01.09.2020 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి సత్ చరిత్రలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి.
బాబా
అంకిత భక్తులు తమంత తాముగా చెప్పిన కొన్ని విషయాలను సంఘటనలను మరాఠీలో మిస్. ముగ్ధా సుధీర్ దివాద్కర్ గారు
వ్రాసిన
వాటిని ఆంగ్లంలోనికి అనువదించినవారు శ్రీ సుధీర్ గారు.
సాయిలీల ద్వై మాసపత్రిక మార్చ్ – ఏప్రిల్ 2013 వ.సం. సంచికనుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్..
ఆత్రేయపురపు
త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్
రావుబహద్దూర్ సాఠే - 1 వ.భాగమ్
బాబా ఉపదేశము
బాబా ఉపదేశం గురించి సాఠే గారు ఇలా వివరిస్తున్నారు.
“బాబా వారు ఉపదేశించిన ఆధ్యాత్మిక బోధనల ప్రకారం నాలో అహంకారం తొలగించుకోవాలని, గర్వం, పొగరుమోతు తనం ఉండరాదని నేను నేర్చుకున్నాను.
నాలో
చెడు ఆలోచనలకు స్థానం ఇవ్వకూడదనే పాఠాన్ని కూడా నేర్చుకొన్నాను.”
బాబా బోధనల ద్వారా సాఠే ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలకు ఆర్ధికంగా సాయం చేసారు.
దాసగణు
రచించిన ‘సంత్ కధామృత్’ పుస్తక ముద్రణకు
రూ.75/- (ఆరోజులలో అది చాలా పెద్ద మొత్తం) ధన సహాయం చేసారు.
ఔదుంబర వృక్షం ---
1916వ.సంవత్సరంలో పూనా వద్ద ఉన్న కొథ్రుడ్
లో సాఠే గారి సేవకులయిన మంగ్ కులస్తులు అక్కడ ఉన్న ఔదుంబర వృక్షానికి తాళ్ళను
కట్టి
గుడారాలను
వేసుకొన్నారు.
అది
దత్తాత్రేయులవారికి నివాసస్థానమయిన పరమ పవిత్రమయిన వృక్షం.
సాఠేగారికి ఈ విషయాలేవీ తెలీవు.
ఆ తరువాత కొద్ది రోజులకు అవాంఛనీయమయిన, అశుభమయిన పరిణామాలు సంభవించడం ప్రారంభమయ్యాయి. ఆ విధంగా ఎందుకని జరుగుతున్నాయని సాఠేగారు పరిశీలించిపుడు, అనుకోనివిధంగా జరిగిన ఈవిషయం తెలిసింది.
జరిగినదంతా
సాఠే, బాబాగారికి తెలియచేసారు. బాబా సాఠేకి స్వప్నంలో దర్శనమిచ్చి, “ఔదుంబర
వృక్షాన్ని శుధ్ధి చేసి
దత్తాత్రేయులవారి పాదుకలను ప్రతిష్టించి వైభవంగా పూజాదికాలను నిర్వహించు” అని ఆదేశించారు.
బాబా ఆదేశాల ప్రకారం సాఠే దత్త పాదుకలను ప్రతిష్టించి వాటికి ప్రతిరోజు పూజలు చేసేందుకు ఒక పూజారిని కూడా నియమించాడు.
సాఠే గారి వింత ప్రవర్తనలు
ఒకసారి ఆయన షిరిడీలో ఉన్నపుడు తన మామగారయిన దాదాకేల్కర్ తో అభిప్రాయ భేదం వచ్చింది.
దాని
తరువాత ఆయన ధనుర్మాస పూజలను నిర్వహిద్దామనుకున్నారు.
ఆయన
అందరినీ భోజనాలకు పిలిచారు.
కాని
కావాలనే తన మామగారిని మాత్రం భోజనానికి పిలవలేదు.
బాబాని
ఆహ్వానించడానికి
సాఠే మసీదుకు వెళ్లారు. బాబా ఆతనని చూడగానే “నా సటకా పట్టుకు రా” అని గట్టిగా
అరిచారు. ఆతరువాత
శాంతించి, “సరే నేను వస్తాను” అన్నారు.
బాబా నన్ను ఒక్కసారి కూడా కొట్టలేదు.
ఒకానొక సందర్భంలో బాబా సాఠేవైపు చూస్తూ ఇలా అన్నారు.
“సాహెబ్
ఒక మామూలు పల్లెటూరి
మనిషి” బాబాకు కొంతమంది భక్తులమీద కోపం వచ్చినపుడు వారిని కొట్టడానికి పరిగెత్తుకుంటూ వచ్చేవారు.
అంతేకాకుండా
వారిమీద తిట్లవర్షం కురిపిస్తూ ఉండేవారు. కాని
ఆయన సాఠేగారిని ఎప్పుడూ కొట్టలేదు.
అందువల్లనే
సాఠే, “బాబా నన్ను ఒక్కడిని మాత్రమే ఎప్పుడూ కొట్టలేదు” అని చాలా గర్వంగా చెబుతూ ఉండేవాడు.
దానికి కారణం తెలుసుకోవాలని
మాధవరావు దేశ్ పాండేకి చాలా ఆసక్తిగా ఉండేది.
బాబాని
అదే విషయం అడిగినపుడు బాబా “అతనిని నేనెందుకని కొట్టాలి? ఆదెబ్బలు ఏవో అతనికి అతని మామాగారినుంచే తగులుతున్నాయి”
పదవీ విరమణ తరవాత ---
ఇక కాలం గడిచిన తరువాత సాఠే ప్రభుత్వ ఉద్యోగంనుండి పదవీవిరమణ చేసారు.
ఆదాయం
తగ్గింది. దాని
ప్రభావంతో ఇక ఏమిచేయాలో తోచని స్థితిలో భార్యకు సంబంధించిన
ఒక బంగారు ఆభరణాన్ని అమ్మేసారు.
షిరిడీలో
బాబా” ఈ అవివేకి నా కుమార్తె ఆభరణాన్నిఎందుకు
అమ్మేశాడు” అని దాదా కేల్కర్ ని అడిగారు.
సాఠేగారు
బాబాకు చేసిన పూజ
అంతకు
ముందు సంవత్సరాలలో షిరిడీలో గురుపూర్ణిమను జరిపేవారు కాదు. 1908 వ.సంవత్సరంలో షిరిడీలో మొట్టమొదటి గురుపౌర్ణమి
పూజను ప్రారంభించే అదృష్టం తాత్యాసాహెబ్ నూల్కర్ కి లభించింది. బాబా ఉదయం భిక్షకు వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చారు. నూల్కర్ బాబాకు పూజచేసే ఏర్పాట్లతో ఆయన వద్దకు వెళ్ళి
“ఈ రోజు పవిత్రమయిన గురుపౌర్ణమి” అన్నాడు.
పూజ చేయడానికి బాబా సంతోషంతో అనుమతిని ప్రసాదించారు.
ఆతరువాత
అదేవిధంగా పూజ నిర్వహించమని బాబా, దాదాకేల్కర్ కి సందేశాన్ని పంపించారు. సాఠేతోపాటుగా మరికొందరు భక్తులు కూడా ఉండటం చేత
పూజ చేయడానికి బాబా వారికి కూడా అనుమతినిచ్చారు.
గురుపౌర్ణమి
పూజ చేసినట్లుగానే మహాశివరాత్రి పూజ కూడా చేస్తే బాగుంటుందని భావించాడు సాఠే. బాబానే శివస్వరూపంగా భావించి పూజించుదామనుకున్నాడు. కాని బాబా అతనికి అనుమతినివ్వలేదు. కాని సాఠే, మేఘా ఇద్దరూ కలిసి తామనుకున్నట్లుగానే
పూజ నిర్వహిద్దామనుకున్నారు. కనీసం మసీదు మెట్లవద్దనయినా
పూజాకార్యక్రమాన్ని చేద్దామనుకున్నారు. ఆరోజు
రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రివేళ ఇద్దరూ మసీదుకు చేరుకొన్నారు. కాని, అప్పటికింకా తాత్యాపాటిల్ మేలుకొనే ఉన్నాడు. వారిద్దరినీ చూసి అక్కడినుండి వెళ్ళిపొమ్మని మౌనంగానే
చేతితో సైగ చేసాడు. కాని వారిద్దరూ అదేమీ పట్టించుకోకుండా
ముందుకు వెళ్ళి, గంధం, బిల్వపత్రాలు, పుష్పాలతో బాబాని అభిషేకించారు. అప్పుడే బాబా నిద్రనుండి మేల్కొన్నారు.
తన
అనుమతి లేకుండా తనను పూజించడానికి రహస్యంగా ప్రయత్నిస్తున్న ఇద్దరి మీద విపరీతంగా తిట్లవర్షం
కురిపించారు. బాబా బిగ్గరగా తిడుతున్న తిట్లు
షిరిడీ గ్రామమంతా ప్రతిధ్వనించాయి. ఆగందరగోళానికి
మొత్తం షిరిడీ గ్రామం మేలుకొంది. సాఠే, మేఘాలు
ఇద్దరూ కలిసి చేసిన తెలివితక్కువ పనికి గ్రామస్థులందరూ వారికి చీవాట్లు పెట్టారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment