11.02.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి
జయజయ సాయి
సాయి బంధువులకు
బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక
అద్భుతమైన శ్రీ షిరిడీసాయి వైభవంలోని మరొక వైభవం.
శ్రీ షిరిడీ
సాయి వైభవమ్ – పునర్జన్మను ప్రసాదించిన బాబా ఊదీ
పురందరేకు
బాబాపై అంతులేని ధృఢమయిన విశ్వాసం. ఆయన
తన కూతురుకు గాని భార్యకు గాని
ఎప్పుడయినా అనారోగ్యం కలిగితే, చూసుకోవడానికి బాబా ఉన్నారనే ధీమాతో
ఉండేవాడు. ఒకసారి
ఆయన భార్య ఉదయం 3 గంటలనుంచి 8 గంటల వరకు ఆగకుండా
వాంతులు డయేరియాతో బాధపడసాగింది. ఆవిడకు
వాంతులు, నీళ్ళవిరోచనాలు ఆగకుండా అవుతూ ఉండటంతో 8 గంటలకి
ఒళ్ళంతా చల్లబడిపోయి నాడి కూడా బలహీనంగా
కొట్టుకోసాగింది. వెంటనే
వైద్యుణ్ణి పిలిపించారు.
ఆయన
పరీక్షించి ఆవిడ ఒక గంటకన్నా
ఎక్కువ బ్రతకదేమోననే సందేహాన్ని వ్యక్తం చేశారు. పురందరే
గారు తన మేనకోడలికి బంగారు
నగ చేయించుదామని కంసాలి ఇంటిలో ఉండటం వల్ల ఈ
విషయం ఆయనకు తెలియదు. పరీక్ష చేసిన వైద్యుడు పురందరే
భార్య బ్రతికే అవకాశం లేదని చెప్పడంతో ఒకతను
ఈ విషయం చెప్పడానికి పురందరే
వద్దకు ఏడుస్తూ వెళ్ళాడు.
పురందరేగారు
ఇంటికి వెళ్ళేదారిలో దత్త మందిరం ఉంది. ఆయన
అక్కడ బాబా, ఒక ఫకీరుగా
చేతిలో జోలితో కనిపించారు. ఆ
ఫకీరు ఆయనను ఓదారుస్తూ “నీభార్య
గురించి ఏమీ భయపడకు. ఆమె మరణించదు.
నీటిలో ఊదీని కలిపి ఆమె
చేత త్రాగించు. ఒక
గంటలో ఆమెకు నయమవుతుంది.
మిమ్మలనందరినీ నేను కాపాడుతూ ఉంటాను.”
అన్నాడు. పురందరే
ఇంటికి చేరుకునేటప్పటికి అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆయన
ఇంటిలోకి వెళ్ళి బాబా ఊదీని నీటిలో
కలిపి భార్య పడుకున్న మంచం
వద్దకు వచ్చారు. ఆవిడ
పళ్ళు బాగా గిట్టకరచుకుని ఉన్నాయి. అందువల్ల
ఆయన బాబా తీర్ధాన్ని ఆవిడ
నోటిలో పోయడానికి ఒక చెమ్చాను నోటిలో
పెట్టి తెరవడానికి ప్రయత్నించారు. ఇది
చూసి చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులంతా
చాలా భయపడ్డారు. బలవంతంగా
తీర్ధాన్ని గొంతులో పోయవద్దని చెప్పారు. వారి
మాటలేమీ పట్టించుకోకుండా ఆయన బాబా ఊదీ
తీర్ధాన్ని ఆవిడ నోటిలో పోశారు. కొంత
ఊదీని ఆమె శరీరమంతా రాశారు.
ఆతరువాత
ఆయన స్నానం చేసి బాబాకు పూజ
చేసి నైవేద్యం సమర్పించారు. ఇక
ఎవరి కోసం ఎదురు చూడకుండా ఏమీ
పట్టనట్టుగా, భోజనం చేశాడు. ఒక గంట తరువాత
వైద్యుడు వచ్చి ఆమెని పరీక్షించాడు. ఆశ్చర్యకరంగా
ఆవిడ కోలుకోవడం గమనించాడు. శరీర
ఉష్ణోగ్రత మామూలు స్థాయికి వచ్చి నాడి కొట్టుకోవడం
మొదలయింది. మందు
ఏమిచ్చారని పురందరేని ఆశ్చర్యంగా అడిగాడు. బాబా
ఊదీ తీర్ధం తప్ప మరింకేమీ ఇవ్వలేదని
పురందరే సమాధానమిచ్చాడు. తరువాత
వైద్యుడు కొన్ని మందులనిచ్చి వాడమని చెప్పివెళ్ళిపోయాడు. ఫకీరు
చెప్పినట్లుగానే ఆమె మరణాన్ని జయించి
కోలుకుని ఆరోగ్యవంతురాలయింది.
(మరికొన్ని వైభవాలు
తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
ఈ రోజునుండి
ప్రాపంచిక రంగములో ధన సంపాదనపై సాయి బానిస శ్రీరావాడ గోపాలరావు గారి ఆలోచనలు తేదీల వారీగా ప్రచురిస్తున్నాను. ఇవి చదివి మీ అభిప్రాయాలను నా మెయిల్ కి తెలపవసిందిగా
కోరుతున్నాను.
-----త్యాగరాజు - tyagaraju.a@gmail.com-
9440375411
21.01.1999
1. ఇతరుల సిరిసంపదలను చూసి నీవు నీజీవితాన్ని కష్టాలపాలు
చేయకు. నీకు ఉన్న సగము రొట్టి తిని జీవించు.
2. తల్లిదండ్రులు, పిల్లలు, వారిమధ్యన ధన సంపాదన వ్యవహారాలు గత జన్మలోని ఋణానుబంధం వలన కలుగుతూ ఉంటాయి. నీవు నీ పిల్లలకు ఆస్తినిచ్చిన, లేదా నీ కుమారుడు నీకు పది రూపాయలు యిచ్చినా, అవి గత జన్మలోని ఋణానుబంధ మహత్మ్యమే.
3. నేడు సాయిభక్తిని వ్యాపారసరళిలో అమ్ముతున్నారు. అటువంటివారినుండి దూరంగా ఉండు.
25.02.1999
4. జీవితంలో
బంగారాన్ని సంపాదించడం తప్పుకాదు. ఆ సంపాదన
పేరిట బంగారంలాంటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.
24.03.1999
5. సాయిపేరిట నీవు ఎవరినుండీ ధనాన్ని యాచించకు. ఎవరయినా సాయి తత్వప్రచారానికి ధనమిచ్చిన దానిని
సాయితత్వ ప్రచారానికే వినియోగించు.
30.06.2000
6. మానవత్వాన్ని
మంటకలిపి ధన సంపాదన చేసేవారికంటే మానవత్వాన్ని ప్రబోధించే భగవంతుని ప్రతినిధులు (భగవంతునిపై
నమ్మకము కలవారు) నాకు ప్రీతిపాత్రులు.
30.07.2000
7. విద్యాదానం
చేసే గురువు తన అర్హత ప్రకారము తన జీవితానికి కావలసిన ధనసంపాదన కావించుకోవాలి. అంతేకాని, తన శిష్యులు తనకంటె ఉన్నత చదువులు చదివి,
తనకంటె ఎక్కువ ధనసంపాదన కావిస్తున్నారే అనే భావన రానీయకూడదు.
30.01.2000
8. గుళ్ళు,గోపురాలకు నీవు ఎంత చందా యిచ్చావు అన్నది
ముఖ్యం కాదు. భగవంతుని పేరిట ఎంతమంది అన్నార్తులకు
భోజనం పెట్టావు మరియు భగవంతుని ఆశీర్వచనాలను పొందగలుగుతున్నావు అనేదే ముఖ్యము.
22.03.2002
9. కొందరు మజ్జిగమెతుకులు తినడానికి కూడా నోచుకోలేదు. అదే కొందరు పెరుగన్నం కావాలని కోరుతూ యితరుల గురించి
ఆలోచించకుండా పెరుగంతా తామే తినాలని తలచేవారిని ఏమనాలో ఒక్కసారి ఆలోచించు.
24.07.2002
10 నీకు ఉన్న కండబలంతో సమాజములో విఱ్ఱవీగేకన్నా నీకు
ఉన్న అర్ధబలంతో సమాజంలోని అన్నార్తులకు అన్నదానం చేయటం మిన్న.
(మరికొన్ని ఆలోచనలు రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment