27.08.2020 గురువారమ్
సాయి
శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
క్లిష్ట పరిస్థితిలో బాబా ఏవిధంగా
సహాయం
చేసారో ఈ రోజు ప్రచురిస్తున్న లీల ద్వారా మనం గ్రహించుకోవచ్చు.
శ్రీసాయి లీల పత్రికలో ప్రచురింపబడిన కొన్ని లీలలను చదవండి.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాదు
ఆదివారమ్ - ఆవు ప్రసవమ్
శ్రీ నాగవరం లక్ష్మీనారాయణ అయ్యర్ గారి కుమరుడు శ్రీ ఎన్. ఎల్. దొరై, డబుల్ మాల్ స్ట్రీట్, తిరుచిరాపల్లి ఫోర్ట్ , 26.07.1939 లో జరిగిన వారి అనుభవం.
ఇంటిలో ఉన్న పాడి ఆవు ఆదివారమునాడు ఈనినట్లయితే ఇంటి యజమానికి ప్రాణగండమని అంటారు.
మాకు
మంచి పాడి ఆవు ఉంది.
23వ.తారీకు (ఆదివారము) నాడు మా ఆవు ప్రసవించడానికి సిధ్ధంగా ఉంది.
అది నొప్పులను భరించలేక కిందపడుకొని అటూ ఇటూ దొర్లుతూ బాధ పడుతూ ఉంది. ఇక రాబోయే ప్రమాదాన్ని నివారించడం కోసం దానిని ఇంటినుండి బయటకు పంపడం కూడా క్షేమకరం కాదని భావించాము. ఏదిఏమయినప్పటికీ ఆవుని ఇంటినుండి మా ఏజెంటు ఇంటికి పంపించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అపుడు నేను బాబాను ఇలా ప్రార్ధించాను “బాబా ఆవు ఆదివారమునాడు ఈనకుండా ఉన్నట్లయితే, 24 వ.తారీకు సోమవారమునాడు ప్రత్యేకంగా నీఫోటోకి పూజ చేసి ప్రసాదం నైవేద్యం పెడతాను”.
అది నొప్పులను భరించలేక కిందపడుకొని అటూ ఇటూ దొర్లుతూ బాధ పడుతూ ఉంది. ఇక రాబోయే ప్రమాదాన్ని నివారించడం కోసం దానిని ఇంటినుండి బయటకు పంపడం కూడా క్షేమకరం కాదని భావించాము. ఏదిఏమయినప్పటికీ ఆవుని ఇంటినుండి మా ఏజెంటు ఇంటికి పంపించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అపుడు నేను బాబాను ఇలా ప్రార్ధించాను “బాబా ఆవు ఆదివారమునాడు ఈనకుండా ఉన్నట్లయితే, 24 వ.తారీకు సోమవారమునాడు ప్రత్యేకంగా నీఫోటోకి పూజ చేసి ప్రసాదం నైవేద్యం పెడతాను”.
ఆశ్చర్యకరంగా ఆవు అంత విపరీతంగా నొప్పులు పడుతున్నప్పటికీ ఆదివారమునాడు ఈనలేదు. 24వ.తారీకు సోమవారం మధ్యాహ్నం ఆవు ఈనడం జరిగింది. నేను ప్రార్ధించుకున్న విధంగా బాబాకు ప్రత్యేకంగా పూజ చేసి ప్రసాదవినియోగం కావించాను.
బాబా వారి ఊదీ యొక్క శక్తిని తెలిపే రెండు లీలలు...
వాయువేగుల వెంకట సుబ్బారావు, అప్పనపల్లి (వయా నగరం, రాజోలు తాలుకా)
15.12.1938
తలనొప్పి -
క్రిందటి
జూన్ నెలలో నాకు తలనొప్పి విపరీతంగా వచ్చిన సమయంలోనే శ్రీ సాయిబాబా స్పర్శ అంటే ఏమిటో మొదటిసారిగా తెలిసింది.
ఆ
తలనొప్పి చాలా విపరీతంగా భరింపలేకుండా ఉండటంతో నేను మాబావమరిది శ్రీ శిష్టా సుబ్బారావు (బి.ఎ. ఆనర్స్) దగ్గరకు సహాయం కోసం వెళ్ళాను.
నేను
వెళ్ళేటప్పటికి
అతను కొద్దిరోజుల క్రితమే వచ్చిన ‘సాయిలీల’ తెలుగు పత్రిక చదువుతూ ఉన్నాడు.
నేను
నాబాధను వివరింపగానే నాకు శ్రీసాయి ఊదీ ప్రసాదం ఇద్దామనే ఆలోచన అతని మనసులో తళుక్కున మెరిసింది.
నేను
అతను ఇచ్చిన ఊదీని నానుదుటికి రాసుకుని మరికాస్త నోటిలో వేసుకొన్నాను.
మంత్రం
వేసినట్లుగా
అయిదు నిమిషాలలోనే నా తలనొప్పి మాయమయిపోయింది.
అప్పటినుండి నాకు ఎన్నో స్వప్నాలు, ఆస్వప్నాలలో దివ్యపురుషుల దర్శనం కలుగుతూ ఉండేది.
వారంతా
శ్రీసాయి యొక్క అవతారాలేనని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని.
పసిపిల్లవాడి బాధ – సరిగ్గ పైన చెప్పిన సంఘటన జరిగిన మరుసటి రోజే 9 నెలల వయసున్న బాబు నా మేనల్లుడు అర్ధరాత్రివేళ ఏకారణం లేకుండా ఆపకుండా గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు.
తల్లితో
సహా అందరూ వాడి ఏడుపు ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏడువు ఆపలేదు.
అపుడు
మాబావమరిది శ్రీ సాయి ఊదీని తీసుకుని పిల్లవాడి నుదిటిమీద రాసాడు.
వెంటనే
మంచి ఫలితం కనపడింది.
పిల్లవాడు
ఏడుపు మాని ప్రశాంతంగా నిద్రపోయాడు.
ఉత్తరాలు – కలలు ---
నాకు
నా సోదరుడికి కలిగే ఆసక్తికరమయిన అనుభవాలని వివరిస్తాను.
మాఇద్దరికీ
ఉత్తరం వచ్చినట్లుగా కలలు వస్తూ ఉండేవి.
ఆవిధంగా
బాబాకు సంబంధించిన ఉత్తరం షిరిడీనుంచి గాని, మద్రాసునుంచి గాని ఆ మరుసటి రోజే వస్తూ ఉండేవి.
దీపాల పిచ్చయ్య శాస్త్రి (బ్రాహ్మిన్, వయసు 45 సం.) తెలుగు పండిట్ వి.ఆర్. కాలేజీ నెల్లూరు
22.09.1938
నేను, నాభార్య
ఇద్దరం 'సాయిలీల’ చదవడం పూర్తి చేసాము.
సరిగ్గ
అప్పుడే బెజవాడలో ఉన్న మా అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదని సమాచారం వచ్చింది.
మేము
చాలా గాభరా పడుతూ మర్నాడే బెజవాడ వెళ్లడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాము. ఆరోజు
రాత్రి తెల్లవారుజామున నా భార్యకు కలలో ఒక వృధ్ధుడు దర్శనమిచ్చి, “భయపడకు, మీ అమ్మాయి క్షేమంగా ఉంది” అన్నాడు.
ఆ
కలను నిజం చేస్తూ మరుసటి రోజే మా అమ్మాయి క్షేమంగా ఉందనే ఉత్తరం వచ్చింది.
ఆ
ఉత్తరంలో అమ్మాయి క్షేమంగా ఉందని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఉంది.
కలలో
దర్శనమిచ్చిన
ఆవృధ్ధుడు బాబా తప్ప మరెవరూ కాదని మేము పూర్తిగా నమ్ముతున్నాము.
(శ్రీ సాయి సాగరమునుండి వెలికి తీసిన ఆణిముత్యాలు ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా చదవండి.)
http://teluguvarisaidarbar.blogspot.com
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
http://teluguvarisaidarbar.blogspot.com
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment