08.09.2020 మంగళవారమ్
ఓమ్ సాయి
శ్రీ
సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా గారు జీవించి ఉన్నరోజులలో జరిగిన అత్యధ్బుతమయిన లీలను ఈ రోజు ప్రచురిస్తున్నాను.
ఇది
శ్రీ సాయి లీల ద్వైమాసపత్రిక మే – జూన్ 2016 వ.సంవత్సరంలో ప్రచురింపబడింది.
ఊహించని
విధంగా బాబా చూపించిన ఈ లీలను ఇప్పుడు మనందరం చదివి బాబావారు తన ప్రేమ దయను తన భక్తులపై ఏవిధంగా ప్రసరిస్తూ ఉంటారో గ్రహించుకుందాము.
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
నాలుగు అణాలు
1. మొట్టమొదటిసారిగా నేను
షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నపుడు ఆయన నాకు నాలుగు అణాలు ఇచ్చారు.
బాబా
నాకు ప్రసాదించిన ఆ విలువయిన నాణాలను, పూజచేసిన కుంకుమ ఉంచిన చిన్న పెట్టెలో చాలా భద్రంగా దాచుకున్నాను.
వాటిని ఎంతో భక్తితో పూజించుకుంటున్నాను. ఒక రోజున నేను దుకాణానికి వెళ్ళి రెండు కొబ్బరికాయలను కొన్నాను. అక్కడ కాయలను అమ్ముతున్నామెకు కాయలకు సరిపడా ధరను చెల్లించేసాను. ఆ తరువాత ఇంటికి వచ్చి, బాబావారు ప్రసాదించిన నాణాలను పూజించుదామనుకుంటే అవి పెట్టెలో కనిపించలేదు. పొరబాటున ఆ నాణాలనే ఇచ్చి కొబ్బరికాయలను కొన్నానని అర్ధమయింది. నాకు తెలివితప్పినంత పనయింది. నాబాధ వర్ణించరానిది. స్వయంగా బాబా ఇచ్చిన నాణాలను పోగొట్టుకున్నందుకు నాబాధ చెప్పనలవికానంతగా ఉంది. సాయిబాబా నామస్మరణ చేస్తూ ఉండిపోయాను. చివరికి ఆ కొబ్బరికాయలను అమ్మిన స్త్రీ, అన్నీ అమ్మేసిన తరువాత మా ఇంటికి వచ్చి, నేనామెకు ఇచ్చిన ఆ విలువయిన నాలుగు అణాలను నాకు తిరిగి ఇచ్చేసింది. వాటిని ఇస్తూ ఆమె “అమ్మా, మీరు పూజించుకుంటూ ఉన్న ఈ నాలుగు అణాలను తీసేసుకోండి. నాకు వేరే అణాలు ఇవ్వండి” అని చెప్పింది. నేను పూజిస్తున్న అణాలు నాలుగూ నాదగ్గిరకి తిరిగి చేరినందుకు, ఈ అధ్బుతమయిన లీలను చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సాయిబాబా నాప్రార్ధనను ఆలకించి నా నాణాలను నాకు తిరిగి ఇప్పించారు.

2 ఎన్నో సంవత్సరాలుగా మేము మా పూర్వీకుల ఇంటిలోనే నివస్తిస్తున్నాము. అయిదు
సంవత్సరాల క్రితం ఒక రోజున నాకొక కల వచ్చింది.
ఆ కలలో
నేను పాలరాతి మేడమెట్ల మీద నుంచుని ఉన్నాను.
శ్రీ
సాయిబాబా అక్కడ నుంచుని ఉన్నారు.
ఆయన
చేతిలో భిక్షాపాత్ర ఉంది. “మెట్లు దిగు” అన్నారు బాబా.
ఆ
వెంటనే నాకు మెలకువ వచ్చింది.
ఆ
కలకి అర్ధమేమిటో నాకు బోధపడలేదు.
ఈ
కల ద్వారా బాబా ఏమని సందేశం ఇస్తున్నారో గ్రహించుకోలేకుండా ఉన్నాను.
మరుసటి
రోజు ఉదయం మా అబ్బాయి పూనానుండి వచ్చాడు.
“మనం
ఇప్పుడే కొత్త ఇంటికి మారాలి” అన్నాడు.
మేము
ఇల్లు మారడానికి గల కారణం తెలిసిన తరువాత, మా అబ్బాయికి నాకు వచ్చిన కల గురించి చెప్పాను.
వెంటనే
మేము కొత్త ఇంటికి మారిపోయాము. మేము ఇల్లు మారబోతున్నామని బాబా నాకు కలలో ముందుగానే సూచన చేసారని అర్ధం చేసుకున్నాను.
3. కొన్ని
సంవత్సరాల క్రితం మా అబ్బాయికి బాగా సుస్తీ చేసింది.
వాడి
ఆరోగ్యం గురించి నాకు చాలా ఆందోళన కలిగింది.
ప్రతిరోజు
పడుకునే ముందు మా అబ్బాయి ఆరోగ్యం గురించి సాయిబాబాను ప్రార్ధిస్తూ ఉండేదానిని.
ఒక రోజు రాత్రి కలలో బాబా దర్శనమిచ్చి “మీ అబ్బాయి ఆరోగ్యంగానే ఉన్నాడు. ఎందుకు దిగులు పడతావు?” అన్నారు. ఆరోజునుంచి మా అబ్బాయి ఆరోగ్యం మెరుగయింది. కొద్ది రోజులలోనే పూర్తిగా కోలుకొన్నాడు.
ఒక రోజు రాత్రి కలలో బాబా దర్శనమిచ్చి “మీ అబ్బాయి ఆరోగ్యంగానే ఉన్నాడు. ఎందుకు దిగులు పడతావు?” అన్నారు. ఆరోజునుంచి మా అబ్బాయి ఆరోగ్యం మెరుగయింది. కొద్ది రోజులలోనే పూర్తిగా కోలుకొన్నాడు.
4. నేను
మూడవసారి షిరిడీ వెళ్ళినపుడు రెండు రూపాయి నాణాలను తీసుకువెళ్ళాను.
ఒకటి
నా చేతిలో ఉంచుకొని మరొకటి చిన్న సంచీలో పెట్టుకున్నాను.
నేను
బాబాకు శిరసువంచి ఆయన పాదాలను స్పృశించి, నా చేతిలో ఉన్న రూపాయి నాణాన్ని ఆయనకు సమర్పించాను.
ఆయన
మరొకటి అడిగారు.
వెంటనే
నేను నా సంచిలోనుండి రూపాయినాణాన్ని ఆయనకు ఇచ్చేసాను.
బాబా.
“ఇవ్వు, ఇవ్వు, నీదగ్గర తగినంత డబ్బు ఉంది” అని అంటూనే ఉన్నారు.
బాబా
సర్వాంతర్యామి
అని, తన భక్తుల గురించిన ప్రతి విషయం ఆయనకు అవగతమేనని ఈ సంఘటన ద్వారా గ్రహించుకున్నాను.
కృష్ణాబాయి ఎస్.ప్రభాకర్
శ్రీ సాయిలీల 5వ.సంవత్సరం సంచికలు 2 - 3
(రేపటి సంచికలో ఎండిపోయిన తమలపాకులు)
(ఇది కూడా బాబా జీవించి ఉన్న కాలంలో జరిగిన ఆసక్తికరమయిన సంఘటన)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment