17.07.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు
వ్యాస మహాముని
13.07.2011 న గురుపౌర్ణమి గురించి ప్రచురించిన దానిలో వ్యాస మహాముని గురించి తెలుగులో రాలేదని సాయి భక్తులు ఈ రోజే చెప్పారు. యింకా కొంతమందికి తెలుగు ఫాంట్ తేడా వల్ల రాకపోయి ఉండచ్చు. వారి సౌకర్యార్థం మరలా ఈ రోజు ప్రచురిస్తున్నాను.
వ్యాస మహర్షి పుట్టీ పుట్టగానె తల్లికి నమస్కరించి యెప్పుడు తలచుకుంటే అప్పుడు ప్రత్యక్షమవుతానని చెప్పి తపోవనాలకు వెళ్ళాడు. ఆయన చేసిన తపస్సు యెంత గొప్పదో మహాభారత కథలోని కొన్ని సన్నివేశాలు మనకి తెలియ చేస్తున్నాయి. భారత గ్రంథంలో తానొక ప్రముఖ పాత్రథారుడిగా ఉండి సమయం వచ్చినప్పుడల్లా యెవరికి, యెప్పుడు, యెక్కడ, సాక్షాత్కరించాలో అక్కడ సాక్షాత్కరించేవాడు వ్యాస భగవానుడు. ఆయా సందర్బాలలో ధర్మ, అథర్మ నిరూపణం చేస్తూ కర్తవ్యాన్ని ప్రబొథిస్తూ తన దివ్య ఉపదేశాలతో లోకానికి జ్ఞాన భిక్ష పెట్టిన మహనీయ గురువు వేదవ్యాస మహర్షి. అందుకే ఈనాటికీ ఆ మహర్షిని స్మరించుకుంటూ వ్యాస పూర్ణిమనాడు నమస్కారాలర్పిస్తూ ఉంటారంతా.
గురువంటే శిష్యుడికి ఉపదేశం చేసి కూర్చుంటే సరిపోదు. అతడిని తన బిడ్డలా కాపాడుతూ అతని అభ్యుదయాన్ని కోరుకునేవాడే అసలైన గురువనిపించుకుంటాడు. అలాంటి ఉత్తమోత్తమ గురు స్వభావమంతా వ్యాస మహర్షిలో ఉంది. గాంథారికి గర్భచ్యుతి కలిగినప్పుడు ఆ మాంసపు ముద్దను నూటొక్క భాగాలుగా చేసి నూరుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టేలాగ చేసిన ఆయన మహాత్మ్యం అసమానం. అంతటి శక్తి ఆయనకు తపస్సు వల్లే ప్రాప్తించింది. ఆ తపస్సుకు యెప్పుడొ మరణించినవారిని సహితం తిరిగి రప్పించగల శక్తి ఆయనకు ఉండేది. యిటువంటి శక్తిని 'దహరోపాసనా' విథానం అని చాందోగ్యోపనిషత్తులాంటివి కూడా ప్రకటిస్తున్నాయి. కురుక్షేత్ర సంగ్రామంలో మరణించిన లక్షలాది మందిని మరణించేనాడు ఏ రూపాలతో, ఏ వస్త్రాలతో ఉన్నారో మళ్ళీ అలానే బతికించి చూపించాడు. అలాగే భారత యుద్ధ వార్తలను థృతరాష్త్రుడికి తెలియపరచటానికి సంజయుడిని నియమించి ఆయనకు కావలసిన అలౌకిక శక్తులన్నిటినీ ప్రసాదించాడు. అశ్వథ్థామ, అర్జునులు యిద్దరూ ఒకరి మీద ఒకరు బ్రహ్మ శిరో నామాస్త్రాన్ని సంథించుకున్నప్పుడు వాటినుంచి వెలువడిన అగ్నిజ్వాలలతో లోకాలు తల్లడిల్లుతున్నప్పుడు నారదుడితో సహా వచ్చి ఆ బాథను చల్లార్చిన దివ్యమూర్తి వేద మహర్షి.
యెంతటి విచిత్రమంటే అప్పటికి కురుక్షేత్ర యుద్ద్థం జరిగి పదిహేను సంవత్సరాలు గడిచి పదహారో సంవత్సరం వచ్చింది. కుంతీ, గాంథారీ, సంజయులను వెంట బెట్టుకుని థృతరాష్త్రుడు వానప్రస్థం కోసం అడవులకు వెళ్ళాడు. కొద్దికాలం తరువాత ధర్మరాజుకెందుకో ఆ పెద్దలందరినీ చూడాలనింపించింది. వెంటనే బంథుమిత్ర పరివార సమేతంగా ధృతరాష్త్రునివద్దకు బయలుదేరాడు. దుర్యొథనుడు తదితరుల భార్యలు కూడా థర్మరాజు వెంట థృతరాష్త్రుడు ఉన్న ఆశ్రమానికి వచ్చారు. కుశల ప్రశ్నలు గడుస్తుండగా వ్యాస మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మాటల సందర్భంలో గాంథారి, థృతరాష్త్రులు చనిపోయిన తమ బిడ్డలైన దుర్యోథనాదులను, వారికి సహాయం చేసిన రాజులు సామంతులలాంటివారిననదరిని చూడాలని ఉందని చెప్పారు. అప్పుడు తనను వేడుకుంటున్నవారి హృదయ వేదనను ఆ పరమ గురువు పోగొట్టాలనుకున్నాడు. వెంటనె అందరినీ గంగా నది ఒడ్డుకు వెళ్ళి ఉండమని అక్కడ కురుక్షేత్ర యుధ్ధ సమయంలో మరణించినవారంతా కనిపిస్తారని అన్నారు వ్యాస మహర్షి. ఆ సాయం సమయం గడిచాక గంగా నదిలోకి దిగి మరణించినవారినందరినీ ఆహ్వానించాడు. ఆ మరుక్షణంలోనే నదిలోనించి పెద్ద కోలాహల ధ్వని వినిపించింది. ఉత్తర క్షణంలోనే, భీష్మ, ద్రోణ, ప్రముఖుల్లాంటివారే కాక నాడు యుథ్థంలో మరణించినవారంతా ప్రత్యక్షం కావడంతో ఒడ్డున ఉన్నవారి భార్యా బిడ్డలు, బంథు మిత్రులు అంతా వారిని చూసి, కలిసి మాట్లాడి ఆనందించారు. పన్నెండు గంటల సేపు యిలా అంతా హాయిగా అన్ని లక్షల మంది లక్షణంగా తమ తమ వారితో ఆనందించి తెల్లవారేసరికి మళ్ళీ అంతర్థానమైపోయారు.
యెంతటి గొప్ప గురువైతే మాత్రం, యెంతటి తపశ్శక్తి సంపున్నుడైతే మాత్రం యిన్ని లక్షల మందిని బతికించడం సాథ్యమా అని ఈ విషయాన్ని యిప్పుడు వింటున్నవారికే కాదు వైసంపాయన మహర్షి వల్ల భారతాన్ని వింటున్న జనమేజయ మహారాజుకి కూడా కలిగింది. నేనిదంతా నమ్మనండీ! ఒకవేళ నేను నమ్మాలంటే మీ గురువైన ఆ వ్యాస మహామునిని మరణించిన మా నాన్నను యిప్పుడు చూపమనండి అప్పుడు నమ్ముతానన్నాడు. ఆ రాజు మాటలకు వ్యాసుడు కరుణ చూపాడు. వెంటనే అక్కడ జనమేజయ మహారాజు తండ్రి అయిన పరీక్షిత్తును, ఆయనతోపాటుగా శృంగిని, యింకా ఆనాటి మంత్రులు లాంటి వారినందరినీ బతికించి చూపాడు. జనమేజయుడు తన తండ్రిని చూడటమే కాదు ఆయనకు సంతోషంతో అవభృధ స్నానం కూడా చేయించి ఆనందించాడు. ఆ పరమ గురువు తపశ్శక్తి అలాంటిది. సందర్భానుసారం థర్మోపదేశం చేస్తూ సన్మార్గాన్ని సూచిస్తూ తనవారి కోర్కెలను తీరుస్తూ ఓ ప్రేమ పూరిత మూర్తిగా సద్గురువుగా వ్యాసుడిలా యెన్నీన్నో సందర్భాలలో కనిపిస్తూంటాడు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment