25.10.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
విజయ దశమి శుభాకాంక్షలు
బాబా ఆరతులు
శ్రీమతి శ్రీలత (మియాపూర్, హైదరాబాద్) గారిని బాబా వారు ఏవిధంగా అనుగ్రహించారో మన సాయిభక్తులందరికి
ఈరోజు వివరిస్తాను.
ఆమె
మియాపూర్ (హైదరాబాద్) లో నివసిస్తున్నారు. ఆమె తన అనుభవాన్ని చెన్నైలో ఉంటున్న తమ అక్కగారయిన శ్రీమతి కృష్ణవేణిగారికి వివరించారు.
కృష్ణవేణిగారు ఆమె
చెప్పిన అనుభవాన్ని నాకు వివరించడం జరిగింది.
ఇపుడు
దానిని ప్రచురిస్తున్నాను.
శ్రీలత గారికి బాబా తన ఆరతులను వీక్షించే భాగ్యాన్ని ఏవిధంగా కలుగచేసారో తెలియచేసే లీల
శ్రీమతి శ్రీలత గారు ఒంగోలులో చదువుకునే రోజులు. కాలేజీ ప్రక్కనే బాబా మందిరం ఉంది. అది ఒంగోలు సంతపేటలో ఉన్న బాబా మందిరం.
ఆమెకు
బాబా మీద ఎంతో భక్తి.
కాలేజీలో
ఉన్నపుడు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో 12 గంటలకు బాబా మందిరానికి ప్రతిరోజు ఆరతికి తప్పకుండా వెడుతూ ఉండేవారు.
ఆరతి
పూర్తయిన తరువాత మరలా కాలేజీకి వెళ్ళిపోయేవారు.
మరలా
సాయంత్రం 6 గంటలకు కూడా క్రమం తప్పకుండా బాబా ఆరతికి వెళ్ళేవారు.
ఆమెకు
బాబా అంటే అంత భక్తి, ప్రేమ.
వర్షం
వచ్చినా, కాలేజీకి సెలవులు ఉన్నా, క్రమం తప్పకుండా బాబా ఆరతికి వెళ్ళడం మాత్రం మానేవారు కాదు.
ఆమెకు
ఆవిధంగా బాబా ఆరతులకు వెళ్ళడం
తన దినచర్యలో ఒక భాగమయిపోయిందనే చెప్పాలి.
ఆతరువాత
వివాహం నిశ్చయమయింది.
అబ్బాయి
చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పినపుడు, చెన్నైలో బాబా మందిరాలు తక్కువ, ఇక్కడయితే
నేను ప్రతిరోజూ బాబా ఆరతులకు వెడుతూ ఉన్నాను, ఇక
చెన్నైలో ఉంటే బాబా మందిరం దగ్గరలో లేనట్లయితే ఆరతులకు వెళ్ళడం సాధ్యం కాదు, ఆయన ఆరతులను చూసే భాగ్యం నాకు లేదా అని చాలా దిగులు పట్టుకుంది.
ఆమె
దిగులును దూరం చేయడానికి బాబా ఆమెకు అధ్బుతమయిన ఊహించని అవకాశాన్ని కలుగజేసారు.
ఆమెకు 2013 వ.సంవత్సరం మే, 31 వ.తారీకున వివాహమయింది.
ఆమె
వివాహం జరగడానికి రెండురోజుల ముందుగానే కాబోయే భర్తకు అప్పుడు చేస్తున్న ఉద్యోగంలో వచ్చే జీతంకన్నా రెట్టింపు జీతంతో హైదరాబాదులోని కంపెనీలో వచ్చింది.
ఇక
వారు చెన్నైనుంచి హైదరాబాద్ కి వచ్చేసారు.
హైదరాబాద్
లోని మియాపూర్ లో వారు ఒక అపార్టుమెంట్ లోకి ప్రవేశించారు.
దగ్గరలోనే
మియాపూర్ లొ పెద్ద బాబా మందిరం ఉందని తరువాత తెలిసింది.
అది
కూడా తాము ఉండే అపార్టు మెంట్ నించి, మందిరానికి నడిచి వెళ్ళేటంత దూరం.
నీ
ఆరతులను చూడలేకపోతున్నానే అని బాధపడుతున్న నన్ను నీమందిరం ప్రక్కనే ఉండేలా అనుగ్రహించావా అని ఆమె ఎంతగానో సంతోషించారు.
వివాహమయిన
తరువాత కూడా బాబా ప్రతిరోజు ఆమెకు తన ఆరతులను వీక్షించే భాగ్యాన్ని కలుగజేసారు.
మనలో
ఉండే శ్రధ్ధను
బట్టే
ఆయన అనుగ్రహం కూడా మనమీద ప్రసరిస్తారనే దానికి ఈ ఉదంతమే సాక్ష్యం.
అది
బాబా ఆమెకు ప్రసాదించిన గొప్ప అదృష్టమనే చెప్పాలి.
ఇక ఇక్కడ మియాపూర్ లోని బాబా మందిరంలోని ప్రత్యేకత ఏమిటంటే ప్రతి గురువారమునాడు ఎప్పుడూ ఇచ్చే సాయిసంధ్యా ఆరతి తరువాత కూడా, రాత్రి 8 గంటల సమయంలో గంగా నదికి ఏవిధంగా కుంభ ఆరతి, నక్షత్ర ఆరతి, సింహ ఆరతి ఇస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా ఇస్తూ ఉంటారు.
ఆరతి
ఇచ్చే సమయంలో మందిరంలోని విద్యుత్ దీపాలన్నిటినీ ఆర్పివేస్తారు.
ఆసమయంలో ఇస్తున్న ఆరతులు కనులపండువగా ఉంటాయి.
ఆవిధంగా
ఎక్కడో తప్ప మనం వీక్షించలేని ఆరతులను తమకు దగ్గరలోనే ఉన్న బాబా మందిరంలో కనులారా తిలకించే అవకాశాన్ని బాబా ఆమెకు అనుగ్రహించారు.
నా
ఆరతులు కావాలన్నావు కదా, అందుకనే నిన్ను నాకు దగ్గరగా ఉండేలా అనుగ్రహించాను అని బాబా అన్నట్లుగా ఆమె భావించుకుని ఎంతగానో సంతోషించారు.
కరోనా
సమయంలో వెళ్లలేకపోయినా అంతకు ముందు రోజులలో ప్రతిరోజు ఖచ్చితంగా బాబా ఆరతులకు హాజరవుతూ ఉండేవారు.
ఆమెకు
వివాహం కావడానికి ముందు చెన్నైలో బాబా మందిరాలు అంతగా లేకపోయినా ఇపుడు మాత్రం ఎక్కువగానే ఉన్నాయని చెప్పారు.
ఇందులో మరొక ముఖ్యమయిన విషయం ఏమిటంటే నేను (త్యాగరాజు) కృష్ణవేణిగారికి ఫోన్ చేసి ఎవరయినా ఆమెకు తెలిసున్న సాయిభక్తుల అనుభవాలు ఉంటే వారిని అడిగి పంపించమన్నాను.
అపుడు
ఆమె తన చెల్లెలు శ్రీలత గారి అనుభవాలను అడిగి చెబుతానని చెప్పారు.
ఆమె
తన చెల్లెలికి ఫోన్ చేసారు.
ఆమె
చెల్లెలు శ్రీలతగారు మధ్యాహ్నం తన బాబుని పడుకోబెడుతూ, బాబుకి నిద్ర చెడకుండా ఉండటం కోసం ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టి పడుకున్నారు.
మళ్ళీ
సైలెంట్ మోడ్ ను తీయలేదు.
కాని
కృష్ణవేణిగారు
ఫోన్ చేసిన సమయంలో తన చెల్లెలి ఫోను ఇంకా సైలెంట్ మోడ్ లోనే ఉంది.
అయినప్పటికీ
ఫోన్ లో రింగ్ శబ్దం వినిపించిందట.
ఆతరువాత
గుర్తుకు వచ్చి మధ్యాహ్నం సైలెంట్ మోడ్ లోనే పెట్టాను కదా మరి రింగ్ శబ్ధం ఎలా వినపడిందని శ్రీలతగారు సాయంత్రం ఫోన్ చూస్తే ఫోన్ ఇంకా సైలెంట్ మోడ్ లోనే ఉందని గమనించారు.
త్యాగరాజు గారికి నీ లీల గురించి చెప్పాను, ఆయన చాలా బాగుందని చెప్పి బ్లాగులో ప్రచురిస్తానని చెప్పారు అని కృష్ణవేణిగారు తన చెల్లిలికి చెప్పడానికి రెండవసారి ఫోన్ చేసినప్పుడు ఆమెకు ఫోన్ రింగ్ అయిన శబ్దం వినపడలేదని చెప్పారు.
ఇదేమిటి,
అక్క మొదటిసారి ఫోన్ చేసినపుడు వినిపించింది, రెండవసారి ఎందుకని వినిపించలేదు అని ఫోన్ చూస్తే ఫోన్ ఇంకా సైలెంట్ మోడ్ లోనె ఉంది.
దీనిని
బట్టి బాబాగారు ఈ లీలను వెంటనే తెలియచేయడానికి తమ అంగీకారాన్ని తెలిపారని ఎంతగానే సంతోషించారు.
బాబా
చేసే అధ్బుతాలను, లీలలను మనమెవ్వరం ఏవిధంగాను ఊహించలేము.
(త్వరలో ఈ విజయదశమి రోజులలో బాబా ఒక భక్తురాలి ఇంటికి వచ్చిన లీల
ఫోటోలతో సహా ప్రచురిస్తాను)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
2 comments:
Saibaba Sharanam
Sai saranam baba charanam ADBUTAM anubhavam
Post a Comment