Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, February 1, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 39 వ.భాగమ్

Posted by tyagaraju on 6:12 AM

 




01.02.2021 సోమవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 39 .భాగమ్

(పరిశోధనావ్యాస రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

సాకోరిశ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానంఉదయం 11 గంటలకు.

ప్రశ్న   ---   మీ ఉద్దేశ్యం ప్రకారం మాతాజీ గారు దర్శనం ఇవ్వడంతోపాటుగా ఆమె బోధించిన అతిముఖ్యమయిన ఉపదేశం ఏమిటి?  మనకి మనశ్శాంతి ఏవిధంగా లబిస్తుంది?

జవాబు   ---   ప్రాధమికంగా మాతాజీ బోధించినది ఏమిటంటే మనసులో భగవంతుని ఊహించుకుని ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉండాలి.  నామస్మరణ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి, మనశ్శాంతికి దోహదపడుతుంది.  భగవంతుని నామాన్ని పదేపదే స్మరిస్తూ ఉండటం వల్ల క్రమక్రమంగా మనసుకు శాంతి లభిస్తుంది.  ప్రాపంచిక వ్యవహారాలలో నిమగ్నమయి ఉన్నవారు గాని, కుటుంబపెద్దలు గాని ఎవరయినా సరే ఈవిధంగా ఆచరించవచ్చు.


ప్రశ్న   ---   ఆమె ఆవిధంగా నామస్మరణ గాని జపాన్ని గాని సాధన చేయమని సలహా ఇచ్చారా?

జవాబు   ---   అవును.  జపం గాని, నామస్మరణను గాని సాధన చేయమన్నారు.  ఇదే భగవంతుని మీద మనం చూపవలసిన భక్తి, గురువుయందు భక్తి, భక్తికి కావలసిన అతి ముఖ్యమయిన విషయం.

కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి మీప్రశ్నకు సమాధానంగా చెబుతాను.  అమెరికన్ స్కాలర్ ఒకాయన ఇక్కడికి వచ్చి మాతాజీని ఇంటర్వ్యూ చేసాడు.  భగవంతుని తెలుసుకోవడం గురించి మాతాజీని ప్రశ్నించాడు.  మాతాజి ఆయనకు ఇచ్చిన సమాధానాన్నే మీకిపుడు చెబుతాను.

మాతాజీ ఇచ్చిన సమాధానమ్  ---

“భగవంతుని గురించి పరిశోధించడమన్నా, ఆయనను గుర్తించడమన్నా  దుర్లభమయిన దానిని కనుగొనడంవంటిది.  అసలు మానవుడు మొట్టమొదటగా మానువునిలాగ ప్రవర్తించాలి.  నేటి ప్రపంచంలో పరిస్థితిని గమనించినట్లయితే తనతోటి మానవుని పట్ల చూపవలసిన ప్రేమ, దయలను మానవుడు పోగొట్టుకున్నాడు.  మానవజన్మ లభించినందుకు మనిషన్నవాడు మనిషిగా ప్రవర్తించాలి. ఈ రోజుల్లో ప్రజలు జంతువులలాగ ప్రవర్తిస్తున్నారు.  ఎన్నో నీచమయిన దశలను దాటుకుని పరిమాణక్రమంలో లభించిన ఈ మానవదేహాన్ని సార్ధకం చేసుకోవాలి.  తన స్థితికి సంబంధించిన గుణాలను, పరిస్థితులను గ్రహించుకోకుండా విచ్చలవిడిగా ప్రవర్తించేవారు భగవంతుని ఉనికిని తెలుసుకోవడం ఆయనను అనుభూతిని చెందటంలాంటివన్నీ కలలో కూడా ఆలోచించనక్కరలేదు.  అందువల్లనే మానవుడు మానవుడిగానే ప్రవర్తించాలని మాతాజీ చెప్పారు.  అపుడే అతనికి భగవంతుని గురించి తెలుసుకోవడానికి తగిన అర్హత లభిస్తుంది.  ఇవన్నీ కూడా ప్రాధమికంగా మానవతా విలువలు.  సాధకుడు అయినా సరే కాకపోయినా సరే తోటిమానవుని యెడల కరుణ ప్రేమ చూపాలి.  ఈ గుణాలు లేకపోయినట్లయితే మానవుడే కాదు, ఆధ్యాత్మిక పురోగతికి తీసుకునివెళ్ళే విలువలు ఏవయితే ఉన్నాయో అవేమీ లేనివాడవుతాడు.  భగవంతుడిని గూర్చి తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నపుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి.  ఆవిధంగా పయనించదలచుకున్న మానవునికి ఆధ్యాత్మిక విలువలు ముఖ్యమయినవి, అవసరమయినవి కూడాను. 

ఇటువంటి మంచి లక్షణాలు ఏమీ లేకుండా నువ్వు భగవంతుని గురించి మాట్లాడవచ్చు, పుస్తకాలు వ్రాయవచ్చు, ఉపన్యాసాలు ఇవ్వచ్చు, కాని వీటివల్ల ఎటువంటి ఉపయోగం లేదు.

ఆధ్యాత్మిక ప్రపంచంలో ముఖ్యంగా కావలసినది స్వీయానుభవం.  అంటే తను బోధించినవాటిని తను స్వయంగా ఆచరించాలి.  అనుభవంలోకి తెచ్చుకోవాలి.  మన జీవితంలో ఆధ్యాత్మికతను నింపుకోవాలి.  ఊరెకే కబుర్లు చెప్పడంవలన గాని, మాట్లాడటం వల్ల గాని ఎటువంటి ఉపయోగం లేదు.”

 నేను చెప్పేది మీకు అర్ధమవుతోందా?  అందువల్లనే మాతాజీ, మానవతా విలువలు ఏవయితే ఉన్నాయో వాటిని పెంపొందించుకోమని చెప్పారు.  ఇదే నిజమయిన ఆధ్యాత్మిక తత్త్వం.  ఏదో ఊరికే పేరుకు జపం  చేయడం ఆరతి ఇవ్వడం కాదు, లేక ప్రార్ధించుకోవడం, సాధనలో మనకు మనమే అనేక రీతులలో అభ్యాసం చేయడం కాని కాదు.  చాలామంది ఈ విషయంలో దారితప్పారు.  వారేదో చాలా గొప్పపని చేస్తున్నామని అనుకుంటారు.  కాని అది చాలదు.  దాని బదులు ఈ మానవతా విలువలను ఆచరణలో పెడుతూ మనలో అంతర్గతంగా వాటిని అభివృధ్ధి పరచుకోవాలి.  ఆధ్యాత్మిక దారిలో పయనించాలంటే ముఖ్యంగా కావలసినవి విశాలమయిన దృష్టి, విశాల భావాలు, విశాలహృదయం.  ఇటువంటి లక్షణాలు ఏమీ లేకుండా భగవంతుని గురించి అన్వేషించడం లేక ఆధ్యాత్మిక పురోగతిని సాధించడం అసాధ్యం.  ప్రజలు తమలో ఉన్న రాక్షగుణాలను తొలగించుకోవాలి.  అంతర్గత పరివర్తన అనుకూలంగా లేనట్లయితే ఆధ్యాత్మిక సాధనలు ఎన్ని చేసినా అవన్నీ నిరుపయోగమే.

మీకు యదార్ధమయిన విషయం ఒకటి చెబుతున్నాను.  గుర్తుపెట్టుకోండి.  మానవదేహం దైవిక సూత్రాలు, మానవతా సూత్రాలు, జంతుజాల సూత్రాలతోను తయారుకాబడి ఉంది.  అందువల్ల చేసే ప్రతిసాధన యొక్క లక్ష్యం నీచప్రవృత్తులను అధిగమింపచేసి దైవత్వానికి చేర్చడం.  ప్రాధమిక లక్షణాలయిన జంతు మానవ లక్షణాలను వెంటనే తొలగించుకోవాలి.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List