06.02.2021 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 42వ.భాగమ్
(పరిశోధనావ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
సాకోరి – శ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానం
– ఉదయం 11 గంటలకు.
ప్రశ్న
--- కన్యకి ఏదయినా సమస్య ఉంటే మాతాజీని కలుసుకుని మాట్లాడతారా?
జవాబు --- అవును. తనకు ఏమయినా సమస్య ఉంటే దాని గురించి మాతాజీకి చెప్పుకుంటుంది. మధ్యాహ్న సమయంలో సమావేశమయినపుడు గాని, ఆతరవాత గాని ఎపుడు మాట్లాడదలచుకుంటే అప్పుడు మాట్లాడుతుంది. ఆమె మాతాజీని ఎప్పుడు కలుసుకున్నా అప్పుడు నిరభ్యంతరంగా నేరుగా ఆమెని కలుసుకోవచ్చు. ఏర్పాటులన్నీ ఆవిధంగా చేసారు ఇక్కడ. ఏమయినప్పటికీ కన్యలందరూ మధ్యాహ్న సమయంలో మాతాజీని ఎప్పుడూ కలుసుకుంటూ ఉంటారు.
సాధారణంగా
ఆధ్యాత్మిక విషయాలు, భగవంతుని సాక్షాత్కారం, మంచి మంచి పుస్తకాలు, సాధుసత్పురుషులు, వీటి విషయాల మీదనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు.
అంతేకాకుండా
మాతాజీయే తమ గురువు కాబట్టి కన్యలందరూ గురువుకు సంబంధించిన విషయాల గురించే తెలుసుకోవాలనుకుంటారు.
ఈ
విధంగా వారు తమ సమయాన్నంతా సద్వినియోగం చేసుకుంటారు.
ప్రశ్న
--- ప్రస్తుతం ఇక్కడ ఎంతమంది కన్యలున్నారు?
జవాబు
--- ఇక్కడ అరవైమంది కన్యలున్నారు.
ఉపాసనీ
బాబా ఇరవైఅయుదు మందికి దీక్షనిచ్చారు.
నలభై
సంవత్సరాల కాలంలో మాతాజీ 35 మందికి దీక్షనిచ్చారు. ఆవిధంగా
మొత్తం 60 మంది కన్యలున్నారు.
ప్రశ్న
--- వాళ్ళందరూ అన్నివేళలా ఇక్కడే ఉంటారా లేక ప్రయాణాలు చేస్తూ ఉంటారా?
జవాబు
--- వారందరికీ ప్రేరణ ఇక్కడే కలిగింది కాబట్టి దానికి కట్టుబడి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు.
ఈ
సంస్థ ఇక్కడ ఇప్పటికీ సజీవంగా ఉండటానికి కారణం వారందరూ ఇక్కడే ఉండటం.
ఏమయినప్పటికీ
ఎక్కడయినా యజ్ఞాలు గాని, మతపరమయిన కార్యక్రమాలు గాని జరిగే ప్రదేశాలకి అప్పుడప్పుడు మాతాజీతో కలిసి వెడుతూ ఉంటారు.
ప్రశ్న
--- ఇక్కడికి దగ్గరలో ఉన్న ప్రదేశాలకా లేక చాలా దూరంగా ఉన్న ప్రదేశాలకి వెళ్ళేవారా?
జవాబు
--- సాకూరీకి బయట ప్రదేశాలకీ వెడుతూ ఉంటారు, ఇప్పటివరకు మాతాజీ హైదరాబాదు, నాగపూర్, సూరత్, బొంబాయి, బెనారస్ ఇంకా భారతదేశంలోని అన్ని ముఖ్యమయిన ప్రదేశాలలోను యజ్ఞాలు నిర్వహించారు.
ప్రశ్న
--- ఆవిధంగా మాతాజీ ప్రయాణాలు చేసేవారన్నమాట?
జవాబు
--- అవును.
కాని,
కన్యలందరూ మాతాజీతో కలిసి వెడతారు.
మాతాజీతో
ఎప్పుడూ కన్యలను వెంటబెట్టుకుని వెడుతూ ఉంటారు.
కొన్నిసార్లు
యజ్ఞాలు నిర్వహించడానికి, మరొక్కపుడు ఎవరయినా భక్తులు మాతాజీని తమ నగరానికి విచ్చేయమని ఆహ్వానించినపుడు వెడుతూ ఉంటారు.
మాతాజీని
ఆహ్వానించిన
భక్తులందరూ ముఖ్యంగా ఎప్పటినుండో ఆమెకు భక్తులుగా ఉన్నవారు ఆమెను సగౌరవంగా ఆహ్వానించి అన్ని మర్యాదలు చేయడానికి అవసరమయిన ఏర్పాట్లన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు.
ఈవిధంగా
ఆనగరమంతా మాతాజీ దర్శనంతో పునీతమవుతుంది.
సాకోరీకి
రాలేనివారందరూ
మాతాజీని దర్శించుకుని ఆమె అనుగ్రహానికి పాత్రులవుతారు.
మీకు
నేను చెప్పేది అర్ధమవుతోందా?
ప్రశ్న
--- సూర్యోదయంనుండి సూర్యాస్తమానం వరకు ప్రత్యేకించి కన్య యొక్క రోజువారీ కార్యక్రమం ఏవిధంగా ఉంటుందో వివరిస్తారా?
జవాబు
--- ఇక్కడ ఉదయం 5 గంటలకే రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
ప్రధాన
ఆలయంలో జ్హోపర్డి ఉంది.
జ్హోపర్డీ
అంటే కుటీరం.
ఆలయం
లోపల ఉపాసనీ మహరాజ్ గారి సమాధి ఉంది.
ఇక్కడ
సాకోరీలో చాలా ఆలయాలున్నాయి.
ఉపాసనీ
మహరాజ్ తల్లిగారి ఆలయం, కన్యాకుమారి ఆలయం, ఉపాసనీ బాబా సమాధి.
ఈ
ఆలయాలన్నీటిలోను
పూజాది కార్యక్రమాలన్నిటినీ పగలు కన్యలే నిర్వహిస్తారు.
పూజలన్నీ
కన్యలే చేస్తారు.
ఇంకా
ఎన్నో ఆలయాలున్నాయి.
దత్తమందిరం,
శని ఆలయం, కుటీరం బయట ఖండోబా ఆలయం, గణేష్ ఆలయం, మారుతి ఆలయం ఉన్నాయి.
ఈ
ఆలయాలలో పూజలు బ్రాహ్మణులే నిర్వహిస్తారు.
కాని
ఇక్కడ ప్రధాన ఆలయం, కుటీరం ఉన్నాయి.
తెల్లవారుఝాము
5 గంటలకు ఆరతితో రోజు ప్రారంభమవుతుంది.
ఆరతి
ఇక్కడ స్థానికంగా జరపబడే సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది.
దాని
ప్రకారం మొదట ఆలయం లోపల తరవాత కుటీరంలోను జరుగుతుంది.
ఆరతి
అంటే కాకడ ఆరతి అయిన తరవాత, కాలాన్ని బట్టి ఆరతి సమయాలు మారుతూ ఉంటాయి, ఉపాసనీ మహరాజ్ సమాధికి అభిషేకం జరుగుతుంది.
అభిషేకం
ఉదయం 8, 8.30 వరకు జరుగుతుంది.
9 గంటలకు
ఉపాసనీ మహరాజ్ సమాధి వద్ద హాలులో కన్యలందరూ భజనలు చేస్తారు.
భజన
కార్యక్రమం ఉదయం 9.30 వరకు జరుగుతుంది.
ఆతరవాత
ఉపాసనీ మహరాజ్ సమాధికి మరొక ఆరతి కార్యక్రమం ఉంటుంది.
ఆరతి
పూర్తయిన తరవాత ఉపాసనీ మహరాజ్ గారు చెప్పిన ఉపన్యాసాలలోని కొన్ని సారాంశాలను చదువుతారు.
వాస్తవానికి
ఉపాసనీ మహరాజ్ జీవించి ఉన్నపుడు ఏకధాటిగా ఎక్కడా ఆపకుండా ఎన్నోగంటలు ఉపన్యాసం ఇచ్చేవారు.
ఆయన
ఉపన్యాసాలకి
ఉపాసని-వాక్-సుధ అని పేరు.
వాటిలో
ఒక్కొక్క ఉపన్యాసమే అయిదు, ఏడు పేజీల దాకా ఉంటుంది.
ఉపాసనీ
మహరాజ్ గారు ఇచ్చిన పవిత్రమయిన సాధుసాహిత్య ఉపన్యాసాలు అన్నిటినీ కలిపినట్లయితే అయిదువేల పేజీలుంటాయి.
ఉపాసనీ
మహరాజ్ గారి ఉపన్యాసాలను ఆధారం చేసుకుని నేను పి.హెచ్. డి చేస్తున్నాను.
ఆయన
ఉపన్యాసాలన్నీ
భగవత్ సాక్షాత్కారం, నీతిశాస్త్రం, ఆధ్యాత్మికత్త్వం, వేదాంతం వీటికి సంబంధించినవే.
కొన్ని
ఉపన్యాసాలు విద్యకు, కుటుంబనియంత్రణకు సంబంధించినవి కూడా ఉన్నాయి.
భారతదేశంలో
జనాభా నియంత్రణ గురించి బోధించడమంటే ఏవిధంగా ఉంటుందో మీరే ఊహించుకోండి.
కుటుంబనియంత్రణ చట్టం
కావడానికి 60 సంవత్సరాలముందే ఈ ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే.
అవిధంగా
ఆయన సామాజిక సమస్యలు కూడా తన బాధ్యతగా భావించి స్పందించేవారు.
ఏమయినప్పటికీ ఆయన గురువు, భగవత్ సాక్షాత్కారం, జపం, తపం వీటి మీదనే ప్రధానంగా
ఉద్ఘాటించి చెప్పేవారు. ఆయన ఒక మహాపురుషుడు. ఆయన ప్రధానంగా చర్చించే విషయాలు ఇవే.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment