05.02.2021 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 41 వ.భాగమ్
(పరిశోధనావ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
సాకోరి – శ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానం
– ఉదయం 11 గంటలకు.
ప్రశ్న --- ఈ
అర్హతా నిర్ణయ కాలంలో (Probation Period) ఉన్న అమ్మాయి ప్రత్యేకంగా నిర్ణయింపబడిన దుస్తులను
ధరించవలసి ఉంటుందా?
జవాబు --- లేదు. ఆమె కన్య అయితే తప్ప కన్యలు ధరించే దుస్తులు ధరించదు. ఈ నాలుగు సంవత్సరాలు అమ్మాయికి అర్హతానిర్ణయ కాలం. ఇది రెండు మూడు సంవత్సరాలకు తక్కువ కాకుండా ఉంటుంది. ఈ కాలంలో ఆ అమ్మాయికి తను జీవితాంతం కన్యగా ఇక్కడ గడపగలనా లేదా అని బాగా అర్ధం చేసుకుంటుంది.
కుటుంబ జీవితంతో పోల్చినట్లయితే సన్యాసి జీవితం పూర్తిగా ఇబ్బందులతో కూడుకుని ఉంటుంది. సన్యాసి జీవితంలో ఎటువంటి సుఖాలు, సౌకర్యాలు ఉండవు. సన్యాసిగా జీవించటమంటే అంత సులువు కాదు. ఉపవాసాలు ఉండాలి. శారీరకంగాను, మానసికంగాను ఎంతో కష్టపడాలి. సూర్యోదయంనుండి సూర్యాస్తమయం వరకు భగవంతుని స్మరించుకుంటూ నామస్మరణ చేస్తూనే ఉండాలి. నిరంతరం భగవత్ చింతనతోనే గడపాలి.
దాని అర్ధమేమిటంటె పూర్తిగా ఈ ప్రపంచాన్ని
మర్చిపోవాలి. ఆ జీవితం ఎలా ఉంటుందంటే జపం,
ధ్యానం, భగవంతుని మీదనే ఆలోచన వీటితోనే గడపాలి.
ఏమిచేస్తున్నా, ప్రతిరూపంలోను భగవంతుని దర్శించుకుంటు ఆవిధంగా తనను తాను మర్చిపోయి
ప్రపంచాన్ని, తన శరీరాన్ని కూడా మర్చివాలి.
దైవమే లోకంగా జీవించాలి. ఈ విధంగా ఎవరూ
చేయలేరు. అందుచేత ఈ అర్హతానిర్ణయ కాలంలో ఆ
అమ్మాయి తనకు తగిన శక్తిసామర్ధ్యాలు ఉన్నాయా లేవా అటువంటి జీవితం గడపగలనా లేదా అని
గ్రహించుకుంటుంది. ఆ అమ్మాయికి దీక్షనివ్వడానికి
అర్హురాలు అని మాతాజీ భావిస్తే ఆమెకి దీక్షనిచ్చి కన్యగా ఉండటానికి, తన శిష్యురాలిగా
అంగీకరిస్తారు. ఆవిధంగా ఇది చాలా సహజంగాను,
ఒక క్రమపధ్ధతిలోను జరిగే ప్రక్రియ. అంతే కాదు
ఇవన్నీ పూర్తిగా అవగాగన చేసుకున్న కన్యలు కొంతమందికి ఇక సన్యాసులు జీవించే జీవితాన్నే
కొనసాగించాలని కూడా అనిపించదు. ఈ విధంగా కూడా
జరుగుతూ ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న కన్య చాలా
రోజులపాటు ఆలోచించిన తరువాత తిరిగి వెనుకటి
ప్రపంచంలోకి వెళ్ళిపోవడానికి తనే స్వయంగా నిర్ణయించుకుంటుంది.
ప్రశ్న --- అయితే
ఆవిధంగా నిర్ణయించుకోవడంలో ఆమెకి సంపూర్ణమయిన స్వేచ్చ ఉందా?
జవాబు --- అవును
అమ్మాయిలందరూ ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు.
ఉపాసనీ బాబా ఏమని చెప్పేవారంటే “అమ్మాయిలందరూ తప్పనిసరిగా సంసారులు అయితీరాలనీ
లేదు, అలాగే అమ్మాయిలందరూ ప్రపంచాన్ని మరిచి ఉండిపోవాలనే భావంతోనూ ఉండకూడదు” ఆవిధంగా వారిలో కొంతమంది మాత్రమే ఇక్కడ నివసిస్తారు. ఇక్కడ ఆశ్రమాన్ని దర్శించడానికి వచ్చేవారికి వారు
ఒక ఆదర్శకన్యలలాగా ప్రేరణ కలిగించేలా ఉంటారు.
ఇక్కడికి వచ్చే అమ్మాయిలకి వారిని చూడగానే వారిలో కూడా ప్రేరణ కలుగుతుంది. దాని ద్వారా వారి అంతరంగంలో పరివర్తన కలుగుతుంది. పారమార్ధిక విషయాలు, ఆధ్త్యాత్మికతత్కిత్వం,
భగవంతుని ప్రాప్తి ఇవన్నీ ఒక ప్రదేశానికి గాని, సమయానికి గాని పరిమితం కావు. ఆధ్యాత్మిక గుణాలు గల మానవుడు ప్రాపంచిక వ్యవహారాలలో మునిగి ఉన్నా గాని వాటిని ఉపయోగించుకుంటాడు. వాస్తవంగా వీటిని
మనం పరిగణలోకి తీసుకోవాలి.
ప్రశ్న --- అమ్మాయి
కన్యగా మారి నాలుగుసంవత్సరాలు అర్హతా నిర్ణయకాలం పూర్తయిన తరువాత మాతాజీతో రోజులో ఇన్ని
గంటలపాటు ప్రత్యేకించి సమావేశం అవ్వాలనే నిబంధన ఏమయినా ఉంటుందా, మాతాజీ వారందరితోను
తరచుగా మామూలుగానే మాట్లాడుతూ ఉంటారా?
జవాబు --- కళాశాలలో
బి.ఎ., ఎమ్. ఎ. లాంటి విద్యలను అభ్యసిస్తున్నట్లుగానే ఇక్కడ కన్యగా దీక్ష ఇవ్వబడిన
తరువాత ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రారంభదశలో ఉంటుంది. ఇక్కడ కూడా వివిధ దశలలో శిక్షణాకాలాన్ని పూర్తి
చేయవలసి ఉంటుంది. జపం, ధ్యానంతోపాటుగా కన్య
సంస్కృతం, వేదాలు తప్పనిసరిగా అధ్యయనం చేయాలి.
ఆవిధంగా క్రమక్రమంగా ఆమె ఇంకా ఇంకా క్షుణ్ణంగా అన్నీ నేర్చుకోగలుగుంది. అత్యుత్తమమయిన శిక్షణకు హామీ ఇవ్వాలంటే ఇది అవసరం. మూడు నాలుగు సంవత్సరాల తరవాత కన్య ఒక మంచి విద్యార్ధినిగా
పరిపక్వతను సాధించి స్వయంగా తనకు తానే ఉన్నత స్థితిలోకి వచ్చి వికసిస్తుంది. అప్పుడె కన్యలకు మాతాజీతో అనుబంధం ఏర్పడుతుంది. వారంతా మాతాజీకి శిష్యురాండ్రు అవుతారు. ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మాతాజీ ప్రతిరోజు
ఉదయం 10 గంటలకు దర్శనమిస్తారు. ఇదే కాకుండా
మధ్యాహ్నం ఒక అరగంట సేపు కన్యలందరూ మాతాజీ ఉన్న గదిలోకి వెళ్ళి ఆవిడతో కలిసి ఉంటారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment