20.12.2022 మంగళవారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమః
శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే
శ్రీ సాయి సత్ చరిత్ర –5 వ.భాగమ్
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744వ.
email. tyagaraju.a@gmail.com
శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 3 కర్మ యోగము (2 వ.భాగమ్)
శ్లోకమ్ - 34
ఇంద్రియస్యేంద్రియస్యార్ధే రాగద్వేషౌ
వ్యవస్థితౌ
తయోర్న వశమాగఛ్ఛేత్ తౌ హ్యస్య పరిపన్ధినౌ
ప్రతి ఇందిరార్ధమునందును (ప్రతి ఇంద్రియ
విషయమునందును) రాగద్వేషములు దాగియున్నవి. మనుష్యుడు
ఈ రెండింటికిని వశము కాకూడదు. ఏలనన ఈ రెండే
మానవుని శ్రేయస్సునకు విఘ్న కారకములు, మహాశత్రువులు.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ 49
ఒకనాడు నానా సాహెబ్ చందోర్కర్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చొని యుండగా బీజాపూరునుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో ఘోషాస్త్రీలుండుటచే నానాసాహెబ్ చందోర్కర్ అక్కడినుంచి లేవనెంచెను. కాని బాబా వానిని నివారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనము చేసికొనిరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసికొనెను. నానా సాహెబ్ చందోర్కర్ ఆమె ముఖసౌందర్యమును చూచి మరల మరల చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూచి, స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట, బాబా నానాతో ఇట్లనెను.
“నానా, అనవసరముగా చికాకు పడుచుంటివేల? ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనము జోక్యము చేసికొనకూడదు. దేవుడు ఈ సుందరమయిన ప్రపంచమును సృష్టించియున్నాడు. గాన అందరిని చూచి సంతసించుట మనవిధి. క్రమముగాను. మెల్లగాను మనసు స్థిరపడి శాంతించును. ముందుద్వారము తెఱచియుండగా వెనుక ద్వారముగుండా పోనేల? మన హృదయము స్వఛ్చముగా ఉన్నంతవరకు ఏమియు దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు ఇతరులకు భయపడనేల? నేత్రములు వానిపని యవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేల?”
ఆ తరువాత దారిలో శ్యామా నానా సాహెబ్ చందోర్కర్ ను అడిగిన మీదట బాబా చెప్పినదాని భావము ఇట్లు చెప్పెను. మనస్సు సహజముగా చంచలమయినది. దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చలింపవచ్చును. శరీరమును స్వాధీనమందుంచుకొనవలెను. దానిని యోరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయములవైపు పరుగెత్తును. కాని, మనము వానివెంట పోరాదు. మనము ఆవిషయములను కోరగూడదు. క్రమముగాను, నెమ్మదిగాను సాధన చేయుటవలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు. కాని వానిని మనము పూర్తిగా స్వాధీనమందుంచుకొనలెను. సమయానుకూలముగా వానినణచి సరిగా ఉంచుకొనవలెను. నేత్రములు అందమయినవానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని, లజ్జకు గాని అవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికలు లేక భగవంతుని సుందరమయిన సృష్టిని చూడుము.
ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను,
సహజముగాను స్వాధీనము చేసికొనవచ్చును. విషయములనుభవించుటలో
కూడా నీవు భగవంతుని జ్ణప్తియందుంచుకొనెదవు.
బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమందుంచుకొని మనస్సును విషయములవైపు పరుగిడనిచ్చినచో
వానిపై అభిమానముండనిచ్చినచో చావుపుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమయినవి. వివేకము (అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట)
సారధిగా మనస్సును స్వాధీనమంధుంచుకొనవలెను.
ఇంద్రియములనిచ్చ వచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారధితో విష్ణుపదము చేరగలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమయిన ఆవాసము. అచటనుండి తిరిగి వచ్చుటలేదు.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ 16 –
17 సాయిబాబా ఇచ్చిన ఉపదేశము.
అంతర్ముఖత (లోనికి చూచుట)
మన ఇంద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు
సృజించియున్నాడు. కనుక మనుష్యుడెప్పుడును బయటనున్న
వానిని చూచును. కాని, ఆత్మ సాక్షాత్కారము లేదా
మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న యాత్మనేకధ్యానముతో చూడవలయును.
మనస్సును, ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట..
శరీరము రధము, ఆత్మ దాని యజమాని, బుధ్ధి
ఆ రధమును నడుపు సారధి. మనస్సు కళ్ళెము. ఇంద్రియములు గుఱ్ఱములు. ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తిలేదో, ఎవరి మనస్సు చంచలమయినదో
ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో (బండి తోలువాని దుర్మార్గపు గుఱ్ఱములవలె) వాడు గమ్య
స్థానమును చేరలేడు. చావుపుట్టుకల చక్రములో
పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి
మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధినమందుండునో (బండి నడుపువాని మంచి
గుఱ్ఱము వలె) ఎవడు తన బుధ్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో,
వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణుపదమును చేరగలడు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment