29.10.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయే తప్ప మరొక దైవాన్ని తలచకుండా ఆయన నామస్మరణలోనే జీవితాన్నంతా గడిపిన సాయి అంకితభక్తురాలయిన శ్రీమతి శివమ్మ తాయి గురించి ఈ రోజు ప్రచురిస్తున్నాను.
సాయి అమృతాధారనుండి సేకరణ.
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
శివమ్మ తాయి – 1వ.భాగమ్
శివమ్మతాయి తమిళనాడులోని కోయంబత్తూర్ దగ్గర ఉన్న వెల్లై కినారు గ్రామంలో 16.05.1891 న మధ్యాహ్నం గం.1.00 కు జన్మించారు.
సమాధి చెందిన సంవత్సరం --
1994
ఆమె 103 సంవత్సరాలు
జీవించారు.
అసలు పేరు ---
రాజమ్మ
ఆమెకు బాబా పెట్టిన పేరు -
శివమ్మ
తాయి
తండ్రి పేరు – వేలప్ప గౌండర్
తల్లి పేరు – పుష్పవతి అమ్మాళ్
విద్య – మూడవతరగతి వరకు.
ఆమెకు
తమిళ భాష మాత్రమే వచ్చు.
వివాహమయిన సంవత్సరం – 1904వ.సంవత్సరం. ఆమెకు
13 సంవత్సరముల వయసులో వివాహమయింది.
భర్త పేరు – సుబ్రహ్మణ్య గౌండర్
కుమారుని పేరు - మణి రాజ్
రాజమ్మ/శివమ్మ తాయి
తన
గురించి చెప్పిన వివరాలు.
ఆమె పెదనాన్నగారు తంగవేల్ గౌండర్, 1906 వ.సంవత్సరంలో పొల్లాచి దగ్గర ఉన్న గ్రామంలో ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా వద్దకు తీసుకు వచ్చారు.
(బాబా
షిరిడీకి దగ్గరలో ఉన్న గ్రామాలకు తప్ప షిరిడీ విఢిచి మరెక్కడికీ వెళ్ళలేదనే విషయం మనం శ్రీ సాయి సత్ చరిత్రలో చదివాము. రాజమ్మ
చెప్పిన ఈ విషయాన్ని బట్టి బాబా సర్వాంతర్యామి అని మనం గ్రహించుకోవచ్చు.)
అప్పుడు
ఆమె వయసు 15 సంవత్సరాలు.
ఆమె
కుమారుడు మణిరాజ్ కు ఒక ఏడాది వయసు.
అప్పటికి
బాబా వయస్సు సుమారు 71 సంవత్సరాలు ఉండవచ్చు.
బాబా ఆగ్రామంలో రెండురోజులు ఉన్నారు.
బాబా
ఆమె చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి, ఒక కాగితం మీద ఆమంత్రాన్ని తమిళ భాషలో పెన్సిల్ తో వ్రాసి ఆమెకు ఇచ్చారు.
కాని
ఆమె బాబా ఇచ్చిన కాగితాన్ని పోగుట్టుకుంది.
బాబా
ఆమెకు కలలో కన్పించి ఆ కాగితం బియ్యం డ్రమ్ములో ఉందని చెప్పారు.
బాబాను
కలుసుకున్నప్పటినుండి ఆమెకు బాబా దర్శనానికి షిరిడీ వెళ్లాలనిపిస్తూ ఉండేది.
(బాబా ఎవరికీ మంత్రోపదేశాన్ని ఇవ్వలేదని శ్రీసాయి సత్ చరిత్రను పారాయణ చేసిన మనందరికి తెలుగు. మరి అటువంటప్పుడు శివమ్మ తాయికి గాయత్రి మత్రోపదేశాన్ని ఎలా ఇచ్చారని మనందరకు సందేహం కలుగవచ్చు. కాని దీని గురించి మనం చర్చించుకోకుండా ఆయన తత్త్వం ఏమిటో అర్ధం చేసుకోవడానికే ప్రయత్నించాలి. నా అభిప్రాయం ప్రకారం శివమ్మ తాయి గారి గురించి పూర్తిగా చదివిన తరువాత ఆమె కారణ జన్మురాలని అందువల్లనే ఆమెకు మాత్రమే బాబా మంత్రోపదేశం చేసారని భావిస్తున్నాను. బాబా భక్తులలో మరికొందరు కారణజన్ములు కూడా ఉండవచ్చని మనం అనుకోవచ్చు గాని, బాబా అంతరార్ధం మనకు బోధపడదు. ఇక దీని గురించి మరింతగా ఆలోచించవద్దు. త్యాగరాజు)
షిరిడీ వెళ్ళాలంటే ఆమె తన భర్త అనుమతి తీసుకోవాలి.
ఆమె
ఆవిషయం భర్తతో చెప్పి తనని షిరిడీ తీసుకువెళ్ళమని అడిగింది.
ఆయనకు
బాబా మీద నమ్మకం లేదు.
కాని
ఒక లీల జరిగిన తరువాత ఆయనకు బాబా మీద నమ్మకం కలిగింది.
దానివల్లనే
ఆయన రాజమ్మను షిరిడీ తీసుకువెళ్లడానికి ఒప్పుకొన్నాడు.
ఇది
1908వ.సంవత్సరంలో జరిగింది.
అపుడామె
వయసు 17 సంవత్సరాలు.
బాబా
ఆమెతో తమిళంలోనే మాట్లాడేవారు.
షిరిడీ సాయిబాబా గురించి శివమ్మ తాయి చెప్పిన వివరాలు.---
“బాబా ఆరు అడుగుల పొడవు ఉండేవారు. ఆయన చేతులు చాలా పొడవుగా ఉండి చేతి వ్రేళ్ళు మోకాళ్ళను దాటి ఉండేవి. బాబా మంచి స్ఫురద్రూపి. ముక్కు చాలా పొడవుగా కొనదేరి, ముక్కు రంధ్రాలు కూడా విశాలంగా ఉండేవి. ఆయన కళ్ళు నల్లగా కాకుండా నీలి రంగులో ఉండేవి. చూపులు చాలా తీక్షణంగా ఉండేవి.
ఆయన కళ్ళు ఎప్పుడూ తెల్లని వెలుగులా ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండేవి. ఆమెరుపు పిల్లి/పులి కళ్ళ మెరుపులా ఉండేది. ఆయనలో మంచి తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది. ఆయనను చూడగానే స్వయంగా ఆదేవుడె ఈ భూమి మీదకు మానవాకారంలో దిగి వచ్చాడా అని అనిపించింది నాకు. ఆయనకు తనే స్వయంగా వంటచేసి అందరికీ వడ్డించటమంటె ఎంతో ఇష్టం. ఆవిధంగా ఆయన అన్నదానం మానవులకే చేయడం కాకుండా పక్షులకి, జంతుజాలాలకుకూడా ఆహారం పెడుతూ ఉండేవారు.
నేను మొట్టమొదటిసారిగా మా కుటుంబంతో సహా షిరిడీ వెళ్ళినపుడు
బాబాఒక పెద్దవంట పాత్రలో ‘గంజి’ (బియ్యంలో నీళ్ళు బాగా ఎక్కువగా పోసి
అన్నం వండేవారు) తయారుచేయడం అక్కడ ఉన్న భక్తులందరితో పాటు
మేము కూడా చూసాము.
మేము
చూస్తూ ఉండగానే ఆయన తనకఫనీ
చేతులను మోచేతులవరకు పైకి జరుపుకొని పాత్రలో సలసల మరుగుతున్న గంజిలో తన చేతిని పెట్టి అన్నాన్ని చాలాసేపు కలియబెడుతూ ఉండేవారు.
ఆ
అధ్భుతమయిన దృశ్యాన్ని మేమెంతో ఆశ్చర్యంగా తిలకిస్తూ ఉండేవాళ్ళం. ఆయనే స్వయంగా గంజిని అక్కడున్న అందరికీ పంచేవారు.
(సందర్భం వచ్చింది కాబట్టి బాబా గురించి మీకు మరొక ఆసక్తికరమయిన విషయాన్ని వివరిస్తున్నాను.
మా
తోడల్లుడు శ్రీ నౌడురి రామకృష్ణమూర్తి గారు ప్రస్తుతం బొంబాయిలో ఉన్నారు.
ఆయన
ఇటీవలే అనగా కొన్ని నెలల క్రితం ముంబాయిలో ఉన్న సెంట్రల్ గ్రంధాలయానికి వెళ్లారు.
అక్కడ
1923 వ.సంవత్సరంలో ప్రచురించిన సాయిలీల పత్రికలో ప్రచురింపబడిన సమాచారాన్ని చెప్పారు.
మరాఠీనుండి
ఆంగ్లంలోకి అనువాదం చేసిన ఆ విషయం…
“బాబా తమ కఫనీ చేతులను తొమ్మిది మడతలు వేసుకొని ధరించేవారు.
బాబా
నుదిటి మీద తొమ్మిది ముడతలు పడ్డాయి (రెండు మూడు సార్లు).
ఆసందర్భంలోనే
తొమ్మిది నాణాలను లక్ష్మీబాయి షిండేకి ఇచ్చారు.”
ఈ సమాచారాన్ని ఫోటో తీసుకోవడానికి గ్రంధాలయ అధికారులు అనిమతించలేదని చెప్పారు…..
త్యాగరాజు)
షిరిడీనుంచి వచ్చిన తరువాత నా భర్త
వార్తాపత్రికలో ఒక
ప్రకటనను చూసారు.
అది
బెంగళూరులో ఉన్న టి.ఆర్. మిల్లు వారికి ఒక సూపర్ వైజర్ కావాలని ప్రచురితమయిన
ఒక ఉద్యోగ ప్రకటన.
నా
భర్త ఆ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకొన్నారు. బాబా
దయవల్ల ఆయనకు ఆ ఉద్యోగం వచ్చింది.
మేము
బెంగళూరుకు వెళ్ళిపోయి
చామరాజపేటలో
నివాసం ఉండేవాళ్ళం.
నేను
సంవత్సరానికి
మూడు, నాలుగుసార్లు షిరిడీకి వెడుతూ ఉండేదానిని. నా
భర్తకు నేనలా వెళ్లడం ఇష్టముండేది కాదు.
ఆయన
నన్ను ప్రశ్నించినపుడల్లా, “బాబాయే నాకు గురువు.
నాకు
ఆయన తప్ప మరే దేవుడూ, దేవతలు ముఖ్యం కాదు.
అందువల్లనే
నేను బాబాను దర్శించుకోవడానికి షిరిడీకి వెడుతూ ఉంటాను” అని చెబుతూ ఉండెదాన్ని. “నువ్వు బాబానే నీగురువుగా ఎందుకని ఎన్నుకొన్నావు” అని అడిగారు నాభర్త.
“ఆయన సద్గురువుగా వచ్చిన భగవంతుని అవతారం.
అందుచేతనే
నేనాయనను నా గురువుగా భావిస్తున్నాను.
మనస్ఫూర్తిగా
ఆయననే ప్రార్ధిస్తాను.
నాకు
ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అపుడు షిరిడీ వెడతాను” అని నాభర్తకు సమాధానమిచ్చాను.
నా భర్తకు ఇష్టం లేకపోయినా, మూడు, నాలుగు సార్లు షిరిడికి వెళ్ళి వస్తూ ఉండేదానిని.
అక్కడ
కొన్ని రోజులు ఉంటూ బాబా చేసే చమత్కారాలను చూసేదానిని.
ఆయన
ఆశీర్వాదాలను తీసుకుంటూ
ఉండేదాన్ని. నాకు
నేనే ఎంతో అదృష్టవంతురాలినని భావించుకునేదాన్ని.
తరువాత
కాలంలో ఇంటిలోనే ఆయన నామస్మరణలోనే కాలం గడిపేదాన్ని.
దాని
ఫలితంగా సంసార జీవితంలో నాకు విరక్తి జనించి బంధం మెల్ల మెల్లగా దూరమవసాగింది.
(ఇంకా
ఉంది)
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment