11.12.2022
ఆదివారమ్
ఓం
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్
శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్
శ్రీ సాయినాధాయనమః
శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర 1 వ.భాగమ్
ప్రేరణ
; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా
స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి ఆలయమ్
సమన్వయ
కర్త ;
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట్,
హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744
నాందీ
ప్రస్తావన
ఈ మధ్య కొంతమంది హేతువాదులు, సాయి మీద
నమ్మకం లేనివారు సామాజిక మాధ్యమాలలో సాయిమీద నిందాపూర్వకమయిన ఆరోపణలు చేయడం జరుగుతూ
ఉంది.
సాయిబాబాను ‘సాహేబు’ అని హేళనగా ప్రస్తావించడమే
కాక, ఆయన పురాణాలు చదివాడా, దేముడి పూజలు చేసాడా అని కూడా అవహేళణ చేస్తూ ఉన్నారు. అంతేకాక ఆయన స్నానం కూడా చేసేవాడు కాదు అని కూడా
అంటూ ఉండటం జరుగుతూ ఉంది.
సాయిబాబా ముస్లిమ్, ఆయన మసీదులోనే నివసించారు,
ఎప్పుడూ అల్లామాలిక్ అంటూ ఉండేవారు. ఈ మూడు
విషయాలు మాత్రమే వీరందరి మనసుల్లో చెరగని ముద్ర వేసాయి.
అంతే కాకుండా అమధ్య ఒక ప్రముఖ స్వామీజీ
సాయిబాబా ముస్లిమ్ అని చెప్పడం వలన కొంతమందికి సాయి మీద నమ్మకంలేకపోయినా సాయిబాబా ముస్లిమ్
అనే అభిప్రాయానికి వచ్చేశారు. సాయి మీద కాస్తో
కూస్తో ఒక మంచి అభిప్రాయం ఉన్నవాళ్ళకి ఆయన ఒక ముస్లిమా? అని ఆశ్చర్యపోతూ సాయిబాబా మీద
నిరసన వ్యక్తం చేసినవారు కూడా ఉండవచ్చు. అటువంటివారి
మనసులలో చెరగని ముద్రను చెరపడానికి నేను ప్రత్నించడంలేదు. కాని వాస్తవాలను గ్రహించమనే ఈ వ్యాసములు ప్రచురించడంలోని
ముఖ్యోద్దేశం.
మనం ఒక నిర్దిష్టమయిన అభిప్రాయానికి రావాలంటే
పూర్తిగా చదివిన తరువాతనే సాధ్యమవుతుంది. అందుచేత
అందరినీ కోరేదేమిటంటే పూర్తిగా చదివిన తరువాతనే సహేతుకమయిన అభిప్రాయాలను వ్యాఖ్యలను
తెలియచేయండి.
ఇపుడు మీముందుంచుతున్న వాస్తవాలను చదవండి. ఇందులో సాయిబాబా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఏమయినా
ప్రవర్తించారో లేదో గ్రహించుకోండి.
శ్రీ సాయి సత్ చరిత్రలో ఉపనిషత్తుల గురించి,
నారదభక్తి సూత్రాల గురించి కూడా ప్రస్తావింపబడింది. వాటిని కూడా సమగ్రంగా ముందుముందు వివరిస్తాను.
సామాజిక మాధ్యమాలలో సాయిబాబాను హేళన చేస్తూ
మాట్లాడిన ఒక ప్రసంగాన్ని కొద్ది రోజుల క్రితం విన్న తరువాత, వ్యాఖ్యలను చదివిన తరువాత
చాలా బాధ కలిగింది. అటువంటి విరోధభావాలున్న
వారికి సమాధానం ఒకటి రెండు పేరాలు, వాక్యాలలో ఇస్తే సరిపోదని భావించాను. చాలా విపులంగా సోదాహరణంగా ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతయినా
ఉంది.
అంతకుముందు కొంతమంది వెలిబుచ్చిన అభిప్రాయాలకు
సమాధానంగా, బాబా హిందూ దేవీదేవతలను నిరాదరిస్తే ఊరుకునేవారు కాదనీ, పాడుబడిన దేవాలయాలను
బాగుచేయించారనీ ఉదహరిస్తూ శ్రీ సాయి సత్ చరిత్రలోని అధ్యాయాల సంఖ్యను ఇవ్వడం జరిగింది. దానిమీద ఇక ఎవరూ వ్యతిరేకమయిన అభిప్రాయాలను తెలపలేదు. కాని ఇంకా కొన్ని కొన్ని నిందలు, ఆరోపణలు సాయిబాబా
మీద అప్పుడప్పుడూ చేస్తూనే ఉన్నారు. వీరందరికి
సమాధానం ఏవిధంగా ఇవ్వాలా అని ఆలోచిస్తుండగా….
అదృష్టవశాత్తు కార్తికమాసంలో హైదరాబాద్
కూకట్ పల్లిలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో దీపాలు వెలిగించడానికి కుటుంబ సభ్యులతో
కలిసి వెళ్లాను. అక్కడ ఆలయంలో ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత వినపడుతూ ఉంది. ఆలయంలో దీపాలు వెలిగించి కాసేపు కూర్చున్నాము.
ప్రశాంతంగా కూర్చున్న తరువాత భగవద్గీత
వింటూ ఉన్నాను. అందులో ఒక శ్లోకానికి ఘంటసాల
గారు వ్యాఖ్యానం అనగా అర్ధం చెబుతున్నారు.
అది వినగానే నాకు అరే! ఇదే విషయం బాబా కూడా చెప్పారు కదా అని నాకు శ్రీసాయి
సత్ చరిత్ర గుర్తుకు వచ్చింది. నేను విన్నది
శ్రీమధ్భగవద్గీతలోని ఏ అధ్యాయంలోనిదో, ఏ శ్లోకమో తెలీదు. ఇంటికి రాగానే అది ఏ శ్లోకమో చూద్దామని భగవద్గీతలోని
అధ్యాయాలు,శ్లోకాలు పరిశీలిస్తూండగా శ్రీసాయి సత్ చరిత్రలోని సంఘటనలు, బాబా చెప్పిన ఉపదేశాలు గుర్తుకు
వచ్చాయి.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్. 6 లో
హేమాడ్ పంత్ ఈవిధంగా అన్నారు.
“నేను వేదపురాణాది సద్గ్రంధములు చదువునపుడు
నా సద్గురు మూర్తియే అడుగడుగునకు జ్ణప్తికి
వచ్చుచుండును. నా సద్గురువయిన శ్రీ సాయిబాబాయే
శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా నాముందు నిలచి, తన లీలలను తామే వినిపింప చేయునట్లు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగనే, శ్రీ సాయి ఆపాదమస్తకము
కృష్ణునివలె కాన్పించును. భాగవతమో , ఉధ్ధవగీతయో
తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనయినా
సంభాషించునప్పుడు సాయిబాబా కధలే ఉదాహరణములుగా జ్ణప్తికి వచ్చును.
(నాందీ ప్రస్తావన ఇంకా ఉంది)
(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment