02.04.2021
శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 66 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ
– శుక్రవారమ్ – అక్టోబర్, 25, 1985
మాధవరావు
దేశ్ పాండే (శ్యామా) గారి కుమారుడు 79 సంవత్సరాల వయసు గల శ్రీ ఉద్దవరావు మాధవరావు దేశ్ పాండే గారితో మూడవసారి జరిపిన సంభాషణ…
ఉధ్ధవరావుగారు చెబుతున్న
వివరాలు ---
మార్తాండబాబా
గారి వయసు ఇపుడు 92 సంవత్సరాలు.
107 సంవత్సరాలు
కాదు. ఆయన
పొరబాటుగా చెప్పారు.
ఒకరోజు ఆయన తండ్రి మహల్సాపతి గారు మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో ఒక కుక్క ఆయన ఇంటిముందుకు వచ్చి నిలుచుంది. అది ఆకలితో అరుస్తూ ఉంది. కాని మహల్సాపతి ఆ కుక్కకి తినడానికి ఏమీ పెట్టలేదు.
పైగా ఒక కఱ్ఱ తీసుకుని దాని తలమీద, మూతి మీద గట్టిగా కొట్టి గాయపరిచారు. అదేరోజు సాయంత్రం భక్తులు సాయిబాబాను దర్శించుకోవడానికి మసీదుకు వెళ్ళినపుడు బాబాకు గాయాలు అయి ఉండటం కనిపించింది. వారంతా బాబాను ఏమి జరిగిందని అడిగారు. ఆసమయంలో మహల్సాపతిగారు కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు బాబా మహల్సాపతితో “నేను ఈ రోజు నీయింటికి వచ్చాను. ఏదయినా తినడానికి పెడతావనుకున్నాను. కాని నువ్వు నన్ను ఈ విధంగా కొట్టి గాయపరిచావు” అన్నారు. కాని బాబా మాటలకి మహల్సాపతి అంగీకరించకుండా, “కాని మీరెప్పుడు వచ్చారు బాబా. నేను మిమ్మల్ని చూడలేదే?” అన్నారు. అపుడు బాబా “నీ ఇంటి గుమ్మంముందుకు ఆ కుక్క రాలేదా?” అన్నారు. అప్పుడు అర్ధమయింది మహల్సాపతికి.
ప్రశ్న --- ఆకుక్క తలమీద గాయం అయినట్లుగానే బాబా తలమీద కూడా నిజంగా గాయం అయిందా?
జవాబు --- అవును.
ఆయన
నుదిటిమీద గాయమయింది.
బాబా
సర్వాంతర్యామి
అని అక్కడున్న వారందరికీ అర్ధమయింది.
ప్రశ్న --- అంటె సర్వజీవరాశులలోను ఉన్నది బాబాయే అని అక్కడున్నవారందరికీ అర్ధమయిందా?
తుకారామ్ --- అవును.
ఈ
సంఘటన తరువాత మహల్సాపతిగారికి బాబా మీదా ఇంకా ఇంకా నమ్మకం పెరిగి మరింత భక్తితో ప్రార్ధించడం మొదలుపెట్టారు.
ప్రశ్న --- మహల్సాపతిగారి నమ్మకానికి ఇది అతి ప్రధానమయిన సంఘటనా?
తుకారామ్ --- అవును.
అంతే. ఉధ్ధవరావు
గారు కూడా అదే అంటున్నారు.
ఉధ్ధవరావు
గారు చెబుతున్న విషయాలు…
నేను
వివాహం చేసుకోదలచినప్పుడు పెళ్ళికూతురుని చూడటానికి శ్రీరామ్ పూర్ వెళ్ళాను.
తుకారామ్
(నావైపు తిరిగి మాట్లాడుతూ) – మీకు అర్ధమయిందా?
ఇక్కడ
జరిగేదేమిటంటే
వివాహం చేసుకోదలచిన పెళ్ళికొడుకు అమ్మాయి ఇంటికి వెడతాడు.
ఇద్దరికీ
సమ్మతమయితే వివాహం జరుగుతుంది.
ఉద్ధవరావుగారు ఇంకా
కొనసాగిస్తూ---
కాని
జరిగిందేమిటంటె
ఆసమయంలో బాబా నాకు కలలో కనిపించి శ్రీరామ్ పూర్ అమ్మాయిని వివాహం చేసుకోవద్దని చెప్పారు.
ఆ
అమ్మాయిని కాకుండా నాసిక్ లో ఉండే అమ్మాయిని వివాహం చేసుకోమన్నారు.
బాబా
చెప్పిన ప్రకారం నేను మనసు మార్చుకుని నాసిక్ లోని అమ్మాయిని వివాహమాడాను.
నా
భార్య ఆ అమ్మాయే.
ప్రశ్న --- మీరు ఎంచుకున్న అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని వివాహం చేసుకోమని బాబా ఆవిధంగా మీకు కలలో ఆదేశించారన్నమాట అవునా?
తుకారామ్ --- అవును.
ఉధ్ధవరావుగారు చెబుతున్నది
అదే.
ఉధ్ధవరావుగారు ఇంకా
చెబుతున్న వివరాలు
---
1940 వ.సంవత్సరంలో మా నాన్నగారు శ్యామా ఇదే ఇంటిలో కాలం చేసారు.
ఇపుడీ
ఇల్లు చాలా పాతబడిపోయింది.
అయినా
మేము ఇందులోనే ఉంటున్నాము.
మా
నాన్నగారు చనిపోయేముందు తనకు ఒక వక్కపలుకు తెమ్మని చెప్పారు.
ఆయన
ఆవక్క పలుకును తిన్న తరువాత ఒక విధమయిన పక్షవాతంతో బాధపడ్డారు.
ఆయన
ఉదయం 11 గంటలకు మరణించారు.
ఆయన
ఇక కొద్ది క్షణాలలో చనిపోతారనగా నాతో, “ఆలయంనుండి గాని, సంస్థానంనుండి గాని ఒక్క పైసా కూడా తీసుకోవద్దు.
ఉచితంగా
సేవ చెయ్యి.
ఎటువంటి
ప్రతిఫలాన్ని
ఆశించకుండా ప్రతిపనీ చెయ్యి.
జీతం
గురించి ఆలోచించకుండా గౌరవపూర్వకంగా సేవ చెయ్యి” అని చెప్పారు.
ప్రశ్న --- శ్యామా తన కుమారునితో చెప్పిన ఆఖరి మాటలు ఇవేనా?
తుకారామ్ - అవును.
అవే
ఆఖరి మాటలు.
ఉధ్ధవారావు
గారు ఇంకా కొనసాగిస్తూ…
మానాన్నగారిని సమాధి
చేయలేదు. హిందూ
సాంప్రదాయం ప్రకారం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.
ప్రశ్న --- శ్యామాగారిని ఎందుకు సమాధి చేయలేదు?
తుకారామ్ --- ఆయనకు పిండప్రదానం చేసారు.
సమాధి
చేయడం గాని లేక సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు గాని చేస్తారు.
ప్రశ్న --- దహన సంస్కారం అవగానే అంత్యక్రియలు ముగిసినట్లా?
తుకారామ్ --- అవును.
ఉధ్ధవరావుగారు ఇంకా
చెబుతూ ---
చందనపు
చెక్కలతో దహన కార్యక్రమం నిర్వహిస్తారు.
శ్యామాగారి
శవయాత్రలో పదివేలమంది పాల్గొన్నారు.
తుకారామ్ --- శ్యామాదేశ్ పాండే బ్రాహ్మణ కులస్థులు.
ఆవంశంలో
బ్రహ్మచారిగా
మరణించినవారినే
సమాధి చేస్తారు.
శ్యామాగారికి
వివాహమయి పిల్లలు ఉన్నారు.
అందువల్లనే
ఆయన శరీరాన్ని దహనం చేసారు.
ఉధ్ధవరావుగారి వివరణలు
---
బాబా
ఈ ఇంటికి ఎన్నోసార్లు వచ్చారు.
మా
నాన్నగారికి
జబ్బు చేసినపుడు బాబా మాఇంటికి రోజుకు రెండు మూడు సార్లు వచ్చేవారు.
ఇపుడు
ఈ ఇంటిలో మేము ఉన్నట్లుగానే బాబా కూడా ఈ ఇంటిలో భౌతికంగా ఉన్నారు.
నేను
బాబాను కలుసుకోవడానికి వెళ్ళినపుడు, ఆయన నా ఎదురుగా నిలబడి ఉన్నపుడు నేను భగవంతుని సమక్షంలో ఉన్నట్లుగానే స్పష్టమయిన అవగాహన కలుగుతుంది నాకు.
“భగవంతుడే
నా ఎదుట ఉన్నాడు” అని అనిపిస్తుంది నాకు.
ఇదే
నాభావం.
ప్రశ్న --- ఇది ఒక ఆలోచనా లేక ఒక నిర్ధిష్టమయిన అనుభవమా?
జవాబు
--- నేను అనుభవిస్తున్న ఖచ్చితమయిన అనుభూతి ఇది.
ఇందులో
ఎటువంటి అనుమానం లేదు.
ఆ
అనుభూతి ఈ విధంగా ఉంటుంది.
నామనసులో
నాకు నేనే చెప్పుకుంటారు.
“ఈ
క్షణంలో భగవంతుడే నా ఎదుట నిలబడి ఉన్నాడు”. బాబాను నేను ఎప్పుడు చూసినా ఆయన ఎదుటకు వెళ్ళినా నాలో కలిగే ప్రతిస్పందన ఇదే.
అది
యదార్ధమయిన అనుభూతి.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment