29.08.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి లీల పత్రికలో ప్రచురింపబడిన లీలను భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు పంపించారు. ఈ లీలను చదివిన తరువాత బాబా తన భక్తుల క్షేమం గురించి ఎంతగా శ్రమిస్తూ ఉంటారో మనం అర్ధం చేసుకోవచ్చు.
గౌహతీలో తుఫాను
ఇపుడు నేను చెప్పబోయేది 2009 వ.సంవత్సరంలో జరిగిన సంఘటన.
అప్పట్లో
మా వారు అస్సాం, గౌహతిలో పనిచేస్తూ ఉండేవారు.
మేము
మా కుటుంబంతో సహా ఒక పెద్ద బంగళాలో క్రింద గదిలో ఉండేవాళ్ళం.
గౌహతీలో
మూడు సంవత్సరాలు ఉన్న తరువాత మావారికి ఢిల్లీకి బదిలీ అయింది.
మా
స్వంత ఊరు ఢిల్లీ అవటం వల్ల మేమెంతగానో సంతోషించాము.
ఒకరోజు రాత్రి నాకు నిద్రలో బాబా దివ్యస్వరం వినిపించింది. “గౌహతి పూర్తిగా నీళ్ళలో మునిగిపోతుంది’ -
ఆ స్వరం
వినగానే వెంటనే నిద్రనుండి లేచాను.
ఎవరు
అలా చెప్పినది అని చూసాను గాని ఎవరూ కనిపించలేదు.
ఆరోజుల్లో గౌహతీలో వాతావరణం కూడా మామూలుగానే ఉండేది.
బాగా
ఎండలు కాసేవి.
బ్రహ్మపుత్రానది కూడా
మామూలుగానే ప్రవహిస్తూ ఉంది.
ఇక
నాకు వినపడ్డ స్వరం ఏదో కలే అనుకుని దాని విషయం మర్చిపోయాను.
పదిరోజుల
తరువాత అదే విధంగా రాత్రి నిద్రపోతున్న సమయంలో “గౌహతి పూర్తిగా నీటిలో మునిగిపోతుంది” అని పదిరోజుల క్రితం వినిపించిన స్వరమే మరలా వినిపించింది.
ఈవిధంగా
వినిపించిందని
మావారికి చెప్పాను.
ఎలాగు ఇక్కడినుంచి వెళ్ళిపోతున్నాము కదా అని సామానులన్నీ సద్ది ఒక ట్రక్ లో ఢిల్లీకి కూడా పంపించేసాము.
తరువాత
మేము రైలులో ఢిల్లీకి వెడదామనే ఉద్దేశ్యంతో మాకు అవసరమయిన కొన్ని సామానులను మాత్రమే మావద్ద ఉంచుకొన్నాము.
గౌహతినుండి
ఢిల్లీకి వెళ్ళే రైలుకు అయిదురోజుల తరువాత మాప్రయాణం.
టిక్కెట్లు
కూడా బుక్ చేసేసుకున్నాము.
సరిగ్గ
ఈ సమయంలోనే అనుకోకుండా గౌహతీలో మేఘాలు మబ్బులు కమ్మేసాయి.
ఎడతెరపిలేని
వర్షం ప్రారంభమయింది.
ఎదో మామూలు
వర్షమే అదే ఆగిపోతుందిలే అనుకున్నాము.
కాని
అస్సలు ఎక్కడా ఆగే సూచనలు కనపడలేదు.
మెల్లగా
మొత్తం ఊరంతా తుఫానులో చిక్కుకుంది.
గౌహతినుండి
ఢిల్లీకి ఎలావెళ్ళాలా అని మధన పడుతూ ఉన్నాము.
అపుడె
ఆశ్చర్యకరంగా
బాబావాణి వినిపించింది---“ నేను నీకు రెండుసార్లు చెప్పాను కదా, గౌహతీలో తుపాను వస్తుందని, వెంటనే రైల్వేస్టేషన్ కి వెళ్ళిపోండి.
అక్కడ
ఒక గదిలో ఉండండి’ అని చెప్పారు.
ఇక
మేము మనసులోనే బాబాకు నమస్కరించుకొని, ఉన్న సామాన్లన్నిటినీ తీసుకుని వెంటనే స్టేషన్
కి చేరుకున్నాము.
వెంటనే
రాజధాని రైలుకు టిక్కెట్లు తీసుకుని వెళ్ళిపోయాము.
అక్కడినుంచి
మా ప్రక్కింటివారికి ఎలా ఉన్నారని ఫోన్ చేసాము. “మీరు వెళ్ళడం మంచిదయింది.
బంగళాలో
మీరు ఉన్న గదులన్నీ జలమయం అయిపోయాయి.
మొత్తం
గౌహతీ అంతా తుఫానులో చిక్కుకుంది, అంతా అస్తవ్యస్తం అయిపోయింది.
ఆ
భగవంతుడె మిమ్మల్ని రక్షించాడు” అని చెప్పారు.
ఇదంతా విన్న తరువాత బాబా స్వరం “గౌహతి పూర్తిగా నీటిలో మునుగుతుంది” నా చెవులలో ప్రతిద్వనించింది. బాబా తననే నమ్ముకున్నవాళ్ళను ఏవిధంగా సహాయపడి రక్షిస్తారో అన్నది గ్రహించుకున్నాము. స్వయంగా ఆయన నావద్దకు వచ్చి తన స్వరాన్ని వినిపించి మమ్మల్ని రక్షించారు. మమ్మల్ని కృతార్ధులను చేసారు. “హే సాయినాధ్, నువ్వు నీభక్తుల గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటావు. నా సంపూర్ణ జీవితాన్ని నీకే అర్పిస్తున్నాను” అని మనసులోనే ప్రార్ధించుకున్నాము.
ఇదంతా విన్న తరువాత బాబా స్వరం “గౌహతి పూర్తిగా నీటిలో మునుగుతుంది” నా చెవులలో ప్రతిద్వనించింది. బాబా తననే నమ్ముకున్నవాళ్ళను ఏవిధంగా సహాయపడి రక్షిస్తారో అన్నది గ్రహించుకున్నాము. స్వయంగా ఆయన నావద్దకు వచ్చి తన స్వరాన్ని వినిపించి మమ్మల్ని రక్షించారు. మమ్మల్ని కృతార్ధులను చేసారు. “హే సాయినాధ్, నువ్వు నీభక్తుల గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటావు. నా సంపూర్ణ జీవితాన్ని నీకే అర్పిస్తున్నాను” అని మనసులోనే ప్రార్ధించుకున్నాము.
(రేపటి సంచికలో శ్రీమతి మంజుభాషిణి గారికి బాబా చూపించిన మరపురాని అనుభూతులు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
1 comments:
Om sai ram
https://www.telugunetflix.com
Post a Comment