10.02.2021 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 44 వ.భాగమ్
(పరిశోధనావ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
సాకోరి – శ్రీ ఉపాసనీ కన్యాకుమారి సంస్థానం
– ఉదయం 11 గంటలకు.
శ్రీ టిప్నిస్ చెబుతున్న మరికొన్ని వివరాలు…
గజానన్ మహరాజ్ గారి ఆశీర్వాదం వల్లనే మాతాజీ ఆమె
తల్లిదండ్రులకు జన్మించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. గజానన్ మహరాజ్ ఆమె తలిదండ్రులకు వారి
కుటుంబంలో కారణజన్మురాలు జన్మిస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఆకారణ జన్మురాలే మాతాజీ.
నేను (ఆంటోనియో) --- అయితే ఆవిధంగా గజానన్ మహరాజ్ గారికి, గోదావరి మాతాజీకి
మధ్య సంబంధం ఉండటమే కాక షిరిడిసాయిబాబాతో కూడా ఉందని అనిపిస్తోంది.
జవాబు --- మాతాజీ తండ్రిగారికి సంతానం కలగలేదు. దానితో మాతాజీ తాతగారికి చాలా దిగులు
పట్టుకుంది. ఆకారణం చేత
ఆయన గజానన్ మహరాజ్ గారిని దర్శించుకోవడానికి వెడుతూ ఉండేవారు. ఆమె తాతగారు గజానన్ గారికి గొప్ప
భక్తుడు. ఒకసారి గజానన్
గారు ఆయనతో “ఎందుకు దిగులు పడతావు? ఏ ఇతర సాధువులు నీకు ఎప్పటికీ ఇవ్వలేనిదానిని
నేను నీకు అనుగ్రహిస్తాను. నేనే మీకుటుంబంలో జన్మిస్తాను” అన్నారు. అపుడు మాతాజీ తాతగారు ఆయనతో
“మీరే నా కుటుంబంలో జన్మించారన్న విషయం నాకెలా తెలుస్తుంది?”
అన్నారు. అపుడు గజానన్ మహరాజ్ గారు నేను జన్మించినపుడు కొన్ని ప్రత్యేకమయిన విశేషమయిన
సంకేతాలు కనిపిస్తాయి, సంఘటనలు జరుగుతాయి” అని వాటిని వివరంగా ఆయనకు చెప్పారు. గోదావరి మాతాజీ జన్మించినపుడు ఆమె
తాతగారికి గజానన్ గారు వివరించిన సంకేతాలన్నీ కనిపించాయి. ఆవిధంగా గజానన్ మహరాజ్ గారు తిరిగి
ఈ భూమిమీద జన్మించారని ఆయనకు నమ్మకం కలిగింది. తరచూ గజానన్ మహరాజ్ గారు గంగ,
గోదా అనే పదాలు పలుకుతూ ఉండేవారు. ఇవి భారతదేశంలోని పవిత్రమయిన నదుల
పేర్లు. గజానన్ మహరాజ్
గారు పలికే ఆపదాలను గుర్తుకు తెచ్చుకుని ఆయన ప్రసాదంగా ఆమె తాతగారు ఆమెకి గోదావరి అని
నామకరణం చేసారు. ఆమె
పేరు వెనుక ఉన్న చరిత్ర ఇది.
ప్రశ్న
--- గజానన్ మహరాజ్ గారి
ఆశీర్వాదం వల్లనే గోదావరి మాతాజీ జన్మించారా?
జవాబు
--- అవును. భారతదేశంలోని యోగులందరి ఆశీర్వాదాలు
ఆమెకు లభించాయి. ఉదాహరణకి
ఆమె బాల్యంలో ఉండగానే ఆమె తన తల్లిదండ్రులతో కలిసి కొంతమంది యోగులను దర్శించడానికి
వెళ్ళేవారు. చివరికి
మొట్టమొదటిసారి ఆమె సాకోరీకి వచ్చినపుడు ఉపాసనీ బాబా ఆమెతో “వీటినన్నిటినీ
ఒకరోజున నువ్వే బాధ్యతగా చూసుకోవాలి” అన్నారు. ఆవిధంగా గజానన్ మహరాజ్ గారు అన్న
మాటలు ఉపాసనీ బాబాగారు స్వయంగా అన్నమాటలకు సంబంధం ఉంది.
ప్రశ్న
--- పూర్తి సంబంధం ఉందని
మీరు నమ్ముతున్నారా?
జవాబు
--- అవును.
ప్రశ్న
--- అయితే షేన్ గావ్
లోని గజానన్ మహరాజ్, షిరిడీలోని సాయిబాబా, ఉపాసనీ మహరాజ్, మాతాజీల మధ్య బలమయిన బంధం ఉందా?
జవాబు
--- రెండు ముఖ్యమయిన
విషయాలను గుర్తుచేసుకుని చెబుతాను.
మొదటిది, గజానన్ మహరాజ్ అన్న మాటలు … “నేనే తిరిగి అవతరిస్తాను”. రెండవది, మొదటిరోజులలో
ఉపాసనీ బాబా ఇక్కడ 1922 - 1923 లేక 1924 లో
గాని ఇక్కడ ఉన్నపుడు ఆయన తన ప్రియభక్తులలో ఒకరయిన బోరావకేగారితో “నా గర్భంలోకి ఒక యోగి ప్రవేశిస్తున్నాడు” అనేవారు. ఈ మాటలు అంటున్నపుడు ఆయన తన చేతిని
తన పొట్టమీద వేసుకుని, “ఒక గొప్ప యోగి నా గర్భంలోకి ప్రవేశిస్తున్నాడు”
అని మరలా అనేవారు. ఆయోగే గజానన్ మహరాజ్. ఇద్దరి మాటలూ ఒకదానితో ఒకటి ఏవిధంగా సంబంధం కలిగి ఉన్నాయో గమనించారా?
ప్రశ్న
--- ఆయన సతీ గోదావరిమాతాజీని
ఉద్దేశ్యించి అన్నారా?
జవాబు
--- రూపమాలంకారంగా కనిపిస్తోంది.
(ఇద్దరు మాట్లాడిన మాటలకు భేదం ఉన్నా లేనట్లే అని చెప్పడం). అనగా గజానన్ మహరాజ్ గారు వారి కుటుంబంలో
అవతరిస్తానని అన్నారు. ఉపాసనీ బాబా “యోగి వచ్చారు” అన్నారు. ఆయన పేరు చెప్పలేదు. దాని అర్ధం గజానన్ మహరాజ్ వచ్చారని
– మీకర్ధమయిందా?
ప్రశ్న
--- అయితే గజానన్ మహరాజ్,
సతీ గోదావరి మాతాజీ మధ్య పూర్తిగా ఏకత్వం అంటే ఇద్దరూ ఒకటే అని మీ అభిప్రాయమా?
జవాబు
--- అవును. ఉపాసనీ మహరాజ్ గారి మాటలు ఆవిషయాన్ని
బలపరుస్తున్నాయి. ఆయన
ఒక సందేశాన్నిచ్చారు. “నా గర్భంలో” ఈ మాటలకు అర్ధం ఆయన మాతాజీ రూపంలో సాకోరికి
వస్తారని. ఆవిధంగా అన్నట్లుగానే
కొద్దిరోజుల తరవాత గోదావరిమాత గారు వచ్చి సాకోరీలోనే స్థిరపడ్డారు. ఉపాసనీ మహరాజ్ గారి మాటలు,
గజానన్ మహరాజ్ గారి మాటలు రెండింటికీ సంబంధం ఉందన్న విషయం మీరు గ్రహించారా? ఇద్దరూ మాట్లాడిన మాటలను కలిపి వివరించాలా? ఉపాసనీబాబా ఆమెతో మొట్టమొదటగా మాట్లాడిన
మాటలు, “నువ్వే వీటన్నిటిని చాలా భద్రంగా చూసుకోవాలి”. ఆయన ఈ మాటలను ఆమె ఒక్కరికే తప్ప మరింకెవరితోనూ
ఈ విధంగా ఎప్పుడూ అనలేదు. ఆయన అన్న మాటలు శుభసూచకంగా చెప్పిన వాస్తవ విషయం. ఇపుడు మనం గోదావరిమాత యొక్క గొప్పతనాన్ని,
ప్రపంచమంతా ఆమెకు ఉన్న అనుచరులనందరినీ చూస్తున్నాము. ఉపాసనీ మహరాజ్ గజానన్ మహరాజ్ గారు
అన్నమాటలు ఫలించాయిని అనిపిస్తున్నాయి.
నేను (ఆంటోనియో) --- ధన్యవాదాలు.
షిరిడీ లెండీబాగ్ లో సాయంత్రం గం.6.45
స్వామిశేఖరరావుతో మూడవసారి సంభాషణ…
స్వామి శేఖరరావు…
నేను ఇంతకుముందు బాబా సమక్షంలో చెప్పిన విషయాలన్నీ పూర్తి యదార్ధాలు. ఇదే నేను మీకు చెప్పదలచుకున్నది. ధన్యవాదాలు.
ప్రశ్న --- అంటే ఇంతకుముందు మీతో జరిపిన ఇంటర్వ్యూలోని విషయాల
గురించా మీరు చెబుతున్నారు?
జవాబు --- అవును.
నేను చెప్పిన ప్రతివిషయం బాబా సమక్షంలో ఉండి చెప్పినట్లుగానే చెప్పాను. ఇది ముమ్మాటికీ నిజం.
ప్రశ్న --- నాకు మీమాటలమీద పూర్తి నమ్మకం ఉంది. ఇంతవరకు మీరు అనువదించడానికి ఏమయినా ఇబ్బంది కలిగిందా?
జవాబు --- ఇక్కడ ప్రతీదీ ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. నాగురించి మీరు బాధపడకండి. అంతా బాబా ఇష్టప్రకారమే జరుగుతుంది. నేను ఆయన సమక్షంలో ఉన్నాను. నేనిక్కడ ఉండటం కూడా ఆయన సంకల్పమే. బాబాకు అంతా తెలుసు. చేసేది అంతా బాబా. అంతే. ధన్యవాదాలు.
ఆతరువాత స్వామిశేఖరరావు దీక్షిత్ వాడా గురించి కొంత సమాచారాన్నిచ్చాడు.
మనం మందిరం ఎదురుగా ఉన్న తోటలో ఉన్నాము. బాబా ఉన్నపుడు ఈతోట లేదు. ఆతరవాతనే ఈ తోటని నిర్మించారు. మందిరానికి ఎడమవైపున కొన్నిపెంకులతో కట్టబడిన తెల్లటి
భవనం కనిపిస్తోంది కదా. అదే దీక్షిత్ వాడా. బాబా దర్శనం కోసం షిరిడీకి వచ్చే యాత్రికులు బసచేయడానికి
నిర్మించబడిన మొట్టమొదటి భవనం. ఈరోజుల్లో ఈ
దీక్షిత్ వాడాని యాత్రికుల బసకోసం ఉపయోగించడంలేదు. బాబా సమాధి చెందిన తరవాత దీనిని భోజనశాలగా మార్చేశారు. ఇపుడు దీనిని టీ క్యాంటీన్ గా మార్చారు. బాబా ఉన్నరోజులలో దీక్షిత్ గారు షిరిడీ వచ్చినపుడెల్లా
వాడాలో పసుపురంగులో బాగా ఎత్తుగా కనిపిస్తున్న పై అంతస్థులో ఉండేవారు. (శేఖరరావు ఆభవనాన్ని
చూపించాడు).
ప్రశ్న --- మొట్టమొదటగా కట్టబడిన వాడా ఇదేనా?
జవాబు --- అవును.
బాబా జీవించి ఉన్నరోజులలోనే ఈ వాడా ఉంది.
అతరువాత బూటీవాడాలాంటి ఎన్నో వాడాలను కట్టారు.
నేను (ఆంటోనియో) --- ధన్యవాదాలు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment