26.08.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈరోజు మరొక రెండు బాబా లీలలను ప్రచురిస్తున్నాను. బాబా వారి ప్రతిలీలలోను మనకు ఆయన తన భక్తులపై చూపించే , కరుణ , దయ ఏవిధంగా ఉంటాయో మనం గ్రహించుకోవచ్చు.
అమెరికా నుండి శ్రీ సుబ్రహ్మణ్యం గారు
పంపిన ఈ లీలను భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు పంపించారు. ఇందులో బాబా లీల ఎంత అధ్భుతంగ ఉంటుందో చదవండి. బాబా లీలలు అన్నీ అధ్భుతమే.
తెలుగు అనువాదమ్ ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
వ్రత పూజ, అభిషేకమ్
సాయి బంధువులందరికీ ఓమ్ సాయిరామ్
ప్రతి గురువారమునాడు చేసేటట్లుగానే ఈ
రోజు కూడా వ్రతపూజ చేసాను. ఈరోజు
ఉదయం ఒక భారతీయ దేశభక్తి పౌరుడిగా గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు, ఇంకా ఇతరులు చేసిన ప్రమాణస్వీకార మహోత్సవాన్ని తిలకించాను.
సమయం అంతా దానికే వినియోగించడం వల్ల
గురువారమ్ చేసే పూజ ఎక్కువసేపు చేయలేకపోయాను. ఇంటిలో బాబాకు అభిషేకం కూడా చేయలేదు. అయినాగాని సాయినాధ స్థవన మంజరిని
విన్నాను. శ్రీ సాయి
సత్ చరిత్రను వింటూ చదివాను. కాని నాకు తృప్తి కలగలేదు.
ఎప్పుడూ చేసేలాగే ఈ గురువారం పూజ సరిగా చేయలేకపోయానే అని మనసులో
బాధిస్తూ ఉంది. బాబా, ఈ రోజు నీ పూజకు ఎక్కువ సమయం కేటాయించలేనందుకు నన్ను
క్షమించు అని మనసులోనే బాబాను వేడుకొన్నాను.
నేనీవిధంగా బాధపడుతున్న సమయంలో మా పొరుగింటాయన (అమెరికా) వద్దనుంచి ఫోన్ వచ్చింది. తన ఇంటిలో రుద్రాభిషేకం చేస్తున్నామని
చెప్పి నన్ను కూడా రమ్మని ఆహ్వానించాడు.
వారితో నాకంతగా సన్నిహిత పరిచయం లేని కారణంగా ఆయన పిలిచిన వెంటనే
వెళ్ళడం నాకిష్టం లేకపోయింది. సరే అనుకుని ఇక వెళ్లకపోతే బాగుండదనే ఉద్దేశ్యంతో వారింటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే చాలా ఆశ్చర్యపోయాను. అక్కడ బాబాకి ఆరోజు గురువారం పూజ
చాలా వైభవంగా చేసారు. ఒక గొప్ప సాయిభక్తుని ఇంటిలో జరిగిన సాయివ్రతమ్, సాయిపూజ
చూసే భాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషించాను. గురువారమునాడు పరమశివునికి అభిషేకం
చేయలేదని బాధపడుతున్న నాకు బాబా ఈవిధంగా నాకోరిక నెరవేర్చారు. శివలింగానికి, సాలిగ్రామాలకి అభిషేకాలు చేయమని పాలు ఇచ్చారు. నేనెంతో సంతోషంగా క్షీరాభిషేకం చేసాను. క్షీరాభిషేకం చేయడం పూర్తయే సమయంలో
అక్కడ పూజ నిర్వాహకులు ఒక గ్లాసునిండా నాకు పళ్ళరసం ఇచ్చి శివలింగానికి, సాలిగ్రామాలకి అభిషేకం చేయమన్నారు. గురువారమునాడు అభిషేకం చేయలేకపోయానే
అని బాధపడుతున్న నాకు బాబా అనుగ్రహించి ఈవిధంగా నాకోరిక తీర్చారు. అంతే కాదు, నన్నొక ప్రత్యేకమయిన ఆహ్వానితుడిగా భావించి నాచేత 15 నిమిషాలకు పైగా పండ్లరసంతో అభిషేకం చేసే అవకాశం కలిగించారు బాబా. నాకోరిక ఈవిధంగా తీర్చినందుకు కోటి కోటి సాష్టాంగ ప్రణామాలు బాబా. బాబా తన అధ్భుతమయిన లీలతో భక్తునియొక్క దాహార్తిని ఈవిధంగా తీర్చారు.
ఆవిధంగా బాబా నామీద
తన అనుగ్రహాన్ని ప్రసరించి నాకు సంతృప్తిని కలిగించారు.
సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు
బాబా సమాధి దర్శనం
శ్రీసాయిలీల పత్రిక 1931 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన లీల
శ్రీ పద్మనాభ అయ్యర్, విశ్రాంత అసిస్టెంట్ ఇంజనీర్, P.W.D. తెన్నూర్,
తిరుచిరాపల్లి, 26.07.1939 న చెప్పిన విషయం.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
కొంతకాలం క్రితం
నేను తెన్నూర్ లోనే ఉంటున్న శ్రీ ఎ. ఎస్. గోపాలకృష్ణ అయ్యర్
గారితో మాట్లాడుతున్నాను. మాటల సందర్భంలో ఆయన తాను హై.బి.పి. తో బాధపడుతున్న సమయంలో షిరిడీ సంస్థానానికి వెళ్ళి
శ్రీసాయిబాబా సమాధిని దర్శించుకున్నట్లు చెప్పారు.
బాబా సమాధిని దర్శించుకున్న తరువాత
నుంచి తన హై బి.పి. తగ్గిపోయిందని చెప్పారు. నాకు కూడా బి.పి. ఎక్కువగా ఉండటం వల్ల నేను కూడా షిరిడీ సంస్థానానికి
వెడదామనుకున్నాను. ఈ
లోగా 7 సం.వయసున్న మా అమ్మాయికి బాగా సుస్తీ
చేసింది. ఏప్రిల్ నెలలో
శ్రీ ఎ. ఎస్. గోపాలకృష్ణ అయ్యర్ గారి ఇంటిలో
మొట్టమొదటిసారిగా పూజ జరుగుతూ ఉంది.
నేను ఆపూజకు వెళ్ళి అక్కడ వారిచ్చిన విభూతి ప్రసాదాన్ని ఇంటికి
తీసుకువచ్చాను. కాస్త
విభూదిని మా అమ్మాయికి ఇచ్చాను. వారం రోజులయినా తగ్గలేదు. ఇంకా ఎక్కువయింది. ఆసమయంలో సాయిబాబా నాకు స్వప్నంలో కనిపించి షిరిడీ సంస్థానానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. ఆయన మాటను శిరసావహించి, మా అమ్మాయి పరిస్థితి చాలా ఎక్కువగానే ఉన్నా, 10.05.1939 గురువారము నాడు షిరిడీ వెళ్ళాను.
అక్కడ బాబావారి సమాధిని దర్శించుకొని ప్రసాదంతో ఇంటికి తిరిగి
వచ్చాను.
మా అమ్మాయికి పూర్తిగా
నయమయి మంచి ఆరోగ్యం చేకూరింది. నా
బి.పి. కూడా సాధారణ స్థితికి వచ్చింది.
(రేపటి సంచికలో ఆదివారమ్ - ఆవు ప్రసవం చదవండి)
(త్వరలో మంజుభాషిణి గారి మరొక అద్భుతమయిన అనుభవమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment