23.09.2020 బుధవారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
“ఆరతి సాయిబాబా” అని బాబా ఆరతిని రచించిన శ్రీ మాధవరావు అడ్కర్ గురించిన వ్రుత్తాంతాన్ని ఈ రోజు ప్రచురిస్తున్నాను.
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక జూలై – ఆగస్టు 2011 వ.సంవత్సరంలో ప్రచురితమయింది.
మాధవరావు
అడ్కర్ - 1 వ.భాగం
తెలుగు అనువాదం -
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
‘ఆరతి సాయిబాబా’ అనే ఆరతి పాటతో ‘సాయి విశ్వ’ ప్రపంచంలో మాధవరావు అడ్కర్ పేరు చిరస్థాయిగా నిలిచింది.
జ్ఞాని అయిన భక్తుని యొక్క లక్షణాలు శ్రీమద్భగవద్గీతలో వివరింపబడ్దాయి. ఈ లక్షణాలను మనం చదువుతున్నపుడు మాధవరావు అడ్కర్ వెంటనే మన మనసులో మెదులుతాడు. ఆలక్షణాలలో ఎన్నో మాధవరావులో ఉన్నాయి.
ఇదంతా మాయాప్రపంచం, నిత్యమైనది కాదు.
అలాగే ఈ శరీరం కూడా శాశ్వతమయినది కాదని, అందువల్లనే ఈ శరీరంతో బంధం, మోహంలాంటివేమి ఏర్పరచుకోరాదని నమ్మే వ్యక్తి మాధవరావు.
మానవుడు అన్ని కోరికలకు, ఆకర్షణలకి లోను కాకుండా ఉండాలని భావించేవాడు.
మానవుడు సత్యమార్గంలోనే సంచరించాలని, పుణ్యస్థలాలను దర్శించుకుంటూ భగవన్నామ స్మరణతోనే జీవితం గడపాలని తలచేవాడు.
ఆవిధంగా ప్రవర్తించినట్లయితే మానవుడు తన లక్ష్యాన్ని చేరుకుని ఆధ్యాత్మికానందాన్ని పొందగలడు అని ఆయన భావం.
ఆయన తన జీవితంలో ఆమార్గంలో పయనించి, అభివ్రుధ్ధిని సాధించి ఉన్నతస్థానానికి ఎదిగారు.
ఆధ్యాత్మిక రంగంలో మంచి యశస్సును పొందగలిగారు.
బాల్యం…
అడ్కర్ కుటుంబం వారు అహ్మద్ నగర్ కు దగ్గర ఉన్న ధనోరా గ్రామంనుండి వచ్చినవారు.
వారి కుటుంబానికి రెండు వాడాలు (భవంతులు) , పెద్ద వ్యవసాయ భూమి ఉంది.
వారు గ్రామానికి ‘కులకర్ణి’ హోదాలో ఉంటూ భూమి శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తూ, వాటికి సంబంధించిన లెక్కలను అప్పచెబుతూ ఉండేవారు.
అడ్కర్ కుటుంబానికి మూలపురుషుడు ‘యోగిరాజ్”.
ఆయన సమాధి రెండు వాడాలలో ఒకదానిలో ఉంది.
శిధిలావస్థలో ఉన్న ఆయన సమాధిని ఇటివల కాలంలో మాధవరావు మేనల్లుడు శ్రీ విష్ణుపంత్ అడ్కర్ వారి కుటుంబ సభ్యులు పునర్నిర్మించారు.
స్వామి యోగిరాజ్ గారికి ఒక్కడె కుమారుడు.
అతని పేరు సబాజీ. సబాజీపంత్కు ముగ్గురు కొడుకులు.
పెద్దవాడు త్రయంబకరావు.
ఇతను మాధవరావుకు తాతగారు.
మాధవరావు అడ్కర్ తండ్రి వామనరావు.
ఆయన విఠల్ భక్తుడు. ఆయన సంవత్సరంలో నాలుగు సార్లు పండరీపురానికి యాత్ర చేస్తూ ఉండేవారు.
మాధవరావు తల్లి గోదావరీ బాయి.
ఆమె ధర్మాచార పరాయణులయిన దేశ్ ముఖ్ కుటుంబంనుండి వచ్చింది.
మాధవరావు 5 వ.తేదీ సెప్టెంబరు, 1877 వ.సంవత్సరంలో జన్మించాడు.
ఆయన ధనవంతులు, దైవభక్తి కల బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.
ఆయన జన్మించినపుడు జరిగిన ఒక ముఖ్యమయిన సంఘటనను వారి కుటుంబంవారు చెబుతూ ఉండేవారు.
మాధవరావు తాతగారు విఠల్ మందిరం ఆవరణలో నిద్రిస్తు ఉన్నారు.
రాత్రివేళ రెండుగంటలకు ఆయనకు కలలో “లే, నీకు మనవడు జన్మించాడు” అన్న మాటలు వినిపించాయి.
వెంటనే నిద్రనుండి లేచి ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్ళారు.
ఆయన కుమార్తెకు పుత్రుడు జన్మించాడని తెలిసింది.
విఠల్ మందిరంలో తనకు వచ్చిన కల యదార్ధమయిందని గ్రహించుకున్నారు.
మధవుడే అనగా ఆవిఠలుడే తనకు మనవడుగా జన్మించాడని ఎంతో మురిసిపోయారు.
అందువల్లనే మనవడికి మాధవ్ అని నామకరణం చేసారు.
అతను నెలల పిల్లవాడిగా ఉన్నపుడు అనుకోని విధంగా ఒక ప్రమాదకరమయిన సంఘటన జరిగింది.
అతని తల్లి మాధవని ఆడిస్తూ వాడిని గాలిలోకి పైకి ఎగరేసింది. పట్టుకుందామనుకునేలోపె,
ప్రమాదవశాత్తు పట్టుతప్పి నేలమీద ఇసుకలో పడ్డాడు.
తల్లి భయంతో వణికిపోయింది. కాని, పిల్లవాడికి ఏమీ కాలేదు.
నవ్వుతూ తల్లివైపు చూస్తున్నాడు.
పిల్లవాడిలో అద్వితీయమైనదేదో ఉన్నదనే విషయం ఆమెకు అర్ధమయింది.
(మనలో కొంతమందికి నెలల పిల్లలను ఎత్తుకుని ఆటగా వారిని చేతులతో ఎత్తుగా పట్టుకోవడం కాస్త పైకి ఎగరేసి చేతులతో పట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఆవిధంగా చేసినప్పుడు పిల్లలు నవ్వినా గాని వారిలో ఒక విధమయిన భయం, ఊపిరి పీల్చుకోలేకపోవడం లాంటివి ఉంటాయి. మనకు ఆటగా ఉన్నా వారికది చెప్పుకోలేని కష్టంగా ఉంటుంది. దయచేసి ఇటువంటి అలవాట్లు ఏమన్న ఉన్నట్లయితే ఇక ముందునుంచయినా ఆవిధంగా పసిపిల్లలతో ఆటలు ఆడవద్దు.... త్యాగరాజు)
మాధవరావు -
ప్రాపంచిక కోరికలు లేని వ్యక్తి
అతనికి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులో తల్లి మరణించింది.
బాల్యంలోనే అతనికి తల్లి దూరమవడంతో మానసికంగా చాలా క్రుంగిపోయాడు.
బాల్యం అంటె ఆటలు ఆడుకునే వయసు.
అతని బాల్యమంతా నిరాశా నిస్ప్రుహలతో
నిండిపోయింది. ముగ్గురి మనవల పెంపకం బరువు బాధ్యతలు తాత, అమ్మమ్మల భుజస్కంధాల మీద పడింది.
మాధవరావు తండ్రికి ఉద్యోగ రీత్యా ఒకచోటునుంచి మరొక చోటుకి బదిలీలు అవుతూ ఉండేవి.
ఆకారణం చేతనే 1885 నుండి 1895 వరకు మాధవరావు అహ్మద్ నగర్ లో దేశ్ ముఖ్ అనగా తన తాత అమ్మమ్మల ఇంటిలోనే
ఉండవలసి వచ్చింది. అక్కడె మెట్రిక్యులేషన్ వరకు విద్యనభ్యసించాడు.
అతను చాలా సూక్ష్మగ్రాహి, తెలివయిన విద్యార్ధిగా పేరుగాంచాడు.
అతనికి ఇష్టమయిన అంశం గణితం.
ఈ
సందర్భంగా మాధవరావు మనుమడు (రామచంద్ర పంత్ కుమారుడు) శ్రీ జనార్ధన పంత్ చెబుతున్న విషయం,
“ మాధవరావుకి బాల్యంలోనే తల్లి దూరమయింది.
అందువల్ల ఆయన పెంపకం తాత అమ్మమ్మలవద్ద జరిగింది. అతనిది తోటిపిల్లలతో ఆడుకునే బాల్యావస్థ. తల్లి పోవడంతో నిరాశకు లోనయి ఎవరితోనూ కలిసేవాడు
కాదు. పాపం ఈ స్థితి సహజమే. ఆయన తాతగారి ఇంటిలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని
ఉండేది. అందువల్ల ఆయన తన తాతగారయిన నానా సాహెబ్
గారితోపాటు భక్తిపాటలకి, భజనలకి వెడుతూ ఉండేవాడు.
మాధవరావు కంఠం చాలా శ్రావ్యంగా ఉండేది.
అందువల్ల చాలా చక్కగా పాటలు పాడే సామర్ధ్యం సహజంగానే అలవడింది. సంగీతం తరగతులకి హాజరవుతూ పాటలు పాడటంలో తర్ఫీదు
పొందాడు. బేలాపూర్ కర్ మహరాజ్ గారి వాయిద్య
పరికరం దేవాలయానికి తీసుకుని వచ్చినపుడు అతనికి అభంగాలను పాడే అవకాశం లభించింది.
(రెండు చోట్ల అక్షర దోషాలు ఉన్నాయి. ఎంతసరిచేసినా సరిఅవడం సాధ్యం కాలేదు. దయచేసి ఏమీ అనుకోవద్దు.... సాయిరాం)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment