11.01.2026 సోమవారమ్
ఓం సాయి శ్రీ సాయి జయయయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాస పత్రిక సెప్టెంబర్, అక్టోబర్ 2025 సంచికలో ప్రచురింపబడిన బాబా లీలలు.
నేను అనువాదం చేయడం మరచిపోయినా బాబా గుర్తు చేసారు. ఈ రోజు వాటిని ప్రచురిస్తున్నాను.
శ్రీ సాయి మహరాజ్ ప్రసాదించిన అధ్బుత అనుభవాలు
శ్రీ సాయిబాబా వారి పవిత్రమయిన ఊదీ యదార్ధ సంఘటనల ఆధారంగా జరిగిన ఆధ్యాత్మిక గాధ.
ప్రాపంచిక విషయాలలో బాబా చూపించే దయ
మరాఠీ నుండి ఆంగ్లానువాదం.. షంషాద్ మీర్జా
తెలుగు అనువాదం .. ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్,
ఫోన్ -- 9440375411 & 81436267
ఫిరోజ్ షాలో ఈ ఆధ్యాత్మిక చైతన్యం మొదలయిన తరువాత అతనికి మరొక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో బాబా దర్శనమిచ్చి”నువ్వు ఎంతో కాలంగా మీ నాన్నగారి పేపర్ మిల్లులో పనిచేస్తున్నావు. ఇకనుండీ నీకు జీతం లభిస్తుంది” అన్నారు.
ఆ మరుసటిరోజే ఒకాయన ఫిరో షా వద్దకు వచ్చి “నువ్వు చాలా కష్టపడి పని చేస్తున్నావు. ఎంత సంపాదిస్తున్నావేమిటీ?” అని ప్రశ్నించాడు.
“ఏమీ లేదు” అని సమాధానమిచ్చాడు ఫిరోజ్ షా.
ఆ సమాధానానికి చలించిపోయి “నీకు ప్రతినెల రూ.200/- జీతం ఇమ్మని మీ నాన్నగారికి చెబుతాను” అన్నాడు ఆయన.
ఆయన అన్నట్లుగానే ఫీరోజ్ షాకి ప్రతినెల జీతం వచ్చే ఏర్పాటయింది. బాబా అనుగ్రహం ఆయన భక్తులపై ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రాపంచిక విషయాలకు సంబంధించి కూడా ప్రసరింపబడుతూ ఉంటుంది.
కాలానికి అతీతంగా నివారణ - ఊదీ
కొద్ది రోజులలోనే ఫిరోజ్ షాకి తీవ్రమయిన జ్వరం వచ్చి ప్రమాదకర స్థితిలో ఉంది. వైద్యులు తమకు తెలిసిన వైద్యం అంతా చేసారు గాని ఏ విధంగాను అతని ఆరోగ్యం మెరుగుపడలేదు.
ఆ రోజు రాత్రి అతనికి స్వప్నం వచ్చింది. సాయిబాబా అతనిని ఒక నిచ్చెన మీదకి ఎక్కించి, షిరిడీలోని పవిత్రమయిన మసీదులో దిగబెట్టారు. అక్కడ అతనిని పవిత్రమయిన ఊదీతో అభిషేకించారు. అతని శరీరమంతా ఊదీ రాసారు. ఆ వెంటనే ఫిరోజ్ షాకి వళ్ళంతా చెమటలు పట్టి జ్వరం తగ్గిపోయింది.
మరునాడు డాక్టర్ వచ్చాడు. ఫిరోజ్ షాకి జ్వరం తగ్గిపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. అంత తొందరగా తగ్గిపోవడం నమ్మలేని విషయం. క్రితం రోజు అతను చాలా ప్రమాదకరమయిన పరిస్థితిలో ఉన్నాడు. అటువంటిది ఇంత అకస్మాత్తుగా ఎలా ఆరోగ్యవంతుడయ్యాడు?
ఔషధం చేయలేనిది నమ్మకం చేసింది.
ఫిరోజ్ షా ప్రత్యక్షంగా బాబాను ఎప్పుడూ చూడకపోయినా అతనిలో బాబా మీద భక్తి వృధ్ధి చెందుతూ వచ్చింది. బల్లమీద ఉన్న ఏ బాబా ఫోటోనయితే ఎత్తలేకపోయాడో దానిని ప్రతిరోజూ పూజించసాగాడు.
బాబా మీద అతనికున్న గౌరవం కల్మషంలేనిది.
మార్చ్, 15, 1931 న అతను ఘోడ్ బందర్ రోడ్డులో వెడుతూ ఉండగా ‘సాయిబాబా లేన్’ అనే సూచిక బోర్డు కనిపించింది. అతని మనసులో ఏదో తెలియని భావం మెదిలింది. ఆ బోర్డునే గమనిస్తూ ఆ దారి ఎక్కడికి వెడుతుందో చూసుకుంటూ వెళ్ళాడు. చివరికి సాయి ప్రధాన్ బాగ్ అనే ప్రదేశానికి చేరుకొన్నాడు. అంతర్గతంగా బాబా తనకు ఇంకా ఆధ్యాత్మిక దారివైపు నడిపిస్తున్నారన్నట్లుగా ప్రగాఢమయిన నమ్మకం కలిగింది. తాను ఎప్పటినుండో తెలుసుకోవాలనుకుంటున్న సమాచారానికి ఆధ్యాత్మిక సంబంధం దొరికిందని చివరికి తెలుసుకున్నాడు.
ఈ విలువయిన సమాచారాన్ని ఆర్.బి. మోరేశ్వర్ ప్రధాన్ గారు శ్రీ సాయిలీల సంపాదకులయిన శ్రీ ఆర్.ఎ. తర్ఖడ్ గారికి వివరించారు.
మరాఠీ నుండి ఆంగ్లానువాదం షంషాద్ మిర్జా
రాబోయే ద్వైమాస పత్రిక నవంబరు, డిసెంబరు, 2025 సంచికలో కొనసాగింపు ఉంటుంది. అది రాగానే మీకు అందిస్తాను.
(ఈ సంచికలో ఇది సమాప్తం)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
బాబా నాకు షిరిడీలో చూపించిన మొట్టమొదటి అనుభూతి 2011 వ.సం.లో ఇదే బ్లాగులో ప్రచురించాను. దానిని మరలా సాయిభక్తులకు వాట్స్ ఆప్ ద్వారా పంపిస్తాను.




0 comments:
Post a Comment