01.04.2021
గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 65 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ
– శుక్రవారమ్ – అక్టోబర్, 25, 1985
మార్తాండ
బాబా గారు చెబుతున్న మరికొన్ని వివరాలు ---
నాకు 35 సం.వయసున్నపుడు సతానానుండి ఉపాసనీ మహరాజ్ గారు షిరిడీకి వచ్చారు. ఆయన మహారాష్ట్రలోని చాలా ప్రదేశాలలో సంచారం చేసారు. అపుడు అందరూ ఆయనను షిరిడీ వెళ్ళి సాయిబాబాను కలుసుకోమని చెప్పారు. “అపుడు మీకు అంతా బాగుంటుంది” అని అన్నారు. వారి సలహాప్రకారం ఉపాసనీ మహరాజ్ షిరిడీ వచ్చి బాబాను కలుసుకొన్నారు. బాబా ఆయనకు మహల్సాపతితో కలిసి రెండు లేక మూడు సంవత్సరాలు ఉండమని చెప్పారు.
బాబా
ఆయనతో “నీకు కావలసిన అవసరాలన్నీ ఆయన చూస్తారు.
నిన్ను
కనిపెట్టుకుని
ఉంటారు. ఇపుడు
మాత్రం నీతో నాకు సంబంధం లేదు. నేనేమీ చేయలేను” అన్నారు.
రెండు,
మూడు సంవత్సరాలు గడిచిపోయిన తరువాత ఉపాసనీ మహరాజ్ తిరిగి బాబా దగ్గరకు వెళ్ళారు.
ఈ
రెండు మూడు సంవత్సరాలు ఆయన మహల్సాపతితోనే ఉన్నారు.
ఆయన
బాబాతో షిరిడీలో తన పట్ల ఏదో తప్పు జరుగుతూ ఉందనీ, అందుచేత తనకు షిరిడీ వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళిపోవాలని ఉందని” అన్నారు.
షిరిడిలో ఉండే ప్రజలందరూ తనను అనేక కష్టాలు పెడతారని అన్నారు.
ఉపాసనీ
బాబా వల్ల ఏదో జరుగుతూ ఉంది.
స్త్రీలను
కొడుతూ ఉండేవారు.
ఆయన
తన భార్యలను కూడా కొట్టేవారు.
ఆయనకు
ముగ్గురు భార్యలున్నారు.
పరిస్థితులు
ఏమీ బాగాలేవు.
ఖండోబా
ఆలయం వద్ద ఆయన తన భార్యలను కొట్టేవారు.
ప్రశ్న --- ఆయన మంచి వ్యక్తి కాదని మీ అభిప్రాయమా?
తుకారామ్ --- మార్తాండబాబా చెబుతున్నది అదే.
ఉపాసనీ
గారికి తరచూ కోపం వచ్చినప్పుడెల్లా తన భార్యలని కొడుతూ ఉండేవారు.
ప్రశ్న --- అందువల్లనే షిరిడీ ప్రజలకి ఉపాసనీ బాబా అంటే ఇష్టముండేది కాదు.
మార్తాండగారి
మాటలకు అర్ధం అదేనా?
తుకారామ్ --- అవును.
ఇదే
ప్రధాన కారణం.
షిరిడి
ప్రజలకి ఉపాసనీ మహరాజ్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు.
ప్రశ్న --- అయినప్పటికీ సాయిబాబాకు ఆయనంటే ఇష్టమేనా?
తుకారామ్ --- సాయిబాబాకు ఆయనంటే ఇష్టమే.
కాని
ఆతరువాత ఇక షిరిడీలో ఉండవద్దని ఆయనకు చెప్పేశారు.
షిరిడీకి
మూడు మైళ్ళ దూరంలో ఉన్న సాకూరీకి వెళ్ళిపొమ్మని చెప్పారు.
ప్రశ్న --- ఇక మీ ఉద్దేశ్యం ప్రకారం ఉపాసనీ బాబా గురించి మీరేమనుకుంటున్నారు?
తుకారామ్ - సాయిబాబా ఆయన గురించి మంచిగానే ఆలోచించి ఆశీర్వదించారు.
ఆయనను
సాకూరీకి వెళ్లమనీ, ఎటువంటి చింతా పెట్టుకోవద్దనీ అంతా శుభమే కలుగుతుందని చెప్పారు.
సాయిబాబా
ఆయనతో “భవిష్యత్తులో నీకు జ్ఞానసిధ్ధి కలుగుతుంది.
నువ్వు
గొప్ప గురువు అవుతావు” అని అన్నారు.
ప్రశ్న --- షిరిడీ గ్రామస్థులకు ఉపాసనీ గారంటే ఇష్ట లేదని మీరెందుకనుకుంటున్నారు?
తుకారామ్ --- దానికి ఆయన ఇంతకుముందే సమాధానమిచ్చారు.
ఆయన
తన భార్యలని కొడుతూ ఉండేవారు.
తరచుగా
ప్రజలమీద కూడా కోపగిస్తూ ఉండేవారు.
ఈ
కారణాలవల్లనే
ప్రజలందరికీ
ఆయన మీద చెడు అభిప్రాయం కలిగింది.
అందువల్లనే
వారు ఆయనను షిరిడీ నుండి వెళ్ళిపొమ్మని చెప్పారు.
ప్రశ్న --- మహల్సాపతిగారు కూడా ఆయనను షిరిడీనుంచి వెళ్ళిపొమ్మని చెప్పారా?
జవాబు --- లేదు.
మా
నాన్నగారికి
ఉపాసనీ మహరాజ్ అంటే ఇష్టమే.
అందువల్లనే
బాబా ఆయనని మా నాన్నగారితో కలిసి ఉండమని చెప్పారు.
ఆయనకు
ఇష్టమే.
ప్రశ్న --- గ్రామస్తులకు ఆయనంటే ఇష్టం లేదు అవునా?
తుకారామ్ --- అవును గ్రామస్థులకు మాత్రమే ఆయనంటే ఇష్టం లేదు.
నేను (ఆంటోనియో)
--- మహల్సాపతిగారికి మాత్రం ఆయనంటే ఇష్టమే.
తుకారామ్ --- అవును. ఆయనకు ఇష్టమే.
ప్రశ్న --- అయితే మూడు సంవత్సరాల తరువాత ఉపాసనీ బాబా గారిని బలవంతంగా షిరిడినుంచి పంపించేసాక ఆయన
సాకూరీలోనే
నివాసం ఏర్పరచుకున్నారా?
తుకారామ్ --- అవును.
ఆయన
బాబాగారి సలహాను పాటించారు.
నువ్వు
ఒక గొప్ప సాదువు అవుతావు అని బాబా నమ్మకంగా చెప్పారు.
అపుడు
ఆయన షిరిడిని వదిలి సాకూరీకి వెళ్ళిపోయారు.
ప్రశ్న --- మెహర్ బాబా గురించి మీకేమన్నా తెలుసా?
జవాబు --- లేదు.
ఆయన
గురించి నాకంతగా తెలియదు.
ఆయన
పార్శీ అనుకుంటాను.
మెహర్
బాబా అహ్మద్ నగర్ లో ఉండేవారు.
తరచూ
ఆయన సాయిబాబాను కలుసుకోవడానికి షిరిడీ వస్తూ ఉండేవారు.
ప్రశ్న --- ఆయన ఎలాంటివారు?
జవాబు --- ఆయన పార్శీ.
ఆయనకు
మరాఠీ గాని, హిందీ గాని రాదు.
ఆయన
ఆంగ్లభాష మాత్రమే మాట్లాడేవారు.
ఇపుడు
ఈ దుబాసీ మీకు అనువాదం చేసి చెబుతున్నట్లుగానే కొంతమంది ఆయనకు ఆంగ్లంలోకి అనువదించి చెప్పేవారు.
ప్రశ్న --- ఆయన ఒక గొప్ప గురువు అని మీరు భావిస్తున్నారా?
జవాబు --- ఆయన మంచివారు.
మంచి
వ్యక్తి.
ప్రశ్న --- మీరు ఆయనను ఒక గురువుగా భావిస్తున్నారా లేక జ్ఞానసిధ్ధిని పొందిన వ్యక్తిగా భావిస్తున్నారా?
ఆయన
సాయిబాబా మరియు
ఉపాసనీ మహరాజ్ గార్ల మార్గదర్శకత్వంలో ఉండేవారా?
జవాబు --- క్రిందటిసారి మెహర్ బాబా షిరిడీ వచ్చినపుడు సాయిబాబా ఆయనను దీవించారు.
బాబా
దీవెనలు లభించాక మెహర్ బాబా సాధువుగా మారారు.
మార్తాండబాబా
ఇంకా చెబుతున్న విషయాలు ---
గజానన్
మహరాజ్ గారు కూడా షేగావ్ నుండి షిరిడికి వచ్చారు.
అయినా
ఆయన తరచుగా వచ్చేవారు కాదు.
ఆయన
బాబాను కలుసుకోవడానికి వచ్చి ఆయనతో కొద్దిసేపు మాట్లాడి తన గ్రామం షేగావ్ కి వెళ్ళిపోయేవారు.
ప్రశ్న --- అయితే గజానన్ మహరాజ్ గారికి, షిరిడీ బాబాగారికి మధ్య అనుబంధం ఉందన్నమాట?
తుకారామ్ --- అవును.
మార్తాండబాబా
గారు అదే చెబుతున్నారు.
ప్రశ్న --- గజానన్ గారు షిరిడికి ఒకసారికన్నా ఎక్కువసార్లే వచ్చారా?
జవాబు --- రెండు లేక మూడు సార్లు … బహుశ ఇంకా ఎక్కువే అయిఉండచ్చు.
షిరిడీ
– మార్తాండ మహల్సాపతి గారి ఇంటిలో ఉ. గం.11.45
శ్రీమతి
దేవకీ దేవన్ తో క్లుప్తంగా జరిపిన సంభాషణ --- ఆమె 1953 వ.సం. నుండి ప్రతి సంవత్సరం షిరిడీకి వస్తూ ఉంటారు.
శ్రీమతి
దేవకీ దేవన్ గారు గుర్తు చేసుకుని చెప్పిన విషయాలు.
1953వ.సం. లో నేను బొంబాయిలో ఉన్నాను.
నాకు
వంట్లో బాగా లేదు.
జ్వరం
వచ్చింది. నాకు
ఏదో చెడు జబ్బు సోకింది.
ఇక
షిరిడీ వద్దామని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చి ఒక వారం రోజులు ఉన్నాను.
బాబా
దయవల్ల నాకు నయమయింది.
ఆయనకు
ధన్యవాదాలు. ఇదే
నావిషయంలో జరిగిన సంఘటన.
ప్రశ్న --- మీరు ఊదీని తీసుకున్నారా?
తీసుకున్న
వెంటనే మీకు నయమయిందా?
జవాబు --- నేను బాబాను దర్శించుకున్న తరువాత ఊదీని కూడా సేవించాను.
దేవకీదేవన్
గారు మార్తాండబాబా గారి ఇంటిలో ఈ దృష్టాంతాన్ని వివరించారు.
అందరు
భక్తులు వస్తున్నట్లుగానే ఆమె కూడా మార్తాండబాబాగారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వస్తూ ఉంటారు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment