ ఆమెకు వివిధ సందర్భాలలో వచ్చినవని చెప్పారు.  







ఆమె ఎంతో సంతోషంతో తమకు కలిగిన అనుభవాలన్నిటినీ వివరంగా తెలియచేసారు.  ఆయన పాదాలను ఎంతో నమ్మకంతో, ఓర్పుతో పట్టుకోవడం తప్ప మరేమీ అక్కరలేదు.  బాబా మీద భక్తి విశ్వాసాలు ఉంచినట్లయితే మనలని ఎక్కడికయినా ఆయన తీసుకువెడతారని ఆవిడ ఎంతో నమ్మకంతో చెప్పారు.  ఇది బాబా భక్తులందరినీ బాబాకు మరింత దగ్గర చేసే అనుభవాలని నేను భావిస్తున్నాను.  బాబా కృప ఎప్పుడూ ఇలాగే అందరిమీదా ఉండాలని కోరుకుంటున్నాను.
(సమాప్తమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)






Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List