Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, March 6, 2016

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికత – 2వ.భాగం

Posted by tyagaraju on 7:44 AM

     
       Image result for images of jasmine flowers


06.03.2016 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
మహాశివరాత్రి శుభాకాంక్షలు

సాయిబానిస గారికి బాబావారు ఇచ్చిన ఆధ్యాత్మిక సందేశాలు రెండవ భాగం చదవండి.
     Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం  – 2వ.భాగం 
07.03.2016 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా  గారి ప్రవచనం "శివ స్వరూపంలో సాయి" క్రింద  ఇచ్చిన యూట్యూబ్  లింక్ లో   వినండి. 


09.06.2000

11. నేను పంచభూతాలను నాలో యిముడ్చుకొని ఈ మానవ రూపాన్ని ధరించానుమానవుడికి పంచభూతాలపై ఆధిపత్యము లేదునేను మాత్రము ఆ పంచభూతాలను నా ఆధీనంలో ఉంచుకున్నాను.
   


31.08.2000

12. నేను నాగురువు బడిలో చేరిన తరువాత సర్వస్వాన్ని మరచిపోయి నాగురువులో భగవంతుని చూడగలిగానునీవు భగవంతుని నీ గురువులో చూడగలిగిననాడు నీ జన్మ ధన్యము.


30.09.2000

13. ఈ ప్రపంచంలో అన్ని మతాలవారు తమ సాప్రదాయం ప్రకారం భగవంతుని ప్రార్ధించుకోవాలిపరమత సహనాన్ని పాటించాలివివాదాలలో తలదూర్చరాదు.

16.11.2000

14.  ఈ నా దర్బారులో వేరువేరు నమ్మకాలతో నావాళ్ళు ఉన్నారువారందరికీ నేనిచ్చే సందేశము.

 "భగవంతుని నమ్మండిమీ మీ స్వధర్మానుసారము భగవంతుని పూజించండి. భగవంతుని అనుగ్రహాన్ని పొంది మీ జీవిత గమ్యాన్ని చేరండి".   

30.03.2001

15. మానవుడు తన ఇష్టానుసారము ఆకాశహర్మ్యాలను కట్టగలడు, కూల్చగలడుకాని, ఆకాశ పరిశోధనలకు మాత్రము గాలిగుమ్మటాలను వాయుదేవుని అనుగ్రహంతో మాత్రమే పైకి ఆకాశములోనికి పంపి పరిశోధనలను చేయగలడుఅందుచేత మానవశక్తి కన్న దైవశక్తి గొప్పదని గ్రహించు.

               Image result for images of man in air ballon

16.04.2001

16.   నకిలీ నోట్లుకు, మంచినోటుకు తేడా తెలుసుకోవటానికి వాటిని మంటల్లో వేయుట అవివేకముఅదే విధముగా ఎదుటి మనిషిలోని ఆధ్యాత్మికత ఎంత ఉందో తెలుసుకోవడం కూడా అవివేకమేఆధ్యాత్మిక విలువలు తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక రంగములో (గురువు సహాయంతో) ప్రయాణం చేయుట ఒక్కటే శరణ్యము.

16.04.2001

17.  నీవు ఎదుటివానిని మోసం చేయగలవుమరి నిన్ను నీవు మోసం చేసుకోగలవాఅలాగే నీవు భగవంతుని మోసం చేయలేవు. కారణం భగవంతుడు నీ హృదయంలోనే ఉన్నాడు కనక.

30.04.2002

18.  నీవు తినే అన్నము పరబ్రహ్మ స్వరూపమునీవు తినలేని స్థితిలో దానిని పారవేయవద్దుఆకలితో ఉన్న నీతోటివానిని పిలిచి వాని ఆకలి తీర్చు.


29.06.2002

19. బీదరికము భగవంతుని చేరడానికి తొలిమెట్టుతోటివాని ఆకలిని గుర్తించగలిగినవాడే బీదవాడుఅనగా భగవంతుడు నివసించేది బీదవాని హృదయములోనే కదా!

16.02.2003

20.  నేను, నాది, నావాళ్ళు అనేవి ఒకనాడు మట్టిలో కలిసిపోవలసినవేవాటిపై వ్యామోహం వదలిపెట్టుశాశ్వతమయిన భగవంతునిపై ప్రేమను పెంచుకోజీవితాన్ని ప్రశాంతమయిన మార్గములో పయనింపచేసుకో

శివ స్వరూపంలో సాయి :  ప్రవచనం 
https://www.youtube.com/watch?v=_SslNISIF0s&feature=youtu.be 

 సాయి ఇచ్చిన సందేశాలు వినండి. 
https://www.youtube.com/watch?v=B7u8z9pe-g8&feature=youtu.be

(మరుసటి సంచికలో మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు)
(సర్వం శ్రీసాయినధార్పణమస్తు) 







Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List