06.09.2020 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు మరొక అధ్భుతమయిన లీలను ప్రచురిస్తున్నాను.
అత్యవసర సమయంలో ఎటు దిక్కు తోచని స్థితిలో బాబాని సర్వశ్య శరణాగతి చేసి వేడుకున్నపుడు
ఆయన ఏవిధంగా తన భక్తులను ఆదుకుంటారో ఇది చదివిన తరువాత మనం గ్రహించుకోగలం. కాని బాబాను
మనం వేడుకొంటున్నపుడు మనలో ఎటువంటి అనుమానాలు తలెత్తకూడదు. కావలసినదంతా ధృఢమయిన నమ్మకం.
శ్రీ సాయి లీల పత్రికలో ప్రచురింపబడిన ఈ లీలను భువనేశ్వర్
నుండి శ్రీమతి మాధవి గారు తెలుగు అనువాదం చేసి పంపించారు.
వివాహానికి
ధన సహాయం ఏర్పాటు
మాది
గుజరాత్ లోని సోన్ గడ్ జిల్లా తాపి గ్రామం.
మా అమ్మాయికి వివాహ ప్రయత్నాలు మొదలుపెట్టాము. అబ్బాయిని చూడటానికి అమల్ సెర్ వెళ్లాను. అబ్బాయి పేరు అజయ్ పవార్. అతను బొంబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. జూన్ నెల 20 వ.తారీకు 2008 వ.సంవత్సరంలో అబ్బాయిని
చూడటానికి నిశ్చయించుకున్నాము.
అబ్బాయి తరపువారందరికీ
మా అమ్మాయి నచ్చింది. వెంటనే వాళ్ళు వివాహం
చేసేయమన్నారు. మూడు రోజులలోనే ముహూర్తం కూడా
నిర్ణయించేసారు. మూడు రోజులలో వివాహానికి అవసరమయిన
డబ్బు సమకూర్చడమంటె మాటలు కాదు. డబ్బు ఏవిధంగా
ఏర్పాటు చేయాలో నాకు పాలుపోలేదు. ఆ సమయంలో
నాదగ్గర రూ.45,000/- మాత్రమే ఉన్నాయి. సమయం
కూడా చాలా తక్కువ. చేతిలో తగినంత డబ్బు కూడా
లేకుండా వివాహప్రయత్నాలు ఎలా మొదలుపెట్టాలో నాకేమీ తోచటంలేదు. పోనీ సంబంధం వదులుకుందామా అనుకుంటే అబ్బాయి కుటుంబం
చాలా మంచిది. ఏమి చేయాలో తెలియలేదు. ఇక బాబా తప్ప మరెవరు ఆదుకునేవారు లేరని ఆయననే శరణు
వేడుకొన్నాను. నా భార్య సోనాగఢ్ మరాఠీ పాఠశాలలో
ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ ఉంది. ఆమెని వెంటనే
వచ్చేయమని చెప్పాను. అన్ని విషయాలు చెప్పాను. అపుడు నా భార్య “ఎందుకు చింతిస్తారు? మనకు సాయిబాబా సహాయం చేస్తారు. బాబా ఫోటో దగ్గర
శ్రధ్ధతో భక్తి పూర్వకంగా వేడుకొందాము. బాబా
తన భక్తుల కష్టాలను బరువు బాధ్యతలను తన భుజస్కంధాల మీద మోస్తారు” అని చెప్పింది. మా ఇంటి ప్రక్కనే ఉత్తరప్రదేశ్ కి చెందిన రామ్ శంకర్
అనే బాబా భక్తుడు ఉన్నాడు. అతను మమ్మల్ని చూసి
“ఎందుకని మీరిద్దరూ అంత ఆందోళనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు? ఏదయినా సమస్యా?” అని అడిగాడు.
“ మా అమ్మాయికి వివాహం నిశ్చయం అయింది. మూడు
రోజులలో వివాహం చేయమన్నారు. డబ్బు సమకూడటం
చాలా కష్టం. ఏమి చేయాలో తోచడంలేదు” అని చెప్పాము.
అపుడు అతను నేను ఒక లక్ష రూపాయలు ఇస్తాను.
మీరింక ఎటువంటి అలోచనా లేకుండా తీసుకోవాలి” అన్నాడు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అతను సాయిబాబా ఫోటో ప్రక్కన కూర్చుని “చింత పడవద్దు. ‘సబ్ కా మాలి ఏక్ హై’ అని వెంటనే వెళ్ళిపోయాడు.
ఆ
తరువాత రోజు మా బావమరిది ఫోన్ చేసాడు. అతనికి
పోలీస్ శాఖలో ఉద్యోగం. అతను కూడా సాయిభక్తుడే. “నీకు డబ్బు అవసరం కదా బెంగపెట్టుకోకు నేను ఇస్తాను
బాబా మీద భారం వేయి” అన్నాడు. ఆవిధంగా మా అమ్మాయి
వివాహం ఇక రెండు రోజులు ఉందనగా డబ్బు సర్దుబాటు అయింది. బాబా అనుగ్రహం వల్లనే మాకు ఆవిధంగా డబ్బు సమకూడింది.
ఈ
విధంగా బాబా దయ వల్ల మూడు రోజులలోనే వివాహానికి
కావలసిన డబ్బు రూ.2,40,000/- ఏర్పాటయింది.
వివాహం చాలా బాగా జరిగింది. వచ్చినవాళ్ళందరూ
మా అమ్మాయి , అల్లుడికి తమ ఆశీర్వాదాలను, శుభాకాంక్షలను
తెలిపారు. ఆ తరువాత నేను బాబా ఫోటో ముందు నిలబడి
కన్నీళ్ళతో బాబా అన్న మాటలను గుర్తుకు తెచ్చుకున్నాను, “నీ భారాన్ని నేను మోస్తాను. నా ఈవచనం అక్షర సత్యం’ బాబా ఎల్లప్పుడు తన భక్తులకు ముందు వెనుక నిలబడి
ఉంటారు. వివాహం అయిన తరువాత గురుపూర్ణిమ వచ్చింది. ఆ సందర్భంగా మేము షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుని
ఆయన కృపకు ధన్యవాదాలు తెలుపుకొన్నాము.
భగవాన్
గంగాధర్
గుజరాత్
సాయి సాగరంలోనుండి వెలికితీసిన ఆణిముత్యాలు ఈ క్రింది లింక్ ద్వారా చదవండి.
http://teluguvarisaidarbar.blogspot.com/
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
http://teluguvarisaidarbar.blogspot.com/
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
1 comments:
Best movies website movie news
Post a Comment