25.09.2020 శుక్రవారం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
“ఆరతి సాయిబాబా” అని బాబా ఆరతిని రచించిన శ్రీ మాధవరావు అడ్కర్ గురించిన వ్రుత్తాంతాన్ని ఈ రోజు ప్రచురిస్తున్నాను. మూడవభాగం
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక సెప్టెంబరు
– అక్టోబరు 2011 వ.సంవత్సరంలో ప్రచురితమయింది.
శ్రీమతి ముగ్ధా సుధీర్ దివాద్కర్
61, హిందూ కాలనీ, మొదటి లేన్
దాదర్ (ఈస్ట్), ముంబాయి
మారాఠీనుండి ఆంగ్లానువాదం - సుధీర్
మాధవరావు
అడ్కర్ -
3 వ.భాగం
తెలుగు అనువాదం -
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ప్రియమయిన
బబన్
ఆ
విధంగా దాసగణు, మాధవరావు ఇద్దరూ అసలుసిసలయిన గురుబంధువులయ్యారు.
దాసగణుగారు యుక్తవయసులో ఉన్నపుడే లావణిలను (మహారాష్ట్రకు సంబంధించిన అశ్లీలమయిన పాటలను) రచిస్తూ ఉండేవారు. ‘పోవడాస్” (చరిత్రలోని వీరుల గురించి వారి ధైర్యసాహసాలను గురించి కీర్తిస్తూ పాడే పాటలు) లను కూడా రచిస్తూ ఉండేవారు. మాధవరావు మంచి పాటగాడే కాక మంచి నటుడు. మాధవరావుకు శ్రావ్యమయిన కంఠం దేవుడిచ్చిన వరం.
చూడటానికి కూడా మంచి అందంగా ఉండేవాడు. అందువల్ల సామాన్య జానపద ప్రజానీకంలో దాసగణు పాటలను
వ్యాప్తి చేయడానికి ముఖ్య కారకుడయాడు.
ఇద్దరిలో
ఉన్నటువంటి వేరు వేరు నైపుణ్యాలని ప్రక్కన పెడితే ఇద్దరిలోను చెప్పుకోదగిన ఒకేరకమయిన
అభిరుచులు కొన్ని ఉన్నాయి.
ఇద్దరూ
కూడా దైవభక్తి తత్పరులు. ఇద్దరికీ భగవంతుని
ఆరాధించడంలోను, ఆయనపై ఆలోచనలతోను కాలం గడపటమంటె ఎంతో ఇష్టం. ఇద్దరికీ ఈ ప్రాపంచిక విషయాలయందు ఎటువంటి ఆసక్తి
లేదు.
మాధవరావులో
ఉన్నటువంటి సహజమయిన భక్తితత్త్వం దాసగణుకి ఎంతగానో నచ్చింది. అందువల్లనే ఆయన 1897 వ.సంవత్సరంలో (లేక ఆపైన అయిఉండవచ్చు)
మాధవని సాయిబాబా వద్దకు తీసుకుని వెళ్ళారు.
ఇన్నాళ్ళుగా వెదకుతున్న మానసిక ప్రశాంతత మాధవకు బాబా సాన్నిధ్యంలో లభించింది.
మాధవరావు,
దాసగణుని తన అన్నగారిగా భావించేవాడు. ఆయన మీద
ఎంతగానో ప్రేమాభిమానాలను కురిపించేవాడు. దాసగణు
కూడా అంతటి ప్రేమాభిమానాలనే అతనిపై కురుపించేవాడు. ఆయన ప్రేమ ఎలా ఉండేదంటె మాధవరావుని కూర్చోబెట్టి
అతని మెడలో పూలదండ వేసి పూజ చేసేవాడు. మాధవరావు
కాళ్ళు కడిగి ఆనీటిని పవిత్ర తీర్ధంగా త్రాగేవాడు. ఆయన పాదాలను స్ప్రుశించి, భక్తితో నమస్కరించుకునేవాడు. కాని మాధవరావుకు, దాసగణు చేస్తున్న ఈ చర్యలు చాలా
ఇబ్బందికరంగా ఉండేవి, కాని దాసగణు తనను ‘బబన్’ అని ఎంతో అభిమానంగా పిలుస్తూ ఉంటె తన
మనసులోని ఇబ్బందికరమయిన భావాలను పైకి చెప్పలేకపోయేవాడు.
ఆరతి
సాయిబాబా…
మాధవరావు
ఎప్పుడు షిరిడీ వెళ్ళినా చాలారోజులపాటు అక్కడే ఉండిపోయేవాడు. అక్కడ పిల్లలకు ప్రైవేటు పాఠాలు చెబుతూ వచ్చిన డబ్బుతోనే
జీవనం సాగించేవాడు. అతని మనసులో షిరిడీకి ఎప్పుడు
వెళ్ళాలనిపిస్తే అపుడు వెళ్లిపోయేవాడు.
1903
– 1904 వ.సంవత్సరంలో అతను షిరిడీ వెళ్ళాడు.
అక్కడ అతని మనసంతా బాబా ఆలోచనలతోనే నిండిపోయింది. ప్రపంచాన్ని మరిచిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అతని మదిలో బాబా మీద ఒక పద్య
రచన చేయాలనే తలంపు కలిగింది. అది సాయిబాబా
మీద భక్తి పారవశ్యంతో పాడే ఆరతి. మాధవరావు రచించిన ఆరతిపాట విన్న దాసగణుకి చాలా అధ్భుతమనిపించింది. కాని మాధవరావుకు అది తను స్వంతంగా రచించినదేమీ కాదని
అంతా బాబాయే చేయించారని భావించాడు. ఆరతి పాటని ఒక కాగితం మీద రాసుకుని దానిని తన జేబులో పెట్టుకున్నాడు.
ఆతరువాత ఇద్దరూ బాబాను దర్శించుకోవడానికి వెళ్లారు. మాధవరావు ఏదో కాగితాన్ని దాస్తున్నట్లుగా బాబా గ్రహించి, “అరే మాధవా! ఆ కాగితాన్ని ధాచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? పైకి చదువు” అన్నారు. మాధవరావు పాడిన ఆరతి విని “ ఈ ఆరతి భక్తుల యోగక్షేమాలను కనిపెట్టుకుని ఉంటుంది” అని బాబా ఆశీర్వదించారు.
బాబా
అన్న మాటలు ఎంత యాదార్ధమయినవో ఇప్పటికీ మనకందరికీ అనుభవమే.
రామజన్మ…
ప్రాధమికంగా
మాధవరావు వైరాగ్యభావంతోనే ఉండేవాడు. అందువల్లనే
అతనికి షిరిడీలో తన సద్గురువు వద్దనే కాలం గడపటమంటే ఎంతో ఆనందంగా ఉండేది. అతనికి తిరిగి ఇంటికి వెళ్ళి భార్యతోను, కుటుంబ
సభ్యులతోను గడపటానికి ఎప్పుడు ఆసక్తి కనబరిచేవాడు కాదు.
అతని
బంధువులందరూ అతను ఎక్కడ ఉన్నాడోనని అన్ని చోట్లా వెదికారు. కాని వారి ప్రయత్నాలేమీ ఫలించలేదు. చివరికి వారి ప్రయత్నం రఘోపంత్ తాను మాధవరావుని
షిరిడీలో చూశానని చెప్పడంతో ఫలించింది. మాధవరావు
తండ్రి షిరిడీ వెళ్ళి అతనిని తిరిగి ఇంటికి తీసుకు వచ్చారు.
ఈవిధంగా
జరుగుతుందని బాబా ముందుగానే ఊహించి, మాధవరావుతో హిందీలో అన్నారు. “నిన్ను తీసుకువెళ్ళడానికి ఇద్దరు మనుషులు గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ వస్తున్నారు. నువ్వు వాళ్ళతో వెళ్ళు. వెళ్ళు – నేను ఆరతి రూపంలో ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను”
అన్నారు. గుర్రాలమీద స్వారీ చేసుకుంటూ ఇద్దరు రాగానే బాబా, “వెళ్ళు వెంటనే
వాళ్ళతో వెళ్ళు – నీకు పుత్రుడు జన్మిస్తాడు.
అతనికి ‘రామ్’ అని నామకరణం చెయ్యి.
ఇక ఇక్కడ ఉండద్దు. వెంటనే వాళ్ళతో వెళ్ళు”
అన్నారు.
అయిష్టంగానే
మాధవరావు బాబా ఆజ్ఞను శిరసావహించి ఇంటికి తిరిగి వచ్చి మరలా సాంసారిక జీవనంలోకి ప్రవేశించాడు. అతనికి కుమారుడు జన్మించాడు. కొడుకుకి ‘రామచంద్ర’ అని నామకరణం చేసాడు.
ఆతరువాత
మాధవరావుకు కుమార్తె జన్మించింది. కుమార్తెకు
పండరీపూర్ లోని శ్రీ రోపాలేకర్ కిచ్చి వివాహం చేసారు. కాని తల్లిలాగానే ఆమె కూడా ఎక్కువ కాలం జీవించలేదు.
రామచంద్రరావుకు
ఉపనయనం జరిగిన సందర్భంలో అతని తండ్రి తప్ప దగ్గరి బంధువులు ఎవ్వరూ ఆసమయంలో లేరు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment