01.08.2013 గురువారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాసీస్సులు
మరలా వారం రోజుల తరువాత మన బ్లాగులో ప్రచురణకు వీలు పడింది..ఆలస్యానికి మన్నించండి.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి 45 వ.అధ్యాయం
ముందుగా శ్రీవిష్ణుసహస్రనామం 76వ.శ్లోకం, తాత్పర్యం
శ్లోకం: భూతావాసో వాసుదేవః సర్వాసునిలయో నలః |
దర్పహా దర్పదో దృప్తోదుర్ధరోధా పరాజితః ||
తాత్పర్యం: పరమాత్మను పంచభూతములకు, అన్ని ప్రాణులకు ఆశ్రయమైనవానిగా, పవిత్రమైన అగ్నిగా, గర్వమును నశింపచేయువానిగా మరియూ గర్వమైనవానిగా, గర్వము లేనివానిగా, గర్వము కలిగినవారికి ధరించుటకు వీలుకానివానిగా, జయించుటకు సాధ్యముకాని వానిగా ధ్యానము చేయుము.
పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి 45వ.అధ్యాయము
16.02.92
ప్రియమైన చక్రపాణి,
ఈ అధ్యాయములో హేమాద్రిపంతు శ్రీసాయిని గూర్చిన కొన్ని వివరాలను, విషయాలను తెలియపర్చినారు. శ్రీసాయి సత్ చరిత్రలోని మాటలు ప్రతి సాయిబంధు గుర్తు పెట్టుకోవాలి.




