30.01.2021 శనివారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా
వ్యాస గ్రంధము – 38 వ.భాగమ్
(పరిశోధనా వ్యాస
కర్త … శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
సాకోరి – శ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానం
– ఉదయం 11 గంటలకు.
ఆ మరుసటిరోజు ఉపాసనీబాబా వంట చేసుకుంటున్నారు. ఆయనకు దగ్గరగా ఒక బిచ్చగాడు నుంచుని ఉన్నాడు. ఆయన బాబా చెప్పిన ఆదేశాలన్నీ మర్చిపోయారు. ఆచారం ప్రకారం గురువుకు గాని సాధువుకు గాని సమర్పించడం కోసం వండినవాటిని మొదటగా వారికి సమర్పించకుండా ఇతరులకు పెట్టరాదు. ఇది బలీయంగా ఎప్పటినుంచో వస్తున్న మతాచారం. ముందుగా దైవానికి సమర్పించకుండా మనం ఎవరికీ పెట్టము. అందువల్ల బిచ్చగాడిని చూడగానే ఉపాసనీబాబా అతనికి ఏమీ పెట్టకుండా పంపించి వేసారు. కొద్ది నిమిషాలలోనే తయారుచేసిన పదార్ధాలన్నిటినీ తీసుకుని సాయిబాబా వద్దకు వెళ్ళారు.
కాని ఉపాసనీబాబా సాయిబాబా దగ్గరకు ఇంకా చేరుకోకుండా దూరంలో ఉండగానే
సాయిబాబా చాలా కోపంగా “వెళ్ళిపో, ఎందుకు
వచ్చావు ఇక్కడికి? నువ్వేమో
నన్ను వెళ్ళిపొమ్మన్నావు. అటువంటపుడు నా దగ్గరకు ఇప్పుడు ఎందుకు వచ్చావు?” అన్నారు. అపుడు ఉపాసనీ “బాబా, కాని మీరెక్కడ ఉన్నారు? ఆసమయంలో” అని అడిగాడు.
(ఖండోబా మందిరమ్)
“నేను నీదగ్గరే ఉన్నాను. ఇక్కడ ఉండద్దు” అన్నావు నువ్వు.
“బాబా నన్ను క్షమించండి. నా ప్రవర్తనకి చాలా విచారిస్తున్నాను. నా ఎదురుగా బిచ్చగానిగా నుంచున్నది
నిజంగా మీరేనా?” అన్నాడు ఉపాసనీ.
మనకున్న పరిమిత జ్ఞానంతో మనం ఏదీ పుర్తిగా గ్రహించుకోలేము. కాని మనకు ఉన్న కొద్దిపాటి వివేకంతోనే
పరివర్తన కలుగుతుందని చెప్పగలము. ఉపాసనీబాబా తరచుగా బాబాని కలుసుకోలేదు. అయినప్పటికీ ఆయన అంతరంగంలో సంపూర్ణమయిన
పరివర్తన కలిగింది. ఆయన
కష్టించి పనిచేస్తూనే ఉండేవారు. అపుడు ఆయన పూర్తిగా మారిన మనిషి.
ఇది నిజంగా చెప్పుకోదగిన విషయం. ఇది గురువు – శిష్యుల మధ్యగల సంబంధంపై ఉన్న ప్రభావం ఎటువంటిదో అర్ధమవుతుంది. సాయిబాబా వారి గొప్పతనం ఎటువంటిదో మనం గ్రహించుకోగలం.
(సాయిబాబా ఒక శునక రూపంలోను, బిచ్చగాని రూపంలోను రావడాన్ని ఉపాసనీబాబా
గుర్తించలేని ఈ రెండు సంఘటనలు బహుశ అక్టోబరు, 1911 వ.సం. లో జరిగి ఉండవచ్చని శ్రీ నరస్వింహస్వామి
గారు, సుబ్బారావు గార్లు వ్రాసిన పుస్తకం SAGE OF SAKURI .. 45 – 7 లో చూడవచ్చు.. . ఆంటోనియోగారు వ్రాసిన విషయం)
ప్రశ్న
--- మొట్టమొదటిసారిగా
సతీ గోదావరి మాతాజీ ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?
జవాబు
--- ఉపాసనీ మహరాజ్ ఇక్కడికి
1917వ.సంవత్సరంలో వచ్చారు. అప్పట్లో ఈ ప్రదేశం ఒక స్మశానం. అటువంటి ప్రదేశాన్ని ఎంతో సుందరంగా
తయారుచేసిన ఆయనకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఉపాసనీగారి ఆధ్యాత్మిక గొప్పదనానికి
ధన్యవాదాలు. ఇది ఇపుడు
యాత్రాస్థలమయింది. 1924 వ.సం. ప్రాంతంలో గోదావరిమాత తన
తల్లితో కలిసి మొదటిసారిగా సాకూరీకి వచ్చారు. వాస్తవానికి ఆమె తల్లిదండ్రులు కూడా
భక్తిపరులే. వారు నాగపూర్,
బెరార్ మొదలయిన ప్రదేశాలలో ఉన్న అనేకమయిన పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ
ఉంటారు. ఇక్కడికి వచ్చిన
తరువాత వారు గజానన్ మహరాజ్ గారి మందిరం ఉన్న ప్రసిధ్ధ పుణ్యక్షేత్రం షేగావ్ కూడా వెళ్ళి
ఆయనను దర్శించుకున్నారు.
ప్రశ్న
--- అయితే వారు షేగావ్ నుండి వచ్చారా?
జవాబు
--- అవును. షేగావ్ గోదావరిమాత జన్మస్థలం. బాల్యంలోనే ఆమెలో తీవ్రమయిన భక్తి
భావాలు ఉండేవి. ఆమె తల్లిదండ్రులు
పుణ్యక్షేత్రాల గురించి విన్నా, మహాత్ముల గురించి విన్నా వారిని
దర్శించుకోవడానికి వెడుతూ ఉండేవారు.
ఆవిధంగా వారికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మహాత్ములను పూజించుకోవడం
అంటే ఎంతో ఇష్టం. ఉపాసనీ
మహరాజ్ ఉన్న ప్రాంతమయిన ఈ సాకూరీకి రావడం వారికి అదే మొదటిసారి. 1924వ.సం.
జనవరి, లేక ఫిబ్రవరి నెలలో అనుకుంటాను. వారు తమ ఇద్దరు కుమార్తెలతోను వచ్చారు. అపుడు గోదావరిమాత వయసు ఎనిమిది లేక
తొమ్మిది సంవత్సరాలు ఉండచ్చు. మొట్టమొదటిసారి వారు ఇక్కడికి వచ్చినపుడు సాకూరీ అభివృధ్ధి చెందడానికి ఇంకా
మొదటి దశలోనే ఉంది. ఉపాసనీ
మహరాజ్ నివసించే గుడిశ, ఆయన కూర్చొనే మండపం ఇవే ఉన్నాయి ఇక్కడ. ఉపాసనీ మహరాజ్ గారి కీర్తి నలుదిశలా
వ్యాపించడంతో భారతదేశంలోని మారుమూల ప్రాంతాలనుండి ఆయనను దర్శించుకోవడానికి ప్రజలు వచ్చేవారు. వారంతా ఆయనను దర్శించుకుని వెళ్ళిపోయేవారు. ఆయనకు ఎన్నోపుష్పాలను, దండలను, పండ్లను తీసుకువచ్చి సమర్పించేవారు. గోదావరిమాత చాలా చిన్నపిల్ల కావడంవల్ల ఆమె ఉపాసనీబాబాను దర్శించుకోవడానికి
వీలుగా మొదటి వరసలో కూర్చుంది. ఒక భక్తుడు తన మెడలో వేసిన దండను ఉపాసనీబాబా గోదావరిమాత మెడలో వేసారు. దండను వేసిన
తరవాత ఆయన అక్కడ ఉన్న అన్ని వస్తువులనూ, ప్రదేశాలను చూపించి,
“అమ్మాయీ! భవిష్యత్తులో నువ్వే వీటినన్నింటిని
భాధ్యతగా చూసుకోవాలి” అన్నారు. ఇక్కడ మరొక విషయం గుర్తుంచుకోవాలి. అపుడు ఆమె వయసు కేవలం ఎనిమిది లేక
తొమ్మిది సంవత్సరాలు. ఆమె ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు.
ఇంట్లో కూడా ఏవిధమయిన చదువు చదువుకోలేదు. ఆమెకు ప్రపంచమంటే ఏమిటో కూడా తెలీదు.
ఉపాసనీ బాబా మాటలు వారికి శుభవార్తగా వినిపించాయి. అపుడు గోదావరిమాత రెండు, మూడు సంవత్సరాలు సాకోరీలోనే ఉంది.
12 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఉపాసనీమహరాజ్ కు శిష్యురాలయింది. ఆమే ఆయనకు ఇంకా అధికారికంగా ప్రకటింపబడని
మొదటి శిష్యురాలు. 1941వ.సంలో ఉపాసనీమహరాజ్ సమాధి చెందిన తరవాత మొత్తం బాధ్యతలన్నీ
ఆమె భుజస్కంధాలమీద పడ్డాయి. ఉపాసనీమహరాజ్ డిసెంబరు, 24, 1941 వ.సంలో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆయన తదనంతరం నలభై సంవత్సరాలకు పైగా
ఆయన నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రజలను చైతన్యవంతులను
కావించడం, ఆధ్యాత్మికవిలువలు వాస్తవాలను ప్రజలలో వ్యాప్తిచేయడం
మొదలయినవన్నీ గోదావరిమాత కొనసాగించారు.
ఆయన ఆశయాన్ని కొనసాగించడమే కాదు, తనలో ఉన్న
ఆధ్యాత్మిక ఉత్సాహంతో మరింతగా విస్తరింపచేసారు. విదేశీయులు కూడా మనశ్శాంతి,
మార్గదర్శకత్వం, జ్ఞానసిధ్ధికోసం గోదావరిమాత దగ్గరకు
వస్తూ ఉంటారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment