09.02.2021 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 43 వ.భాగమ్
(పరిశోధనావ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
సాకోరి – శ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానం
– ఉదయం 11 గంటలకు.
(ఆయన
ఒక మహాపురుషుడు.
ఆయన
ప్రధానంగా చర్చించే విషయాలు ఇవే….
ఆ
తరవాతనుంచి చదవండి..)
ఒక్కొక్కసారి ప్రజలు ఆయనను సామాజిక సమస్యల గురించి కూడా ప్రశ్నిస్తూ ఉండేవారు. ఆయన తన అభిప్రాయాలను చెప్పేవారు. ఈ ఉపన్యాసలన్నీ పది పదిహేను నిమిషాలపాటు ఉదయం 10 గంటలవరకు జరిగేవి. పదిగంటలకు గోదావరిమాత దర్శనం ఇచ్చేవారు. భక్తులందరూ ఆమె దర్శనం కోసం తమకు తామే ఒక వరుసలో నిలబడేవారు. ఇది ఒక అరగంటసేపు జరిగేది. ఆతరవాత ఆలయంలోను, కుటీరం వద్ద ఆరతి కార్యక్రమం 11 గంటలకు ప్రారంభమయి 12, - 12.30 కు పూర్యయేది.
సాయంత్రంఆరతి ఆలయంలో సూర్యాస్తమ సమయంలో జరిగేది.
ఇది
రాత్రి 7 మరియు 8 గంటలకు జరిగేది.
ఆతరవాత
8 నుంచి 9 వరకు రాత్రి భోజన సమయం.
తరవాత
దిండి కార్యక్రమం ప్రారంభమవుతుంది. దిండి
అంటే కన్యలందరూ కలిసి భజనలు చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరతారు.
ఆఖరికి వారు ప్రధాన ప్రదేశమయిన కుటీరం వద్దకు చేరుకొని రాత్రి ఆరతి ఇస్తారు.
ఆఖరు
ఆరతి రాత్రి 10.30 కు ఇస్తారు.
ఇవే ఇక్కడ జరిగే కార్యక్రమాలు…ఇంతే కాకుండా సాయంత్రం 6 గం. నుండి 7 గం.వరకు కన్యలందరూ భజనలు పాడిన
తరువాత ఉపన్యాసాలుంటాయి. ఒక కన్య ప్రవచనం చెబుతుంది.
ఈ
ప్రవచనం ఏవిధంగా ఉంటుందంటె ఒక విద్యార్ధి తాత్త్విక గ్రంధాలవంటి భాగవతపురాణ, రామాయణ, లేక యోగవాసిష్టాలను
ప్రాఠ్యాంశంగా
ఎన్నుకుని తాను చదివినదానిని ఎంతవరకు అర్ధం చేసుకున్నాడో ఉపన్యాసపూర్వకంగా చెప్పే విధంగా ఉంటుంది.
కన్య
తన ప్రసంగంలో తన దృష్టికోణంలో తను అర్ధం చేసుకున్న తత్త్వాన్ని వర్ణించి వివరిస్తుంది.
తను
వ్యాఖ్యానించడానికి
ఎన్నుకున్న అంశాన్ని గురించి విపులంగా వివరణ
ఇచ్చి ఉపన్యసిస్తుంది.
ప్రశ్న --- ఈ సాకూరి ఆశ్రమంయొక్క ప్రత్యేకత
ఏమిటో వివరిస్తారా?
జవాబు --- మీరు సాధువులను దర్శించుకోవడానికి ఆశ్రమానికి వెళ్ళినపుడు అక్కడ భక్తి, నామస్మరణ, పురాణపఠనాలు, ధ్యానం, భజనలు ఇవన్నీ సాధారణంగా మీకు కనిపించే దృశ్యాలు.
అయితే
ప్రతి సంస్థకి, ప్రతి వ్యక్తికి స్వంతంగా కొన్ని ప్రత్యేకతలు, ప్రత్యేక
లక్షణాలు ఉంటాయి.
దేనికి సంబంధించిన ప్రత్యేకత
దానికి ఉంటుంది. ఇక్కడ
సాకూరీలొ
ఉపాసనీ బాబా మొట్టమొదటగా హిందూమతానికి చేసిన సహకారం, ఇంకా ప్రపంచ తత్త్వ విషయాల స్వభావాన్ని వివరించడాన్ని లక్ష్యంగా చేసుకుని మహిళలకు మాత్రమే ఉద్దేశించి మతపరమయిన సంస్థను స్థాపించడం, యజ్ఞ సాధన ఏర్పాటు చేయడం
ఇవన్నీ.
ప్రశ్న --- అలాగే మహిళలకు వేదపారాయణాన్ని అనుమతించడం చాలా అసాధారణమయిన విషయం కదా?
జవాబు --- ఇది
యజ్ఞాలకు సంబంధించినది. వాస్తవానికి భారతదేశంలో
ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనే కోరిక ఉన్న మహిళలకోసం స్థాపింపబడిన సంస్థలు చాలా తక్కువగా
ఉన్నాయి. పశ్చిమంలో చాలామంది సన్యాసినులు ఉన్నారన్న
విషయం మీకు తెలుసు కదా. ఇటువంటి సంస్థలన్నీ
మొట్టమొదటగా పశ్చిమంలోనే ఏర్పాటయ్యాయని చదివాను.
వాటిల్లో ఇది ఒకటి. అంతేకాదు ఉన్న అన్నింటిలోకన్న
అత్యుత్తమంగా నిర్వహింపబడుతున్న సంస్థ ఇదే.
ఉదాహరణకి రామకృష్ణమిషన్ లో కొన్ని ఉన్నాయి. ఆనందమయి మా స్థాపించినవని మరికొన్ని ఉన్నాయి ఎటువంటి సందేహం లేకుండా సాకూరీ ఆశ్రమం ఇప్పటికీ
ఉత్తమంగానే ఉంది. కన్యలు, బ్రహ్మచారిణులు నాగపూర్
జిల్లా, మహారాష్ట్రనుండే కాకుండా భారతదేశం అన్ని ప్రాంతాలనుండి వస్తారు. వారిలో అన్ని మతాలవారు, కులాలవారు ఉన్నారు. వారిలో ఉన్న ఆధ్యాత్మిక దాహం, ఆరాటమే వారినిక్కడకు
రప్పిస్తుంది.
ప్రశ్న --- వారందరూ
నిజంగానే భారతదేశం అన్ని ప్రాంతాలనుండి వస్తారా?
జవాబు --- అవును. రోజంతా వారు భజనలతోను, ఆరతులతోను, వివిధరకాలయిన సాధనలతోను తీరికలేకుండా ఉంటారు. వారి మనస్సంతా నిరంతరం భగవంతుని మీదే లగ్నమయి ఉంటుంది. ఇదే వారి పాఠ్యాంశం. యజ్ఞసాధన కూడా ఈ ప్రదేశానికి ఒక విధమయిన ప్రత్యేకతనిస్తుంది. స్త్రీలు ఎంతో నైపుణ్యంతో యజ్ఞాలను నిర్వహించడం, వేదశ్లోకాలను పఠించడం భారతదేశం మొత్తంమీద మీరు చూడగల ఏకైక ప్రదేశం ఇది ఒక్కటే.
సంవత్సరంలో ఏడు యజ్ఞ వేడుకలను నిర్వహిస్తారు. స్త్రీలు యజ్ఞాలను నిర్వహించడమనేది ప్రజలు ఎక్కడా చూడని కారణంగా కొంతమంది యజ్ఞాలను స్త్రీలు నిర్వహించడానికి ఏమి హక్కు ఉందని ప్రశ్నిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే చాలా శతాబ్దాల తరవాత స్త్రీలకు ఈ హక్కు తిరిగి లభించింది. దానికి కారణమయిన ఉపాసనీబాబాకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. అందువల్లనే ఉపాసనీ బాబాను ఒక విప్లవకారుడు అని అంటాము. నేను చెప్పేది అర్ధం చేసుకుంటున్నారా?
ఇటువంటి విధానం ఇక్కడ సన్యాసి మఠంలో చాలా ప్రత్యేకతను
కలిగి ఉంది. ఇక్కడ కన్యలకి వేదాలలో మంచి పరిజ్ఞానం
ఉంది. వారిలో కొంతమంది గణపతి, అంటే దాని అర్ధం
వారికి ఆ వేదాలలో పరిజ్ఞానం చాలా అత్యధిక స్థాయిలో ఉంది అని. ఇక్కడ యాగాలను ప్రత్యక్షంగా చూడటం ఒక మంచి అనుభూతినిస్తుంది. కన్యలు యజ్ఞాలను నిర్వహించడం గురించి చెప్పాలంటే
నాకు మాటలు చాలవు.
ప్రశ్న --- ఈ
అక్టోబరు నెల యజ్ఞం ఎన్ని రోజులపాటు జరుగుతుంది?
జవాబు --- ఈ
యజ్ఞం నవరాత్రులలో మొదటిరోజున ప్రారంభమవుతుంది.
యజ్ఞం ఏడు, ఎనిమిది రోజులు జరుగుతుంది.
ఒక్కొక్క యజ్ఞం శాస్త్రాలలో చెప్పిన విధంగా నిర్ణయింపబడుతుంది. ఆవిధంగా ఒక యజ్ఞం నాలుగురోజులు, మరొకటి పదిహేనురోజులు,
యజ్ఞాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఉదాహరణకి సూర్యయజ్ఞం
జనవరి 1వ.తేదీన ప్రారంభమయి 15వ.తారీకున ముగుస్తుంది. యజ్ఞాలన్నీ శాస్త్రాలలో నిర్దేశించబడిన విధానంలోనే నిర్వహిస్తారు.
నాకు ఇంతటి
విలువయిన సమాచారాన్నిచ్చి, ఎంతో సహాయం చేసినందుకు శ్రీ టిప్నిస్ గారికి మనఃస్ఫూర్తిగా
ధన్యవాదాలు తెలుపుకున్నాను.
శ్రీ టిప్నిస్ … ఎంతో
విలువయిన మీ సమయాన్ని, ధనాన్ని లెక్క చేయకుండా ఈ విషయసేకరణకి ఎన్నో ప్రయాసలుపడి భారతదేశానికి
వచ్చినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment