10.10.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబా వారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్ర 21వ. అధ్యాయంలో మనకు వి.హెచ్. ఠాకూర్,
నిశ్చలదాస్
గురించిన ప్రస్తావన వస్తుంది.
నిశ్చలదాస్
గురించిన పూర్తి సమాచారం శ్రీ సాయి లీల ద్వైమాసపత్రిక మే – జూన్ 2013 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది. డా.సుబోధ్ అగర్వాల్ గారు ఆంగ్లంలో వ్రాసినదానికి తెలుగు అనువాదం ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్.
నిశ్చల దాస్ -1 వ.భాగమ్
నిశ్చల్ దాస్ (1791 – 1863) హర్యానా రాష్ట్రంలోని సోనేపట్ జిల్లా ఖర్ హౌడా తాలూకా కిడోహ్లి గ్రామంలో జన్మించాడు. అతను దహియా గోత్ర కుటుంబీకుడు. దహియా గోత్రస్తులు జాట్ కులస్తులలో ఉంటారు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీలలో ఈ జాట్ కులస్థులు ఎక్కువ.
ఈ
దహియాన్ లు దధిచక్ కుటుంబానికి చెందినవారని అంటారు.
అనగా
దధీచి మహర్షికి వారసులు వీరు.
దేవాసుల
సంగ్రామంలో
దధీచి మహర్షే రాక్షసులతో యుధ్ధంచేయమని
తన ఎముకలను ఆయుధాలుగా చేసి ఉపయోగించుకోమని ఇచ్చాడు. (మంగ్లన రాతి శాసనం v.1272 –
1215 A D ). నిశ్చల దాసు చాలా బుధ్ధిమంతుడు. అతనికి వయసుతోపాటుగా
సంస్కృతం నేర్చుకోవాలనే కోరిక కూదా పెరగసాగింది.
ప్రపంచభాషలన్నిటిలోను సంస్కృతం అతి ప్రాచీనమయిన భాష.
సంస్కృతంతో సమానమయినట్టి విజ్ఞానం
ప్రపంచంలోని
మరి ఏయితర విజ్ఞాన సర్వస్వానికి సరిపోలదు.
మన
భారతీయ వారసత్వ విజ్ఞానానికి, అభిప్రాయాలకి సంస్కృతభాష ఒక చిహ్నం.
సంస్కృతభాషలో
యధేచ్చగా
సత్యాన్వేషణ
గురించి పరిశోధన చేయవచ్చు.
సంస్కృతభాషలో
మనం గమనించదగ్గ అత్యంత ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే ఇతర భాషలపై ఆభాషకి ఎటువంటి చిన్నచూపుగాని ద్వేషంగాని లేదు.
ప్రాచీన
కాలంనుండి
సంస్కృత
భాషను నేర్చుకోవడానికి వారణాశి (కాశీ) గొప్ప కేంద్ర స్థానం.
ఎంతోకాలంపాటు
గొప్ప గొప్ప సంస్కృతపండితులు ఈ వారణాశినుండే ఉద్భవించారు.
అధ్బుతమయిన
రచనలు కూడా వారణాశిలోనే రచింపబడ్డాయి.
నిశ్చలదాసుకు
ప్రాచీన
సంస్కృత భాషను అందులోని అన్ని విషయాలను పూర్తిగా నేర్చుకోవాలని ఎంతో అసక్తిగా ఉండేది.
తన ప్రగాఢమయిన కోరికను తీర్చుకునేందుకు కాశీ పట్టణానికి ప్రయాణమయ్యాడు. కాశీకి చేరుకొన్న తరువాత అక్కడి సంస్కృత విద్యాలయంలో
బ్రాహ్మణులకు తప్ప ఇతర కులాలవారికి ప్రవేశం నిషిద్ధమని తెలిసింది. కాని అతను సంస్కృత భాషను నేర్చుకోవాలనే పట్టుదలను
సడలించుకోలేదు. ఏవిధంగానయినా సరే నేర్చుకోవలసిందే
అని నిశ్చయించుకున్నాడు. దానికనుగుణంగా తానొక
బ్రాహ్మణ కుమారుడిగా వేషము మార్చుకొని సంస్కృత విద్యాలయంలో ప్రవేశం సాధించుకొన్నాడు.
నిశ్చలదాసు
త్వరలోనే తరగతిలో అందరిలోకి ఉత్తమ విద్యార్ధిగా అర్హతను సాధించాడు. ఆవిధంగా తన గురువుకి అత్యంత ప్రియమయిన శిష్యుడయ్యాడు. గురువుకు అతనంటే ఎంతో ఇష్టం ఏర్పడింది. ఇక విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తిరిగి వెళ్ళిపోయేముందు
తన గురువు ఆశీర్వాదాలు తీసుకుని వెడదామని ఆయన వద్దకు వెళ్ళాడు. గురువు తన శిష్యుడిని ఆశీర్వదించి అతనికి వీడ్కోలు
పలికేముందు తన కూతురును వివాహం చేసుకోమని వివాహ ప్రస్తావన తీసుకువచ్చారు. గురువుగారి కుమార్తె తనకు సోదరితో సమానమని చెప్పి
తిరస్కరించాడు. కాని, గురువు కుమార్తె సోదరితో
సమానమనే నిశ్చలదాసు చెప్పిన వాదనను ఆయన అంగీకరించలేదు. ఇక నిశ్చలదాసుకు తనెవరో నిజం చెప్పవలసిన అగత్యం
ఏర్పడింది. అతనికి తప్పించుకోవడానికి మరేవిధమయిన
మార్గం కనిపించలేదు. చివరికి తాను జాట్ కులస్థుడినని,
బ్రాహ్మణ కులస్థుడను కానని నిజం వెల్లడించాడు.
ఆమాట వినగానే గురువుకు చాలా ఆగ్రహం వచ్చింది. “ఒక జాట్ కులస్థునికి విద్యనేర్పిన పాపభారాన్ని
మోయవలసి వచ్చిందనే ఆగ్రహంతో రగిలిపోయాడు. ఇక
నీవు ఎప్పటికీ నయం కాని జ్వరంతో బాధపడెదవు గాక” అని నిశ్చలదాసుని శపించాడు.
నిశ్చలదాసు
దాదుపంతి సాధువుగా పేరు గాంచి ‘విచార సాగరం” అనే వేదాంత గ్రంధాన్ని రచించాడు. ఈ పుస్తకం అనేక వేదాంత విషయాలమీద సంపూర్ణమయిన సమాచారం
ఉన్న గ్రంధంగా ప్రసిధ్దిగాంచింది.
అందువల్లనే
నిశ్చలదాసు పండితులలో అగ్రగణ్యుడిగా పేరు పొందాడు. అతను రచించిన గ్రంధాలు – ‘వృత్తిప్రభాకరం’, ‘విచారసాగరం’,
‘యుక్తి ప్రకాష్’, ‘తత్త్వసిధ్ధాంతము’.
విచారసాగరాన్ని
లాలా శ్రీరాం గారు ‘మెటాఫిజిక్స్ ఆఫ్ ది ఉపనిషత్స్’ అనే పేరుతో ఆగ్లంలోకి అనువదించారు. ఈ విచారసాగరం ఉత్తరభారత దేశ ప్రాంతవాసులు ప్రతిరోజు
పారాయణ చేసుకోవడానికి అనువుగా ఎంతో ప్రాచుర్యం పొందింది. సంస్కృతభాషలో వేదాంతసారాన్ని చదివి అర్ధం చేసుకోలేని
సామాన్యులకు శతాబ్ధాలకు పైగా ఈ ఆంగ్ల పుస్తకం ఎంతో ఉపయుక్తం గా ఉంది.
శ్రీ
సాయి సత్ చరిత్ర 21వ.ధ్యాయంలో నిశ్చలదాసు గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది.
వినాయక
హరిశ్చంద్ర ఠాకూర్ పట్టభద్రుడు. అతను రెవెన్యూ
శాఖలో గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. అతను
ఒకసారి సర్వేపార్టివారితో కలిసి బెల్గాం దగ్గర ఉన్న వడగాం పట్టణానికి వచ్చాడు. అక్కడ అప్పా అనే కన్నడయోగిని కలుసుకొని ఆయనకు పాదాభివందనం
చేసి ఆయన ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని పొందాడు.
ఆ సమయంలో ఆకన్నడ యోగి నిశ్చలదాసు రచించిన ‘విచారసాగరం’ లోని కొంతభాగాన్ని అక్కడ
ఉన్న శ్రోతలకు బోధిస్తూ ఉన్నాడు. విచారసాగరం
వేదాంతానికి ప్రామాణిక గ్రంధం. వి.హెచ్.టాకూర్
కన్నడయోగి వద్ద సెలవు తీసుకుని వెడుతున్న సమయంలో
ఆయన “నువ్వు ఈ గ్రంధాన్ని పఠించు. దీనిని
పఠించినట్లయితే నీ మనోరధమీడేరుతుంది. ఆతరువాత
భవిష్యత్తులో ఉద్యోగరీత్యా నువ్వు ఉత్తరదిశకు వెళ్ళినపుడు నీ అదృష్టం వల్ల ఒక మహాత్ముని
దర్శనభాగ్యం కలుగుతుంది. వారు నీకు జ్ఞానోపదేశం
చేసి నీమనసుకు శాంతిని, సౌఖ్యాన్ని కలుగచేస్తారు” అని దీవించారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment