15.07.20011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు
ఆథ్యాత్మిక ప్రగతి
కొద్ది రోజుల క్రితం హైదరాబాదునుంచి సాయి భక్తుడు శ్రీ నగేష్ గారు ఒక ప్రశ్న అడిగారు. మనిషి ఆథ్యాత్మికతలోకి వస్తున్నడనటానికి నిదర్శనం యేమిటి అని. ఈ విషయం గురించి మిగతా సాయి బంథువులందరికి కూడా తెలియచేయాలని నేను సేకరించిన సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను.
మానవుడు ఆథ్యాత్మికంగా యెదుగుతున్నాడనటానికి నిదర్శనాలు.
1. యితరులలోని లోపాలని గుర్తించే ఆసక్తిలో తగ్గుదల.
(యితరుల లోపాలని గురించి ఆసక్తి లేకుండా అనాసక్తిగా ఉండటం, వాటికి అంతగా ప్రాధాన్యతనివ్వకపోవడం)
2. మనలోని గొప్ప గుణాలని గుర్థించే ఆసక్తిలో తగ్గుదల.
(మన గురించి మనమే గొప్పలు చెప్పుకోకుండా అంతా భగవత్సంకల్పంతోనే జరుగుతున్నదని అనుకోవడం. మనం యితరులకి యేమన్నా మంచి చేసి ఉంటే దాని గురించి మనం గొప్పగా అనుకోకూడదు. భగవంతుడే మనచేత ఆ మంచి పని గాని, సహాయం గాని యితరులకి అందించాడని భావించడం. దాని గురించి యిక మరచిపోవడం. కాని యితరులు మనకు చేసిన సహాయాన్ని మాత్రం మరువకూడదు.)
3. యితరులతో ఘర్షణ పడే ఆసక్తిలో తగ్గుదల.
4. ఉత్కంఠ, బాథ అనుభవంలోకి రావడంలో తగ్గుదల.
5. యితరులతో పిచ్చాపాటి మాట్లాడటంలో తగ్గుదల.
6. ఆథ్యాత్మిక విషయాల పైన ఆసక్తి, ఆథ్యాత్మిక జ్ఞాన సముపార్జన మీద, ఆథ్యాత్మిక గ్రంథాలను చదవడంలో ఆసక్తి.
7. యితరులలోని మంచి గుణాలని మెచ్చుకునే ఆసక్తిలో పెరుగుదల.
8. జీవితంలోని ప్రతీ క్లిష్ట పరిస్థితిని ఆనందంగా స్వీకరించే సమర్థత విషయంలో పెరుగుదల.
9. ప్రతీ క్షణం ఆనందంగా ఉండే సమర్థతలో పెరుగుదల.
10. కారణం లేకుండా మనసులో పెల్లుబికే ఆనందం.
11. లౌకిక ఆనందాల మీద విముఖత.
12. జరిగేది తనకి అనుకూలమైన రీతిలో జరపాలన్న ఆసక్తి తగ్గి జరిగేది చూస్తూ ఉదాశీనతగా ఉండగలగడం.
13. దైవ సంబంథ విషయాలైన సత్సంగం, పూజ, జపం, ధ్యానం, వీటి మీద ఆసక్తి.
14. మనసెప్పుడు దైవ చింతనమీదే ఉండటం, నామస్మరణ మీద మనసు లగ్నం చేయడం.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment