Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, August 25, 2020

గురు కృప

Posted by tyagaraju on 7:53 AM

    Chronology of the life of Shirdi Sai Baba
   Pink Rose Clipart - Rose, HD Png Download , Transparent Png Image ...

25.08.2020  మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ముందుగా నేను అడిగిన ప్రశ్నకు బాబా సమాధానం….
23.08.2020 తారీకున నాకు బాగా తెలిసున్న వ్యక్తి సుమారు 70 సంవత్సరాల పైగా  వయసున్నాయన బాబాను తన తరఫున ఒక ప్రశ్న నన్ను అడగమన్నారు.  ఆయనకు అన్ని బరువు బాధ్యతలు తీరిపోయాయి.  హాయిగా కృష్ణా రామా అనుకుంటూ ఉన్నారు.  కాని ఆయనలో ఒక విధమయిన కీర్తి కండూతి అనేది ఉందన్న విషయం తెలిపి దానిని ఎలా తగ్గించుకోవాలో బాబాని అడగమని చెప్పారు.

సరే అని నేను నిన్నటిరోజున అనగా 24 .తారీకున ధ్యానంలో బాబాని ఈ విధంగా ప్రశ్నించాను.  బాబా ఆయన నిన్ను అడగమన్న ప్రశ్న అడుగుతున్నాను.  ఆయన తనలో ఉన్న కీర్తి కండూతిని ఏవిధంగా తగ్గించుకోవాలి.?”

బాబా సమాధానం.. "EGO”  అని సమాధానమిచ్చారు. అనగా అహంకారాన్ని తగ్గించుకోమని చెప్పారు.  కాని నాకు ఇంకా తృప్తికలిగించలేదు ఆ సమాధానం. ధ్యాన సమయంలో   నా శరీర  పరిస్థితిని బట్టి ఇంకా ఆయన చెప్పవలసినది ఉందనిపించి మరికాసేపు అయిదు నిమిషాలు కూర్చున్నా ఏమీ సమాధానం రాలేదు.  ఇక ధ్యానంలోనుంచి లేచి నా టేబుల్ మీద ఉన్న ‘HOW I FOUND GOD’  by E.K. SPENCER గారు వ్రాసిన 500 పేజీల పుస్తకం చేతిలోకి తీసుకున్నాను.  కళ్ళు మూసుకుని బాబాని ప్రార్ధించి ఒక పేజీ తీసి ఒకచోట వేలు పెట్టాను.  కళ్ళు తెరచి చూసాను.  అందులో ఉన్న సమాధానం తెలుగు అనువాదం ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను.


ప్రతి మానవునికి శాశ్వతమయిన పరమానందం జన్మహక్కు.  కాని నరకమనే శాశ్వతమయిన జ్వాల లేదు.  స్వర్గం, నరకం అన్నవి ఉన్నాయి కాని అవి మానవుడు తానే సృష్టించుకున్నవి.  పాపపంకిలమే (పాపాలు చేయడమే) నరకం.  ధర్మబద్ధతే (న్యాయమార్గంలో ప్రవర్తించడమే) స్వర్గం.  పాపపంకిలమయిన సంకెళ్లను త్రెంచుకుని కోరికలు అనేవి లేకుండా గడిపే జీవితం భగవంతుని ప్రేమకు నోచుకుంటుంది.  భగవంతుడు అటువంటివారిని ప్రేమిస్తాడు.  ఆవిధంగా ధర్మబధ్ధంగా జీవితం గడిపినవాడు చివరికి భగవంతుని స్వర్గధామానికి చేరుకొని శాశ్వతానందాన్ని పొందుతాడు." 
నా విశ్లేషణ... కీర్తి కండూతి ఉండటం వల్ల అహంకారం మనలో కలుగుతుంది.  మనలని ఎవరూ కీర్తించటంలేదనే బాధ మనసులో ఉండటమే దానికి కారణం.  అది కూడా ఒక కోరికే కదా.  అందువల్ల ఆ కోరికను కూడా మనం సమూలంగా త్రుంచివేయాలి. 
ఇక ఈ రోజు మంజుభాషిణి గారి మరొక అధ్భుతమయిన బాబా లీలను ప్రచురిస్తున్నాను.  
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
గురు కృప
ఓమ్ సాయిరామ్, 
సాయిబంధువులారా, మనందరియందు సాయి తన అనుగ్రహం చూపాలని ఆయన దయ మనందరిమీద ప్రసరించాలని అందరం కలిసి వేడుకొందాము.
2013.సంవత్సరంలో మా కుటుంబం మీద గురుకృప ఏవిధంగ  ప్రసరింపబడిందో మీకందరికీ వివరిస్తాను.  అప్పట్లో మా కుటుంబం చాలా క్లిష్టదశలో ఉంది.  మా అమ్మాయి వయస్సు నాలుగు సంవత్సరాలు.  మా అమ్మాయికి బాగా విపరీతంగా పొంగు చూపింది.  అది 13 రోజులు ఉంది. నా భర్తకి ఉద్యోగం కూడా పోయింది.  ఆర్ధిక ఇబ్బందుల వల్ల మేము పెరుగన్నం మాత్రమే తినవలలిసిన పరిస్థితి ఏర్పడింది.  అది మాజీవితంలో చాలా కష్టదశ.

ఒకవైపు అప్పులు, మరొక వైపు ఆదాయం లేకపోవడం, మా అమ్మాయికి అనారోగ్యం.  అన్ని కష్టాలు ఒకేసారి చుట్టుముట్టాయి.  మాకులదైవం మంత్రాలయ శ్రీ రాఘవేంద్రస్వామి వారు.

మేము మంత్రాలయం వెళ్ళి అక్కడ మూడురోజులపాటు సేవ చేస్తామని మొక్కుకున్నాము.  స్వామికి సేవ చేసినందువల్ల మా కష్టాలన్నీ తీరిపోయి అంతా శుభమే కలుగుతుందని మా గట్టి నమ్మకం.  కాని ఆ సమయంలో చెన్నైనుండి మంత్రాలయం వెళ్ళడానికి కూడా మావద్ద డబ్బు లేదు.  ఎలా వెళ్లాలో అర్ధం కాని పరిస్థితిలో బాధపడుతూ ఉన్నాము.  ఈపరిస్థితులనుండి మమ్మల్ని మంత్రాలయం నువ్వే తీసుకువెళ్ళు అని సాయిబాబాను ప్రార్ధించుకొన్నాను.

ఇదే సమయంలో మా అమ్మాయి ఆరోగ్యం మెరుగుపడసాగింది.  ఆచారం ప్రకారం పొంగు పూర్తిగా మానిన మూడు రోజుల తరువాత తలకి స్నానం చేయించాలి.   నాలుగవ రోజు ఉదయం నేను మానాన్నగారి వద్దకు వెళ్ళి మంత్రాలయం వెళ్ళడానికి నాలుగువేల రూపాయలు ఇమ్మని అడిగాను.  ఆయన వెంటనే డబ్బు ఇచ్చారు.  మా పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయారు.  అమ్మాయి ఇపుడే మెల్లిగా కోలుకొంటోంది కదా, చిన్నపిల్లతో ప్రయాణం చేయద్దుఅన్నారు.

కాని మేము మా ప్రయాణాన్ని ఆపదలచుకోలేదు.  స్థిరనిశ్చయంతో ఆపరిస్థితిలోనే మంత్రాలయానికి బయలుదేరాము.  సాయిబాబాయే మమ్మల్ని బయలుదేరేలా చేసారు.
       3 Unique Rayara Mathas in South India Apart From Mantralayam ...
             Jasmine Flowers Manufacturer & Exporters from Vellore, India | ID ...
మేము మంత్రాలయం స్టేషన్ కి సాయంత్రం 6 గంటలకు చేరుకొన్నాము.  ఆలయానికి అతి దగ్గరలో ఉన్న హోటల్ కి చేరుకొన్నాము.  మేము అక్కడ ఉండటానికి మానాన్నగారు అన్ని ఏర్పాట్లు ముందే చేసి ఉంచారు.

సాయంత్రం గం.6-30 కు రాఘవేంద్రస్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళాము.  మరుసటి రోజునుంచి మేము మూడురోజులపాటు సేవ ప్రారంభించాలి.

మేము ఆలయంలోకి ప్రవేశించేముందు మాకు ఎదురుగాతెల్లటి కఫనీ ధరించి, తెల్లటి గడ్డం, తలకి గుడ్డ చుట్టుకుని ఉన్న ఒక వ్యక్తి మాకెదురుగా కన్పించాడు.  అతను సూటిగా నావైపు చూస్తూ "నువ్వు ఇక్కడికి రావాలనుకున్నాను, వచ్చావునా దక్షిణ ఇవ్వు అన్నాడు.

ఆవిధంగా దక్షిణ అడిగిన వ్యక్తి సాయి సాయిమా సాయిబాబా.  ఈ లీలను నేను వ్రాస్తున్నపుడు నా కళ్ళు చెమర్చాయి.

అతను దక్షిణ అడిగిన వెంటనే మేము రూ.37/- ఇచ్చాము.  అతను అచ్చం సాయిబాబాలా ఉన్నాడని అన్నారు నాభర్త.

మంత్రాలయంలో మూడు రోజులు చాలా అధ్భుతమయిన సేవ చేసాము.  మేము ఇక మంత్రాలయంనుండి తిరిగి బయలుదేరే సమయం అయినా గాని ఆవ్యక్తి మరలా మాకు కనిపించలేదు.

మమ్మల్ని మంత్రాలయం తీసుకువెళ్ళి రాఘవేంద్రస్వామి వారి దర్శనం చేయించిన సాయికి, ఇంటికి వచ్చిన తరువాత కృతజ్ఞతలు తెలుపుకొన్నాము. 
రాఘవేంద్రస్వామి, సాయి ఇద్దరూ మమ్మల్ని దీవించారు.

మా జీవితంలో జరిగిన అధ్భుతం ఏమిటంటె మాకు సాయి దర్శనమిచ్చారు.  ఇద్దరు గురువుల అనుగ్రహంతో మాజీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరిసాయి.
సాయి దయాళు, సాయి కృపాళు
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

2 comments:

S.V.Swamy on August 25, 2020 at 11:51 AM said...

Sai Ram. Guru is ONE only but comes in many forms as needed. In school and college, we have many teachers and lecturers to teach us various subjects. Similarly, in life also, we get different Gods (Deities) and Gurus at different times to teach us the lessons that we need to learn. The ultimate lesson to be learnt is of course that we are ONE with the ONE and are thus not different.

tyagaraju on August 25, 2020 at 10:55 PM said...

చాలా చక్కగా విశ్లేషించారు... ధన్యవాదములు

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List