Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, March 30, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 63 వ.భాగమ్

Posted by tyagaraju on 7:06 AM

 




30.03.2021  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 63 .భాగమ్

(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేటహైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీశుక్రవారమ్అక్టోబర్, 25, 1985

షిరిడీలోశ్రీ ఉత్తమరావు పాటిల్ గారి ఇంటిలో ఉదయం గం. 9.15 కి

తాత్యాకోతే పాటిల్ గారి కుమారుడు శ్రీ ఉత్తమరావు పాటిల్ గారితో (60 సం. వయస్సు) జరిపిన సంభా వివరాలుతాత్యాకోతే పాటిల్ గారు సాయిబాబాకు ప్రియమయిన భక్తుడు.

ప్రశ్న   ---   మీనాన్నగారి గురించిన వివరాలు చెబుతారా?  ఆయన ఏమి చేస్తూ ఉండేవారు?

జవాబు   ---   మా నాన్నగారు జీవించినంత కాలం ప్రతిరోజు మసీదుకు వెళ్ళి బాబాతోనే ఉండేవారు.  రోజంతా బాబాతోనే ఉండేవారు.  ఆయన రాత్రి పడుకునేందుకు మాత్రమే ఇంటికి వచ్చేవారు.


శ్రీ ఉత్తమరావు గారి జ్ఞాపకాలు ---

మా నాన్నగారు, తాత్యాకోతే పాటిల్ గారికి సంతానం లేదు.  సంతానం కోసం బాబా శీర్వాదాలను అందుకుందామనే ఉద్దేశ్యంతో బాబా వద్దకు వెళ్ళారు.  ఆయనకు మూడు వివాహాలు అయ్యాయి.  ముగ్గురు భార్యలు.  బాబా శీర్వాదాలు లభించిన తరువాత మూడవ భార్యకు ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు.  మా నాన్నగారు 1945 .సంవత్సరంలో కాలంచేసారు.  ఆర్ధికవ్యవహారాల నిర్వహణంతా సంస్థానానికి అప్పగించబడటానికి ముందు, మందిరం యొక్క వ్యవహారాలన్నీ మానాన్నగారే చూసేవారు.  బాబా ప్రతిరోజు మా నాన్నగారికి రూ.35/- ఇస్తూ ఉండేవారు.  షిరిడీలో గాని, మసీదు లేక మందిరంలో గాని ఎటువంటి కార్యక్రమాలు జరిగినా వాటికి తాత్యాకోతే పాటిల్ గారే ఆడబ్బును వినియోగించేవారు.



నేను  (ఆంటోనియో)   ---   షిరిడీలో ప్రత్యేకంగా మయినా నిర్వహించినపుడు దానికి ప్రముఖ వ్యక్తి నిజానికి మీ నాన్నగారే అని అర్ధమవుతోంది.  ఆయన సాయిబాబాకు అత్యంత సన్నిహితులు.

జవాబు   ---   అవును.  బాబా ఆయనకు ప్రతిరోజు రూ.35/- ఇచ్చినా కూడా ఒక్కోసారి కొన్ని కార్యక్రమాల ప్రయోజనం కోసం తన స్వంత డబ్బును కూడా ఖర్చు పెట్టేవారు.

ప్రశ్న   ---   ఇక్కడ షిరిడిలో చాలా మట్టుకు నిర్మింపబడిన ఆలయాలన్నిటికీ మీ నాన్నగారే బాధ్యత వహించారన్న విషయం నిజమేనా?  నేను విన్నది నిజమేనా?

జవాబు   ---   మానాన్నగారు తాత్యాకోతే పాటిల్ గారు లక్ష్మీమందిరాన్ని, ఆతరువాత మారుతీ మందిరాన్ని, తరువాత మరొకదానిని నిర్మించారు.  ఆయన మూడు ఆలయాలను నిర్మించారు.  మారుతీ మందిరాన్ని ప్రత్యేకించి హనుమంతుని కోసమే నిర్మించారు.

ప్రశ్న   ---   అయితే షిరిడిలో ఆయన చాలా ముఖ్యమయిన వ్యక్తి అన్నమాట?

జవాబు   ---   అవును.  ఆయన ఇక్కడ ప్రముఖ భూస్వామి.

ప్రశ్న   ---   బాబా అనుగ్రహం వల్లనే మీరు జన్మించినందుకు బాబాకు ధన్యవాదాలు.  బాబా గురించి మీనాన్నగారు చెప్పిన విషయాలు ఏమయినా చెబుతారా?  ఆయన జీవనశైలి, ఆయన బోధనలు వగైరా?

జవాబు   ---   బాబా జీవించి ఉన్న రోజులలో మా నాన్నగారు ఎప్పుడూ బాబా దగ్గరే ఉండేవారు.  బాబా ప్రొద్దున వేలో భిక్షకు వెళ్ళేటప్పుడు మానాన్నగారు కూడా ఆయనతోపాటు వెళ్ళేవారు.  మధ్యాహ్న ఆరతి అయిన తరవాత భక్తులందరికీ ప్రసాదాలు పంచి ఇంటికి వచ్చేవారు.  ఆయన మా ఇంటిలోనివారందరికీ ప్రసాదం పెట్టేవారు.  బాబా ఎక్కడినుంచి వచ్చారో, అయన తల్లిదండ్రులు ఎక్కడివారో, ఎవరో, ఆయన కులమేమిటో ఇలాంటి విషయాలేమీ ఎవరికీ తెలియవు.

ప్రశ్న   ---   అంటే సాయిబాబా గురించి ఎటువంటి విషయాలు ఎవరికీ తెలియవని మీ భావమా?

తుకారామ్   ---   అవును.  ఆయన అదే చెబుతున్నారు.

ప్రశ్న   ---   మీ నాన్నగారు సాయిబాబాకు అత్యంత న్నిహితంగా ఉండేవారని చెప్పారు కదా, మరి బాబా మీనాన్నగారికి ప్రత్యేకించి ఏమన్నా చెప్పారా?

జవాబు   ---   బాబా మా నాన్నగారిని, భవిష్యత్తు గురించి ఎటువంటి చింతా పెట్టుకోవద్దని, జీవితమంగా సంతోషంగా గడుస్తుందని ఆశీర్వదించారు అంతే.

ప్రశ్న   ---   అయితే బాబా గారు మీనాన్నగారికి ప్రత్యేకంగా ఎటువంటి ఉపదేశం చేయలేదా?

జవాబు   ---   లేదు.

ప్రశన్   ---   బాబాగారి వైఖరి, ఆయన ప్రవర్తన ఏవిధంగా ఉండేదో దీని గురించి మీ నాన్నగారు మీతో ఎపుడయినా మాట్లాడారా?

జవాబు   ---   ఒక్కొక్కసారి మా నాన్నగారు చెబుతూ ఉండేవారు --- “బాబా మనలని ఎంతగానో అనుగ్రహించారు” – ఇంకానేనెప్పుడూ బాబాతోనే ఉన్నాను” --- “బాబా వెళ్ళిపోయిన తరువాతనే నేను ఒంటరివాడినయ్యాను”.  బాబా సమాధి చెందిన తరువాత ఆయన ఒంటరి అయ్యారు అంతే.

ఉత్తమరావు గారు చెబుతున్న విషయాలు ---

మా నాన్నగారికి మేము ముగ్గురు కుమారులం.  అందరూ జీవించే ఉన్నారు.  వారి పేర్లు శివాజీరావు, బాఘీరావు, నేను ఉత్తమరావు.  నేను రెండవవాడిని.  మొదటివాడు బాఘీరావు.  ఆఖరివాడు శివాజీరావు.

ప్రశ్న   ---   బాబా మీనాన్నగారికి సంతానం కలగడానికి దీవించారని చెప్పారు కదా, ఆయన ఏవిధంగా దీవించారు?  బాబా తన చేతులను మీ నాన్నగారి తలపై ఉంచి ఆశీర్వదించారా లేక కొబ్బరికాయను కొట్టి ఆశీర్వదించారా?

జవాబు   ---   బాబా మా నాన్నగారికి ఒక తెల్లరంగు సంచీని కానుకగా ఇచ్చారు.  ఇప్పటికీ ఆసంచీ మాదగ్గరే ఉంది.  (ఆయన ఒక పెద్ద పెట్టెలోనుండి ఆసంచీని తీసి నాకు చూపించారు.)

ప్రశ్న   ---   బాబా సంచీని కానుకగా ఇవ్వడానికి, సంతానం కలగడానికి ఏమయినా సంబంధం ఉందా?

జవాబు   ---   అవును, ఉంది.

ప్రశ్న   ---   అయితే బాబాగారు మీ నాన్నగారికి సంతానప్రాప్తి కోసం సంచీని కానుకగా ఇచ్చి ఆశీర్వదించారా?

జవాబు   ---   అవును, అది అలాగే జరిగింది.

ప్రశ్న   ---   కాని, కానుకగా ఇవ్వబడిన సంచీకి, పిల్లలు పుట్టడానికి ఉన్న సంబంధం ఏమిటి?

జవాబు   ---   బాబా మా నాన్నగారికి తెల్లసంచీ ఇచ్చిన తరవాతే ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు.

ప్రశ్న   ---   సంచీ, ప్రసవానికి ప్రతీక అయి ఉండవచ్చా?

జవాబు   ---   బాబా సంచీని ఇచ్చిన తరువాతనే మా నాన్నగారికి సంతానం కలిగిందని మాత్రం చెప్పగలను.  అప్పుడే ఆయన భార్య గర్భందాల్చింది.

ప్రశ్న   ---   బాబా ఏమాట చెప్పకుండా సంచీని ఇచ్చి ఊరుకున్నారు అంతేనా?

జవాబు   ---   అవును.  ఆయన మా నాన్నగారికి సంచీని ఇస్తూ, అంతా శుభమే జరుగుతుంది, అన్నీ శుభంగానే పూర్తవుతాయి అన్నారు.  ఆయన మా నాన్నగారితో పిల్లల కోసం కాని, మరింకే ఇతర విషయాల కోసం గాని ఎటువంటి చింతా పెట్టుకోవద్దన్నారు.

ప్రశ్న   ---   ఇది ఏసంవత్సరంలో జరిగింది?

జవాబు   ---   నాకు గుర్తు లేదు.  నాకు తెలుసున్నదల్లా బాబా సంచీని మా నాన్నగారికి ఇవ్వడం.  మా నాన్నగారు సంచీని చాలా జాగ్రత్తగా భద్రపరచమని చెప్పారు.

ప్రశ్న   ---   మీ నాన్నగారు మరణించిన తరువాత ఏమి జరిగింది?

జవాబు   ---   మా నాన్నగారు మరణించిన తరువాత మా అన్నగారు బాఘీరావు పాటిల్ 1945 నుండి 1965 వరకు బూటీవాడా, సమాధి మందిరం మసీదు వ్యవహారాలన్నీ తనే చూసాడు.  తరువాత ఒక ట్రస్టు ఏర్పాటయింది.  ట్రస్టే అన్ని ఆర్ధిక వ్యవహారాలను ఇంకా ఇతర వ్యవహారాలను నిర్వహించసాగింది.



ప్రశ్న   ---   మీ నాన్నగారు జీవించి ఉన్నపుడే ఇదంతా జరిగిందా?

జవాబు   ---   అవును.  ఆయన జీవించి ఉన్నపుడు ఆయనే మొట్టమొదటి భ్యుడు.  అంతా ఆయన సంరక్షణలోనే ఉండేది.  ఆయన మరణించిన తరువాత ఆయన కుమారుడు బాధ్యతలను నిర్వహించాడు.

ప్రశ్న   ---   ఆతరువాతి క్రమంలో సంస్థానం వారు తీసుకున్నారా?

జవాబు   ---   అవును.

ప్రశ్న   ---   సంస్థానం ఏసంవత్సరంలో ఏర్పాటయింది?

జవాబు   ---   ఇక్కడి స్థానిక ప్రభుత్వం 1965. సం. లో ఏర్పాటుచేసింది.

ప్రశ్న   ---   అయితే సంస్థానం యొక్క కార్యకలాపాలు మొదలవడం 20 సం. క్రితమే జరిగిందన్నమాట.  ప్రభుత్వమే దానిని నడిపిస్తూ ఉందా?

జవాబు   ---   అవును.  అంతే, 20 సంవత్సరాలు.

ప్రశ్న   ---   ఇన్ని సంవత్సరాలు, ఇక్కడ షిరిడిలో జీవితం ఏవిధంగా మార్పు చెందింది?

జవాబు   ---   ఇక్కడి కార్యకలాపాలన్నీ ప్రభుత్వమే ప్రారంభించిన తరువాత చాలా మార్పులు వచ్చాయి.  అన్నీ మారిపోయాయి.  పూర్వపురోజులలో ఎలా పనిచేసేదో అప్పటికీ ఇప్పటికీ అన్నీ మారిపోయాయి.  ప్రభుత్వం ఎన్నో మార్పులు చేసింది.  అన్నిటినీ మార్చేసింది.

ప్రశ్న   ---   మీ ఉద్దేశ్యంలో ఇపుడు మారిన పరిస్థితులు బాగున్నాయా లేక ఇంతకు ముందే బాగా ఉండేవా?

జవాబు   ---   పూర్వపు రోజులలోనే బాగా ఉండేది

ప్రశ్న   ---   అన్ని వ్యవహారాలను మీ నాన్నగారు నిర్వహించినపుడు ఆరోజుల్లోనే బాగుండేదా?

జవాబు   ---   లేదు, లేదు.  ప్రభుత్వం కూడా చాలా బాగా చేస్తూ ఉంది.  ప్రభుత్వంవారు ఎన్నో నూతన పద్ధతులను ప్రవేశపెట్టి అన్నీ మార్పులు చేసారు.  మందిరంలోను, మసీదులోను, భోజనశాలలోను ఎన్నో భివృద్ధిపనులను చేపట్టారు.

ప్రశ్న   ---   అయితే ఇపుడు షిరిడిలో సంస్థానంవారి నిర్వహణ మీకు చాలా సంతృప్తికరంగా ఉందా?

జవాబు   ---   అవును.  నాకు చాలా సంతోషంగా ఉంది.  ప్రభుత్వంవారు చాలా బాగా పనిచేస్తున్నారు.

నేను   (ఆంటోనియో)   ---   ధన్యవాదాలు.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


 

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List