22.08.2017 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయి లీల ద్వైమాసపత్రిక
మార్చి – ఏప్రిల్, 2015 సంచికలో ప్రచురింపబడ్డ విశ్లేషాత్మక వ్యాసాన్ని ఈ రోజు ప్రచురిస్తున్నాను.
సంకలనమ్ : షంషద్ ఆలీ బేగ్
మరాఠీనుండి ఆంగ్లానువాదమ్ : మిస్ మినాల్ వినాయక్ దాల్వి
శ్రీ సాయి – ధన్వంతరి
ఆత్మ భగవంతునితో అనుసంధానమై ఉంటుంది. మనం ఈ భూప్రపంచంలో ఉన్నపుడు ఆత్మకి
మన శరీరమే నివాస స్థానం. అందువల్లనే మనం మన
శరీరాన్ని రోగగ్రస్తం కానీయకుండా ఆరోగ్యకరంగాను, పరిశుభ్రంగాను ఉండేలాగ జాగ్రత్తగా
చూసుకుంటూ ఉండాలి.
బాబా షిరిడీలో ఉన్న కాలంలో
మానవజాతి సంక్షేమం కోసం నిరంతరం శ్రమించారు.
మన మనస్సు, బుద్ధి అంతే కాకుండా ఆరోగ్యకరమయిన శరీరం వాటియొక్క ప్రాముఖ్యాన్ని అందరికీ
తెలియచేశారు. సాయిబాబా షిరిడీలో గొప్ప వైద్యునిగా
పేరుగాంచారు. దీని గురించి మనం శ్రీసాయి సత్
చరిత్ర 7వ. అధ్యాయంలో గమనించవచ్చు.
“తొలిదినములలో బాబా తెల్ల
తలపాగా, శుభ్రమయిన ధోవతి, చొక్కా ధరించేవారు.
మొదట గ్రామములో రోగులను పరీక్షించి, ఔషధములనిచ్చేడివారు. వారి చేతితో నిచ్చిన
మందులు పని చేయుచుండేడివి. మంచి హస్తవాసి గల
వైద్యునిగా పేరువచ్చెను.”
– ఓ.వి. 46
బాబా రోగులకు మందులివ్వడమే
కాదు, మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఏవిధంగా నడచుకోవాలో, శరీరాన్ని ఏవిధంగా కాపాడుకోవాలో మొదలయిన విషయాలమీద సలహాలు యిస్తూ ఉండేవారు.
ఆయన ప్రతిరోజు లెండీబాగ్ కు అప్పుడప్పుడు ప్రక్కనే ఉన్న గ్రామమయిన రహతాకు కాలినడకనే
వెళ్ళి వస్తూ ఉండేవారు.
ఆయన ఎప్పుడూ ఏ వాహనంలోను
ప్రయాణం చేయలేదు. ఆఖరికి ఆయనయందు భక్తితో పల్లకీ
ఉత్సవాన్ని జరిపించే సమయంలో కూడా నడిచేవెళ్ళారు గాని పల్లకీ మాత్రం ఎక్కలేదు. తరచూ ఆయన గంటల తరబడి ప్రకృతిలో లీనమయ్యి ఉండేవారు. ఆయన షిరిడీలో మొట్టమొదటిసారిగా గురుస్థానమయిన వేపచెట్టు క్రింద తపమాచరిస్తూ ధాన్యముద్రలో కనిపించారు.
దీనిని బట్టి మంచి ఆరోగ్యంతో జీవించాలంటే ప్రకృతి, నడక, ధ్యానం ఎంత సహాయపడతాయో
వాటి ప్రాముఖ్యత గురించి బాబా తెలియచేశారు.
నేటి కాలంలో ‘యోగాభ్యాసం' నాగరికతగా మారింది. కాని బాబా ఆరోజుల్లోనే యోగాభ్యాసం
చేసేవారు. బాబా హటయోగం, ఖండయోగం చేసేవారనే
విషయం మనకు శ్రీసాయి సత్ చరిత్ర 7వ.అధ్యాయంలో కనిపిస్తుంది.
బాబా చేసిన మరొక అధ్భుతం
ఏమిటంటే, షిరిడీ పొలిమేరలలో గోధుమ పిండిని చల్లించి కలరా మహమ్మారిని షిరిడీలోకి ప్రవేశించకుండా
నిరోధించడం. ఇది ఎంతో అధ్భుతమని అందరూ భావించినప్పటికీ, దీని వెనుక ఒక శాస్త్రీయమయిన, సైన్స్ కి సంబంధించి మూలాధారమయిన విషయం ఒకటి ఉన్నదని 1928వ.సంవత్సరంలో సాయిలీలా మాసపత్రికలో ఒక
వ్యాసం ప్రచురింపబడింది. కాని ఒక డాక్టర్ అందులో
ప్రచురింపబడ్డ వ్యాసాన్ని విమర్శిస్తూ తన వ్యతిరేకతను తెలియచేసాడు. ఆ వ్యాసరచయితను నిందిస్తూ “నువ్వు రాసినదేమిటి? కలరా అనేది ఒక దుష్ట శక్తా? దుష్ట దేవతా ?
దానిని మనం చూడగలమా? ఇటువంటి వ్యాసాలు
పాఠకులను తప్పుత్రోవ పట్టిస్తాయి. నువ్వు చదివేదేమో
బయాలజీ, నువ్వు మైక్రోబయాలజిస్టువి కూడాను.
కలరాకు కారణమయ్యే సూక్ష్మజీవులు అమ్మవారిగా రూపంమార్చుకుని మనకు కనిపిస్తుందా? మైక్రోబయాలజిస్టువి అయినా నువ్వు ఆవిధంగా చెప్పడం
భావ్యమేనా” అని విమర్శించాడు.
ఆవ్యాస రచయిత, ఆ డాక్టరు
ఇద్దరూ కలిసి ఈ విషయం మీద చర్చించుకున్నారు.
డాక్టరు వ్యాసరచయితను కలుసుకున్నాడు.
డాక్టరు : “కలరా సూక్ష్మ
జీవుల వల్ల వ్యాప్తి చెందుతుంది, అవునా?”
రచయిత: “అవును”
డాక్టర్ : అయితే కాలవ దగ్గర కలరా మహమ్మారి అనే ఒక స్త్రీ కూర్చుని ఉందని అంటున్నావు కదా, దాని అర్ధం ఏమిటి?”
రచయిత : గ్రామ సరిహద్దు
కాలవ వెంబడే ఉంది. కాలువలో నీరు నిండుగా ప్రవహిస్తూ
ఉంది. కలుషితమయిన నీటిలో సూక్ష్మజీవులు వృధ్ధి చెంది వ్యాపిస్తాయనే విషయం మనకు తెలుసు. ఎవరయినా రోగి యొక్క దుస్తులను ఆ కాలవలో ఉతికినపుడు,
సూక్ష్మజీవులు నీటిలో వ్యాపిస్తాయి. తరవాత
మరెవరయినా దుస్తులను ఆ నీటిలో ఉతికినట్లయితే ఆ సూక్ష్మజీవులు ఆ దుస్తులను అంటిపెట్టుకుని
ఉంటాయి. ఆ బట్టలను తెచ్చి ఆరవేసినపుడు వాటిమీద
ఆసూక్ష్మజీవులు ఉంటాయనే విషయం సాయిబాబాకు తెలుసు.
ఆవిధంగా ఆరబెట్టిన దుస్తులను ఒక స్త్రీగా సాయిబాబా వర్ణించి ఆ మహమ్మారి షిరిడీలోకి ఎపుడు
ప్రవేశిద్దామా అని ఎదురు చూస్తూ ఉందని గూఢార్ధంతో ఆవిధంగా మాట్లాడారు. లెండీలో ఆసమయంలో తగినంత నీరు లేక ఎండిపోయినందువల్ల
గ్రామస్తులందరూ కాలువలోని నీటినే ఉపయోగిస్తూ ఉండేవారు. కాలువలోకి పరిశుభ్రమయిన నీటి ప్రవాహం వచ్చేలోపులోనే రోగకారకమయిన సూక్ష్మజీవులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందువల్లనే సాయిబాబా ముందుగానే ఊహించి మందులను తయారు
చేస్తూ ఉండేవారు.
డాక్టర్ : అయితే పిండిని
నీటిలోను, కాలవ సరిహద్దులలోను చల్లినంత మాత్రం చేత కలరా వ్యాధి వ్యాపించకుండా అరికట్టవచ్చా?”
రచయిత : మీరడిగిన ప్రశ్న బాగుంది. కాని మీప్రశ్నకు సమాధానం చెప్పగలిగే జ్ఞానం, సమర్ధత
నాకు లేవు. అయితే నేను నమ్మే విషయాన్ని మాత్రం
చెబుతాను. కలరా నివారణకి మందు వాక్సిన్ (టీకా). కలరాకు కారణమయ్యే సూక్ష్మ జీవుల మీదనే ప్రయోగాలు
చేసి ఒక విధమయిన వాక్సిన్ తయారు చేస్తారు అవునా?”
డాక్టర్ : అవును
రచయిత : వాక్సిన్ అంటే ఏమిటి?
డాక్టర్ : సూక్ష్మ జీవులను
కాంజీ అనబడే నల్ల కారట్ ల జ్యూస్ యొక్క ద్రావణంలో వేస్తారు.
(నల్ల కారట్స్)
అందులో ఈ సూక్ష్మజీవులు ఒక ఆకారం వరకు పెరిగి పెద్దవయి ఒక విధమయిన ద్రవాన్ని స్రవిస్తాయి. ఆద్రవం కలరా సూక్ష్మ జీవులన్నిటినీ చంపివేస్తుంది. అటువంటి స్థితిలో ఆద్రవాన్ని వాక్సిన్ ద్వారా రోగి శరీరంలోనికి ఎక్కించినపుడు శరీరంలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి.
(నల్ల కారట్స్)
అందులో ఈ సూక్ష్మజీవులు ఒక ఆకారం వరకు పెరిగి పెద్దవయి ఒక విధమయిన ద్రవాన్ని స్రవిస్తాయి. ఆద్రవం కలరా సూక్ష్మ జీవులన్నిటినీ చంపివేస్తుంది. అటువంటి స్థితిలో ఆద్రవాన్ని వాక్సిన్ ద్వారా రోగి శరీరంలోనికి ఎక్కించినపుడు శరీరంలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి.
రచయిత : శ్రీసాయిబాబా
కూడా గోధుమపిండిని నీటిలో చల్లించి సరిగ్గా యిదే విధానాన్ని అమలుపరచారు. నీటిలో చల్లబడిన పిండి నీటిఆవిరితో కలిసి ఆవిరయినపుడు
ఆ పిండిలో ఒక విధమయిన మార్పు జరుగుతుంది. పిండి
నీటిలో ఉన్నందువల్ల నీటిలో ఉన్న కలరా సూక్ష్మ జీవులు నశిస్తాయి అవునా?
డాక్టర్, రచయిత చెప్పినదానికి
ఆఖరికి అంగీకరించాడు. అతని సందేహం తీరిపోయింది. అవును ఆవిధంగా జరగడానికి ఆస్కారం ఉంది అని ఒప్పుకున్నాడు.
సాయిబాబా చేసే చర్యలు
మనలాంటి సామాన్యులు అర్ధం చేసుకోలేనివిగా ఉంటాయి.
అయితే పరిశోధించే దృష్టితోను,
తెలుసుకోవాలనే ఆసక్తితోను సాధ్యమయినంత వరకు తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి.
ఈవిధంగా సాయిబాబా ప్రజలను
రోగాలబారిన పడకుండా కాపాడి అందరూ మంచి ఆరోగ్యవంతంగా ఉండేలా కాపాడుతూ వచ్చారు. సాయిబాబా రోగులకు సేవచేసి వారికి వైద్యం చేసినట్లే
నేటికీ ఆస్పత్రులను నిర్మించి ప్రజలకు సేవా కార్యక్రమాలను షిరిడీలో కొనసాగిస్తూ ఉన్నారు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment