12.12.2022 సోమవారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమ:
శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే
శ్రీ సాయి సత్ చరిత్ర
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
పాఠకుల స్పందన...
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై, ఓమ్ సాయిరామ్, చాలా చక్కని నిర్ణయం తీసుకున్నారు. బాబా గారు వారికి సమాధానం మీద్వారా చెప్పించాలనుకున్నారేమో అని అనిపిస్తోంది.
శ్రీ టి. యాదగిరి, సూర్యాపేట్
చాలా అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు. మన సాయి అనుగ్రహం సదా మీకు రక్షగా ఉంటుందని నా భావన.
ఒక పాఠకురాలి....స్పందన...
నేను ఇప్పటిదాకా సాయి చరిత్ర చదవలేదు. కొన్నాళ్ళ క్రితం మొదలుపెడితే ఏదో ఆటంకం వచ్చి ఆపేసాను. నేను కూడా సాయి ముస్లిమా అనుకునేదానిని. బాబా చెప్పేవి ఎక్కువ నియమ నిష్టలు లేకుండా అందరికీ ఆచరణ యోగ్యంగా ఉంటాయి. ప్రాక్టికల్ గా ఉంటాయి. నిజమేకదా అనిపిస్తుంది ఆయన మాటలు.
నాందీ ప్రస్తావన … తరువాయి భాగమ్
రెండు సంవత్సరాల క్రితం బాబా సూచనతో గురుభక్తి గురించి ప్రచురించాను. రెండు భాగాలు ఫేస్ బుక్ లోని ఒక సమూహంలో ప్రచురించాను. పరమ శివుడు పార్వతీదేవికి గురుభక్తి గురించి బోధించాడు.
గురుభక్తి అనేది ఏ విధంగా ఉండాలో శ్రీ సాయి సత్ చరిత్రలోని ఘట్టాలను ప్రస్తావిస్తూ
ప్రచురించాను. కాని అందులో ‘సాయిబాబా’ పేరు
ఉంది కాబట్టి సాయి మీద నమ్మకం లేని వారు ఎవరూ చదవడానికి ఇష్టపడలేదు. మనం ఏదయినా విమర్శ చేసేముందు పూర్తిగా చదివిన తర్వాతనే
మన అభిప్రాయాలను తెలపాలి. పరోక్షంగా ఒక వ్యక్తి
గురించి ఎవరయినా ఏమి చెప్పినా నిజానిజాలు మనం గ్రహించుకోవాలి.
ఉదాహరణకి శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్
28 గమనించండి.
లాలా లక్ష్మీ చంద్ అనువానికి శ్రీ సాయిబాబా
స్వప్నములో కనిపించారు. దాసగణుగారు హరికధ చెప్పే
సమయంలో సాయిబాబా ఫోటోని ఎదురుగా పెట్టుకుని చెబుతూ ఉండేవాడు. ఒకసారి లక్ష్మీచంద్ ఆయనచెప్పే హరికధను వినడానికి
వెళ్ళాడు. అక్కడ సాయిబాబా ఫొటో చూసి తనకు స్వప్నంలో
కనిపించినది ఆయనే అని ఎంతో ఆనందపడ్డాడు. షిరిడీ
వెళ్ళి ఆయనను దర్శించుకోవడానికి ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు. ఒక రోజు అతని స్నేహితుడు శంకరరావు వచ్చి షిరిడీకి
వచ్చెదవా అని అడిగాడు. లక్ష్మీ చంద్ ఎంతగానో
ఆనందించి తన పినతండ్రి దగ్గర రూ.15/- అప్పుచేసి
షిరిడీకి పయనమయ్యాడు. రైలులో అతడు, శంకరరావు
భజన చేసారు. సాయిబాబా గురించి తోటిప్రయాణీకులను
అడిగాడు. షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోగానే
బాబా అతనితో “టక్కరివాడు, దారిలో భజన చేయును.
నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును.
ఇతరులను అడుగనేల? మన కండ్లతోటి సమస్తము
చూడవలెను. ఇతరులను అడుగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమయినదా లేదా అనునదిఆలోచించుము. రూ.15/- అప్పు తీసుకుని షిరిడీకి రావలసిన అవసరమేమి? హృదయములోని కోరిక ఇప్పుడయినా నెరవేరినదా?” అన్నారు
దీనిని బట్టి మనం ఏదయినా సరే మనకండ్లతో
చూచి నిజానిజాలను నిర్ధారించుకోవాలి. అంతే
కాదు, అప్పు చేసి తీర్ధయాత్రలకు వెళ్లవలసిన అవసరం లేదని మంచి హితబోధ చేసారు.
ఇపుడు ఈ వ్యాసపరంపర సాయిభక్తులకు శ్రీ
సాయి సత్ చరిత్ర మరొక సారి పునశ్చరణ చేసుకున్నట్లవుతుంది. సాయి మీద ఒక విధమయిన తప్పుడు అభిప్రాయం ఉన్నవారికి
వాస్తవాలను గ్రహించుకునే అవకాశమని నేను భావిస్తున్నాను. కాని పూర్తిగా చదివిన తరువాతనే కదా అవకాశం కలిగేది.
ఇక అసలు విషయం శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తుల సారాంశమే శ్రీ సాయి సత్ చరిత్ర ప్రారంభించేముందు శ్రీ సాయి సత్ చరిత్ర 27 వ. అద్యాయములోని ఒక సంఘటనను ప్రస్తావిస్తాను.
గీతా రహస్యము
బ్రహ్మవిద్యను అధ్యయనము చేయువారిని బాబా
ఎల్లప్పుడు ప్రేమించువారు, ప్రోత్సహించువారు.
ఇచట దానికొక ఉదాయరణమిచ్చెదము. ఒకనాడు
బాపూసాహెబ్ జోగ్ కు ఒక పార్సెలు వచ్చెను. అందులో
తిలక్ వ్రాసిన గీతా రహస్యముండెను. అతడా పార్సెలును
తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేయునప్పుడది క్రింద పడెను. అదేమని బాబా అడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకమునుంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి
తన జేబులోనుండి ఒక రూపాయి తీసి పుస్తకముపై బెట్టి దక్షిణతో కూడ పుస్తకమును జోగునకందించుచు,
“దీనిని పూర్తిగ చదువుము. నీకు మేలు కలుగును”
అనిరి.
దీనిని బట్టి బాబా ను విమర్శించువారు
ఒక విషయాన్ని గ్రహించుకోవాలి. బాబా హిందూ ధర్మానికి
వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. అవునా ? కాదా? ప్రతి
హిందువు అన్నవాడు భగవద్గీతను చదవాలి.
రేపటినుండి శ్రీమద్భగవద్గీతలోని శ్లోకాలు,
వాటికి సంబంధించి శ్రీ సాయి సత్ చరిత్రలోని విషయాలు ప్రారంభమ్
(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment