03.10.2020 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు బాబా చేసిన సహాయం గురించి ప్రచురిస్తున్నాను. బాబా జీవించి ఉన్న రోజులలో జరిగిన ఈ సంఘటన ‘సాయి
సరోవర్’ అనే గుజరాతీ పుస్తకంలో ప్రచురింపబడినది. మరలా ఆంగ్లంలో shiridisaitrust.org లో ప్రచురింపబడింది.
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
ఋణ
విముక్తి
నాగపూర్
లో శ్రీ అమీదాస్ లక్ష్మీదాస్ మెహతా అనే వడ్డీవ్యాపారి ఉండేవాడు. అతను వసంతరావు అనే సాయిభక్తుడికి ఆరువందల రూపాయలు
అప్పుగా ఇచ్చాడు.
వసంతరావు రోజులు బాగాలేకపోవడంవల్ల అతను ఎంతోమంది వద్దనుంచి కూడా అప్పులు చేసి వాటిని సకాలంలో తీర్చలేకపోయాడు. ఇక సాయిబాబాయే తనకు దిక్కు అనుకున్నాడు. అంతేకాకుండా సాయిబాబా ఎల్లప్పుడూ అతనితోనే ఉండేవారు. అందువల్లనే అతను షిరిడీ వెళ్ళాడు.
అతనికి అప్పులిచ్చినవాళ్ళు అతనింటికి
ఎప్పుడు వెళ్ళినా “ఊళ్ళోలేడు” అనే సమాధానమే వచ్చేది. అమీదాస్ ఈ సమాధానాలకి బాగా విసిగిపోయాడు. అతనికోసం వెదకడం మొదలుపెట్టాడు. ఆఖరికి అతను షిరిడీలో ఉన్నట్లు తెలిసింది. వసంతరావు ఒక ఫకీరును ఆశ్రయించి ఆయన పాదాలచెంత ఉన్నట్లుగా
సమాచారం లభించింది.
అమీదాస్
వెంటనే షిరిడీ వెళ్ళాడు. ద్వారకామాయిలో సాయిబాబా
పాదాలు వత్తుతూ ఉన్నాడు వసంతరావు. అమీదాస్
అక్కడే బాబా ఎదురుకుండానే వసంతరావుని బాగా దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. అనరాని మాటలు అన్నాడు. అతని తిట్లకు వసంతరావు చాలా బాధపడి కళ్లనీళ్ళు పెట్టుకున్నాడు. కాని ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా బాబా పాదాలను
వత్తుతూ కూర్చున్నాడు. సాయిబాబా ఎంతో శాంతంగా
అమీదాస్ తో “సోదరా నువ్వు చాలా రోజులు ఓపిక పట్టావు. ఇక రెండు రోజులు ఆగు. ఎల్లుండికల్లా నీ అప్పు వడ్డీతో సహా తీర్చివేయబడుతుంది”
అన్నారు. ఎలాగయితేనేమి అమీదాస్ బాబా మాటల మీద
నమ్మకంతో తిరిగి వెళ్ళిపోయాడు.
ఎల్లుండి
అనగా మూడవరోజు ఉదయం అమీదాస్ ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు. ఆసమయంలో ఎవరో తలుపు కొట్టారు. అమీదాస్ కళ్ళు నులుముకుంటూ లేచి తలుపు తెరిచాడు. ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి కనిపించాడు. “ఎవరు నువ్వు?
నీవెవరో నేను గుర్తుపట్టలేకుండా ఉన్నాను” అన్నాడు అమీదాస్. అపుడావ్యక్తి “నేను వసంతరావుగారి సేవకుడిని. మీ బాకీ చెల్లించమని నాకు డబ్బు ఇచ్చి పంపించారు. మీ ఖాతా పుస్తకాలను చూసి వడ్డీతో సహా ఎంత అయింది
లెక్క చూసి ఆసొమ్మును ఈ చిన్న సంచీలోనుండి తీసుకోండి” అన్నాడు. అలా అంటూ చిన్న సంచీని అమీదాస్ చేతుల్లో పెట్టి,
అయ్యా, స్వయంగా మీరే లెక్కపెట్టుకుని ఈ సంచీలోనుండి మీకు రావలసిన బాకీ సొమ్మును తీసుకోండి. మీరు ఒక్కపైసా కూడా ఎక్కువ తీసుకోరనే నమ్మకం నాకుంది”
అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి.
“ఆరువందల
రూపాయలు అంటే చాలా పెద్ద మొత్త్రం. అంత సొమ్ము
ఇంత చిన్న సంచీలో ఎలా పడుతుంది? అది సాధ్యమేనా?
అనే సందేహం కలిగింది అమీదాస్ కి. ఎంతో ఆశ్చర్యంతో
కళ్ళువిప్పార్చి ఆవ్యక్తి వైపు చూస్తూ అమీదాస్ ఆ సంచీలోనుండి నాణాలను తీసి లెక్కపెట్టసాగాడు. విచిత్రం ఏమిటంటే అమీదాస్ ఆసంచీలోనుండి ఎన్ని నాణాలు
తీసినా అది చిన్న సంచీ అయినప్పటికీ ఖాళీ అవడంలేదు. అందులోనుండి నాణాలు ఏమీ తరగడంలేదు. అమీదాస్ సంచీలోనుండి తనకు రావలసిన ఆరువందలు తీసుకుని
ఆవ్యక్తితో “ఖాతా పుస్తకాలు పైన మేడమీద ఉన్నాయి.
ఒక్కనిమిషం ఆగండి. వాటిని తీసుకువస్తాను” అన్నాడు అమిదాస్. అపుడా వ్యక్తి “అయ్యా మీరేమి దానిగురించి ఆలోచించకండి. నేనింకా చాలా బాకీలు చెల్లించాల్సి ఉంది. అందుకనే నేను తొందరగా వెళ్ళాలి. నేనిపుడు వెళ్ళిపోతున్నాను. డబ్బు ముట్టినట్లుగా రసీదు వసంతరావుగారికి పంపించడి”
అన్నాడు.
వసంతరావు
రసీదు అందుకున్న వెంటనే అతనికి నోటమాట రాలేదు.
సాయిబాబా తనయందు చూపించిన ప్రేమకి ఎంతగానో సంతోషం కలిగింది. అప్పులవాళ్ళనుంచి తనను రక్షించడానికి సాయిబాబా ఎంతగానో
కష్టపడ్డారని గ్రహించుకుని వసంతరావు కళ్ళంబట నీళ్ళు పెట్టుకున్నాడు.
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment