24.08.2020 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నిన్నటిరోజున అనగా 23.08.2020 న ప్రచురించిన ‘మద్రాసు భజనసమాజం’ చదివి స్పందించిన సాయిభక్తులందరికీ కృతజ్ఞతలు.
బాబా
జీవించి ఉన్న కాలంలో ఆయన అనుభూతులను, మహిమలను స్వయంగా అనుభవించిన మద్రాసు భజనసమాజంలోని వారు వ్రాసినదానిని చదివి సాయిభక్తులు ఎంతగానో సంతసించారు.
ఈ రోజు బాబా వారి అనురాగం, ప్రేమ, దయ గురించిన మరొక అధ్భుతమయిన విషయాన్ని మీకు అందిస్తున్నాను.
చెన్నై
నుండి శ్రీమతి మంజు భాషిణి గారు బాబా తన జీవితంలోకి ఏవిధంగా ప్రవేశించారో ఆంగ్లంలో వ్రాసి పంపించారు.
బాబా
తనవారిని ఏవిధంగా తన వైపు రప్పించుకుంటారో ఇది చదివిన తరువాత మనం గ్రహించుకోవచ్చు.
ఆయన
అనురాగం ఎటువంటిదో చదివిన నాకే కళ్ళు చెమర్చాయి.
శ్రీమతి
మంజుభాషిణి గారు శ్రీమతి మాధవి, భువనేశ్వర్ గారికి పంపించారు.
ఇక
చదవండి.
(ఇక్కడ మీకొక ముఖ్యమయిన విషయం చెప్పాలి. మంజుభాషిణిగారి పూర్వీకులు షిరిడీలోనే ఉండేవారట)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
బాబా నాజీవితంలోకి ఏవిధంగా ప్రవేశించారు?
(పిలుస్తే
పలుకుతా)
సాయిబంధువులందరికీ ‘ఓమ్ సాయిరామ్’
ఈ రోజు విజయదశమి మహాపర్వదినం రోజున శ్రీసాయిబాబా జీవితాంతం మీకు తోడుగా ఉండి తన ఆశీర్వాదాలను నిరంతరం ఇస్తూ
ఉండమని
కోరుకొంటున్నాను.
బాబా నాజీవితంలోకి ఏవిధంగా ప్రవేశించారు?
ఆయన నా జీవితంలోకి ఏవిధంగా ప్రవేశించారో మీకు వివరిస్తాను.
2009వ.సంవత్సరం వరకు నాకు బాబా అంటే ఎవరో తెలీదు. ఆయన షిరిడీలో ఉండే ఒక ఫకీరని, ఆయనకు తెల్లటి గడ్డం ఉంటుందని మాత్రమే తెలుసు. అంతకు తప్ప మరేమీ ఆయన గురించి తెలియదు.
ఈ రోజున అనగా 2019వ.సంవత్సరం వచ్చేటప్పటికి నాకు బాబాయే సర్వస్వం.
నా
చుట్టూ ఉన్న ప్రపంచంలో నాకు కనిపించే ప్రతిదానిలోను నేను బాబాని దర్శించుకుంటూ ఉంటాను.
ఆయన
నాకు ప్రతిరోజు తన లీలలను కొన్నిటిని అనుభవించేలా చేస్తూ ఉంటారు.
కాని
ఇవి ఎందుకు ఎలా జరుగుతున్నాయి?
“నావారిని
నేను పిచ్చుక కాళ్ళకి దారం కట్టి లాగినట్లుగా నా వద్దకు రప్పించుకుంటాను” అని బాబా చెప్పారు.
ఆవిధంగా
ఆయన వద్దకు లాగబడిన పిచ్చుకలలో నేనూ ఒకదానిని.
2009వ.సంవత్సరంలో నేను మైలాపూర్ లో ఉన్న బాబా మందిరానికి వెళ్ళాను.
అంతకు
క్రితం రోజే మా మరదలి కొడుకు మూడు ఏండ్ల వయసున్నవాడు బాబా ఫొటో చూపించి ఈయన ఎవరు? అని నన్నడిగాడు.
ఆయనెవరో
నాకు తెలీదని చెప్పాను.
అప్పుడు
వాడు నవ్వుతూ “చిక్కమ్మా! ఈయన బాబా” అన్నాడు.
“ఇంత
చిన్న పిల్లవాడికి ఆయన బాబా అని కాస్తయినా తెలిసింది.
నాకసలు
తెలీనే తెలీదు” అనుకున్నాను.
అపుడు
నేను వాడితో “సరే అయితే, ఆయనను ఎలా ప్రార్ధించాలి?” అని ప్రశ్నించాను.
“ఆయనని
‘బాబా’ అని పిలు ఆయన వస్తారు” అన్నాడు.
పిల్లవాడు
చెప్పినదానిని
బట్టి ఆవిధంగా జరుగుతుందని నేనస్సలు ఊహించలేదు.
బాబా
అని పిలిచినంతనే ఆయన వెంటనే వచ్చేస్తారా అనుకున్నాను.
అపుడు
నేను వాడి చేతిలో ఉన్న బాబా ఫొటోవైపు చూస్తూ “బాబా నా దగ్గరకు రా” అన్నాను.
నేను
ఆవిధంగా అనడం వాడితో ఊరికే నవ్వులాటగా అన్నానే గాని, నేనన్న మాటలలో ఆసమయంలో బాబా మీద ఒక్క శాతం కూడా భక్తిభావం నాలో లేదు.
కాని, ఆమరుసటి
రోజే నేను మైలాపూర్ లో ఉన్న బాబా మందిరానికి వెళ్ళడం జరిగింది.
అప్పటినుండే
నాజీవితంలో బాబా తన లీలలను ప్రదర్శించసాగారు.
ఆయన
అనుగ్రహం వల్లనే నాకు ఇంతకుముందు లేనటువంటి ఆరోగ్యం, సంపద, జ్ఞానం అన్నీ లభింపచేసారు.
2009వ.సంవత్సరం నుండి 2019 వ.సంవత్సరం వరకు ఈ పది సంవత్సరాల కాలంలో నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు సర్వస్వం బాబా, బాబా ---ఆయన తప్ప నా వెనుక నిలబడి నాకు అన్నివిషయాలలోను తోడూ నీడగా ఉండి ప్రతిక్షణం నన్ను కనిపెట్టుకుని ఉండేవారెవరూ లేరు.
నేనాయనకు ఏమి చేసానని, నా వెనుకనే నిలబడి ప్రతిక్షణం నాకు ఆసరాగా ఉన్నారు?
ఆయన ఫోటోవైపు చూస్తూ నేనన్న మాటలు “బాబా” అంతే.
నేనన్న
ఆ ఒక్కమాటకే నేను కలలో కూడా ఊహించని విధంగా బాబా నాకు ఎన్నోవిధాలుగా సాయపడుతూ ఉన్నారు.
ఈ విజయదశమి రోజున నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏమిటంటె బాబాకి ఈరోజు పూజ ఎలా చేయాలి అని ఆలోచించవద్దు, గాభరా పడవద్దు.
లేక
ఆయనకు పూజ చేయకపోయినా ఫరవాలేదు.
మీ
హృదయాంతరాలలోనుండి
మనఃస్ఫూర్తిగా ‘సాయిబాబా’ అని పిలవండి చాలు.
మీ
జివిత ఆఖరి క్షణాల వరకు బాబా మీప్రక్కనే ఉంటే మీకింకేమి కావాలి?
ఓమ్ సాయిరామ్
మంజుభాషిణి
గారు పంపించిన మరొక అద్భుతమయిన సాయి లీల
ఇది
మా అమ్మగారికి 15.06.2019 న శనివారమునాడు జరిగింది. మా అమ్మగారు క్రిందపడిపోవడం వల్ల కుడిచేయి జాయింట్
దగ్గర బాగా దెబ్బ తగిలింది. ఈ సంఘటన జరగడానికి
మూడునెలల క్రితం ఆమెకు కాలు ఫ్రాక్చర్ అయింది.
ఒక వారం క్రితమే దానినుంచి కోలుకొన్నారు.
కోలుకున్న తరువాత మరలా అనుకోని విధంగా కింద పడి చేతికి పెద్ద దెబ్బ తగలడంతో చాలా భయానికి గురయ్యారు. ఆ దెబ్బ బాగా గట్టిగా తగలడంతో విపరీతమయిన నొప్పికి
ఏడవడం మొదలుపెట్టారు. నా సోదరి వెంటనే ఆస్పత్రికి
తీసుకువెళ్ళింది. అక్కడ ఎక్స్ రే తీయించాము. డాక్టర్ పరీక్షించి మందులచీటీ వ్రాసి, దెబ్బతగిలిన
చోట కాస్త రక్తం గడ్డ కట్టింది, అందుచేత మూడు రోజులపాటు నొప్పి ఎక్కువగా ఉంటుందన్నారు. చేతికి
ఏమీ ఫ్రాక్చర్ కాలేదని చెప్పారు. ఫ్రాక్చర్
అవలేదన్న మాటవినగానే మా అమ్మగారికి ఎంతో ఊరట కలిగింది. కాని ఇక్కడ జరిగిన అధ్భుతం ఏమిటంటే డాక్టర్ గారు
మందుల చీటీ వ్రాస్తున్న కాగితం క్రింద శ్రీసాయి సత్ చరిత్ర పుస్తకం ఉంది. ఆపుస్తకంలో అప్పుడు 8వ.అధ్యాయం తెరవబడి ఉంది. అది
చూసి నాకు, ఆస్పత్రిలో సాయి సత్ చరిత్ర ఉండటమేమిటని ఆశ్చర్యం వేసింది. ఇంకా ముఖ్యమయిన విషయం ఏమిటంటె క్రిందటి గురువారమునాడే
మా అమ్మగారు 8 వ. ఆధ్యాయం పారాయణ చేసారు. ‘బాబాకు
నేనంటే ఇష్టం లేదు, నాకు ఆయన సహాయం చేయటంలేదు’ అనే భావం మా అమ్మగారిలో ఉండేది. 8వ. అధ్యాయంలో బాయిజామాయి చేసే సేవ గురించి, భక్తులందరి
మీద ఆమె చూపే ప్రేమ గురించి వివరింపబడి ఉంది.
బాబా తన మీద చూపించిన దయకి మా అమ్మగారు ఎంతగానో పొంగిపోయారు. ఆస్పత్రిలో శ్రీసాయి సత్ చరిత్రలోని 8వ.ధ్యాయం మీదనే
డాక్టర్ గారు మందుల చీటీ వ్రాయడం, తనకి ఫ్రాక్చర్ ఏమీ కాలేదని తెలియడం ఇవన్నీ బాబా
దయవలనేనని గ్రహించుకున్నారు. ఆమె ఇప్పుడు కోలుకుంటోంది.
ఓమ్
సాయిరామ్
(మంజుభాషిణి గారి మరొక అధ్బుతమయిన లీల రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment