30.11.2022 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 49 వ, భాగమ్
అధ్యాయమ్
– 48
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
9440375411 & 81436267
మనలను
సన్మార్గంలో నడిపించే సాయి
నా చిన్న తనంలో నేను సాయిమందిరంలో ఆడుకుంటూ ఉండేదానిని. అప్పట్లో పెద్దవాళ్లందరూ బాబా మన కోరికలను తీరుస్తారు అని చెబుతూ ఉండేవారు. ఒకసారి నేను మందిరంలో ఆడుకుంటూ ఉండగా నాకు చాలా ఆకలి వేసింది. నాకు కాబూలీ చనా తినాలనిపించి బాబాను ప్రార్ధించాను.
కొద్ది సేపటిలోనే ఒకతను మందిరంలోకి వచ్చి బాబా పాదాలవద్ద కాబూలీ శనగలను నైవేద్యంగా
పెట్టాడు. ఈ సంఘటన నాకు బాబా గుర్తు. ఒకసారి నాకు మామిడిపండు తినాలనిపించింది. అది మామిడిపండ్ల కాలం కూడా కాదు. ఆశ్ఛర్యకరంగా ఎవరొ ఒకతను మామిడిపండుని బాబాకు నివేదించడానికి
ఆయన చరణాలవద్ద పెట్టాడు. ఈ పాటికి నాకు సాయి
మీద ఎంతో భక్తి ఏర్పడి ఆయన భక్తురాలినయ్యాను.
సాయిదయ
వల్ల నేను ఒక మంచి మనిషిగా ఎదిగాను. ఒకసారి
నేను మందిరానికి వెళ్ళి బాబాను దర్శించుకుని తిరిగి వెడుతున్నాను. దారిలో ఒకామె తన కుమారుడితోను, మామగారితోను నుంచుని
ఉంది. ఆమె తన భర్త అక్కడ పనిచేస్తున్నాడని
చెప్పింది. తన భర్తని కలుసుకోవడానికి అకోలా
నుండి వస్తున్నామని, కాని తన భర్త, పనిచేస్తున్న చోట లేడని చెప్పింది. అందుచేత తిరిగి అకోలాకు వెళ్లడానికి రూ.150/- సాయం
చేయమని కోరింది. ఆమె నిజమే చెబుతోందని భావించాను. నేను కొత్త చెప్పులు కొనుక్కోవడాని తెచ్చుకున్న
రూ.150/- ఆమెకు ఇచ్చి సహాయపడ్దాను.
మా
పనిమనిషి ప్రతిసారి నేను భోజనం చేసేవేళకే వస్తూ ఉండేది. అందుచేత నేను ఒక మనిషికి అదనంగా వంట చేయవలసివచ్చేది. ఒకసారి నేను రెండు రోజులు అదనంగా మరొక మనిషికి వంట
చేయడం మానేశాను. రెండు రోజుల తరువాత టి.వి.
సీరియల్ లో దానికి సమాధానం లభించింది. ఆ సీరియల్
లో “నీవు భోజనం చేసే వేళకి ఎవరయినా వచ్చినట్లయితే వారికి భోజనం పెట్టడం నీ బాధ్యత అని
చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని సాయి ఎప్పుడూ
చెబుతూ ఉండేవారు. ఇంటికి వచ్చిన అతిధిని ఆకలితో
ఉంచకూడదు.
ఈ విధంగా
బాబా, నేను ఎప్పుడయినా తప్పు దారిలో నడుస్తున్నట్లయితే సరియైన మార్గంలో నడిపించేవారని
చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
ఈ ప్రపంచంలో
మానవుడు స్వార్ధపరుడు. మనం ఎటువంటి ప్రతిఫలాన్ని
ఆశించకుండా అందరికీ సాయపడుతూ ఉండాలి.
శ్రీమతి
ప్రఫుల్లా జోషి
9820998396
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment