17.12.2022 శనివారమ్
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఓమ్ శ్రీ గణేశాయనమః
శ్రీ మాత్రేనమః
ఓమ్ శ్రీ సాయినాధాయనమః
ఓమ్ శ్రీ కృష్ణపరబ్రహ్మణేనమః
శ్రీ మద్భగవద్గీత, ఉపనిషత్తుల సారాంశమే
శ్రీ సాయి సత్ చరిత్ర – 4 వ.భాగమ్
ప్రేరణ ; గీతాచార్యుడు శ్రీ కృష్ణపరమాత్మ, మరియు సాయినాధులవారు
ప్రేరణా స్థలమ్ … శ్రీ వేణుగోపాలస్వామి
ఆలయమ్
సమన్వయ కర్త ; ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744వ.
3వ. భాగానికి పాఠకుల స్పందన
శ్రీమతి కృష్ణవేణి, చెన్నై…. బాబా గారు
గొప్ప యోగి మాత్రమే కాదు, సకల దేవతా స్వరూపుడు. సాయిని ఎవరు ఎలా భావిస్తారో వారిని అలా అనుగ్రహిస్తారు.
ఒక పాఠకురాలు, హైదరాబాద్…. రోజూ మీరు
పెట్టిన బ్లాగ్స్ చదువుతున్నాను, బాగుంటున్నాయి.
పారాయణ కూడా మొదలు పెట్టాను. మనసుకు
కష్టం తోచినప్పుడు బాబా అని అనుకుంటే గొప్ప
రిలీఫ్ గా ఉంటుంది నాకు.
శ్రీమద్భగవద్గీత అధ్యాయమ్ – 3 కర్మ యోగము
శ్లోకమ్ - 12
ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాసంతే యజ్ణభావితాః
తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన
ఏవసః
యజ్ణములద్వారా సంతృప్తిని పొందిన దేవతలు
మీకు (మానవులకు) అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ
దేవతలకు నివేదన చేయక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 24 ఈ
అధ్యాయములో బాబా చెప్పిన ఉపదేశము
దేవతలకు, పంచప్రాణులకు, పంచాగ్నులకు,
అతిధికి అర్పించకుండా భోజనం చేయడం మహాదోషం.
మనసు, బుద్ది, ఇంద్రియాలు, విషయాలను అనుభవించే ముందు నన్ను స్మరిస్తే నాకు వానిని
సమర్పించినట్లే.
పంచేంద్రియములకంటె ముందే, మనస్సు, బుధ్ధి
విషయానందమనుభవించును. కనుక మొదలే భగవంతుని
స్మరించవలెను. ఇట్లు చేసినచో నిది కూడ ఒక విధముగ
భగవంతునికర్పితమగును.
దీనిని బట్టి మనము గ్రహించుకోవలసిన ముఖ్యమయిన విషయమ్. సాధారణంగా కొంతమంది తమ ఇండ్లలో వంట పూర్తయిన తరువాత మహానివేదన చేస్తూ ఉంటారు. అనగా వండిన పదార్ధాలన్నిటినీ దేవుని ముందు పెట్టి నివేదన చేయడం ఒక ఆచారమ్. అలా కాకుండా కొంతమంది తమ తమ ఇండ్లలో భగవంతునికి పూజలు చేసి ఏదయిన ఒక ఫలం గాని, మరేదయినా పదార్ధాలు గాని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అటువంటి సమయాలలో మనము భోజనం చేసేముందు మన ఇష్టదైవాన్ని తలుచుకుని ఎదుట ఉన్న భగవంతునికి గాని, బాబాకు గాని అర్పించి తీసుకోవాలి. దీనిని ప్రతిరోజు మనం అభ్యాసం చేసినట్లయితే భగవంతుని కరుణకు ప్రీతిపాత్రులమవుతాము.
వంటకాలలో మనకు ఇష్టమయిన పదార్ధాలు ఉన్నాయనుకోండి. నివేదనకు ముందుగానే వాటిని చూసిన వెంటనే మనకి నోటిలో నీళ్ళూరుతాయి. ఎప్పుడెప్పుడు తిందామా అని మనసు గోల చేస్తూ ఉంటుంది. కాని ఆవిధంగా జరిగినట్లయితే ఆ పదార్ధానికి ఎంగిలి దోషం తగులుతుంది. అందువల్ల నివేదనకు ముందు మానసికంగా వాటిని అనుభవించరాదు.
అందువల్లనే దేవాలయాలలో భగవంతునికి పులిహోర గాని, చక్రపొంగలి, దద్ధోజనం వంటి పదార్ధాలను నివేదన చేసేముందు భక్తుల కంట పడకుండా తెరలు వేస్తూ ఉంటారు.
శ్లోక్లమ్ – 17
యస్త్వాత్మరతిదేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ
మానవః
ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే
సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తినందిన
జ్ణానియైన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును.
అతడు పూర్ణకాముడు. కనుక ఆత్మయందే తృప్తినొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు. అట్టివానికి ఎట్టి కర్తవ్యమును ఉండదు.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయమ్ – 3
బాబా కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ణాన మూర్తులు. వైష్ణవభక్తులకిల్లువంటివారు. ఎల్లప్పుడు ఆత్మసాక్షాత్కారమునందే
మునిగి యుండెడివారు. బాబా ద్వంద్వాతీతులు. ఎల్లప్పుడు సచ్చిదానంద స్వరూపులుగా నుండెడివారు.
శ్రీ సాయి సత్ చరిత్ర అధ్యాయం – 10
బాబా ఎల్లప్పుడు ఆత్మానుసంధానమందే మునిగి
యుండెడివారు. వారెల్లప్పుడు ఒకే ఆసనమందు స్థిరముగ
నుండెడివారు. వారెక్కడకు ప్రయాణములు చేసెడివారు
కారు. చింతా రహితులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు. ఆత్మజ్ణానమునకు ఆయన గని. దివ్యానందమునకు వారు ఉనికిపట్టు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment