09.12.2022 గురువారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 50 వ, భాగమ్
అధ్యాయమ్
– 49
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 81436267
సాయి
ఎప్పుడూ సరైన దారి చూపిస్తారు
మా
అమ్మాయి నేహ వివాహం నిశ్చయం అయింది. వివాహసమయంలో
నీటికి గాని, డబ్బుకి, వివాహం జరిగే ప్రదేశం ఇంకా పెళ్ళికి సంబంధించిన వేటికీ కూడా
ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని సాయిని ప్రార్ధించుకున్నాను. వివాహ సమయంలో అన్నీ అనుకున్నట్లుగానే సజావుగా జరిగాయి. వివాహానికి వచ్చిన అతిధుల కోసం పై అంతస్థులోని ఫ్లాట్
ని వసతిగా ఏర్పాటు చేసాము. 24 గంటలూ నీటివసతికి
ఇబ్బంది కలగకుండా గడిచింది. ఎటువంటి సమస్యలూ
ఉత్పన్నం కాలేదు.
నాకు
గర్భాశయంలో గడ్డ ఏర్పడింది. నా గురించి అందరూ
చాలా బెంగ పడ్డారు. గుజరాత్. పఠాన్ లో ఉంటున్న
మా అమ్మగారింటికి వెళ్లాను. అక్కడ వైద్యులు నాకు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ మొదలుకావడానికి పది నిమిషాలు వ్యవధి ఉంది. నేను సాయిని ప్రార్ధించుకుంటూనే ఉన్నాను. నాకు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.
రెపోర్ట్స్
అన్నీ సక్రమంగా ఉన్నాయి. నేను ఇక నా రోజువారీ పనులు చేసుకోవడం ప్రారంభించాను.
నా
సోదరుడి కొడుకు కూతురు ‘ఆగి’ (హెర్పెస్ జోస్టార్) తో బాధపడుతూ ఉంది. ఒక రోజున నా మరొక సోదరుడు సాయిబాబాకి ఆరతి ఇస్తున్న
సమయంలో హటాత్తుగా తన కూతురిని అహ్మదాబాద్ కు వైద్యం కోసం తీసుకుని వెళ్లమన్నట్లుగా
స్ఫురించింది.
వారు
అహ్మదాబాద్ కి ప్రయాణమయ్యారు. దారిలో మాసోదరుడి
కష్టమర్ ఒకతను ఫోన్ చేసినపుడు తను కూతురిని అహ్మదాబాద్ లో ఉన్న వైద్యుడి దగ్గరకు తీసుకుని
వెడుతున్నట్లుగా చెప్పాడు. అదృష్టవశాత్తు ఆ
వైద్యుడు కష్టమర్ కి మేనమామ. చక్కగా వైద్యం
జరిగి హెర్పెస్ జోస్టర్ తో బలహీన పడిన కూతురు మంచి ఆరోగ్యవంతురాలయింది. మామూలుగా నడవసాగింది. తన పనులు తాను చేసుకోగలిగే స్థితికి చేరుకుంది.
ఇదంతా
సాయిబాబా దయ వల్లనే జరిగింది.
జయశ్రీ
సహా
9594006389
సాయి
దయా సాగరం ఇక ముగింపుకి వచ్చింది. ఆంగ్ల పుస్తకంలోని
మరికొన్ని ఉన్నాయి గాని, అవి అంతగా ఆకట్టుకునేగా లేనందువల్ల వదలి వేయడం జరిగింది.
త్వరలోనే
బాబా నాచే వ్రాయించుకున్న వ్యాసాలను అందిస్తాను…
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment