24.09.2020 గురువారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
“ఆరతి సాయిబాబా” అని బాబా ఆరతిని రచించిన శ్రీ మాధవరావు అడ్కర్ గురించిన వ్రుత్తాంతాన్ని ఈ రోజు ప్రచురిస్తున్నాను.
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక జూలై – ఆగస్టు 2011 వ.సంవత్సరంలో ప్రచురితమయింది.
శ్రీమతి ముగ్ధా సుధీర్ దివాద్కర్
61, హిందూ కాలనీ, మొదటి లేన్
దాదర్ (ఈస్ట్), ముంబాయి
మారాఠీనుండి ఆంగ్లానువాదం - సుధీర్
మాధవరావు
అడ్కర్ -
2 వ.భాగం
తెలుగు అనువాదం -
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
అతనికి
ఆధ్యాత్మిక రచనలు, కధలు, పురాణాలు, ప్రవచనాలు, భజనలు కీర్తనలలాంటివాటిని చదవాలనే ఆసక్తిని
పెంచుకున్నాడు.
కాని
దురద్రుష్టం అతనిని ఎల్లప్పుడు వెంటాడుతూనే ఉంది.
అతని జీవిత క్రమంలో నాలుగు నెలల తేడాలోనే తాత, అమ్మమ్మ కాలం చేసారు. ఇక గత్యంతరం లేని పరిస్థితులలో తిరిగి తండ్రి వద్దకే
చేరుకున్నాడు. కాని ఇంటిలో ఆడదిక్కు లేదు. ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసులోనే తల్లి మరణించింది. అతని ఆలనా పాలన, ప్రేమగా చూసే తాత అమ్మమ్మ ఇద్దరూ
కూడా దూరమయ్యారు. మాధవరావు తండ్రి హైదరాబాద్
సంస్థానంలోని ‘కరోడ్ గిరి’ గ్రామంలో ‘వాకేదార్’ గా ఉద్యోగం చేస్తుండేవారు. ఆరోజుల్లో హైదరాబాద్ సంస్థానం నిజాం పరిపాలనలో ఉండేది.
మాధవరావు
తన తండ్రి వద్దనే ఉంటూ, సంస్క్రుతం, పార్సీ, ఉర్దూ, భాషలు నేర్చుకుని వాటిలో మంచి ప్రావీణ్యం
సంపాదించాడు. ఇంటర్ పూర్తి చేసిన తరువాత తండ్రి
సలహా ప్రకారం నిజాం రాష్ట్ర విధ్యాశాఖలో ఉపాధ్యాయునిగా చేరాడు.
మాధవ
తండ్రి ఉద్యోగరీత్యా చాలా సార్లు ఇంటికి దూరంగా ఉండేవారు. అందువల్ల ఎన్నోరోజులు మాధవ ఇంట్లో ఒక్కడె ఉండేవాడు. అంతేకాకుండా అతని తమ్ముడు చెల్లెల బాధ్యతల భారం
కూడా అతని మీదనే పడింది. ఈ పరిస్థితులు అన్నీ అతన్ని చుట్టుముట్టేసరికి అతను ఇంకా నిరాశకు లోనయ్యాడు.
ఈ పరిస్థితులన్నిటినీ తట్టుకుని అధిగమించి మాధవ వేరే దారి చూసుకున్నాడు. నిత్య సత్యమైన శాశ్వత ఆనందానికి మార్గం ఏమన్నా ఉందా అనే అన్వేషణలో
పడ్డాడు. మరొకవైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వహించాలి అటు సత్యాన్వేషణ ఇటు ఉద్యోగ నిర్వహణ రెండింటినీ సమానంగా నిర్వహించాలనే పరిస్థితి. అందుకు పడే కష్టం తలుచుకుంటే నిరుత్సాహం ఆవరించింది మాధవరావు యొక్క తెలివితేటలకి అతని అందమైన దస్తూరి ని చూసి రఘోపంత్
కావడే (కర్మలా జిల్లాలోని సాదె గ్రామంలోని వజ్రాల వ్యాపారి) చాలా ముగ్ధుడయ్యాడు.
అతను తన కుమార్తె
అయిన గంగాబాయిని మాధవరావుకిచ్చి వివాహం చేయాలని
అనుకున్నాడు. అనుకున్న ప్రకారం సాదె
గ్రామంలో 1899వ సంవత్సరంలో వివాహం జరిగింది. అప్పటికి మాధవరావు వయస్సు 22 సంవత్సరాలు.
గంగాబాయి
చాలా నాజూగ్గా అందంగా ఉంటుంది. ఆమెలో దైవ భక్తి, ఎక్కువ. ప్రేమ స్వభావురాలు.
మధురంగా మాట్లాడేది. ఆమెకు కుట్లు అల్లికలలో మంచి నైపుణ్యం ఉంది.
వివాహమయినా మాధవరావు తన రోజువారీ కార్యక్రమాలను మాత్రం మార్చుకోలేదు .అతను ఉద్యోగం చేసుకుంటూనే పుణ్యక్షేత్రాలకు
యాత్రా స్థలాలకు వెడుతూ ఉండటం వల్ల ఇంటిలో ఎప్పుడూ ఉండేవాడు కాదు. అందువల్ల గంగాబాబాయి చాలా కాలంపాటు తన తల్లిదండ్రుల వద్ద, మామగారి వద్ద ఉంటూ ఉండేది.
పదకొండు
సంవత్సరాల తర్వాత వారికి మొట్ట మొదటి సంతానం 1910వ సంవత్సరంలో కృష్ణాబాయి జన్మించింది. ఆమె జన్మించిన తర్వాత కూడా మాధవరావు తన తండ్రి
ఉంటున్న ఊరికి ఎప్పుడు వచ్చినా గాని ఇంటికి మాత్రం వచ్చేవాడు కాదు. దగ్గరలో ఉన్న మారుతి మందిర్ లో ఒంటరిగా కాలం గడిపేవాడు.
ప్రయాణ సమయంలో ఏది దొరికితే అది తినేవాడు. అతనికి వంకాయలతో చేసిన వంటకాలు అంటే ఇష్టం. కానీ ఆహారం విషయంలో అతనికి ఇష్టాయిష్టాలు ఏమీ లేవు. భక్రి/రోటీ, అటుకులు, వేరుశనగలు ఇలాంటి వాటిని తిని రోజు గడిపేసేవాడు. ఇక దుస్తుల విషయానికి వస్తే దానికి అంతగా ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదు. చక్కగా ఉతికిన పంచె, చొక్కా, దాని మీద కోటు ధరించేవాడు. నెత్తి మీద టోపీ పెట్టుకునే వాడు.
పుస్తకాలని తన పంచలోనే కట్టుకునేవాడు. ఎక్కడికి వెళ్ళినా పసుపు రంగు లోటా/జార్ తీసుకువెళ్ళేవాడు. ఇవి తప్పించి ఇక ఎటువంటి సామానులు లేకుండా సుదూర ప్రాంతాలైన కాశీ/ బెనారస్ ల దాకా ప్రయాణం చేసేవాడు.
ప్రయాణాల్లో డబ్బు పూర్తిగా ఖర్చు అయిపోయిన సందర్భాలు కూడా ఉండేవి. అటువంటి సమయాల్లో ఎవరో ఒకరు అతన్ని ఆదుకునేవారు . ఆ తర్వాత తన ప్రయాణం కొనసాగించేవాడు. కానీ ఎక్కువ రోజులు పాటు అతని
జేబు ఎప్పుడు ఖాళీగా ఉండేది కాదు.
పిల్లలకు తినుబండారాలను పంచడం అతని అభిరుచి. అతనికి
ఏదీ దాచుకోవాలని ఉండేది కాదు. అందుచేత తన దగ్గర ఉన్న వాటిని తన చుట్టు
ఎవరుంటే వారికి
పంచిపెట్టేస్తూ ఉండేవాడు. ఎవరైనా అతనికి
దుస్తులను గాని, వస్తువులను గాని బహూకరించిన వెంటనే వాటిని ఇతరులకు ఇచ్చేస్తూ ఉండేవాడు. ఒకసారి అతను
వల్లభాయి సోదరి కుటుంబంలో జరిగే వివాహ కార్యక్రమానికి వెళ్ళాడు. అతనికి వారు ఒక వెండి పాత్రను బహుకరించారు. వారి ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే అతను ఆ పాత్రను తనకు ఏ మాత్రం పరిచయం లేని ఒక బ్రాహ్మణునికి దానం చేసేసాడు. ఆ సమయంలో చూసిన మొట్టమొదటి వ్యక్తి అతనే కాబట్టి.
అతనికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళి పోతూ ఉండేవాడు. అది అతని స్వభావం. ఒకానొక సందర్భంలో అతను శ్రీ గజానన్ మహారాజ్ ను దర్శించుకోవడానికి
షేన్ గావ్ వెళ్ళాడు.
తిరుగు ప్రయాణంలో
అస్థి గ్రామంలో తన ఉద్యోగానికి వెళ్లాడు. ఆ సమయంలో దాసగణు మహారాజ్ కి దగ్గరలోనే ఉన్న
జంఖేడ్ కు బదిలీ అయింది. వీరిద్దరికీ ముందే పరిచయం కలిగింది. కానీ
అప్పుడు వారి కలయిక నామకః జరిగినదే తప్ప అందులో పెద్ద విశేషమేమీ లేదు. కానీ ఈ సారి కలుసుకున్నప్పుడు వారిద్దరూ నిజంగానే గురుబంధువులు అయ్యారు. మాధవరావుకు ఉద్యోగరీత్యా బదిలీలు అవుతూ ఉండేవి. మాధవరావు మనవడు శ్రీ జగన్నాథ పంత్
వద్ద లభించిన పాత కాగితాలను పరిశీలించినపుడు మాధవరావు మూడు
నాలుగు సందర్భాలలో ఉద్యోగాలు మారినట్లుగా
తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే మాధవరావుకు
తీర్ధయాత్రలకు
ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు తనకు సెలవులు లేని సందర్భాలలో
కూడా చాలా సులువుగా తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి
వెళ్ళిపోతూ ఉండేవాడు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment