Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, September 9, 2020

ఎండిపోయిన తమలపాకులు - 1 వ.భాగమ్

Posted by tyagaraju on 7:33 AM

      Shirdi Sai Baba Temple - Visa Temple
            Red Rose PNG HD | PNG Mart


09.09.2020  బుధవారమ్
ఓమ్ సాయి  శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
బాబా గారు జీవించి ఉన్నరోజులలో జరిగిన అత్యధ్బుతమయిన లీలను రోజు ప్రచురిస్తున్నాను.  ఇది శ్రీ సాయి లీల ద్వైమాసపత్రిక మేజూన్ 2016 .సంవత్సరంలో ప్రచురింపబడింది.  ఊహించని విధంగా జరిగిన లీలను ఇప్పుడు మనందరం చదివి బాబావారు తన ప్రేమ దయను తన భక్తులపై ఏవిధంగా ప్రసరిస్తూ ఉంటారో గ్రహించుకుందాము.
BABA’S HEMAD గారు వ్రాసిన అనుభవం శ్రీ సాయి లీల 5.సంవత్సరం సంచిక 9 -10 లో ప్రచురితమయింది.  మరాఠీనుండి ఆంగ్లంలోనికి అనువదించిన వారు మీనల్ వినాయక్ దాల్వీ గారు.

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట,  హైదరాబాద్
ఎండిపోయిన తమలపాకులు - 1 వ.భాగమ్
           Dried betel leaves.🎉🎉🎉 We made a hight... - บ้านสวนสุขใจ&บ้านไร่หลายเติบ  | Facebook

1918.సంవత్సరం సెప్టెంబరు, 14.తేదీ శనివారమునాడు వినాయక చవితి సందర్భంగా నాస్నేహితుడు శ్రీ గణపతిరావు బడ్కర్ ఇంటికి వెళ్లాను.  మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి చాలా ఆలస్యమవడం వల్ల రాత్రి దాదాపు 2 గంటలకు పడుకున్నాను.  తెల్లవారుజాము 4 గంటలకు నాకు కల వచ్చింది.  ఆ కలలో దభోలీ పీఠాధిపతి స్వామి శ్రీ మహావిమలానంద గారు నాకు 8 అణాలు (వెండినాణాలతో) ఇచ్చిమధ్యాహ్నం 12 గంటలకు ముందుగానే నాకు 100 తమలపాకులు తీసుకుని రాఅన్నారు. 

           Paan - Wikipedia
నేను వెంటనే లేచి కూర్చున్నాను.  లైటు వేసి చూసాను.  ఎక్కడా ఆకులు గాని, అణాలు గాని లేవు.  స్వామి కూడా ఎక్కడా కనపడలేదు.  ఇదంతా ఒక కల అంతే అనుకున్నాను.  అయినప్పటికీ ఈ కల నాకు ఎంతో ఆధ్యాత్మికానుభూతిని కలిగించింది. ముందుగా ఏమయినా సూచనలు చేయడానికి అటువంటి కలలు ఎప్పుడు వచ్చినా నా డైరీలో రాసుకుంటూ ఉంటాను.  అలాగే ఈ కలను కూడా నా డైరీలో రాసుకున్నాను.  ఈ విధంగా రాసుకోవడానికి కారణం ఏమిటంటే ఈ కలలే తరచుగా ఏదో ఒక రూపంలో వాస్తవంగా జరుగుతూ ఉండేవి.  ఇవన్నీ నాకు అనుభవమే.

మేము వినాయక చవితిని అయిదు రోజులపాటు జరుపుకుంటూ ఉంటాము.  అది మా సంప్రదాయం.  సెప్టెంబరు 13.తారీకున వినాయక నిమజ్జనం కావించాము.  తమలపాకులు కూడా గణపతి పూజలో భాగమే కాబట్టి వాటిని ఎక్కువగా తెచ్చిపెట్టి నిలువ చేసి ఉంచాము.  ఆ ఆకులు చాలా మిగిలిపోవడంవల్ల వాటిని దభోలీకి ఏవిధంగా పంపించడమా అనే ఆలోచనలో పడ్డాను.  కారణమేమిటంటే బాంద్రాలో మేమున్న ఇంటినుంచి దభోలీ చాలా దూరం.  దభోలీకి పంపంచడం సాధ్యం కాకపోతే షిరిడికి పంపించవచ్చు అనుకున్నాను.  నాకు మళ్ళీ కావాలంటే ఎన్ని ఆకులు కావాలంటే అన్ని సులభంగానే లభిస్తాయి.  ఈ విషయాన్ని మా ఇంటిలోని వాళ్ళతో చర్చించి నిర్ధారించుకున్నాను.  అయినా ఈ ఆకులను ఎవరికి పంపించాలో ఇంకా ఖచ్చితంగా ఏమీ అనుకోలేదు.  ఈ ఆలోచనలన్నిటితో మంచంమీదనుంచి లేచి, మెట్లు దిగి క్రిందకి వస్తున్నాను.  మెట్లమీద ఎవరో పైకి వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది.  ఆ వచ్చేది అణ్ణాచించిణికర్.  ఆయనను చూడగానే నాకు సంతోషం కలిగింది.  ఆరోజు ఆదివారం.  ఆయన కేశవ్ జోషీని కలుసుకోవడానికి క్రితం రోజు రాత్రే షిరిడీనుంచి వచ్చారు.  ఆయన నాకు వెంటనే శ్రీసాయిబాబా వారి ఊదీని ఇచ్చారు.  కాసేపు విశ్రాంతి తీసుకున్న తరవాత నాకు వచ్చిన కల గురించి చెప్పాను.  మీకు తెలుసున్నవారు ఎవరయినా షిరిడీ వెడుతున్నారాఅని అడిగాను.  బాలా సాహెబ్ దేవ్ గారు మంగళవారమునాడు షిరిడీ వెడుతున్నారని చెప్పారు.  ఆయన వెళ్ళేముందు సోమవారమునాడు ఆయనని తను కలుసుకోబోతున్నట్లుగా చెప్పారు.  ఇది వినగానే నేనాయనకు వంద తమలపాకులు, రెండు వక్కలు, ఎనిమిది అణాలు, ఇంకా నాకు వచ్చిన కల గురించిన పూర్తి వివరాలను ఒక కాగితం మీద రాసి ఆయనకు ఇచ్చాను. 

శ్రీ అణ్ణాగారు బాలా సాహెబ్ దేవ్ గారిని ధానే లో కలుసుకుని మొత్తం వివరాలన్నీ చెప్పారు.  బాలా సాహెబ్ వెంటనే అణ్ణాగారు ఇచ్చినవాటినన్నిటినీ తీసుకుని, షిరిడీ వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి బయలుదేరారు.  ఆయన ఇక షిరిడీకి ప్రయాణమయే సమయానికి ఆయన కుమార్తెకు సుస్తీ చేసింది.  అందు చేత మంగళవారం బయలుదేరడానికి బదులు మరొక రెండు రోజులు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకొన్నారు.  రెండు రోజుల తరువాత షిరిడీ వెళ్ళి బాబాకు, ఆకులు, వక్కలు, అణాలు ఇచ్చి, తను ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని బాబాకు వివరించారు.  రెండు రోజులు ఆలస్యం కావడం వల్లనే ఆకులు ఎండిపోయాయని మన్నించమని కోరారు.  సాయిబాబా వారికి నాకు వచ్చిన కల గురించిన వివరాలను కూడా చెప్పారు.

భక్తులు బాబాకు ఏమి సమర్పించినా, బాబా వాటిని అక్కడ ఉన్న భక్తులందరికీ పంచిపెట్టేస్తూ ఉంటారు.  ఇపుడు అణ్ణా చించనీకర్ ఇచ్చినవి కూడా భక్తులకు పంచేయాలి.  కాని బాబా, ఆకులను తను కూర్చున్న మెత్త క్రింద పెట్టి, “సరే, ఆకులు ఎండిపోయినా ఫరవాలేదు.  వాటిని అక్కడే ఉండనీఅన్నారు.

దేవ్ గారు ఈవిషయం గురించి నాకు ఉత్తరం ద్వారా తెలియచేద్దామనుకున్నారు.  కాని ఆయన  1918.సంవత్సరం సెప్టెంబరు, 27 .తారీకున శ్రీమాధవరావు దేశ్ పాండే గారిని కలుసుకున్నపుడు ఆయనకు ఈ సంఘటన గురించి చెప్పారు.  గజగౌరీ వ్రతం రోజు రాత్రి నేను భావు సాహెబ్ దీక్షీత్ గారి ఇంటికి వెళ్ళినపుడు ఆ సంఘటన గురించి నాకు సమాచారం పంపించారు.  ఆ మరుసటి రోజు నేను బయలుదేరబోతుండగా ఆయన ఏకనాధభాగవతం చదువుతాను,  విని వెళ్లమని నన్ను బలవంత పెట్టారు.  శ్రీ భావూ సాహెబ్ గారు ఏకనాధ భాగవతాన్ని ఉదయం వేళలో చదువుతూ ఉంటారు.  ఆయన చదువుతున్నది నేను శ్రధ్ధగా వింటున్నాను. 
             Buy Sri Eknath Bhagwat Book Online at Low Prices in India | Sri Eknath  Bhagwat Reviews & Ratings - Amazon.in
కాకతాళీయంగా ఆరోజు ఎండిపోయిన ఆకుల గురించి చదివారు.  అందులో అధ్భుతమయిన ప్రస్తావన వచ్చింది.  భక్తులు వయసుమీరినవారయినా సరే వారు తనకి  
ఇష్టులేనని, వయసు మీద పడినంత మాత్రం చేత అది వారిలో ఉన్న భక్తిని ఏమాత్రం తగ్గించదనీ, ఆవిధంగానే భక్తులు భక్తితో సమర్పించిన ఎండిపోయిన ఆకులను కూడా భగవంతుడు భక్తితో స్వీకరిస్తాడని అధ్భుతంగా చెప్పబడింది.  ఆయన చదువుతున్న భాగంలో దీని గురించి రావడం రెండు సంఘటనలలోను ఎండిపోయిన ఆకుల గురించే రావడం నాకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది.

నిష్కళంకమయిన భక్తితో హృదయపూర్వకంగా సమర్పించినట్లయితే అటువంటివి ఎల్లప్పుడూ పూజనీయమైనవే, పవిత్రమయినవి
రోజులు గడిచే కొద్ది, అవి ఎండిపోయినా సరే
భగవంతుడు వాటిని ప్రేమతో స్వీకరిస్తాడే తప్ప పనికిరావని భావించడు.
దశమ స్కంధం అధ్యాయం 6 శ్లోకం 12 ఓ వి. 41)

(మిగిలిన భాగం రేపటి సంచికలో)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List