31.03.2021
బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 64 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ
– శుక్రవారమ్ – అక్టోబర్, 25, 1985
షిరిడీ - మార్తాండ
మహల్సాపతి
గారి ఇంటిలో ఉదయం గం. 10.30
సాయిబాబావారి
ప్రధమ భక్తుడు, ఖండోబా ఆలయానికి వంశపారంపర్య పూజారి అయిన మహల్సాపతి చిమనాజీ నగారే గారి కుమారుడు శ్రీ మార్తాండమహల్సాపతి (మార్తాండబాబా) తో రెండవసారి జరిపిన ముఖాముఖీ సంభాషణ --
మార్తాండగారు
చెబుతున్న విషయాలు ---
రాముడు,
కృష్ణుడు, జీసస్ క్రీస్తు లాగానే సాయిబాబా వారు కూడా అవతార పురుషులు.
ఆయన
ఒక అవతారంగానే జీవించారు,
ఆవిధంగానే ప్రవర్తించారు.
బాబా
ఖండోబా ఆలయానికి
వచ్చినపుడు, మానాన్నగారు మహల్సాపతి గారు పూజారి.
ఆయనే
బాబా గారిని “ఆవోసాయి” అని ఆహ్వానం పలికారు.
“ఆవో
సాయి” అంటే అర్ధం “రండి సాయి”
. మా నాన్నగారు అది బాబాకు పెట్టిన పేరు.
ప్రశ్న ---
‘సాయి’
అన్న మాటలు సరిఅయిన
అర్ధం ఏమిటి?
జవాబు --- మహాత్ములయిన సాధువులను ‘సాయి’ అని సంబోధిస్తారు.
అలాగే
భారతదేశంలో గొప్ప వ్యక్తులను ‘మహారాజ్’ అని పిలుస్తారు.
‘సాయి’
అన్న పదానికి చాలా అర్ధాలు ఉన్నాయి.
ప్రశ్న --- బాబా జీవితం
గురించి గాని, లేక మీ నాన్నగారి జీవితం గురించి గాని సంబంధించి ఏదయిన ఒక సంఘటన వివరిస్తారా?
జవాబు --- నేను పుట్టడానికి ముందు మా నాన్నగారికి సంతానం లేదు.
బాబా
ఆశీర్వాదాల తరువాతనే మా నాన్నగారయిన మహల్సాపతిగారికి కుమారుడు జన్మించాడు.
అంటే
నేను జన్మించాను.
నాకు
30, 35 సంవత్సరాల
వయసు ఉన్నపుడు బాబా అప్పటికింకా జీవించే
ఉన్నారు. బాబా
సమాధి చెందిన సమయంలో నా వయసు 35 సంవత్సరాలు.
నేను
బాబాకు ఎన్నో విధాలుగా సేవ చేసాను.
తమలపాకులు
సేకరించే పనిలో ఆయనకు సహాయం చేసేవాడిని. ఆయన
శరీరాన్ని మర్ధించేవాడిని.
ముఖ్యంగా
కాళ్ళు నొక్కడంవంటి పనులు చేసేవాడిని.
బాబాయే
స్వయంగా నా వివాహాన్ని కుదిర్చారు. ఇప్పటికీ
మేము బాబాకు మధ్యాహ్న ఆరతికి ముందు నైవేద్యాన్ని పంపిస్తూ ఉంటాము.
ఆనాటినుండి మా ఇంటినుండే ఆయనకు ప్రతిరోజూ నైవేద్యం పంపుతూ ఉన్నాము.
మధ్యాహ్న
ఆరతి పూర్తయి బాబాకు నైవేద్యం సమర్పించిన తరువాతనే మేము భోజనం చేస్తాము.
ప్రశ్న --- ఒకసారి బాబా మీనాన్నగారిని పిలిచి “నీ భార్య మెడలో గడ్డ ఉంది” అని చెప్పారనే
విషయాన్ని నేను పుస్తకాలలో చదివాను.
మీనాన్నగారికి ఆ
సంగతి ఏమీ తెలియదు.
సాయిబాబా
ఆమె మెడలో ఉన్న గడ్దని నయం చేసారు.
మీ
కుటుంబానికి
బాబావారు ప్రత్యేకంగా అనుగ్రహించారని ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది.
దీని
గురించి మీకేమయినా గుర్తుందా?
జవాబు ---
1914 వ.సం. లో ఒకసారి మా అమ్మగారికి అంటువ్యాధి వల్ల తొడలో గడ్డలు వచ్చాయి.
అందుచేత
విశ్రాంతికోసం
మా అమ్మగారు తన సోదరుడు నామదేవ్ సింఘాటె ఇంటికి వెళ్ళారు.
ఆ
సమయంలోనే బాబా మా అమ్మగారికి ఈ వ్యాధి వచ్చిందనే విషయాన్ని మహల్సాపతిగారికి ఈ విధంగా చెప్పారు. “మహల్సాపతీ, నా శరీరం మీద గడ్డలు లేచాయి.
అవి
నన్ను చాలా బాధపెడుతున్నాయి”.
బాబా
శరీరంమీద
అనేకరకమయిన గడ్డలు కనిపించాయి.
ప్రశ్న --- మీ అమ్మగారిని బాధిస్తున్న గడ్డలను బాబా తన శరీరం మీదకు తెచ్చుకున్నారని మీ ఉద్దేశ్యమా?
తుకారామ్ --- అవును.
ప్రశ్న --- మహల్సాపతిగారు బాబా శరీరం మీద ఆ గడ్డలని స్వయంగా చూసారా?
తుకారామ్ --- అవును.
మహల్సాపతిగారు వాటిని
చూసారు.
మార్తాండ
బాబా ---
ఆతరువాత
మరుసటిరోజు బాబా శరీరం మీద ఉన్న గడ్డలు పగిలి వ్యాధి నయమయింది.
ఈ
విధంగా మా అమ్మగారికి నయమయింది.
ప్రశ్న --- ఇది అప్పట్లో సాయిబాబా చేసిన అధ్భుతం కదా?
తుకారామ్ --- అవును చాలా గొప్ప అధ్భుతం
నేను (ఆంటోనియో)
--- ద్వారకామాయిలో బాబాతోపాటు మీనాన్నగారు నిద్రిస్తూ ఉండేవారు.
బాబా
ఆయనను ఒక్కరినే అనుమతించేవారు.
తుకారామ్ (మధ్యలో కల్పించుకుని) --- ఆయన
ఒక్కరినే కాదు.
మసీదులో
తాత్యాకోతే పాటిల్ కూడా బాబా దగ్గర నిద్రించేవారు.
ఇద్దరూ
కలిసి నిద్రించేవారు.
ప్రశ్న --- బాబా చెక్కబల్లమీద నిద్రించేవారు.
ఆబల్ల
గురించి చెబుతారా?
జవాబు --- బాబా సమాధి చెందిన తరువాత మా నాన్నగారు మహల్సాపతిగారు ప్రతిరోజు మసీదుకు వెళ్ళేవారు. రాత్రివేళల్లో కూడా
వెళ్ళేవారు. బాబా సమాధి మీద వస్త్రాన్ని కప్పేవారు.
దీనినే
‘శరీరాన్ని మర్దనా చేయడం” అంటారు.
తుకారామ్ (వివరణ)
--- ఆయన శరీరం సమాధిలో ఉంది.
ఆయన
నాన్నగారు సమాధిమీద వస్త్రాన్ని పరచి, బాబా ఇంకా సశరీరంగానే ఉన్నారనే భావంతో ఆయన శరీరాన్ని మర్ధనా చేసేవారు. ఈ
విధంగా నాలుగు సంవత్సరాల పాటు 1922 వ.సం. వరకు జరిగింది.
ఆ
సంవత్సరంలోనె
మహల్సాపతి మరణించారు.
మార్తాండ
బాబా ---
బాబా
చెక్కబల్లమీద
నిద్రించడం ప్రతివారూ
చూసేవారు. బాబా
ఆబల్లమీదకి ఏవిధంగా ఎక్కేవారో ఏవిధంగా దిగేవారో ఎవరూ కనిపిట్టలేకపోయారు.
ఆఖరికి మా నాన్నగారు కూడా తెలుసుకోలేకపోయారు.
బహుశ
ఆయన దూరంనుంచి
మాత్రమే చూసారు.
బాబా
ఆబల్లమీద పడుకున్నారని మాత్రమే మాకు తెలుసు.
కాని
ఎవరు కూడా ఆయన ఎక్కడం, దిగడం చూడలేదు.
ప్రశ్న --- బాబా సమాధి చెందేనాటికి
మీ వయస్సు 35 సంవత్సరాలని చెప్పారు కదా, బాబా గురించి ఏదయినా చిన్న వృత్తాంతం గాని, కధ గాని గుర్తుకు తెచ్చుకుని చెబుతారా? ఏదయినా సరే చిన్న సంఘటన.
జవాబు --- బాబా చాలా విషయాలు చెబుతూ ఉండేవారు.
నాకు
మాత్రమే కాదు ప్రతివారికీ.
బాబా
అందరికీ, భక్తులకి, గ్రామస్థులకీ ప్రతిరోజు కధ చెప్పేవారు.
ప్రశ్న --- మీకేమయినా గుర్తున్నాయా?
జవాబు --- నరసింహస్వామిగారు వ్రాసిన పుస్తకంలో బాబా గురించిన కధలు, మానాన్నగారి గురించి అన్నీ విపులంగా ఉన్నాయి.
ప్రశ్న --- కాని మీకు గుర్తున్నవి ఏమయినా ఉన్నాయా?
జవాబు --- ఇపుడు నావయస్సు 107 సంవత్సరాలకన్నా పైమాటె.
ఇప్పటికే
చాలా అలసిపోయాను.
ఇక
మాట్లాడే శక్తి లేదు నాకు.
ఇంకా
మిగతా విషయాలున్నాయి. కాని ఇప్పటికే అలసిపోయాను.
నేను (ఆంటోనియో)--- మంచిది.
ఇంతటితో
మన సంభాషణను ముగిద్దాము.
ధన్యవాదాలు. మీసమయాన్ని
వెచ్చించినందుకు
ధన్యవాదాలు.
అయినప్పటికీ
మార్తాండ బాబా ఇంకా మాట్లాడుతూ…
ఆంధ్రప్రదేశ్ లో ఇంకొకాయన ఉన్నారు.
ఆయన
పేరు ఆచార్య భరద్వాజ.
ఆయన
కూడా సాయిబాబా మీద
పుస్తకం వ్రాసారు.
నేను (ఆంటోనియో)
--- ధన్యవాదాలు.
అవును. నాకు
తెలుసు. నావద్ద
కూడా భరద్వాజగారి పుస్తకం ఉంది. నాదగ్గర నరసింహస్వామిగారి పుస్తకాలు లేవు.
ఏదోవిధంగా
వాటిని సంపాదిస్తాను.
మార్తాండబాబా
--- వామన్ ప్రాణ్ గోవింద్ పటేల్ గారు బాబా మీద
రచించిన పుస్తకం ఒకటి ఉంది. అది గుజరాతీ భాషలోనే ఉంది.
నేను (ఆంటోనియో)
--- పుస్తకాల గురించి ఇంత వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఇంతటితో
మన సంభాషణను ముగిద్దాము.
(మార్తాండబాబా గారు చెప్పిన విషయాలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment