Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, August 28, 2020

బాబా దర్శనం - షిరిడీలో అధ్బుతమయిన లీల

Posted by tyagaraju on 7:32 AM
      Shirdi temple to be closed from Sunday after Uddhav Thackeray's remarks on  Sai Baba's birthplace- The New Indian Express
      Download Pink Rose Hd HQ PNG Image | FreePNGImg
28.08.2020  శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అధ్భుతమయిన బాబా లీలను ప్రచురిస్తున్నాను.  సాయిలీల పత్రికలో ప్రచురింపబడిన ఈ లీలను తెలుగులోనికి అనువాదం చేసి పంపించినవారు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి.

 బాబా దర్శనం - షిరిడీలో అధ్బుతమయిన లీల

నా భార్యపేరు సుచిత్ర. ఆమె 02.05.2005 నాగపూర్ లో భయంకరమయిన ప్రమాదానికి గురయింది.  ఆమె కుడిచేయి, భుజందగ్గర కాలర్ బోను, ఎడమకాలు, పాదాలు, వేళ్ళు చాలా భయంకరంగా విరిగాయని డాక్టర్ చెప్పారు.  కాలు, చేయి, చర్మం కూడా చీలిపోయింది. నాగపూర్ లోని ఒక డాక్టర్ చేతికి కాలికి మందుపెట్టి కట్టు కట్టారు.  కుడి చేయిని మెడవద్దనుంచి కట్టుకట్టారు.  


ఎడమకాలుకు కూడా కట్టుకట్టినందువల్ల కాలు నిటారుగా లేక నడవడం కూడా కష్టంగా ఉంది.  కొన్ని రోజుల తరువాత చాలా కష్టం మీద మెల్లగా నడిచేది.  ఆమె బాబాకు భక్తురాలు.  బాబాను మనస్థాపంతో వేడుకుంటూ ఉండేది.”బాబా ఈ కష్టాన్ని దూరం చెయ్యి తండ్రీ” అని.  అన్నింటికన్నా ఆశ్చర్యకరమయిన సంఘటన 15.06.2005 రాత్రి దగర దగ్గర గం.1.55 నిమిషాలకు పరమ పూజనీయులయిన సాయినాధులవారు నాభార్య ఎదురుగా వచ్చి నిలబడ్డారు.  
          Samriddhi Shirdi Sai Baba Picture On Vinyl Sunboard with Gloss Lamination.:  Amazon.in: Home & Kitchen
నా భార్య ఆసమయంలో నిద్రపట్టక మేలుకొనే ఉంది.  బాబా ఆమెను లేచి నిలబడు అన్నారు.  అపుడామె “బాబా నాకు కాలు చెయ్యి ఎముకలు విరిగి బాగా నొప్పిగా ఉన్నాయి.  నేను లేచి నిలబడలేకుండా ఉన్నాను తండ్రీ” అంది.  అపుడు బాబా “దెబ్బ ఎక్కడ తగిలింది, చూపించు” అన్నారు.  ఆమె  చీరపైకెత్తి తన కాలికి తగిలిన దెబ్బను చూపించలేకపోయింది.  అపుడు బాబా “నేను నీకు తండ్రి, తల్లిని, తల్లి దగ్గర సిగ్గెందుకు? లే" అని ఆమె చేయి పట్టుకొని లేపారు.  ఆమె కాలికి చేయికి ఉన్న కట్టుమీద బాబా చేయి పెట్టగానే వాటంతటవే ఊడి క్రింద పడిపోయాయి.  కట్టుమీద ఉన్న లేపనం మంచంమీద ఉన్న దుప్పటిమీద పడిపోయింది.  బాబా ఆమె ప్రక్కన కూర్చుని “చేయి తిన్నగా పెట్టు” అన్నారట.  అలాగ అని తనే ఆమె చేతిమీద తన చేతినిపెట్టి ఆమె చేయి నిటారుగా చేసారు.  మళ్ళీ చేయి ముడుచుకో అన్నారు. నా భార్య ఆవిధంగానే చేసింది.  అపుడు బాబా “ఇక నీవు బాగయినావు” అని అన్నారు.  బాబా నిలబడి ఆమెను ఆశీర్వదించారు.  ఆమె బాబాతో “బాబా టీ తయారు చేసి ఇస్తాను త్రాగి వెళ్ళు” అంది.  ఆమాటలకు బాబా చిన్న చిరునవ్వు నవ్వారు.  ఆమె బాబాను నాకు చూపించాలని “ఏమండీ నిద్రలేవండి, బాబా వచ్చారు” అని అరిచింది.  నేను లేచి చూసేసరికి బాబా వెళ్ళిపోయారు.  బాబా తను వచ్చాననే విషయం గుర్తు చేయడానికన్నట్లుగా ఆమె కాలు చేయి బాగుచేసారు.  దుప్పటి మీద లేపనం పడి ఉంది.  కాని ఆమె పిడికిలి మూసుకుని ఉంది.  చేయి తెరవమని చెప్పాను.  ఆమె చేయి తెరవగానే చేతిలో బాబా పెట్టిన ఊదీ ఉంది.  నా భార్య సుచిత్ర ఎపుడూ షిరిడీ వెళ్ళలేదు.  కాని నాగపూర్ లో మాయింటికి దగ్గరలోనే ఉన్న బాబా గుడికి ఎపుడూ వెడుతూ ఉండేది.  శ్రధ్ధతో బాబాను పూజించుకుని వచ్చేది.  బాబా చూపించిన ఈ లీల మాకు ఎంతో ఆనందాన్ని కలిగించి బాబాపై మా భక్తిని మరింతగా పెంచింది.

కొన్నిరోజుల తరవాత మా అమ్మాయి, అల్లుడుతో సహా మేమందరం కారులో షిరిడీకి వెళ్ళాము.  అక్కడ వరుసలో నిలబడి బాబా దర్శనం చేసుకొన్నాము.  ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము.  ఆ తరువాత ప్రసాదాలయానికి వెళ్ళాము.  అక్కడ ప్రసాదాలయంలో అన్నం, రొట్టె, పప్పు అన్నీ వేసారు.  మేమందరం భోజనాలు చేస్తున్నాము.  “నాభార్యకు అన్నంలో బాబా ప్రసాదం (తెల్లని చిన్న చిన్న కలకండ పలుకులు, జీడిపప్పు, శనగలు) సమాధిమందిరంలో బాబాకు నివేదన చేసేవి, ఒక బాబా లాకెట్ అన్నీ వచ్చాయి.  మేము చాలా ఆశ్చర్యపోయాము.  అక్కడ వడ్డన చేసేవాళ్ళని పిలిచి, “అన్నంలో ఈ ప్రసాదం ఎలా వచ్చింది?  మీరేమన్నా వేసారా?” అని అడిగాము.  వారంతా తెల్లమొహం వేసుకొని నిలబడ్డారు.  అందరూ బాబా చేసిన ఈలీలకు ఆశ్చర్యపోయారు.  మేము ముఖ్యంగా నాభార్య బాబావారి అశేషమయిన కృపకు పాత్రురాలయింది.  ఆయన దీనజన బాంధవుడు.  అందరూ ఆయన చేసే అధ్భుతాలకు తలవంచక తప్పదు.
ఎమ్.డి. మిశ్రా
ఎస్.బి.ఐ. కాలనీ
నాగపూర్
(రేపు మరొక బాబా లీల)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List