05.09.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి సత్ చరిత్రలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి.
బాబా
అంకిత భక్తులు తమంత తాముగా చెప్పిన కొన్ని విషయాలను సంఘటనలను మరాఠీలో మిస్. ముగ్ధా సుధీర్ దివాద్కర్ గారు
వ్రాసిన
వాటిని ఆంగ్లంలోనికి అనువదించినవారు శ్రీ సుధీర్ గారు.
సాయిలీల ద్వై మాసపత్రిక మార్చ్ – ఏప్రిల్ 2013 వ.సం. సంచికనుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్..
ఆత్రేయపురపు
త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్
రావుబహద్దూర్ సాఠే – 5 వ.భాగమ్
సమర్ధ చెప్పిన వృత్తాంతం ---తరువాయి భాగమ్
వారికి అంతా చెప్పిన తరువాత తిరిగి నేను
నా ప్రయాణాన్ని కొనసాగించాను. కొన్నిరోజులపాటు
అక్కడికి, ఇక్కడికి తిరిగిన తరువాత ఉమర్ కోట్ కి చేరుకొన్నాను. అక్కడికి వెళ్ళిన తరువాత వీరి గురించి
ఆరా తీశాను. ఆ స్త్రీ
ఒక మగపిల్లవాడిని ప్రసవించిందని తెలిసింది. నేనా పిల్లవాడిని చూడటానికి వెళ్ళాను.
తల్లిదండ్రులను కలుసుకొని నా శుభాకాంక్షలను
తెలిపి ఆశీర్వదించి అక్కడినుండి బయలుదేరాను. ఆపిల్లవాడి పేరు జలాలుద్దీన్ మహమ్మద్. ఆతరువాత ఆపిల్లవాడే ‘అక్బర్’ గా ప్రసిధ్ధి చెంది హిందూస్థాన్ కి చక్రవర్తి
అయ్యాడు. ఇదంతా ఆ అల్లామియా
లీల.
దక్షిణ భిక్షా సంస్థ (ధార్మిక సంస్థ) మరియు ‘శ్రీసాయినాధ
ప్రభ’ మాసపత్రిక
1915వ. సంవత్సరంలో సాఠే
గారికి పూనాకు బదిలీ అయింది. బాబా ఆయనను షిరిడీకి పిలిచి, ‘దక్షిణభిక్షా సంస్థ’ను ప్రారంభించమని చెప్పారు.
ఆసంస్థకి సాఠే వ్యవస్థాపకునిగాను, చైర్మన్
గాను బాధ్యతలు వహించారు.
ఈ సంస్థ ‘శ్రీసాయినాధ ప్రభ’ అనే మాసపత్రికను ప్రారంభించింది. దానికి ఎడిటర్ గా శ్రీసుందరరావు నారాయణ్
గారు నియమితులయ్యారు. నాటి పాత సంచికలను తిరగేస్తే 1915 నుండి 1918
వరకు షిరిడీ సంస్థానంలో జరిగిన కొన్ని ముఖ్యమయిన విషయాలు తెలుస్తాయి.
ఈ సంస్థకు కావలసిన ఆస్తులు, అవసరమయిన సామాగ్రి అంతా రాధాకృష్ణమాయి ఆధినంలోనే ఉండేవి. కాని, సంస్థ
ప్రారంభింపబడిన ఒక సంవత్సరంలోపే ఆమె మరణించింది. ఆమె తదనంతరం సంస్థకు సంబంధించిన ఆర్ధికవ్యవహారాలను
ఎవరు నిర్వహించాలనే దానిమీద వివాదాలు తలెత్తాయి.
ఇంతే కాకుండా సంస్థ మొత్తం సాఠేగారి
ఆధినంలోనే ఉండటం, ఆయన ప్రభుత్వ శాఖలో పెద్ద ఉద్యోగి కావడం,
షిరిడీలో వాడాను నిర్మించి ఆయన అందులోనే నివసించడం, ఆయన ఛాందస భావాలు, ఆయన అహంకారం, కఠిన స్వభావం ఇవన్నీ ఆయనమీద మిగతావారు ఆగ్రహంతో ఉండటానికి ఇవి కూడా కొన్ని
కారణాలు. అంతేకాదు చావడి
ఉత్సవంలో బాబా ఆయనకే ప్రత్యేకంగా చత్రం, చామరాలను పట్టుకునే అవకాశాన్ని
ఇవ్వడం, సాఠే మాత్రమే ఆ పని చేయాలని బాబా పట్టుపట్టడం కూడా మరొక
ముఖ్యమయిన కారణం.
ఈ కారణాలన్నిటి వల్లనే అందరి దృష్టి
సాఠే మీదనే కేంద్రీకృతమయి ఆయన మీద అసూయపడసాగారు.
అందువల్లనే సంస్థలో అంతర్గతంగా విభేదాలు, తగవులాటలు ప్రారంభమయ్యాయి.
ఈ పరిస్థితి ఎంతవరకూ వెళ్ళిందంటే షిరిడీలో
కొంతమంది సాఠేగారిని షిరిడీనుంచి తరిమివేయడానికి స్థానికంగా ఉండే గూండాల సహాయం తీసుకుందామనే
నిర్ణయానికి వచ్చారు. ఒకసారి
దాదా కేల్కర్ సాఠే దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, మసీదు ద్వారం
దగ్గర నానావలి పదునైన ఆయుధంతో నిలబడి నిన్ను చంపడానికి సిధ్ధంగా ఉన్నాడని సాఠే గారికి
సమాచారం ఇచ్చాడు.
ఆఖరికి దీని తరువాత ఇంకా ఇటువంటివే మరికొన్ని
సంఘటనలు జరిగిన తరువాత సాఠే షిరిడీ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నారు.
ఆయన చెబుతున్న విషయం ---“ఎవ్వరికీ వెడుతున్నట్లు చెప్పకుండానే నేను శాశ్వతంగా షిరిడీ వదిలిపెట్టి వెళ్ళిపోయాను. నేనింక షిరిడీలో ఉండకూడదన్నది బహుశ
బాబా కోరికా? లేక నేను
బాగుపడటం కోసమే నా నివాసాన్ని పూనాకి మార్చుకోమనా? కాని ఒక్కటి మాత్రం నాలో ఎటువంటి
అనుమానానికి ఆస్కారం లేని విషయం ఉంది. అది ఏమిటంటే నేను షిరిడీలో ఉన్నపుడు బాబా ఆశీర్వాదాలు నాయందు
ఉన్నాయి. ఇపుడు నేను ఎక్కడ ఉన్నాగాని ఆయన అనుగ్రహం నామీద ఎల్లప్పుడూ
ఉంటుంది.”
(సమాప్తమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment