Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, October 11, 2020

నిశ్చలదాస్ – 2 వ.బాగమ్

Posted by tyagaraju on 9:17 AM

 



11.10.2020  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు

నిశ్చలదాస్ – 2 .బాగమ్

శ్రీ సాయి సత్ చరిత్ర 21అధ్యాయంలో మనకు వి.హెచ్ఠాకూర్,  నిశ్చలదాస్ గురించిన ప్రస్తావన 

వస్తుంది.  నిశ్చలదాస్ గురించిన పూర్తి సమాచారం శ్రీ సాయి లీల ద్వైమాసపత్రిక మే – జూన్ 2013 .సంవత్సరంలో ప్రచురింపబడిందిడా.సుబోధ్ అగర్వాల్ గారు ఆంగ్లంలో వ్రాసినదానికి తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజునిజాంపేటహైదరాబాద్.


కొద్దిరోజులకి ఠాకూర్ కి జున్నర్ కి బదిలీ అయింది.  అక్కడికి చేరుకోవాలంటే నానేఘాట్ కొండప్రాంతాన్ని ఎక్కి వెళ్ళాలి.

నానేఘాట్ పర్వతప్రాతం మహారాష్ట్ర పూనా జిల్లాలోని జున్నర్ కి దగ్గరలో ఉంది.  శాతవాహనుల పరిపాలనా కాలంలో (200 B C E -  190 C E).  దారిద్వారానే కళ్యాణ్, జున్నర్ మధ్య వాణీజ్య కార్యకలాపాలకి రాకపోకలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేవి. నాణేఘాట్ కి పూర్తి అర్ధం నాణే అనగా నాణెము,  ఘాట్ అనగా దారి.  ఈదారిగుండా కొండలను ఎక్కి దాటుకుంటూ వెళ్ళాలంటే దారి ఒక టొల్ బూత్ గా ఉండేది.  అనగా వర్తకులు ఈదారిలో వెళ్లడానికి టోల్  రుసుము చెల్లించాలి.  


ఇక్కడ కొండదారి చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి అంత సులువుగా ఉండదు.  దున్నపోతుమీద ఎక్కి వెళ్ళవలసిందే తప్ప మరే ఇతర ప్రయాణసాధనాలు ఉపయోగపడవు.  కొంకణప్రాంతం, దక్కన్ ప్రాంతాలలో నివసించేవారికి ఇది అడ్డదారి.  దారి మోటారువాహనాలకు అనువైనది కాదు.  దారికి చుట్టుప్రక్కల ఆదిమానవులచే తొలచబడిన గుహలు అనేకం ఉన్నాయి.  కొంకణంవైపు అతి దగ్గరగా ఉండే జనసమ్మర్ద ప్రాతం వైశాఖేర్ 14 కి.మీ.దూరంలో ఉంది.  పీఠభూమివైపు 6 కి.మీ దూరంలో ఘాత్ ఘర్ ప్రాంతం ఉంది. మౌర్య సామ్రాజ్య పతనం తరువాత శాతవాహన రాజులు అధికారంలోకి వచ్చినట్లుగా చాటిచెప్పే విషయాలు గుహలలో శాసనాల రూపంలో చెక్కబడి ఉన్నాయి.  శాతకర్ణి (శాతకర్ణి -1) శాతవాహన రాజులలో మూడవవాడు.  మధ్యభారత దేశాన్ని 180 B C E లో పరిపాలించాడు.  కునాల్ మహరాజ్ కుమారుడే శాతకర్ణి అని భావించడం జరిగింది.  సుంహాస్ పరిపాలనలో ఉన్న పశ్చిమ మాళవ ప్రాంతాన్ని శాతకర్ణి జయించాడు.  ఖరవేల రాజుకు శతృవుగా శాతకర్ణిని హధిగుంపలో కళింగ శాసనంలో ప్రస్తావింబబడిఉంది.

శాతకర్ణి రాణి నాగనిక. (నయనిక).  ఆమె మరాఠా యువరాణి.  నాగనిక (నయనిక)నానేఘాట్ శిలాశాసనం జారీ చేసింది.  అందులో శాతకర్ణిని దక్షిణాపధానికి ప్రభువుగాను, తిరుగులేని సార్వభౌమాధికారిగాను పేర్కొంది.  ఆమె అత్యంత శక్తిమంతురాలయిన స్త్రీ.  ఆమె తన అధికారంతో గుహలను, శిల్పాలను చెక్కించి శిలాశాసనాలను ఏర్పాటు చేయించింది.  గుహలలో చెక్కబడిన శిలాశాసనాలలో ఆమె తన గురించి, తన కుటుంబ సభ్యుల గురించిన వివరాలను చెక్కించింది.  రాణి పరిపాలనాధికారి ప్రభువు అయిన శాతకర్ణి గురించి వ్రాయించినదానిని బట్టి మనకు కావలసినంత సమాచారం లభిస్తుంది. శిలాశాసనాలను బట్టి మహారాజు ఎన్నో త్యాగాలు చేసాడు.  బ్రాహ్మణులను పోషించి వారికి వేలసంఖ్యలో గోవులను ధానం చేసాడు.  ఎన్నో గుర్ఱాలను, ఏనుగులను అగ్రహారాలను దానం చేయడమే కాక అధిక మొత్తంలో ధనాన్ని (కర్షపణాలు) కూడా దానం చేసాడు.  పొరుగురాజ్యాలపై సార్వభౌమాధికారానికి గుర్తుగా అశ్వక్రతువు కూడా చేసినట్లు తెలుస్తుంది.  బహుశ సుంగాసుల మీద విజయం సాధించినందుకు అశ్వక్రతువును నిర్వహించి ఉండవచ్చు.  దీర్ఘచరురస్రంగా ఉన్న గుహలో ఇరుప్రక్కలం అలంకారంగా ఉన్న శిలావిగ్రహాలు ఇపుడు లేకపోయినప్పటికీ శిలాశాసనాల ప్రకారం ఆయన పరిపాలనాకాలంలో సాధించిన విజయాల గురించి ఇప్పటికి నిలిచి ఉన్నాయి.

శాతకర్ణి (180 – 170  B C E ) యుధ్ధరంగంలో వీరమరణం పొంది ఉండవచ్చు.  చిన్నవారయిన అతని ఇద్దరు కుమారులు వేదిశ్రీ, సతిశ్రీ ఇద్దరూ తల్లి నాగనిక ఏలుబడిలో రాజకార్యాన్ని నిర్వహించారు.  పూనాకి ఉత్తరంగా 30 మైళ్ళదూరంలో జున్నర్ ని  90 A D లో తన రాజ్యానికి రాజధానిగా ఏర్పాటు చేసుకున్నాడు.

ప్రాంత చరిత్ర గురించిన అతిముఖ్యమయిన విషయానికి ఋజువు  నానేఘాట్ రికార్డులు.  నానేఘాట్  చరిత్రకు సంబంధించిన పత్రాలను గమనించినట్లయితే వాటిలో వేదాలకు అధిదేవతలయిన యమ, ఇంద్ర, చంద్ర, సూర్య వీరందరి గురించి ప్రస్తావిఅంచబడి ఉంది.  శాతవాహన రాజవంశ సామ్రాజ్యంలో హిందూమతంలో భగవత్ స్వరూపం గురించి శంకర్సన్ మరియు వాసుదేవ్ ప్రస్తావన ద్వారా తెలుస్తుంది.

తిరిగి మనం శ్రీసాయి సత్ చరిత్ర 21 అధ్యాయానికి వద్ధాము.

వి.హెచ్. ఠాకూర్ కు జున్నర్ కు బదిలీ అయినందువల్ల నాణేఘాట్ పర్వతం ఎక్కవలసివచ్చింది.  అతనికి దున్నపోతు తప్ప మరే ఇతర ప్రయాణ సాధనము లభించలేదు.  దాని మీదనే స్వారీ చేయవలసివచ్చింది.  ఆతరువాత అతనికి కళ్యాణ్ కి బదిలీ అయింది.  అక్కడ నానాసాహెబ్ చందోర్కర్ తో పరిచయం కలిగింది.  ఆయన ద్వారా సాయిబాబా కీర్తిని విని ఆయన దర్శనం చేసుకోవాలనుకున్నాడు.  ఆతరువాత రోజే నానాసాహెబ్ షిరిడీకి ప్రయాణమవుతూ ఠాకూర్ ను కూడా తనతో షిరిడీకి రమ్మన్నాడు.  కాని ఆరోజు ఠాణా పట్టణ సివిల్ కోర్టులో ఒక కేసు ఉండటం వల్ల చందోర్కర్ వెంట వెళ్లలేకపోయాడు.  అందువల్ల నానా సాహెబ్ ఒక్కడే వెళ్ళాడు.  ఠాకుర్ ఠాణా వెళ్ళాడు కాని కేసు వాయిదా పడింది.  నానాసాహెబ్ తో కూడా షిరిడీ వెళ్లలేకపోయినందుకు ఎంతో చింతించాడు.

ఇక ఠాకుర్ తాను ఒక్కడే షిరిడీ వెళ్లాడు.  అక్కడికి చేరుకున్న తరువాత క్రితంరోజే నానాసాహెబ్ షిరిడీనుంచి తిరిగి వెళ్ళిపోయాడని తెలిసింది.  అక్కడ అతనికి కొంతమంది స్నేహితులు కలిసారు.  వారు అతనిని బాబావద్దకు తీసుకుని వెళ్లారు.  తన అదృష్టంవల్ల బాబా దర్శనభాగ్యం కలిగినందుకు ఆయన ఆశీర్వాదాలు లభించినందుకు ఎంతగానో పొంగిపోయాడు.  అనిర్వచనీయమయిన ఆనందంతో అతని శరీరమంగా పులకించిపోయింది.  భావోద్వేగాలతో కళ్లలో ఆనందాశ్రువులు ధారగా కారాయి.  అప్రయత్నంగా ఎంతో భక్తితో బాబా నామస్మరణ చేసాడు.  బాబా సంపూర్ణదేవతా స్వరూపుడని గ్రహించుకున్నాడు.  సర్వజ్ఞుడయిన బాబాఈదారి కన్నడ యోగి అప్పా చెప్పినంత సులభమయినది కాదు.  అప్పా చెప్పినట్లుగా దున్నపోతుమీద పర్వతమెక్కినంత సులభమయినది కాదు.  ఆధ్యాత్మిక దారి అంతకన్నా కష్టమయినది.  శరీరాన్ని అరగదీయటం అనివార్యంఅన్నారు.

బాబా మాటలు వినగానే అంతకుమునుపు మహాత్ముడు కన్నడయోగి చెప్పిన మాటలు అనుభవంలోకి వచ్చాయి.  ఆయోగి చెప్పిన మాటలు తనకు తప్ప మరెవరికీ తెలియవు.  ఇప్పుడు బాబా అన్నమాటలు వినగానే ఆయన ఎంతటి సర్వజ్ఞుడో అర్ధమయింది.  రెండు చేతులూ జోడించి సాయి పాదాలమీద శిరసువంచి నమస్కరించి ప్రార్ధించాడు.  అపుడు బాబాఅప్పా చెప్పినదంతా యదార్ధమే.  కాని ఊరికే చదివినంత మాత్రాన సరిపోదు.  బాగా సాధన చేయాలి.  చదివినదంతా ఆచరణలో పెట్టాలి.  లేనట్లయితే ఎటువంటి ఫలితం ఉండదు.  గురువు అనుగ్రహం లేనిదే వట్టి పుస్తకజ్ఞానం నిష్పలంఅని బోధించారు.

ఠాకుర్విచారసాగరంలోని సైధ్దాంతిక భాగాన్ని మాత్రమే చదివాడు.  కాని బాబా, చదివినదానిని ఏవిధంగా ఆచరణలో పెట్టాలో మార్గాన్ని బోధించారు.

డా.సుబోధ్ అగర్ వాల్

డెహ్రాడూన్

(సమాప్తం)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List