02.09.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి సత్ చరిత్రలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి.
బాబా
అంకిత భక్తులు తమంత తాముగా చెప్పిన కొన్ని విషయాలను సంఘటనలను మరాఠీలో మిస్. ముగ్ధా సుధీర్ దివాద్కర్ గారు
వ్రాసిన
వాటిని ఆంగ్లంలోనికి అనువదించినవారు శ్రీ సుధీర్ గారు.
సాయిలీల ద్వై మాసపత్రిక మార్చ్ – ఏప్రిల్ 2013 వ.సం. సంచికనుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్..
ఆత్రేయపురపు
త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్
రావుబహద్దూర్ సాఠే – 2 వ.భాగమ్
నేను నీ తండ్రిని
సాఠే బాబాని మాత్రమే తన సద్గురువుగా
భావించారు. ఆయనకు తన జీవితకాలంలో
ఎంతోమంది సాధువులను, సంతులని కలుసుకునే అవకాశాలు ఎన్నో వచ్చాయి. కాని ఆయన ఎప్పుడూ వారినుంచి ఉపదేశాలను
పొందడానికి ప్రయత్నించలేదు.
ఆయనకు ఎప్పుడన్నా ఉపదేశం పొందాలనిపిస్తే ఆవిషయం గురించి మొట్టమొదటగా బాబా అనుమతి కోసం దాదాకేల్కర్ ద్వారా అడిగించేవాడు. కాని ఒక సందర్భంలో మాత్రం బాబా ఆయన కోరికను త్రోసిపుచ్చారు.
ఆయనకు ఎప్పుడన్నా ఉపదేశం పొందాలనిపిస్తే ఆవిషయం గురించి మొట్టమొదటగా బాబా అనుమతి కోసం దాదాకేల్కర్ ద్వారా అడిగించేవాడు. కాని ఒక సందర్భంలో మాత్రం బాబా ఆయన కోరికను త్రోసిపుచ్చారు.
కాని ఒకసారి సాఠేగారికి కొంకణ ప్రాంతంలోని సత్పురుషుడయిన కాకా మహరాజ్ పురాణిక్ దగ్గరనుంచి ఉపదేశం తీసుకోవడానికి బాబా అనుమతినిచ్చారు.
ఆయన నన్ను వదలరు
1911వ.సంవత్సరంలో కాకామహారాజ్ పూనాలో ఉన్న డోలే అనే భక్తుని ఇంటిలో బసచేసారు. ఆయనను దర్శించుకోవడానికి ఎంతోమంది వచ్చారు. వారు కూడా ఆయనని తమతమ ఇళ్ళకు రమ్మని ఎంతగానో ప్రాధేయపడ్దారు. ఆవిధంగా ప్రాధేయపడ్డవారిలో సాఠేగారు కుడా ఒకరు. సాఠే ఎంత అడిగినా కాకా మహరాజ్ ఏమాట చెప్పకపోయేసరికి, ఆవిషయాన్ని అంతటితో వదలిపెట్టి ఆఫీసుకు వెళ్ళిపోయారు. అదేరోజు ఆయనకు కాకామహారాజ్ నుంచి, తాను సాఠేగారి కోరికను మన్నించి వారి ఇంటికి వస్తున్నట్లుగా సందేశాన్ని పింపంచారు. సాఠే ఆనందానికి అంతులేదు. కాకా మహరాజ్ గారిని తీసుకురావడానికి తన గుఱ్ఱపు బండీని పంపించారు.
కాకామహరాజ్ గారు రాగానే సాఠే ఆయనకు ఎన్నో అతిధిమర్యాదలు చేసారు. కాని ఒక్క విషయం మాత్రం అడగకుండా ఉండలేకపోయారు. “మహరాజ్, ఉదయం నేను మిమ్మల్ని అడిగినపుడు మీరు రావడానికి ఇష్టపడలేదు, ఇపుడు మీఅంతట మీరే వచ్చారు. ఇదెలా సంభవం?” అని ప్రశ్నించారు.
కాకా మహరాజ్ గారి వద్దనుంచి ఒక అధ్బుతమయిన సమాధానం వచ్చింది. సాఠేగారి ఇంటిలో గోడమీద అలంకరింపబడి ఉన్న సాయిబాబా ఫొటోవైపు చూస్తూ “నేనేమి చేయగలను? నేను మీ ఇంటికి వచ్చేంతవరకు ఆయన నన్ను స్థిమితంగా విశ్రాంతి కూడా తీసుకోనివ్వలేదు”.
మరికొన్ని సందర్భాలు – అనుభవాలు
సాఠేగారి కుమార్తెలలో ఒకామె జోషీని వివాహమాడింది. జోషి అతని కుటుంబంవారు అందరూ బాబా
భక్తులే. సాఠే,
జోషీ యొక్క అనుభవాలను వ్రాసుకున్నారు.
ఒకసారి జోషి బాబా దర్శనం చేసుకుని, తిరిగి వెళ్ళే సమయంలో కొంచెం ఊదీని ఇమ్మని బాబాని అడిగాడు. అప్పుడు బాబా “నీకది తరవాత లభిస్తుంది” అన్నారు. జోషీ రైలులో కూర్చున్న తరువాత అతని ప్రక్కనే ఉన్న తోటి ప్రయాణీకుడు తనకు బాబా స్వయంగా ఇచ్చిన ఊదీలొ కాస్త ఊదీని జోషీకి ఇచ్చాడు.
మరొక సంఘటన జోషి సోదరుడయిన హరికి సంబంధించినది. హరి అతని మిత్రులు బాబాని దర్శించుకోవడానికి వెళ్ళినపుడు ఆయన చాలా ఆగ్రహంగా ఉన్నారు. అది చూసి వారు బాబా దగ్గరకు వెళ్లడానికి సాహసించలేదు. కొంత సేపటి తరవాత బాబా ప్రసన్నులయి, “అయితే మీరు ఆముసలాయనని చంపి నావద్దకు వచ్చారు? అన్నారు. బాబా ముసలాయన అని సంబోధించినది కాకా మహారాజ్ పురాణిక్ గారు స్వర్గానికేగడం గురించని ఆ తరవాత వారికి అర్ధమయింది.
అదేవిధంగా గజానన్ మహరాజ్ గారు కూడా స్వర్గధామం చేసుకోవడం గురించిన సంఘటన. బాబా ఎప్పుడూ లెండిబాగ్ కి ఉదయం గం.8.30 కి గాని 9 గంటలకు గాని వెడుతూ ఉంటారు. కాని ఈ సంఘటన జరిగిన రోజు బాబా మసీదులో ఒక గోడప్రక్కన ఉదయం 10 గంటలదాకా నిద్రపోతూనే ఉన్నారు. అపుడు ఒక భక్తుడు ఆయనని పిలిచి నిద్రలేపినపుడు, బాబా “నా గజాననుడు వెళ్ళిపోయాడు” అన్నారు.
గొప్ప అదృష్ఠం ---
బాబా సాఠేగారి చేత వేపచెట్టువద్ద (గురుస్థాన్) ఒక వాడాను నిర్మింపచేసే అదృష్టాన్ని ప్రసాదించారు.
ఒకసారి బాబా ఆయనతో “ఇక్కడ నా గురువుగారి సమాధి ఉంది. ఆయన పేరు ……..” అని ఆయన ఏదో గొణిగారు. సాఠేగారికి ఆయన చెప్పిన పేరు సరిగా వినపడలేదు. ఆపేరులో చివరి అక్షరం షా గాని సా తో గాని పూర్తవుతుంది. రెండిటిలో ఏదో ఒక అక్షరం అయిఉండవచ్చు అని సాఠే గారు అన్నారు. బహుశా వెంకూ---సా?”
బాబా ఒక అత్యంత రహస్యమయిన ఆంతరంగిక విషయాన్ని
సాఠేగారికి వెల్లడించారు. ఇక
అంతకన్నా గొప్ప అదృష్టం ఇంకేమన్నా ఉంటుందా? అంత అదృష్టం లభించిన తరువాత ఎవరయినా ఇంకేమన్నా అడుగుతారా?
(రేపు మరికొన్ని ఆసక్తిరకరమయిన విశేషాలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(రేపు మరికొన్ని ఆసక్తిరకరమయిన విశేషాలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment