09.04.2021
శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 67 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – బొంబాయి
శనివారమ్, అక్టోబరు, 26, 1985
నా డైరీలోని ముక్యాంశాలు …
ఉదయం గం. 9.00 .. నాహోటల్ గదిలో. ఈ రోజు షిరిడీని వదిలి వెళ్ళేరోజు. ఈ రోజు తెల్లవారుజాము గం. 5.15 కి కాకడ ఆరతిలో పాల్గొన్నాను. నా సామానంతా సద్దేసుకున్నాను. స్వామి శేఖరరావు అడిగినమీదట అతనిని ప్రశంసిస్తూ మంచి పరిచయ ఉత్తరాన్ని వ్రాసాను. అతను ఎంతో నమ్మకమయినవాడని, అతని ధర్మం, విశ్వసనీయత, ఆదర్శప్రాయమయిన అతని ప్రవర్తన గురించి చాలా విపులంగా అతనిని ప్రశంసిస్తూ వ్రాసాను.
ఇపుడు క్రిందకు వెళ్లి ఫలహారం చేసి
హోటల్ గది అద్దె చెల్లించి ఖాళీ చేయాలి.
ఆతరువాత షిరిడీలో ముఖ్యమయిన ప్రదేశాలను చూసిరావాలి. సంస్థానానికి వెళ్ళి వాళ్ళందరికీ
వెళ్ళి వస్తానని చెప్పి బయలుదేరాలి.
(స్వామి శేఖరరావుతో శ్రీ ఆంటోనియో గారు, షిరిడీలోని బాలుడు)
ఉ. గం.
11.30 …
సంస్థానంలోని వారందరికి వెళ్ళివస్తానని చెప్పాను. శ్రీనారాయణ బాబా, బషీర్ బాబాల గురించి మరికొంత సమాచారం తెలిసింది. చివరిసారిగా పవిత్రమయిన ప్రదేశాలయిన
సమాధిమందిరం, లెండీతోటలు, గురుస్థానం,
ద్వారకామాయి, చావడి, మారుతీ
దేవాలయం, లక్ష్మీ దేవాలయం అన్నిటిని దర్శించుకున్నాను. లక్ష్మీబాయి తుకారామ్ షిండె సమాధిని
కూడా దర్శించుకున్నాను. ఆమె మేనకోడలితో సంక్షిప్తంగా మాట్లాడాను. శ్రీసాయి సత్ చరిత్ర మరొక పుస్తకాన్ని
కొన్నాను. మధ్యాహ్నం
భోజనం పూర్తయింది. షిరిడీనుండి
బొంబాయికి బస్సు మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరుతుంది. రాత్రి 9 గంటలకు బొంబాయి
చేరుకుంటుంది. స్వామిశేఖరరావుకు
చివరిసారిగా వీడ్కోలు చెప్పి అతని సేవకి తగినట్లుగా పారితోషికం ఇవ్వాలి. దానితో నా షిరిడీ యాత్ర ముగుస్తుంది.
షిరిడీ సంస్థానం ప్రధానకార్యాలయంలో ఉ. గం. 9.45
బషీర్ బాబా, నారాయణబాబాల గురించి షిరిడి సంస్థానంవారు చెప్పిన
మరికొన్ని వివరాలు…
బషీర్ బాబా రెండుమూడు సంవత్సరాల క్రితం అనగా 1982 లేక 1983 లో మరణించారు. సరియైన సంవత్సరం మాకు అంతగా గుర్తులేదు. అయనకు ఎప్పుడు రావాలనిపిస్తే అపుడు
తరచుగా హైదరాబాదునుండి షిరిడి వస్తూ ఉండేవారు. ఈ విషయం మాత్రం ఖచ్చితం. ఆయన తిరిగి వెళ్ళడానికి కొద్దిరోజుల
ముందు మరణించారు. ఆయన
మరీ వృధ్దులేమీ కాదు. అయనకు 42 లేక
43 సంవత్సరాల వయస్సు ఉంటుంది.
ఇక నారాయణబాబా గారి విషయానికి వస్తే ఆయన ప్రతిసంవత్సరం షిరిడికి
యాత్రగా వస్తూ ఉండేవారు. ఆవిధంగా
1985వ.సం.లో వచ్చిన
సందర్భంగా ఆయన యాత్రా విశేషాలతో కూడిన ఈ చిన్న కరపత్రాన్ని మీకు ఇస్తున్నాము.
షిరిడీసాయికి భక్తులుగా మాత్రమే మా సంస్థానంవారు వీరిద్దరినీ
పరిగణించారు. సాయిబాబావారి బోధనలు,
తత్త్వాన్ని భారతదేశంలోను, మిగతా ప్రపంచానికి చాటిచెప్పిన
వ్యక్తులుగానే వారిని మేము పరిగణించాము.
షిరిడీబాబాకు, వారికి మధ్య అతీంద్రియసంబంధాల గురించి గాని,
వారు బాబాకు
మధ్యవర్తులుగా తమకు తామే చెప్పుకునేవారనే ఆవిషయాల గురించి మేమేమీ మాట్లాడము. దానికి మౌనమే మా సమాధానం అంతే.
తుకారామ్ షిండె గారి ఇంటిలో ఉ. 10.30 కి
లక్ష్మీబాయి నివసించిన ఇంటికి సంరక్షకురాలిగా ఉన్న ఆమె మేనకోడలు లక్ష్మీబాయి తుకారామ్ షిండేతో జరిపిన సంభాషణ.
ఆమె
నివసించిన ఇంటినే బాబా ఫొటోలతోను, ఆమె ఫొటోతోను, చిన్నదేవాలయంగా మార్చారు. మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలోని యౌవలా నుండి లక్ష్మీబాయి షిరిడి వచ్చారు.
తుకారామ్ లక్ష్మీబాయి గురువారం రాత్రి 7 గంటలకు మరణించారు.
లక్ష్మీబాయి మేనకోడలు చెప్పిన వివరాలు ---
ఆమె 1963వ.సంలో మరణించారు. ప్రతిరోజు ఆమె తన ఇంటిలో బాబాకు పూజ,
ఆరతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవారు.
తుకారామ్ --- ఆమె ప్రతిరోజు మసీదును తుడిచి శుభ్రం చేస్తూ ఉండేవారు. ఒక్కోసారి ఆమె బాబాకు భోజనం తీసుకువెడుతుండేది.
లక్ష్మీబాయి బాబాతో 25 సంవత్సరాలకు పైగా
కలిసి ఉంది. బాబా సమాధి
చెందేసమయంలో ఆమెకు 9 రూపాయి నాణాలను ఇచ్చారు. మొదట అయిదు, ఆతరువాత నాలుగు నాణాలను ఇచ్చారు.
ఒక్కోనాణానికి ఒక్కో అర్ధం ఉంది.
ప్రశ్న --- లక్ష్మీబాయికి 9 నాణాలను ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటి?
జవాబు --- 9 నాణాలను కానుకగా ఇవ్వడంలోని ప్రాముఖ్యత
నాకు తెలియదు. నేను ఆమె
మేనకోడలిని. (ఆమె ఆ నాణాలను చూపించారు).
తుకారామ్ --- లక్ష్మీబాయి శరీరాన్ని ఇక్కడే సమాధి
చేసారు. ఆమె సమాధి సరిగా
ఆమె ఇంటిముందరే ఉంది.
నేను (ఆంటోనియో) - ధన్యవాదాలు.
(శ్రీ ఆంటోనియో గారు బొంబాయికి చేరుకున్న తరువాత శ్రీ స్వామి రామ్ బాబా
గారిని కలుసుకున్న విశేషాలతో ముగింపు.)
ఆలోపుగా జరిగిన వివరాలు ముఖ్యమయినవి కానందువల్ల, వదిలివేయడం జరిగింది. బాబాకు సంబంధించిన వివరాలను మాత్రమే ప్రచురిస్తున్నాను.)
(తరువాత శ్రీ స్వామి రామ్ బాబా గారితో జరిపిన సంభాషణ)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment