28.10.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
నాకోరికను మన్నించి మా ఇంటికి వచ్చిన బాబా
గత రెండుమూడు రోజులనుండి దసరా రోజులలో బాబా ఒక సాయిభక్తురాలి
ఇంటికి వచ్చిన అధ్భుతమయిన లీలను ప్రచురిస్తానన్నాను. ఈ రోజు ఆ లీలను ప్రచురిస్తున్నాను. ఆమె తన పేరును వెల్లడించడానికి సుముఖత వ్యక్తం చేయనందువల్ల
ఆమె పేరును ప్రచురించడంలేదు. ఫోటోల కోసం ఎదురుచూసాను
గాని, నాకు చేరకపోవడం వల్ల వాటిని ప్రచురించడంలేదు. ఇక చదవండి…
ఇక్కడ మన రాష్ట్రం వారికి దసరాకు బొమ్మల కొలువులు పెట్టడం ఆనవాయితీ. ఆవిధంగా ఒక సాయిభక్తురాలు తను పెట్టబోయే బొమ్మల కొలువుకు బాబాని ఆహ్వానించడం, బాబావారు రావడం చాలా అధ్భుతమయిన లీల. ఆమె వివరించిన ఆ అనుభవాన్ని ఇప్పుడు మనందరం చదివి ఆనందిద్దాము.
ఆమె ప్రతి సంవత్సరం విజయదశమికి తొమ్మిది రోజులపాటు బొమ్మలకొలువు పెడుతూ ఉంటారు. అది ఆమెకు ఎప్పటినుండో ఉన్న ఆనవాయితీ. కాని ఈ సంవత్సరం ఆమె తల్లిదండ్రులకి బాగా జ్వరం ఎక్కువగా ఉండి అసలు ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఆయినా ఆమె ఈ సంవత్సరం కూడా బొమ్మలకొలువు పెట్టుకున్నారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన తరువాత ఆమె బాబాని ఇలా ప్రార్ధించుకున్నారు, “ మా అమ్మా, నాన్న ఇద్దరికి జ్వరం తగ్గిపోయి ఆరోగ్యంగా ఉండాలి. నేను పెట్టిన బొమ్మలకొలువుకు మీరు ఎలా వస్తారో తెలియదు. మీరు వచ్చి నన్ను ఆశీర్వదించాలి”.
ఆవిధంగా
బొమ్మల కొలువు ప్రారంభించిన రెండు రోజుల తరువాత ఒకామె బాబా చిత్రాలు ఉన్న ప్లాస్టిక్ తోరణం గుమ్మానికి కట్టుకునేది ఇచ్చారు. అపుడు ఆమె బాబా
మాఇంటికి ఈ విధంగా వచ్చారని ఎంతో సంతోషించి ఆ తోరణాన్ని గుమ్మానికి కట్టారు. ఇక్కడ అద్బుతం ఏమంటె ఆమె బాబా చిత్రాలు ఉన్న తోరణాన్ని గుమ్మానికి కట్టిన రెండురోజులలోనే ఆమె తల్లిదండ్రులిద్దరికీ ఎప్పటినుండో తగ్గకుండా ఉన్న జ్వరం తగ్గిపోయింది.
పూర్తి ఆరోగ్యం చేకూరడంతో ఇక మేము మా ఇంటికి వెళ్ళి విజయదశమి పండుగ జరుపుకుంటామని తమ ఇంటికి వెళ్ళిపోయారు.
ఇది
బాబా ఆమెకు ప్రసాదించిన అధ్బుతమయిన లీల.
ఇక్కడ బాబా తోరణంరూపంలో ఆమె ఇంటికి రావడం, ఆమె తల్లిదండ్రులకు జ్వరం తగ్గిపోవడం దీనికి అనుబంధమయే సంఘటన శ్రీ సాయి సత్ చరిత్రలోని 19 వ. అధ్యాయంలో బాబా చేసిన అద్భుతం ఆమెకు గుర్తుకు వచ్చిందని చెప్పారు.
“బాబా ఒక నిచ్చెనను తెప్పించి దానిని వామన్ గోండ్ కర్ ఇంటి గోడకు వేయించి నిచ్చెనెక్కి ఇంటిపైకి వెళ్ళారు.
అక్కడినుండి
దాటి ప్రక్కనే ఉన్న రాధాకృష్ణమాయి ఇంటిపైకి వెళ్లారు, మరలా ఆ నిచ్చెనను మరల ప్రక్కింటి గోడకు వేయించి క్రిందకు దిగేశారు.
ఆ
సమయంలో రాధాకృష్ణమాయి తీవ్రమయిన జ్వరంతో బాధపడుతూ ఉంది.
ఆవిధంగానే
బాబా తన తల్లిదండ్రులకు ఆరోగ్యాన్ని ప్రసాదించారని ఆనందించారు.
ఇక రెండవలీల… ఇదే బొమ్మల కొలువు జరుగుతున్నపుడు, “బాబా మీరు ఎలాగయినా వచ్చి ఆశీర్వదించాలని వేడుకోవడంతో తోరణం రూపంలో బాబా వచ్చారేమోనని భావించారు. కాని బాబా ఆ విధంగా రావడమే కాకుండా మరొక విధంగా కూడా ఆమె ఇంటికి వచ్చారు. ఇది ఎలా జరిగిందంటే బొమ్మలకొలువు చూడటానికి కొంతమందిని పిలవడం జరిగింది. ఒకామె తన ఇద్దరి పిల్లలతోను కలిసి ఆమెకు బాబా చిత్రపటాన్ని తెచ్చి ఇచ్చారు. ఆమె ఆబొమ్మను ఆమెకు ఎపుడోనే ఇద్దామనుకున్నారట గాని సమయం దొరకక ఇవ్వలేకపోయారు. ఇపుడు ఎలాగూ పిలిచారు కదా అని ఆమె తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆవిధంగా బాబా ఆరోజు ఆమె బొమ్మలకొలువులో ఆశీనులయ్యారు. ఆమె తన ఇద్దరుపిల్లలతో కలిసి రావడం శ్రీసాయి సత్ చరిత్రలోని 40వ.ధ్యాయంలోని సంఘటనను గుర్తుకు తెచ్చిందని చెప్పారామె.
ఆ
అధ్యాయంలో, “దేవుగారి ఇంటికి బాబా, భోజనానికి సన్యాసి రూపంలో ఇద్దరు కుర్రవాళ్ళను వెంటపెట్టుకుని వచ్చిన సంఘటన.” ఆవిధంగా ఆమె తన ఇద్దరుపిల్లలతో రావడం ముగ్గురి రూపంలో బాబాయే వచ్చారని భావించి ఎంతో సంతోషించారు.
వాళ్ళకు
తాంబూలం ఇచ్చి పంపించారు.
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment